Weight Loss With Sleeping: నిద్రపోవడానికి ముందు ఈ చిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు.. జీవక్రియకూ లాభం!
ఉదయానికల్లా బరువు తగ్గిపోవాలా? అయితే, ఈ కింది చిట్కాలు పాటించండి. రోజు రోజుకు మీరు బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
శరీరానికి నిద్ర ఎంతో అవసరం. నిద్ర లేకపోతే.. శరీరం అదుపు తప్పుతుంది. అంతేకాదు.. ఆరోగ్య సంబంధ సమస్యలు కూడా వెంటాడుతాయి. మనం నిద్రపోయినప్పుడు కొన్ని అవయవాలకు మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. మిగతా అవయవాలు మాత్రం పనిలోనే ఉంటాయి. అయితే, మనం మెలకువగా ఉన్నంత చురుగ్గా అవి పనిచేయవు. కాబట్టి.. కావల్సినన్ని క్యాలరీలను అవి బర్న్ చేయలేవు. కాబట్టి.. బరువు తగ్గే అవకాశాలు చాలా తక్కువ. నిద్రపోవడానికి ముందు మనం కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా బరువు మాత్రమే కాదు.. జీర్ణక్రియను కూడా పెంపొందించుకోవచ్చు. అదెలాగో చూడండి.
రాత్రి నిద్రపోవడానికి ముందు.. ఉదయం నిద్రలేచిన తర్వాత మన బరువులో వ్యత్యాసం ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇందుకు కారణం.. ఒకసారి నిద్రపోయిన తర్వాత మనం ఏ ఆహారం తీసుకోం. పైగా అవయవాలు కొన్ని క్యాలరీలను బర్న్ చేస్తాయి. ఊపిరి పీల్చుకోవడం, చెమట పట్టడం వల్ల క్యాలరీలు తగ్గుతాయి. అందుకే బరువులో కాస్త వ్యత్యాసం ఉంటుంది. పగటి వేళలతో పోల్చితే రాత్రివేళ క్యాలరీలు అంత వేగంగా తగ్గవు. అయితే, శరీరంలో కొవ్వు తగ్గడం కంటే నీటి శాతం తగ్గడం చాలా ముఖ్యం. అలాగే, రాత్రంతా సరిగా నిద్రపోకపోయినా నష్టమే. అది మీ బరువును మరింత పెంచుతుంది.
8 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుంది?: రాత్రి 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడి కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో కార్టిసాల్ స్థాయి పెరుగుదల ప్రేగుల్లోని సూక్ష్మజీవులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సూక్ష్మజీవుల స్థాయిలలో అసమతుల్యత వల్ల యజీవక్రియ నెమ్మదిస్తుంది. నిద్ర కోల్పోవడం వల్ల ఆకలి కలిగించే హార్మోన్లకు భంగం ఏర్పడుతుంది. ఫలితంగా జంక్ ఫుడ్ తినడానికి అవకాశం ఉంటుంది. అది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. ఇది బరువు పెరగడానికి, ఇతర సమస్యలకు దారి తీస్తుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక అధ్యయనం పేర్కొంది. నిద్ర కోల్పోవడం వల్ల మీరు సుమారు 20 శాతం శక్తిని పోల్పోతారని పేర్కొంది. కాబట్టి.. మంచి నిద్ర కావాలన్నా.. నిద్రలోనే బరువు తగ్గి, జీవక్రియను పెంపొందించుకోవాలన్నా.. ఈ కింది టిప్స్‌ను ప్రయత్నించండి.
సాయంత్రం వేళలో వ్యాయామం: మీ ఆఫీస్‌లో జిమ్ ఉన్నా లేదా మీరు ఆఫీస్ లేదా పనులను పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్ర వేళల్లో జిమ్ చేయండి. దీనివల్ల మీ జీవక్రియ రేటు 16 గంటల వరకు పెంచుకోవచ్చని ఇటీవల డయాబెటోలోజియా అధ్యయనం పేర్కొంది. దీని ప్రకారం.. ఉదయం వ్యాయామం చేసినవారి కంటే సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేవారిలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం వేళల్లో వ్యాయామం వల్ల శరీరం అలసిపోయి హాయిగా నిద్ర కూడా పడుతుంది.
చన్నీటి స్నానం చేయండి: జిమ్ తర్వాత చన్నీటి స్నానం చేయడం చాలా మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరం తెల్ల కొవ్వు(White Fat), గోధుమ వర్ణం కొవ్వు(Brown Fat) అనే రెండు రకాల కొవ్వులు ఉంటాయి. బ్రౌన్ ఫ్యాట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ ఫ్యాట్ జీవక్రియ క్రియాశీలంగా ఉంటుంది. ఇది క్యాలరీలను బర్న్ చేస్తుంది. అయితే, వయస్సు పెరిగినవారిలో బ్రౌన్ ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. బ్రౌన్ ఫ్యాట్‌ను యాక్టీవేట్ చేయడానికి 30 సెకన్ల చల్లదనం అవసరమని ఓ పరిశోధనలో తేలింది. అందుకే వ్యాయామం తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు. అలాగే చల్లగా ఉండే గదిలో నిద్రించడం ద్వారా కూడా బ్రౌన్ ఫ్యాట్‌ను పెంచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
గ్రీన్ టీ తాగండి: గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్లు జీవక్రియను పెంచుతాయి. గ్రీన్ టీని రాత్రిపూట తీసుకుంటే.. 3.5 శాతం ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ (AJCN) 2016 అధ్యయనంలో పేర్కొంది. అధ్యయనంలో భాగంగా కెఫిన్‌తో పాటు, గ్రీన్ టీలోని కాటెచిన్ సమ్మేళనాలను తీసుకున్న వ్యక్తుల్లో బ్రౌన్ ఫ్యాట్ పెరిగింది. గ్రీన్ టీ వల్ల నిద్రకు ఎలాంటి సమస్య ఉండదు.
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!