NIMS Recruitment: నిమ్స్‌లో 51 సీనియర్ రెసిడెంట్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక పూర్తి వివరాలు ఇలా
NIMS Jobs: హైదరాబాద్‌లోని నిమ్స్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
![NIMS Recruitment: నిమ్స్‌లో 51 సీనియర్ రెసిడెంట్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక పూర్తి వివరాలు ఇలా Nizams Institute Of Medical Sciences has released notification for the recruitment of senior resident posts apply now NIMS Recruitment: నిమ్స్‌లో 51 సీనియర్ రెసిడెంట్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక పూర్తి వివరాలు ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/81b2af17d087fb308972aa97e4f9ba101719050482143522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nizam's Institute Of Medical Sciences Senior Resident Posts: హైదరాబాద్‌లోని 'నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS Hyderabad)' సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 51 ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి. దరఖాస్తుతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికేట్లు జతచేసి జూన్ 26లోగా నిమ్స్ కార్యాలయంలో సమర్పించాలి. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగల ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 51
విభాగాలవారీగా ఖాళీలు..
➥ రేడియేషన్ అంకాలజీ: 01 పోస్టు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ జనరల్ మెడిసిన్: 01 పోస్టు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ పాథాలజీ: 05 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ మైక్రోబయాలజీ: 01 పోస్టు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్: 17 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ రేడియాలజీ & ఇమేజియాలజీ: 11 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ గైనకాలజీ: 01 పోస్టు
అర్హత: ఎండీ(గైనకాలజీ)/ డీజీవో/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ క్లినికల్ ఇమ్యునాలజీ & రుమటాలజీ: 02 పోస్టులు
అర్హత: ఎండీ/డీఎన్‌బీ (జనరల్ మెడిసిన్/పీడియాట్రిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
➥ ఎండోక్రైనాలజీ & మెటబాలిజం: 02 పోస్టులు
అర్హత: ఎండీ/డీఎన్‌బీ (జనరల్ మెడిసిన్/పీడియాట్రిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
➥ మెడికల్ జెనెటిక్స్: 02 పోస్టులు
అర్హత: ఎండీ/డీఎన్‌బీ (పీడియాట్రిక్స్/ జనరల్ మెడిసిన్), ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ లేదా అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ హెమటాలజీ: 02 పోస్టులు
అర్హత: ఎండీ/డీఎన్‌బీ (జనరల మెడిసిన్/పీడియాట్రిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
➥ న్యూరాలజీ: 06 పోస్టులు
అర్హత: ఎండీ/డీఎన్‌బీ (జనరల మెడిసిన్/పీడియాట్రిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.500. నిమ్స్ క్యాష్ కౌంటర్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.1,21,641.
దరఖాస్తుకు చివరితేదీ: 26.06.2024.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
O/o. Executive Registrar,
Nizam's Institute Of Medical Sciences (NIMS),
Panjagutta, Hyderabad.
దరఖాస్తుకు జతచేయాల్సిన డాక్యుమెంట్లు...
➛ పదోతరగతి లేదా తత్సమాన మార్కుల సర్టిఫికేట్
➛ ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ కోర్సు స్టడీ సర్టిఫికేట్
➛ తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
➛ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు హోదా కలిగి ఉండాలి.
➛ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ కోర్సుల డిగ్రీ లేదా ప్రొవిజినల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి
➛ ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ నుంచి NOC, పర్‌ఫార్మెన్స్ రిపోర్ట్ తీసుకోవాలి.
➛ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్
➛ పబ్లికేషన్స్ (ఇంటర్వ్యూ సమయంలో అవసరమవుతుంది)
➛ బ్యాంక్ అకౌంట్ వివరాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)