News
News
X

Lakhimpur Kheri Violence: లఖింపుర్ కేసులో యూపీపై సుప్రీం ఫైర్.. హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో విచారణ

లఖింపుర్ ఖేరి కేసు విచారణను హైకోర్టు మాజీ న్యాయమూర్తితో జరిపించాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.

FOLLOW US: 

లఖింపుర్‌ ఖేరి కేసులో ఉత్తర్‌ప్రదేశ్ విచారణ తీరుపై సుప్రీం కోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు తాము ఆశించినట్లుగా జరగడం లేదని వ్యాఖ్యానించింది. విచారణను హైకోర్టు మాజీ న్యాయమూర్తితో జరిపించాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. పంజాబ్​, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్​ రాకేశ్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్​ల పేర్లను ఇందుకోసం సిఫారసు చేసింది.

" మరికొంత మంది సాక్షులను విచారించామని తప్ప కేసు స్టేటస్ రిపోర్టులో ఏం లేదు. పది రోజులు సమయం ఇచ్చినా ల్యాబ్‌ నివేదిక కూడా అందలేదు. కేవలం ఆశిష్ మిశ్రా ఫోన్ సీజ్ చేశారు.. మిగిలిన నిందితుల సంగతేంటి? విచారణ సరిగా జరిగేందుకు వివిధ హైకోర్టులకు సంబంధించిన రిటైర్డ్ జడ్జీలను నియమించాలనుకుంటున్నాం. దీనిపై ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ శుక్రవారంలోగా స్పందన తెలియజేయాలి.                       "
-       సుప్రీం ధర్మాసనం

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రోజు వారీ విచారణను పర్యవేక్షిస్తారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లు ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాను రక్షించేలా కనిపిస్తున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. రెండు ఎఫ్‌ఐఆర్‌లను వేర్వేరుగా విచారించాలని సూచించింది. నిందితుల ఫోన్ కాల్ వివరాలు ఇవ్వాలని యూపీ సర్కార్‌కు ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను నవంబర్‌ 12కు వాయిదా వేసింది.

ఇదీ కేసు..

ఇటీవల యూపీలోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు.  వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. మొత్తానికి ఆశిష్ మిశ్రా సహా మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Padma Awards 2021: సుష్మా స్వరాజ్, పీవీ సింధూ, కంగనా రనౌత్‌ సహా 119 మందికి పద్మ పురస్కారాలు

Also Read: Chhattisgarh Firing: తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు

Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!

Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే

Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి

Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే

Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే

Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Nov 2021 05:03 PM (IST) Tags: supreme court Farmers Protest Lakhimpur-Kheri Ashish Mishra UP government Harish Salve Lakhimpur Case

సంబంధిత కథనాలు

Independence Day 2022 Live Updates: విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలు - జెండా ఆవిష్కరించిన సీఎం జగన్

Independence Day 2022 Live Updates: విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలు - జెండా ఆవిష్కరించిన సీఎం జగన్

Breaking News Telugu Live Updates: తిరుమల కొండపై భక్తుల రద్దీ - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

Breaking News Telugu Live Updates: తిరుమల కొండపై భక్తుల రద్దీ - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

Independence Day 2022: వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం, పంచప్రాణాలు పెట్టాలి - ఆ ఐదు ఏంటో చెప్పిన ప్రధాని మోదీ

Independence Day 2022: వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం, పంచప్రాణాలు పెట్టాలి - ఆ ఐదు ఏంటో చెప్పిన ప్రధాని మోదీ

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

టాప్ స్టోరీస్

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్