Guppedantha Manasu జూన్ 24 ఎపిసోడ్: ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు-వసు అల్లరికి రిషి ఫిదా, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తుళ్లింత
Guppedantha Manasu June 24 Episode 485: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 25 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జూన్ 24 ఎపిసోడ్ (Guppedantha Manasu June 24 Episode 485)
దేవయాని అన్న మాటలు తల్చుకుని బాధపడుతుంది జగతి. అక్కయ్యలో కడుపుమంట రోజురోజుకీ పెరుగుతోంది. బావగారి ముందే ఇలా బయటపడిందంటే తన ఆలోచనలు ఇంకా ఎలాంటి వికృత రూపాలు తీసుకుంటాయో కదా అంటుంది జగతి. చెట్టుని పండిన పండు, పాపం రెండూ పండినప్పుడే నేల రాలుతాయంటాడు మహేంద్ర. ఇలా ఎంత దూరం పోతుందో ఏంటో కదా రిషిని నేను వదిలి వెళ్లాడని అనుకుంటున్నాడు, సాక్షి మోసం చేసింది, వసు నో చెప్పిందని బాధపడుతున్నాడు, చివరికి దేవయాని అక్కయ్యది కూడా కపట ప్రేమే అని తెలిస్తే బంధాల మీద, మనుషుల మీదున్న కాస్త నమ్మకం పోతుంది కదా
మహేంద్ర: నీరు ప్రవహిస్తూ అన్ని మలినాలను కలుపుకుంటూ కొంత దూరం వెళ్లాక మలినాలు కిందకు చేరి స్వచ్ఛమైన నీరు ముందుకుసాగుతుంది. మనిషి జీవితం కూడా అలాంటిదే. చెడ్డవాళ్లు మురికినీరులా అడుగుకి చేరుతారు, మంచివాళ్లు మనతో పాటూ ప్రయాణం చేస్తారు. దేవయాని వదిని తన నిజస్వరూపం ఎంత తొందరగా బయటపెడితే అంత మంచిది అని నేను అనుకుంటున్నాను. మంచి చెడుమీద గెలవాలి అంటే చెడు పరాకాష్టకి చేరాల్సిందే. శిశుపాలుడి నూరు తప్పులను శ్రీకృష్ణుడు భరించాడు కదా.. చూద్దాం..ఈ వదిన ఇంకా ఎన్ని తప్పులు చేస్తుందో... రిషిని మభ్యపెడుతూ, కపట ప్రేమ చూపిస్తూ నటిస్తోంది కానీ అబద్ధపు పునాదుల మీద ప్రేమలు, బంధాలు నిలవవు..ఎప్పుడో అప్పుడు కూలిపోవాల్సిందే. వదిన నిజస్వరూపం రిషికి తెలిస్తే ఆవిడ పరిస్థితి ఏంటో ఊహకు కూడా అందదు.
జగతి: దేవయాని అక్కయ్య ఓడిపోతుందని సంతోషించడం కాదు..ఇప్పటి వరకూ గాయపడిన రిషి మనసు మళ్లీ ఇంకోమోసాన్ని తట్టుకోలేదు కదా
Also Read: కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా - వసు దగ్గర బెట్టు చేస్తోన్న రిషి
రోడ్డు పక్కన సైకిల్ ఆపేసి చైన్ పెడుతుంటుంది వసుధార. అదే దారిలో వెళుతూ రిషి చూసి ఆగుతాడు. నేను ట్రై చేయనా అడిగితే మీ వల్లకాదులెండి అనేస్తుంది. నేను ఎండీని అని రిషి అంటే..మీరు కాలేజీ ఎండీ అని నాకు తెలుసు కానీ సైకిల్ కి, చైన్ కి తెలియదు కదా అంటుంది. ఇంతలో వసు ముఖానికి ఆయిల్ మరక అంటుంకుంటే ఫోన్లో చూపిస్తాడు. కశ్చఫ్ ఇవ్వండి అని అడిగి రిషి ఇచ్చేలోగా చున్నీతో తుడిచేసుకుంటానంటుంది. సార్ వాటర్ పోయండి చేతులు కడుక్కుంటాను అని అడుగుతుంది.
రిషి: సైకిల్ బాగవలేదు కదా అప్పుడే చేతులు కడిగేస్తున్నావేంటి
వసు: బాగవలేదు సార్ కానీ మీరొచ్చారు కదా
రిషి: అంటే నన్ను బాగుచేయమంటావా
వసు: ఇప్పుడేం చేద్దాం సార్
రిషి: నువ్వే చెప్పు ప్రతి విషయంలో నీకు స్పష్టత ఉంటుంది కదా
వసు: మనం కాసేపు క్యారెక్టర్స్ మార్చుకుందాం..
రిషి: నేను మనసు, క్యారెక్టర్స్ మార్చుకునేవాడిని కాదు..ఎప్పుడూ ఒకేలా ఉంటాను
వసు: కాసేపు అలా అనుకుందాం సార్..అంటూ... రిషిలా యాక్ట్ చేస్తూ వసుధారా ఏమైంది
రిషి: వసులా నటిస్తూ సైకిల్ చైన్ పాడైంది సార్
వసు: రిషిలా రియాక్టవుతూ ఇందులో బాధపడేదేముంది..మన కారుంది కదా అందులో వెళదాం పద అంటుంది
రిషి: బాగా అర్థమైందిలే అంటాడు
కార్లో వెళుతూ ఇప్పుడు నేను రిషిని, వసుధారనా అని అడిగితే అదెప్పుడో అయిపోయింది సార్ అంటే.. అంతేలే మళ్లీ నీకు అవసరం వచ్చినప్పుడు రిషిగా మారిపోతావా...
వసు: తిరిగి తిరిగి తలనొప్పిగా ఉంది ఎక్కడైనా ఆపితే టీ తాగుదాం సార్ అంటుంది. ఓ టీ కొట్టు దగ్గర ఆగుతుంది. రెండు స్పెషల్ టీ, బిస్కెట్స్ ఉన్నాయా అని అడుగుతుంది.
రిషి: నాకేం వద్దు అంటాడు
వసు: సాయంత్రం మిర్చి వేస్తావా..వెయ్యాలి భయ్యా ఆదాయం పెరుగుతుంది కదా అంటూ వేడి టీ పట్టుకుని హడావుడిగా వెళుతుంది..
రిషి: నిన్నెవరు తెమ్మన్నారు చేయి కాలుతుంది కదా అని కోప్పడతాడు రిషి
వసు: నేనే మీకిద్దామని అని నసుగుతుంది...
టీ తాగేసి వెళుతుండగా రిషి సార్ లిఫ్ట్ ఇవ్వరేమే అనుకున్నాను అనుకుంటుంది వసుధార. మీ పక్కన కార్లో కూర్చుంటే ఎంతో బావుంటుంది అనుకుంటూ ప్రశాంతంగా బావుంది కదా అని బయటకు అంటుంది.
Also Read: తింగరే హిమ అని జ్వాల(శౌర్య)కు తెలిసేలా చేసిన శోభ, సౌందర్య ఏం చేయబోతోంది
ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిషికి ఎదురుగా మహేంద్ర నిల్చుని ఉంటాడు
రిషి: ఎక్కడికి వెళ్లావ్, నీ మూడ్ ఎలా ఉందని అడగొద్దు డాడ్
మహేంద్ర: నన్ను అడగొద్దు అన్నావ్ నువ్వు నన్ను అడుగుతావా
రిషి: భోజనం చేశారా..
మహేంద్ర: లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నాను
జగతి: రిషిపై మాటలతో గెలవాలని అనుకోవద్దు..నువ్వు ఓడిపోయి రిషిని గెలిపించాలి కదా మహేంద్ర అనుకుంటుంది మనసులో
డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతుంటే వచ్చి జగతి చేతిలో ప్లేట్ లాక్కుంటుంది దేవయాని. నువ్వు వడ్డిస్తే తింటాడో తినడో తెలియదు..నువ్వు పక్కకు జరిగితే కనీసం కడుపునిండా అయినా భోజనం చేస్తాడు అంటుంది. జగతి ఏమీ మాట్లాడకుండా ఆగిపోతుంది.
దేవయాని: రా నాన్నా రిషి..నిద్రపోకుండా మీకోసమే ఎదురుచూస్తున్నాను.
రిషి: మీరు నిద్రపోవచ్చు కదా
దేవయాని: నాకు నీకన్నా ఎవరు ఎక్కువ చెప్పు అనగానే మహేంద్ర పొలమారినట్టు యాక్ట్ చేసి వదినగారికి నీ కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదంటాడు. ఇంతలో దేవయాని ఏం రిషి ఏం మాట్లాడడం లేదు సైలెంట్ గా ఉన్నావేంటి..
మహేంద్ర: సైలెంట్ గా ఉన్నాడంటే ప్రశాంతంగా ఉన్నట్టే కదా
జగతి: కొందరి ప్రశాంతతను ఇంకొందరు ఓర్చుకోలేరులే మహేంద్ర..నీకేం కావాలో చెప్పు వడ్డిస్తాను
రిషి: వంటలు చాలా బావున్నాయి మీరే చేశారా పెద్దమ్మా...
దేవయాని: అవును నాన్నా నేను చేశాను
జగతి: నేను చేసిన వంటలు నా కొడుకు బావుందని తింటున్నాడు చాలు.. పేరు ఎవరిదైతే ఏంటి నా కొడుకు కడుపునిండా తింటున్నాడు చాలు
మహేంద్ర: నువ్వే చేశావని నాకు తెలుసు జగతి.. అయినా ఎందుకు చెప్పవు
దేవయాని: సాక్షి నా దగ్గర చాలా ఫీలవుతోంది రిషి...
జగతి: చేసిన దానికి పశ్చాత్తాపం ఫీలవుతోందా...
దేవయాని: కాదు నాన్నా తను నీకు సారీ చెప్పాలనుకుంటోంది
రిషి: కోపంగా ప్లేట్ లో చేయి కడిగేసుకున్న రిషి..పెద్దమ్మా మీరంటే నాకు గౌరవం కానీ బ్లాక్ మెయిల్ , అబద్ధాలు చేసేవారంటే నాకు అసహ్యం..సాక్షి ఏం చేసిందో మీకు తెలియదు, కుటుంబం పరువు తీసేలా మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటాను, ఇంకోసారి తన టాపిక్ మనింట్లో వినపడకూడదు పెద్దమ్మా అనేసి సీరియస్ గా వెళ్లిపోతాడు...
Also Read: నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా, వసు ప్రేమని గుర్తించలేకపోతున్న రిషి
రేపటి( శనివారం)ఎపిసోడ్ లో
వసుధార..రిషికి టీ తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వెందుకు తీసుకొచ్చావ్ అంటే మాట్లాడాలి అంటుంది. మీరు నాతో ఎప్పటిలా ఉండడం లేదు..నాతో మాట్లాడడం లేదు..నాపై కోపం ఉంటే డైరెక్ట్ గా తిట్టండి సార్ పడతాను అంటుంది. రిషి చూస్తూ నిల్చుంటాడు..