అన్వేషించండి

Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

Andhra Pradesh Rains | ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బంగాళాఖాత ఆవర్తనం ఏపీ, తెలంగాణలో వర్షాలకు కారణం.
  • తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం.
  • ఏపీలో తేలికపాటి, మోస్తరు వర్షాలతోపాటు పిడుగులు పడవచ్చు.
  • పిడుగుల పట్ల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక.

Telangana Rains Update | హైదరాబాద్: బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మంగళవారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం, రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంగళవారం సైతం వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు
వాతావరణ శాఖ సూచనల ప్రకారం, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు
మరోవైపు రాష్ట్రంలో గత ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలుచోట్ల భారీగా, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు) మండలంలో 10.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అలాగే నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్‌ గ్రామీణ మండలం మల్కాపూర్‌లో 8.1 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావం కారణంగా మంగళవారం (జులై 21న) రోజున పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని వెల్లడించింది.

పిడుగులతో కూడిన వర్షాలు

 శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతం), కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు  ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసినట్లు APSDMA పేర్కొంది

 

Frequently Asked Questions

ఏపీ, తెలంగాణలో వర్షాలకు కారణం ఏమిటి?

బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.

తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది?

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది?

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం), కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతాయి.

వర్షాల సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Ponnam Prabhakar On SIR: ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్
ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget