Karthika Deepam జూన్ 25 ఎపిసోడ్: శోభ చెంప చెళ్లుమనిపించిన సౌందర్య, అటు డాక్టర్ సాబ్ తో లెక్కలు తేల్చుకుంటున్న రౌడీ బేబీ
Karthika Deepam june 25th Episode 1388: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 25 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.
Karthika Deepam జూన్ 25 శనివారం ఎపిసోడ్
జ్వాల( శౌర్య) కోసం ఇంట్లో వంటచేస్తున్న సౌందర్య ...నీకు ఏం ఇష్టం అని అడుగుతూ దోసకాయపచ్చడి చేయనా అంటుంది. అది నా శత్రువికి ఇష్టం అందుకే నాకు ఇష్టంలేదంటుంది జ్వాల.
సౌందర్య: హిమ అనుక్షణం నీకోసమే ఆలోచిస్తుంటే నువ్వు దాని గురించి ఇలా ఆలోచిస్తున్నావ్
జ్వాల: నేనెవరో తెలిసే వంటచేసి తినిపిస్తోందా అనుకున్న జ్వాల నేనెవరో తెలిస్తే ఇలా ఉండదు కదా అనుకుంటుంది. సీసీ నువ్విలా తినిపిస్తుంటే...
సౌందర్య: హా తినిపిస్తుంటే..ఎవరనా గుర్తొస్తున్నారా
జ్వాల: నాకెవరున్నారు సీసీ...ఉన్న డాక్టర్ సాబ్ కూడా నో చెప్పారు
సౌందర్య: మీ డాక్టర్ సాబ్ తో నన్ను మాట్లాడమంటావా
జ్వాల: నువ్వేం చేస్తావులే సీసీ..మొదట్నుంచీ ఇంతే..నా తలరాతేఇంత..అందర్నీ పోగొట్టుకున్నాను
సౌందర్య: ప్రయత్నించి చూస్తే పోగొట్టుకున్నవి ఒక్కోసారి దొరుకుతాయి కదా, ప్రయత్నించి చూడు
జ్వాల: చాలు సీసీ కడుపునిండిపోయింది..నానమ్మకి నేనెవరో తెలియకుండానే ఇంత ప్రేమ చూపిస్తోంది, తెలిస్తే ఎంత ప్రేమ చూపిస్తుందో...
సౌందర్య: కడుపునిండా అన్నం తినిపించిన సౌందర్యతో నువ్వు కూడా తినొచ్చు కదా అంటుంది. నువ్వు తిన్నావ్ కదా నాకు కడుపునిండిపోయింది.
జ్వాల: నువ్వేదో నా మనసుని రిపేర్ చేద్దామని చూస్తున్నావ్ కానీ అది జరగదు నువ్వెళ్లు..యంగ్ మెన్ ఎదురుచూస్తుంటారు
సౌందర్య: వెళ్లిపొమ్మని మొహంమీదేచెప్పేస్తున్నావ్ ఏంటే..నాతో పాటూ మా ఇంటికి రావొచ్చుకదా
జ్వాల: వద్దులే సీసీ ఎవరు ఎక్కడ ఉండాలో ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు వద్దులే అనేస్తుంది . ( అక్కడకు వస్తే హిమను చూసి తట్టుకోలేను..నీ ముందు తనతో గొడవపడడం నాకు ఇష్టం లేదు)
సౌందర్య: ఏమైందే అసలు ఇంకా ఏదో ఆలోచిస్తున్నావ్
జ్వాల: అందరూ ఎంత మోసం చేశారు సీసీ..ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందా సీసీ..
సౌందర్య: హిమ నిన్ను మోసం చేయలేదే...నీకోసమే తన ప్రేమని త్యాగం చేసింది..అది నీకెలా చెప్పాలో అర్థంకావడం లేదు.. తింగరే హిమ అని తెలిస్తే నీకుకోపం ఇంకా పెరిగిపోతుంది.. అనుకుంటూ బయటకు వెళుతుంది.
సౌందర్యకు కాల్ చేసిన శోభ..నేను చెప్పింది ఏం చేశారు అని అడుగుతుంది. నీ లొకేషన్ పంపించు అక్కడకు వచ్చి ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తుంది.
Also Read: తింగరే హిమ అని జ్వాల(శౌర్య)కు తెలిసేలా చేసిన శోభ, సౌందర్య ఏం చేయబోతోంది
మరోవైపు ప్రేమ్ హిమను తల్చుకుని బాధపడుతుంటాడు. అందేంట్రా నువ్వు ముంబై వెళుతున్నావంట.... నా పెళ్లికి ఉండకపోతే ఎలా, నువ్వే ఫొటోలు తీయాలి అంటాడు నిరుపమ్ . అసలు క్యాన్సర్ పేషెంట్ ను పెళ్లిచేసుకోవడం అవసరమా అన్న ప్రేమ్ తో... ఎన్నేళ్లు బతికాం అన్నది కాదు ఎంత ఆనందంగా ఉన్నాం అన్నది ముఖ్యం అంటాడు. ప్రేమ్...నిరుపమ్ కి హగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
అటు సౌందర్యకి కాల్ చేసిన శోభ..ఆమె రాకకోసం ఎదురుచూస్తుంటుంది...ఇంతలో సౌందర్య రానే వస్తుంది.
శోభ: మీ నిరుపమ్ ని నాకిచ్చి పెళ్లిచేయండి, మీ రెండో మనవరాలు మీ ఇంట్లో అడుగుపెడుతుంది, అనవసరంగా క్యాన్సర్ పేషెంట్ కి ఇచ్చి పెళ్లి చేయడం అవసరమా..నెలరోజుల్లో చనిపోయేదానికి..అందుకే నాకిచ్చి పెళ్లిచేయండి..
సౌందర్య: లాగిపెట్టి కొట్టిన సౌందర్య... నువ్వేంటే నాకు డీల్ ఇచ్చేది...అతితెలివి చూపించకు, అది కూడా నా దగ్గర అస్సలు చూపించకు, నా మనవరాలిని, నా ఫ్యామిలీని ఒక్కమాట అన్నా నేను తట్టుకోలేను. నువ్వేదో డీల్ అని పెద్దపెద్ద మాటలు చెప్పావ్ కదా..అది నాకు పెద్ద పనేం కాదు. నా మనవడికి పెళ్లి చేయడం తెలుసు, నా మనవరాలిని ఇంటికి ఎలా తెచ్చుకోవాలో తెలుసు.. పావలా మేటర్ ఉంటే ముప్పావలా చేయొద్దు.. అలా చేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తాను. గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతుంది...
చీకటి పడ్డాక కారుని రోడ్డుపక్కన ఆపేసి హిమ ఆలోచిస్తుంటుంది. అమ్మా నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం అనుకుంటే ఏంటో ఇలా జరుగుతోంది అనుకుంటుంది. హిమని ఒంటరిగా చూసిన శోభ.... హిమ పేరుతో జ్వాలకి కాల్ చేసి నీ శత్రువు హిమని మాట్లాడుతున్నా అంటుంది. నన్ను కలవాలని ఉందా వస్తావా అంటూ లొకేషన్ షేర్ చేస్తుంది. ఆ లొకేషన్ దగ్గరకు పరుగుతీస్తుంది జ్వాల. ఇప్పడు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఫుట్ బాల్ ఆడుకుంటాను అనుకుంటుంది శోభ.
Also Read: ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు-వసు అల్లరికి రిషి ఫిదా, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తుళ్లింత
సౌందర్య- ఆనందరావు: ఈ చేతులతో దాన్ని ఎత్తుకున్నానండీ, ఈ చేత్తో మన రౌడీకి అన్నం తినిపించాను, అన్నీ చేసి ఇన్నాళ్లూ నా మనవరాలిని చూసికూడా గుర్తుపట్టలేకపోయాను, అప్పటికీ నా మనసులో ఏదో బాధ కలిగేది..ఇప్పుడు అర్థమైందండీ రక్తసంబంధం అంటే ఇదేనేమో అని సౌందర్య అంటే..నేను చూడలేకపోయానని బాధపడతాడు ఆనందరావు. ఇంటికి రమ్మని అడిగాను కానీ అది రౌడీ కదా పట్టుదలతో ఉంది హిమపై కోపంగా ఉందని చెబుతుంది. అది మనల్ని గుర్తుపట్టి కూడా మన దగ్గరకు రాకుండా ఎలా ఉండిపోయింది సౌందర్య అని ఆనందరావు బాధపడతాడు. శౌర్యకి నేనంటే చాలా ఇష్టం సౌందర్య..రాత ఏంటో తెలియదు చిన్నప్పుడు దూరమైంది, పెద్దయ్యాక దూరమైంది..ఎందుకు దూరమైందో ఏంటో ఆ పైవాడికే తెలియాలి....
ఎపిసోడ్ ముగిసింది...
సోమవారం ఎపిసోడ్ లో
ఏంటే ఆటోని తీసుకొచ్చి ఏకంగా ఇంటి ముందు పెట్టావ్ అని స్వప్న అడుగుతుంది. లెక్కలు తేల్చుకుందామని వచ్చానన్న జ్వాల...ఇది మీరు కొనిచ్చిన ఆటోనే డాక్టర్ సాబ్..ఇంకా నేను ఆటోలో తిరిగితే జ్వాల అనే నా పేరుకి అర్థం లేకుండా పోతుంది. మీ సహాయానికి సానుభూతికి నమస్కారం అని ఆటో కీ నిరుపమ్ చేతిలో పెడుతుంది.
Also Read: రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో, ఇకపై ఇద్దరు శత్రువులు అని రగిలిపోతున్న జ్వాల