అన్వేషించండి

Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?

Podharillu Serial Today Episode March 9th: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?

Podharillu Serial Today Episode: కేశవ్‌ గురించి  చక్రి చెప్పిన అబద్ధం గురించి మహా కన్నాకు చెబుతుంది. అసలు మీ కేశవ్‌ ఏం చేస్తుంటాడని అడగ్గా.. చెప్పడం దేనికి నేరుగా చూపిస్తానని కన్నా అంటాడు. కానీ దీని గురించి మళ్లీ నువ్వు చక్రిని అడగకూడదని...గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అనకూడదని మాట తీసుకుంటాడు. సరేనని చెప్పడంతో మహాను తీసుకుని కేశవ్‌ బైక్‌ మెకానిక్‌ షాప్‌ దగ్గరకు వెళ్తాడు. అక్కడ కేశవ్ చేసే పని చూసి మహా ఆశ్చర్యపోతుంది. మీ అన్నయ్యకు  పెద్ద ఆటోమోబైల్‌ ఇండస్ట్రీ ఉందని చెప్పాడురా కన్నా అని మహా అంటుంది. కేశవ్‌తో మాట్లాడి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత చక్రి రాగానే మహా నిలదీస్తుంది. మీ కేశవ్‌ ఏం చేస్తుంటాడని అడగ్గా...పెద్ద ఆటోమోబైల్‌ సంస్థ ఉందని మళ్లీ అబద్ధం చెప్పడంతో మండిపడుతుంది. ఇప్పుడే మీ ఆటోమోబైల్ ఇండస్ట్రీ చూసి వస్తున్నాని అంటుంది. అసలు నీకు అబద్ధాలు చెప్పేందుకు సిగ్గు అనిపించలేదా అని మళ్లీ గట్టిగా క్లాస్‌ పీకుతుంది. మా ఇంటి గురించి, మా అన్నదమ్ముల గురించి గొప్పగా చెప్పాను తప్ప...తానేమీ అబద్ధాలు చెప్పలేదంటూ తప్పించుకుంటాడు.
 
బయట నుంచి రెండు ఫొటోలు పట్టుకుని వచ్చిన నారాయణ...ఇంట్లో గోడకు మేకులు కొడుతుండటం చూసి మాధవ్‌ అడుగుతాడు. కాసేపట్లో మీకే అన్ని తెలుస్తాయంటూ మహా, చక్రి రిసెప్షన్ ఫొటో తీసి గోడకు తగిస్తాడు.అలాగే తమ ఫ్యామిలీ మొత్తం తీయించుకున్న గ్రూఫ్‌ పొటో సైతం అక్కడ పెడతాడు.ఆ రెండు ఫొటోలు చూసి మహా షాక్‌కు గురవుతుంది. మాధవ్‌ వైపు చూసి తలపట్టుకుంటుంది. దీంతో మాధవ్‌ వాళ్ల నాన్నపై మండిపడతాడు. అసలు నేను రిసెప్షన్ ఆల్బమ్ వద్దని చెబితే...నువ్వు ఈ ఫొటోలు ఎందుకు తెచ్చావని నిలదీస్తాడు. అసలు మన ఇంట్లో మనం అందరం కలిసి దిగిన ఫొటో ఒక్కటైనా ఉందా అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.ఇన్నాళ్లకు మనం అందరం కలిసి దిగిన ఫొటో ఇంట్లో పెడితే...నన్నే ప్రశ్నిస్తావా అంటాడు. ఇకపై ఈ ఇంటి గురించి ఎవడు మాట్లాడాలన్నా...ఈ ఫొటో చూసి నోరు మూసుకుంటారని అని బయటకు వెళ్లిపోతాడు.
 
మాధవ్‌ను పక్కకు తీసుకెళ్లి అతన్ని ప్రశ్నిస్తుంది. ఇలాంటిది జరుగుతుందనే...ఆరోజు రిసెప్షన్‌కు రానని చెప్పాను అంటుంది. మీమీద ఉన్న గౌరవంతో రిసెప్షన్‌కు వస్తే...ఇప్పుడు ఏకంగా నన్ను చక్రి భార్యను చేసేస్తున్నారని మండిపడుతుంది. నాకు కూడా ఇలా జరుగుతుందని తెలియదమ్మా అంటాడు. అంతలో అక్కడికి వచ్చిన కేశవ్‌ను చూసి మహా వెళ్లిపోతుంది. కేశవ్‌ వాళ్ల అన్నయ్యను అపార్థం చేసుకుంటాడు. రిసెప్షన్‌ ఆల్బమ్ ఇస్తానంటే ఎందుకు వద్దన్నావ్‌ అని నిలదీస్తాడు. నీకన్నా ముందే చక్రికి పెళ్లి అయిపోయిందని నువ్వు ఈర్ష్యపడుతున్నావ్ అని అవమానిస్తాడు. నీకు అన్ని విషయాలు ఇప్పుడు చెప్పలేనని చెప్పినా వినకుండా కేశవ్‌ అక్కడి నుంచి అగ్రహంగా వెళ్లిపోతాడు.
 
దుబాయ్ నుంచి వచ్చిన తాయర్ భర్త...గాయత్రికి ఓ మంచి సంబంధం తీసుకుని వస్తాడు. అబ్బాయికి చాలా ఆస్తి ఉందని...దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఉందని చెబుతాడు.ఈ సంబంధం మాట్లాడటానికే నేను అర్జెంట్‌గా దుబాయ్‌ నుంచి వచ్చానని అంటాడు.ఆ మాటలు విన్న తాయర్‌ చాలా సంతోషపడుతుంది.కానీ ఈ సంబంధం తీసుకొచ్చిన తండ్రిపై గాయత్రికి చాలా కోపం వస్తుంది. పెళ్లి వెంటనే చేయాలని అంటున్నారని...వాళ్లు వీలైనంత త్వరగా పెళ్లిచూపులకు వస్తారని చెబుతాడు.
 
కేశవ్‌ అన్న మాటలకు బాధపడుతున్న మాధవ్‌ వద్దకు చక్రి వస్తాడు. ఆ ఫొటో ఐడియా ఇచ్చింది తానేనని చెబుతాడు. దీంతో మాధవ్‌ చక్రిని మందలిస్తాడు. మళ్లీ మళ్లీ ఎందుకు తప్పులు చేస్తున్నావని నిలదీస్తాడు. రోజూ ఆ ఫొటో చూసైనా తను నాకు దగ్గరవుతుందని చక్రి అంటాడు.అసలు ఆ అమ్మాయి మీకు జరిగింది పెళ్లి కాదని అనుకుంటుందని...నువ్వు మాత్రం ఆమె భార్యని ఊహించుకుంటున్నావని మందలిస్తాడు.
 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget