అన్వేషించండి

YSRCP AP Assembly : పార్లమెంట్‌లో గళం.. అసెంబ్లీకి పలాయనం - వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు- జగన్ సభకు వెళ్తారా?

YS Jagan : ఏపీ శాంతిభద్రతలపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు వైసీపీ ఎంపీలు. అయితే ఆ అంశాన్ని చర్చించాల్సింది అసెంబ్లీలలో. అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీలో నిరసనల వల్ల ఉపయోగాముందా?

AP Politics YSRCP Boycott Assembly:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విధానాలు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి.  రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణత,  రాజకీయ హింస , డీఎస్సీ నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నిత్యం మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.  అదే సమయంలో  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ఏపీ శాంతిభద్రతలపై వాయిదా తీర్మానాలు కూడా ఇస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడేందుకు చట్టసభలు ప్రధాన వేదికలు. అయితే ఇక్కడ రాష్ట్ర అంశాలపై అసెంబ్లీలో చర్చించాల్సింది .. అక్కడ మాత్రం వైసీపీ ఆసక్తి చూపించడం లేదు.  

రాష్ట్ర పరిధిలోని అంశం లా అండ్ ఆర్డర్ 

పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం రాష్ట్రంలో శాంతిభద్రతల  వ్యవహారం అనేది పూర్తిగా రాష్ట్ర జాబితా  పరిధిలోని అంశం. పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చినా, దానిపై   చర్చకు స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ అనుమతించే అవకాశాలు ఉండవు. మహా అయితే  జీరో అవర్ లో ఏదైనా మాట్లాడవచ్చు కానీ వైసీపీ ఎంపీలు ఏపీ శాంతిభద్రతల అంశాన్ని లేవనెత్తగలరు.  అయితే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం గానీ, ప్రజా సమస్యలకు తగిన సమాధానం పొందడం గానీ ఏమాత్రం సాధ్యం కాదు. కానీ ఏపీ అసెంబ్లీలో వారికి ఆ చాన్స్ లభిస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, పాలకులను నిలదీయడానికి అత్యంత శక్తివంతమైన వేదిక శాసనసభ  . త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ ఈ సమావేశాలకు హాజరవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అసెంబ్లీకి వెళ్లకుండా బహిష్కరించడం వల్ల తమ గొంతును సభలో వినిపించే సవర్ణ అవకాశాన్ని పార్టీ స్వయంగా చేతులారా జారవిడుచుకుంటోంది. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఇచ్చిన అవకాశాల కంటే, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వం మైక్ ఇస్తుందో లేదోనన్న సందేహాలు ఉన్నప్పటికీ.. సభకు వెళ్తేనే ప్రతిపక్షం పోరాటపటిమ ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది.

ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్న వైసీపీ 

ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ సవాలు విసురుతున్న అంశాలు కొల్లలుగా ఉన్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నిబంధనల నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు, రాజకీయ వేధింపుల ఆరోపణల వరకు ప్రతి అంశంపైనా ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు వైసీపీ వద్ద విస్తృతమైన సమాచారం ఉంది. ఈ అంశాలపై పాయింట్ బై పాయింట్ అసెంబ్లీ వేదికగా మంత్రులను, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను నిలదీస్తే పొందే మైలేజ్ ఎంతో ఎక్కువ. పార్లమెంట్‌లో వంద నిరసనల కంటే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నిలబడి వేసే ఒక్క ప్రశ్న ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యతను పెంచుతుంది.

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం చేస్తారా? 

అయితే, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం చేస్తారా? లేక గతంలో లాగానే  ప్రతిపక్ష నేత  హోదా ఇవ్వలేదన్న నెపంతో అసెంబ్లీకి దూరంగా ఉంటారా? అన్నది ఆ పార్టీ నేతలుక ఇంకా క్లారిటీ లేదు.  ప్రతిపక్ష హోదా సాంకేతిక అంశం మాత్రమే. సభలోకి అడుగుపెట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడితే, ప్రజల్లో జగన్ ఇమేజ్ , పొలిటికల్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. మైక్ కట్ చేస్తే ప్రత్యక్షంగా ప్రజా క్షేత్రంలోనే సభా ఉల్లంఘనపై పోరాడవచ్చు. అలా కాకుండా సభను బహిష్కరిస్తే..  సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే పారిపోతున్నారు  అనే అధికార కూటమి ప్రచారానికి బలం చేకూరే ప్రమాదం ఉంది. పార్లమెంట్లో వాయిదా తీర్మానం  అనేది మీడియాలో రావడానికి ఉపయోగపడుతుంది.  అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చ జరిగి, శాంతిభద్రతలపై స్పష్టత రావాలంటే వైఎస్సార్‌సీపీ తక్షణమే తన అసెంబ్లీ బహిష్కరణ వ్యూహాన్ని పునఃపరిశీలించుకోవాలి. రాబోయే వర్షాకాల సమావేశాల్లో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి సభలోకి అడుగుపెట్టి, ప్రజాసమస్యలపై గళమెత్తితేనే అది నిజమైన ప్రజాస్వామ్య పోరాటమవుతుంది. మరి ఆ దిశగా ఆలోచిస్తారా? 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget