టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఎన్ని వికెట్లు తీసినా అవకాశం ఇవ్వకపోతే, ఇక రిటైర్మెంట్ తీసుకోవడమే మేలు' అని కైఫ్ ఘాటుగా స్పందించారు. కుల్దీప్ విషయంలో సెలక్టర్ల తీరుపై క్రీడాభిమానులు కూడా మండిపడుతున్నారు.