అన్వేషించండి

Lok Sabha Delimitation 2026 Issue: డీలిమిటేషన్ సెగ - శశిథరూర్ జీతాల లాజిక్‌కు నారా లోకేష్ కాన్స్టిట్యూషన్ కౌంటర్ - లెక్క సరిపోతుందా!?

Shashi Tharoor Nara Lokesh Twitter: లోక్‌సభ స్థానాల పెంపుపై శశిథరూర్ వేసిన డ్రైవర్ జీతం లాజిక్‌కు మంత్రి నారా లోకేష్ రాజ్యాంగబద్ధమైన పాయింట్లతో గట్టి కౌంటర్ ఇచ్చారు.

Nara Lokesh Reply To Shashi Tharoor: భారతదేశంలో  నియోజకవర్గాల పునర్విభజన యాభై శాతం ఫార్ములాతో త్వరలో జరగనుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, శశిథరూర్ ఒక ఆసక్తికరమైన  థాట్ ఎక్స్‌పెరిమెంట్   తో ట్వీట్ చేశారు. దీనికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిల్లీ స్థాయి సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో, పక్కా రాజ్యాంగబద్ధమైన పాయింట్లతో ఇంగ్లీష్‌లోనే ఘాటుగా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

శశిథరూర్  డ్రైవర్ జీతం లాజిక్  

ట్విట్టర్  వేదికగా శశిథరూర్ చంద్రబాబును ఉద్దేశించి ప్రస్తావిస్తూ.. "నాయుడు గారు, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ జీతం రూ. 2 లక్షలు, మీ డ్రైవర్ జీతం రూ. 20 వేలు అనుకుందాం. ఇప్పుడు ఇద్దరికీ 50% జీతం పెంచితే.. మీ జీతం రూ. 3 లక్షలు, డ్రైవర్ జీతం రూ. 30 వేలు అవుతుంది. శాతం పరంగా ఇద్దరికీ సమానంగా పెరిగినా, మీ ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం  మునుపటి కంటే చాలా పెరిగిపోతుంది కదా! దక్షిణాది సీఎంల ఆందోళన కూడా ఇదే. యూపీకి 80 ఎంపీలు, కేరళకు 20 ఎంపీలు ఉన్నప్పుడు ఉన్న వ్యత్యాసం.. రేపు సీట్లు పెరిగి 120 వర్సెస్ 30 అయినప్పుడు సమాన నిష్పత్తిలోనే ఉన్నా, సీట్ల సంఖ్య పరంగా ఉత్తరాది బలం  భారీగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఆందోళన పరచడం లేదా?" అని ప్రశ్నించారు. 

 ఫ్రీజ్‌కు కాలం చెల్లింది - కాంగ్రెసే బాధ్యురాలు: లోకేష్ 

శశిథరూర్ ట్వీట్‌కు నారా లోకేష్ నాలుగు పవర్‌ఫుల్ పాయింట్లతో సమాధానమిచ్చారు. "డియర్ డాక్టర్ థరూర్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లోక్‌సభ స్థానాల కేటాయింపు అనేది జనాభా ప్రాతిపదికనే జరగాలి. 1971 జనాభా లెక్కల ప్రకారం సీట్లను ఫ్రీజ్ చేయడం అనేది తాత్కాలికం మాత్రమే. ఆ గడువు ఈ ఏడాది   తో ముగిసిపోతుంది. ఎలాంటి జోక్యం లేకపోతే కొత్త డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల సీట్లు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన మీ కాంగ్రెస్ పార్టీయే ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహించాలి" అని లోకేష్ మొదటి పాయింట్‌గా గుర్తుచేశారు.

  1971 నాటి ఇండియా కాదు.. ఎంపీలపై భారం పెరిగింది! 

రెండో పాయింట్‌గా లోకేష్ దేశంలో పెరిగిన జనాభాను ప్రస్తావించారు. "1971 నాటి భారతదేశం వేరు, 2026 నాటి భారతదేశం వేరు. మన జనాభా నాడు 55 కోట్లు ఉంటే, నేడు దాదాపు 146 కోట్లకు చేరింది. కానీ లోక్‌సభ స్థానాలు మాత్రం అవే ఉన్నాయి. అంటే నాడు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించిన జనాభా కంటే.. నేడు ఒకే ఎంపీ 2.5 రెట్లు ఎక్కువ మంది పౌరులకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. అందువల్ల పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచడం అనేది కేవలం రాజకీయ ఎంపిక కాదు, అది ప్రజాస్వామ్య అవసరం" అని లోకేష్ స్పష్టం చేశారు.

  ఓటరు సమానత్వ హక్కు.. ఎన్డీయే రక్షణ కవచం! 

లోకేష్ తన కౌంటర్‌లో మూడో మ, అత్యంత కీలకమైన రాజ్యాంగ పాయింట్‌ను లేవనెత్తారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఒక రాష్ట్ర ఓటరుకు మరో రాష్ట్ర ఓటరు కంటే ఎక్కువ ఓటు విలువ ఉండే హక్కు లేదు. ప్రతి పౌరుడి ఓటు విలువ దేశవ్యాప్తంగా సమానంగా ఉండాలన్నదే రాజ్యాంగ ఆశయం.  జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే.. సమాన నిష్పత్తిలో  సీట్లు పెంచాలనే ప్రతిపాదనను ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తోంది. బాధ్యతాయుతంగా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసేందుకే ఈ నిష్పత్తి ఫార్ములాను వాడుతున్నాం అని లోకేష్ పేర్కొన్నారు.  

 పార్లమెంట్‌లో ఈక్వేషన్స్ మారవు.. 

చివరగా శశిథరూర్ చెప్పిన డ్రైవర్ జీతం ఉదాహరణను లోకేష్ తిప్పికొట్టారు.  పార్లమెంటరీ ప్రభావం లేదా అధికారం అనేది సభలో జరిగే బిల్లుల ఓటింగ్   పై ఆధారపడి ఉంటుంది. అది సాధారణ మెజారిటీ అయినా, మూడింట రెండు వంతుల మెజారిటీ అయినా సరే.. అన్ని రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో సీట్లు పెంచినప్పుడు, పాత పొలిటికల్ ఈక్వేషన్స్ ఏవీ మారవు. అందరికీ ఒకే నిష్పత్తిలో పెరిగినప్పుడు ఎవరికీ అదనపు ప్రయోజనం గానీ, మైలేజ్ గానీ దక్కదు  అని చెప్తూ థరూర్‌ లాజిక్‌కు లోకేష్ పక్కా పొలిటికల్ చెక్-మేట్ పెట్టారు.


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG Historic Lords Test: లార్డ్స్ హిస్టారికల్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
హిస్టారికల్ లార్డ్స్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
ABP Desam Top 10, 9 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 9 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget