ABP Desam Health Conclave 2024 : మరుమూల ప్రాంతాలకూ హైఎండ్ వైద్య సేవల విస్తరణ - ఏబీపీ దేశం హెల్త్ కాంక్లేవ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్
Health Conclave 2024 : హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా వైద్య సౌకర్యాలను పెంచడం సవాలేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటోందన్నారు.
Health Conclave 2024 Ponban Prbhakar : హైదరాబాద్ ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలకు కేంద్రంగా నిలిచిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏబీపీ దేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన హెల్త్ కాంక్లేవ్ 2024లో పాల్గొన్నారు.
అంతర్జాతీయ వైద్య , ఫార్మా రంగంలో నెంబర్ వన్ గా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్ వర్క్ హెల్త్ కాంక్లేవ్ పెట్టడం ఎంతో సంతోషం. ఈ కాంక్లేవ్ తో దేశవ్యాప్తంగా మరోసారి హైదరాబాద్‌లోని వైద్య సౌకర్యాలపై అందరికీ తెలిసే అవకాశం లభిస్తుంది. ప్రపంచ వైద్య రంగం శరవేగంగా మారుతోదంని సాంకేతిక మారుతోందన్నారు డయాబెటిస్ లాంటి సమస్యలు మహమ్మారిగా మారుతున్నాయన్నారు. ఏ రంగానికి అయినా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ముఖ్యం. వైద్య చికిత్స విషయంలో ప్రపంచ దేశాల దృష్టిలో ఇప్పటికే హైదరాబాద్ ఉంది. అలాగే ప్రపంచానికి వస్తున్న సరికొత్త ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ఆయుధాలను తయారు చేసేందుకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కు కూడా తెలంగాణ కేంద్రంగా మారుతోందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలకు ఆరోగ్య భద్రత అందిచండానికి.. ప్రభుత్వం అసాధారణ చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రోఫైల్ రెడీ చేయాలని నిర్ణయించుకున్నామన్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. . ఇది విప్లవాత్మకమైన మార్పు. ఎవరికైనా అనారోగ్యం వస్తే.. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఒక్క క్లిక్ తో తెలుసుకుని వైద్యం చేయవచ్చునన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వైద్యుల్ని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శంషాబాద్ లో మెడికల్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఏదైనా సమస్య ఉంటే మెడిసిన్ సగం పని చేస్తే.. తగ్గిపోతుందన్న ధైర్యం కల్పించడం మరింత ముఖ్యమని తెలిపారు.
వికారాబాద్ దగ్గర ఆకాలంలో చేస్ట్ హాస్పిటల్ ఉండేది నిజాం నవాబు ఔషద మొక్కలు పెట్టారని.. ఎలాంటి మందులు వాడకుండా అక్కడ ఉన్న గాలి వల్ల రోగాలు మాయం అవుతాయని ఉండేది. వాతావరణ కాలుష్యం తరువాత కాలుష్య ఆహారం తిన్న తరువాత వ్యాదుల బారినపడుతున్నామన్నారు. అమెరికా ,ఆస్ట్రేలియా ఇలా ఏ దేశం వెళ్ళిన మన దగ్గర ఉత్పత్తి అయ్యే మెడిసిన్ వాడే పరిస్థితి ఉంది..ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లుగా , సైంటిస్ట్ లుగా మన తెలంగాణకు సంబంధించి అగ్రగామిగా ఉన్నామన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చే cmrf ,loc అప్లికేషన్ ట్రీట్మెంట్ కేసులు చూస్తే ఆశ్చర్యం వేస్తుందని.. 30-40 సంవత్సరాల లోపు వారికి కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు వస్తున్నాయి .. డయాలసిస్ కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. ఏదైనా వ్యాధికి సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో మెడికల్ హబ్ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తాం.. ఆర్టీసి లో 50 వేల కుటుంబాలు ఉన్నాయి..వారందరికీ అక్కడ అధునాతన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గతంలో తక్కువ సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉండేవి.. ఇప్పుడు చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. రీసెర్చ్ చేయడానికి మంచి వనరులు అందుబాటులో ఉన్నాయి.. ఏజెన్సీ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తే వారికి ప్రోత్సహించినట్లు ఉంటుంది.. ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తుందన్నారు.
హైదరాబాద్ వైద్య రంగంలో ఉన్న సౌకర్యాల కారణంగా ఒక్క తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు అయిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘడ్‌తో పాటు విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెషంట్లు వస్తున్నారని.. ఎంత మంది వచ్చినా మెరుగైన వైద్యం అందించేలా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్న తాను.. నగరం నలువైపులా భారీ స్థాయిలో ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుందన్నారు. వైద్య విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానం ఇచ్చారు.