Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు
కరోనా వైరస్ ఇంకా ఉనికిలో ఉండగానే మంకీపాక్స్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. చాపకింద నీరులా సరిహద్దులు దాటి మరీ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది.
WHO ప్రకారం మంకీపాక్స్ ఒక వైరల్ జూనోటిక్ వ్యాధి. ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. తరువాత మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఒక్క కేస్ కూడా నమోదు కాలేదని, అయితే ఇతర దేశాల్లో ఉన్న కేసుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ సూచనను అనుసరించి, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా వ్యాధికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది.
గత 21 రోజుల్లో ప్రభావిత దేశాలకు వెళ్లిన వారందర్నీ పరిశీలిస్తున్నారు. అలాంటి వారి సమాచారాన్ని వెంటనే స్థానిక జిల్లా అధికారికి ఆ తర్వాత ఆరోగ్య శాఖకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఎవరైనా రోగాల బారిన పడి ఉంటే అలాంటి వారికి చికిత్స చేసేటప్పుడు అన్ని ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను అనుసరించాలి. నివేదిక సానుకూలంగా వస్తే కాంటాక్ట్ ట్రేసింగ్ స్టార్ట్ చేస్తారు.
అనుమానిత రోగుల నమూనాలను పరీక్ష కోసం NIV పూణేకు పంపిస్తారు. గత 21 రోజుల్లో పేషెంట్‌తో తిరిగిన వారంతా వెంటనే గుర్తించి ఐసోలేట్ చేస్తారు. అనుమానిత రోగుల గాయాలు వెంటనే నయం కావు. గాయాలు నయమై కొత్త చర్మం ఏర్పడే వరకు నిర్బంధంలో ఉండాలి.
మంకీపాక్స్ ఉత్తర అమెరికాతోపాటు బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యుఎస్, స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాలో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ ఇంకా ఉనికిలో ఉండగానే మంకీపాక్స్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. చాపకింద నీరులా సరిహద్దులు దాటి మరీ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. మంకీపాక్స్ అనేది జూనోటిక్ వ్యాధి. అంటే మనిషి నుంచి మనిషికి సులభంగా సంక్రమించే అంటువ్యాధి. ఇప్పటికే యూకేలో ఈ వ్యాధి ఉనికిలో ఉంది.
‘మంకీపాక్స్’ అనేది మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాలలో సాధారణంగా సంభవించే సాధారణ మానవ అంటువ్యాధి. దీన్ని వైద్య పరిభాషలో ‘సిల్వాటిక్ జూనోసిస్’ అని అంటారు. ఇది కూడా కరోనా తరహాలోనే శ్వాస ద్వారా, ఉమ్మి బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. చర్మంపై ఏమైనా గాయాలున్నా, కలుషిత ఆహారాన్ని తిన్న.. ముట్టుకున్నా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మంకీపాక్స్ పొదిగే కాలం సాధారణంగా 6 నుంచి 13 రోజుల వరకు ఉంటుంది. కానీ, ప్రస్తుత బాధితుల్లో 5 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది.
మంకీపాక్స్ వైరస్ రెండు రకాలు: ఒకటి వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్, రెండోది కాంగో బేసిన్ (సెంట్రల్ ఆఫ్రికన్) క్లాడ్. వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్‌లో కేసు-మరణాల నిష్పత్తి దాదాపు 1 శాతం ఉంది. కానీ, కాంగో బేసిన్ క్లాడ్‌లో మాత్రం మరణాలు 10 శాతం వరకు ఉండవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంకీపాక్స్ వైరస్ కేసులు మొదట్లో ఆఫ్రికా దేశాల్లో కనిపించాయి. అక్కడ్నించి ఇతర దేశాలకు పాకడం కూడా మొదలైపోయింది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమదేశాల్లో, మధ్య దేశాల్లో కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.
1. తలనొప్పి
2. జ్వరం
3. వెన్ను నొప్పి
4. కండరాల నొప్పి
5. చలి
6. అలసట
అమ్మవారిలాగే...
చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది.
ఎందుకొస్తుంది?
మాంసాహారం తినేవారిలో అధికంగా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. సరిగా ఉడకని మాంసం తినడం వల్ల లేదా ఈ వైరస్‌ను మోస్తున్న జంతువులను ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం వంటివి చేయడం వల్ల కూడా మంకీపాక్స్ వైరస్ శరీరంలో చేరుతుంది. ఈ వైరస్ సోకాక రెండు నుంచి నాలుగు వారాల్లో పోతుంది. ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనది కాదని ఆరోగ్య నిపుణులు నిర్ధారించారు.
ఈ వైరస్‌ను 1958లో తొలిసారి గుర్తించారు. కోతులలో ఈ వైరస్ మొదటిసారి బయటపడడంతో దీనికి మంకీ పాక్స్ అని పేరు వచ్చింది.