Pills With Cold Water: చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్, కాఫీలతో మాత్రలు వేసుకోవచ్చా?
చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్స్‌తో టాబ్లెట్లు వేసుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి?
డాక్టర్లు రాసిచ్చే టాబ్లెట్స్ లేదా మాత్రలను కొందరు చల్లటి నీటితో వేసుకుంటారు. ఇంకొందరు మాత్రల్లోని చేదు.. నాలికకు తెలియకూడదనే ఉద్దేశంతో కూల్ డ్రింక్స్‌తో మింగుతారు. మరికొందరికి టీ, కాఫీలతో కూడా మాత్రలు వేసుకోవడం అలవాటు. మరి ఈ విధంగా మాత్రలు మింగడం మంచిదేనా? మనం తీసుకొనే టాబ్లెట్స్‌పై కూల్ డ్రింక్స్, చల్లటి నీరు ఏవిధమైన ప్రభావాన్ని చూపుతాయి?
డాక్టర్ల సూచన ప్రకారం.. టాబ్లెట్స్ లేదా క్యాప్యూల్స్ (మాత్రలు)ను గ్లాసు నీటితో తీసుకోవాలి. బాగా మరిగిన నీళ్లతోగానీ, చల్లటి నీటితోగానీ వేసుకోకూడదు. అయితే, ఈ విషయం చాలామందికి తెలియదు. కొంతమందికి ఇది తెలిసినా పట్టించుకోరు. సౌదీ అరేబియాలోని ప్రిన్సెస్ నౌరా బింట్ అబ్దుల్‌రహ్మాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. చాలామందికి కూల్ డ్రింక్స్‌తో మాత్రలు మింగడం అలవాటని తెలిపారు. ఈ సందర్భంగా వారు పారాసెటమాల్ (Paracetamol) లేదా ఇబుప్రోఫెన్ (Ibuprofen) వంటి ఓవర్-ది-కౌంటర్ డ్రగ్స్‌ను వేర్వేరు పానీయాలతో తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్నారు.
⦿ సౌదీ ఫార్మాస్యూటికల్ జర్నల్‌లో ప్రచురించి వివరాల ప్రకారం.. కడుపులోకి వెళ్లిన మాత్రలు విచ్ఛిన్నమై శరీరానికి అందే ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి.
⦿ ఒక వ్యక్తి గ్లాసు నీటితో కాకుండా మరేదైనా డ్రింక్‌తో పెయిన్ కిల్లర్ మింగినట్లయితే.. వెంటనే ఫలితం పొందలేరు. ఆ టాబ్లెట్ శరీరంపై ప్రభావం చూపేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
⦿ చల్లగా ఉండే డ్రింక్స్‌తో తీసుకున్నవారిలో మాత్ర విచ్ఛిన్నం లేదా కరగడానికి సుమారు 40 నిమిషాల వరకు సమయం తీసుకుంది. అంటే అది గది ఉష్ణోగ్రత కలిగిన నీటితో తీసుకొనే మాత్ర విచ్ఛిన్నత కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంది.
⦿ మనం మింగే మాత్ర కాలేయం గుండా వెళ్తుంది. రక్త ప్రవాహంలోకి ప్రవేశించే ముందు కడుపులోని ఆమ్లాల ద్వారా విచ్ఛిన్నమవుతుంది. అదే కూల్ డ్రింక్స్, లేదా కూల్ వాటర్‌తో టాబ్లెట్ మింగితే ఆమ్లాలతో కలిసే ప్రక్రియ ఆలస్యమవుతుంది.
⦿ ఆహారం కడుపులోకి వెళ్లి వ్యర్థంగా చిన్న పేగుల్లోకి చేరేందుకు సుమారు 15 నిమిషాలు పడుతుందని పరిశోధకులు తెలిపారు. ఒక వేళ మీరు తీసుకునే మాత్ర విచ్ఛిన్నం లేదా కరగడానికి కావడానికి 15 నిమిషాలు కంటే ఎక్కువ సమయం పడితే అది వ్యర్థంగా మారే అవకాశం ఉందన్నారు.
⦿ కేవలం సాధారణ ఉష్ణోగ్రతలు కలిగిన నీటితో మాత్రమే టాబ్లెట్లు వేసుకోవాలని, వాటికి ప్రత్యామ్నాయంగా మరే పానీయాలు వాడొద్దని పరిశోధకులు సూచించారు.
⦿ కూల్ వాటర్‌తో మాత్రలు లేదా ఔషదాలు తీసుకున్నప్పుడు.. ఆ మందులను ప్రాసెస్ చేయడానికి బదులుగా చల్లటి నీటిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మీ శరీరం శక్తిని ఖర్చు చేస్తుంది.
☀ ఈ పానీయాలతో అస్సలు మాత్రలు మింగొద్దు
నారింజ రసం లేదా ఆరెంజ్ జ్యూస్: ఇది ఆరోగ్యానికి మంచిదే. శరీరానికి అవసరమైన బోలెడన్ని విటమిన్లు ఇస్తుంది. అయితే, మాత్రలను మాత్రం ఈ జ్యూస్‌తో కలిపి తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మాత్రలను కరిగించడానికి సహకరించదు. పారాసెటమాల్‌ను చల్లటి నారింజ రసంతో కలిపి తీసుకుంటే.. అది కరిగేందుకు సుమారు అరగంట సమయం పట్టిందట. అదే సాధారణ నీటితో తీసుకుంటే 10 నిమిషాలకే మాత్ర విచ్ఛిన్నమైందని పరిశోధకులు పేర్కొన్నారు.
కూల్ డ్రింక్స్ లేదా గ్యాస్‌తో నిండిన శీతల పానీయాలు: లంచ్ తర్వాత లేదా డిన్నర్ తర్వాత.. తిన్నది అరగడానికి కూల్ డ్రింక్స్‌ను తాగొచ్చు. కానీ, మాత్రలు వేసుకోవడానికి మాత్రం ఇది తగిన పానీయం కాదు. మాత్రలను కరిగించే విషయంలో.. నీటితో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. కూల్ డ్రింక్‌లో ఉండే రసాయనాలు కూడా మాత్రపై ప్రభావం చూపవచ్చు.
ఎనర్జీ డ్రింక్స్: కెఫిన్, చక్కెర స్థాయిలను ఎక్కువగా కలిగిన ఎనర్జీ డ్రింక్స్ శరీరానికి శక్తినైతే అందిస్తాయి. కానీ, మాత్రలను తీసుకోడానికి మాత్రం పనిచేయవు. ఔషదాల విషయంలో ఈ ఎనర్జీ డ్రింక్స్ మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. ఈ డ్రింక్‌లో మాత్ర కరిగేందుకు సుమారు 25 నిమిషాలు పడుతుంది.
కాఫీ లేదా టీ: ఎక్కువ మంది 43 డిగ్రీల సెల్సియస్ వేడితో కాఫీని తాగుతారు. వేడి వేడి కాఫీతో టాబ్లెట్‌ను తీసుకుంటే త్వరగా కరిగిపోతుంది. దాని వల్ల కూడా తగిన ఫలితం ఉండదని పరిశోధకులు అంటున్నారు. మాత్ర వేసుకోడానికి గది ఉష్ణోగ్రత (37 °C) ఉండాలని అంటున్నారు. కానీ, 37°Cతో కాఫీ ఎవరు తాగుతారు?
మజ్జిగ: ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ, మజ్జిగతో మాత్ర తీసుకుంటే అది కరిగేందుకు సుమారు 40 నిమిషాల సమయం పడుతుంది. అందుకే, మజ్జిగతో కూడా మాత్ర వేసుకోవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Also Read: నిద్రపోవడానికి ముందు ఈ చిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు
మద్యంతో: ఇది మరింత డేంజర్. బీర్, వైన్, వోడ్కా.. ఇలా దేనితోనూ టాబ్లెట్లు మింగకూడదు. వీటితో టాబ్లెట్లు తీసుకుంటే కరగడానికి ఎక్కువ సమయం పట్టడమే కాదు. సమస్యను మరింత పెంచుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. కాబట్టి.. ఇకపై మీరు టాబ్లెట్స్ వేసుకుంటే కేవలం సాధారణ నీటినే వాడండి.
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!