Parliament Winter Session: ఆరోజు నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఈసారి ఇవే హాట్ టాపిక్స్!
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు (సీసీపీఏ) సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
కరోనా నిబంధనలు..
అయితే ఈ సమావేశాల్లో కూడా కరోనా నిబంధనలు పాటించనున్నారు. ఏడాదిన్నర కాలంగా కరోనా మార్గదర్శకాలను పార్లమెంటు సమావేశాల్లో పాటిస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు.
ఇవే నిబంధనలు..
- సమావేశాలకు ముందు సభ్యులు కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.
- మాస్కును తప్పనిసరిగా ధరించాలి.
- పార్లమెంటు ఆవరణలో కూడా భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి.
- ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
వీటిపైనే చర్చ..
ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు మొత్తం పెగాసస్, రైతు చట్టాల రద్దుపైనే నడిచాయి. ప్రతిపక్షాలు సభలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న కారణంగా ఈసారి మరింత వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరుగుదల, లఖింపుర్ ఖేరీ ఘటన, రైతు చట్టాల రద్దు తదితర విషయాలు చర్చకు రానున్నాయి.
Also Read: ZyCoV-D COVID-19 Vaccine: జైకోవ్-డీ టీకాకు కుదిరిన రేటు.. ఇక వ్యాక్సినేషనే లేటు.. ఒక డోసు ఎంతంటే?
Also Read: Ambani Antilia Update: ట్యాక్సీ డ్రైవర్.. ఓ బ్యాగ్.. ఇద్దరు మనుషులు.. అంబానీ ఇంటి వద్ద హైఅలర్ట్!
Also Read: Padma Awards 2021: సుష్మా స్వరాజ్, పీవీ సింధూ, కంగనా రనౌత్ సహా 119 మందికి పద్మ పురస్కారాలు
Also Read: Chhattisgarh Firing: తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి