అన్వేషించండి

Guppedantha Manasu జూన్ 22 ఎపిసోడ్: నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా, వసు ప్రేమని గుర్తించలేకపోతున్న రిషి

Guppedantha Manasu June 22 Episode 483: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 23 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు జూన్ 22 ఎపిసోడ్ (Guppedantha Manasu June 22 Episode 483)

నా స్టోరీని కథగా చెబుతావా అని వసుపై కోప్పడిన తర్వాత తన క్యాబిన్ కి వెళ్లి కూర్చుంటాడు రిషి. ఆ పక్కనే ఓ రిషి పేరు మీద ఉన్న కవర్లో పెన్ డ్రైవ్ ఉంటుంది. అది ఏంటా అని చెక్ చేస్తాడు రిషి. సాక్షి వీడియో ఉంటుంది అందులో.
సాక్షి వీడియోలో: నీకేమైంది..మనకు ఎంగేజ్ మెంట్ అయింది..నువ్వు వసుని కోరుకున్నావ్ ఆ వసు నిన్ను వద్దంది.. ఇప్పుడైనా నువ్వు నన్ను అంగీకరించొచ్చు కదా నాతో నీ ప్లాబ్లెమ్ అంటో నాకు అర్థం కావడంలేదు. వద్దు పొమ్మన్న వసుధారని ఇంకా ఎందుకు కోరుకుంటున్నావ్. లైబ్రరీలో తనెందుకు ఉంది..ఏదైనా సీక్రెట్ మీటింగ్ ప్లాన్ చేశావా..నన్ను వదులుకోవద్దు రిషి..నా ప్రేమని యాక్సెప్ట్ చేయి..ఐ లవ్ యూ రిషి...
ఆ పెన్ డ్రైవ్ డస్ట్ బిన్ లో వేసేసిన రిషి..వసుధారకి కబురుపెడతాడు...వసు వస్తుంది
రిషి: రండి వసుధార గారూ..అతిథి మర్యాదలు చేద్దామని రమ్మన్నాను కాఫీ, టీ, కూల్ డ్రింక్ జ్యూస్ ఏం తీసుకుంటారు. తమరు చేసిన ఘనకార్యాలనికి భారీ సన్మానం చేసినా తక్కువే.
వసు: నేనేం చేశాను
రిషి: మన మధ్య విషయాలన్నీ ఆ సాక్షికి ఎందుకు చెప్పావ్..
వసు: సాక్షికి నేనేం చెప్పాను..
రిషి: ఇంకోసారి ఆమాట అనొద్దు..నువ్వు చెప్పకపోతే నేను ప్రపోజ్ చేసింది, రిజెక్ట్ చేసింది తనకు ఎలా తెలుస్తుంది..ఏదో కహాని చెప్పు వింటాను కానీ మన పర్సనల్ విషయం మూడో వ్యక్తి అయిన సాక్షికి ఎలా తెలిసింది..
వసు: ఇప్పుడేం చెప్పాలి..సాక్షి ఆరోజు అక్కడే ఉందని ఎలా చెప్పాలి..రిషి సార్ నమ్ముతారో నమ్మరో..
రిషి: మాట్లాడవేంటి..నేను చెప్పాను..నువ్వు నో అన్నావ్..నాది ప్రేమ కాదన్నావ్..సరే..నన్ను రిజెక్ట్ చేసావ్.. ఐ యామ్ రిజెక్టెడ్ పీస్..నిన్ను ఇష్టపడడమే నా తప్పు కదా? ఆ విషయం చెప్పడమే నేను చేసిన పెద్ద తప్పు.. నన్ను కాదనడం ఔను అనడం నీ వ్యక్తిగతం కానీ ఆ విషయం సాక్షికి చెప్పడం ద్వారా నీ ఈగో తృప్తి పడిందా? 
వసు: నేను చెప్పేది వినండి ప్లీజ్...
రిషి: నువ్వేం చెప్పకు..నేను వినను..సాక్షి ఎలా మాట్లాడిందో తెలుసా.. వీడియో పంపించింది. అసలు సాక్షి అంతలా మాట్లాడడానికి, బిహేవ్ చేయడానికి కారణం నువ్వే అని తెలుస్తోంది..
వసు: మీరంటే గౌరవం ఉంది
రిషి: నాపై గౌరవం ఉంటే నువ్వు సాక్షికి మన విషయాలు చెప్పేదానికి కాదు. సాక్షి బారినుంచి లైబ్రరీలో నన్ను రక్షించానని ఫీలవుతున్నావేమో , నీ సహాయాలు-సానుభూతి నాకు అవసరం లేదు. నన్ను రిజెక్ట్ చేశావ్ చాలు ఇక నా గురించి ఆలోచించకు , నా మంచి చెడ్డలు నీకు అనవసరం.
వసు: నన్ను మాట్లాడనిస్తారా..చెప్పింది వింటారా
రిషి: జరిగినదంతా చాలు..చేసిన నిర్వాకం చాలు వెళ్లిపో... అని డోర్ దగ్గర నిల్చుంటాడు
వసుధార రిషిని చూస్తూ నడుస్తూ డోర్ కొట్టుకుని పడిపోతుంటే రిషి పట్టుకుంటాడు..ఆ తర్వాత ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Also Read: నిరుపమ్ మాటలకు కుప్పకూలిపోయిన జ్వాల, అండగా నిలబడిన సౌందర్య, కథలో మరో కీలక మలుపు

వసుధార బయటకు వెళ్లి ఓ చెట్టుకింద కూర్చుని సాక్షి-రిషి మాట్లాడిన మాటలన్నీ గుర్తుచేసుకుంటుంది. 
వసుధార: రిషి సార్ సాక్షికి మన విషం ఎలా తెలిసిందంటే ఏం చెప్పాలి.తనే  చూసింది నేను ఏం చెప్పలేదంటే మీరు నమ్మగలరా..అసలు మీరు నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు( ఐ లవ్ యూ చెప్పిన సంఘటన గుర్తుచేసుకుంటుంది) నా తప్పు సరిదిద్దుకుంటాను, రిషి సార్ కన్నా విలువైనది నా లైఫ్ లో ఏముంటుంది, ఏమీ ఉండదు, లేదు కూడా.. ఎదురుగా నిల్చున్న జగతిని చూసి షాక్ అవుతుంది
జగతి: క్లాస్ కి వెళ్లలేదా..మళ్లీ రిషితో గొడవా.ఏమైనా అన్నాడా
వసు: మీ అబ్బాయి జెంటిల్మెన్ మేడం..
జగతి: వసు అని జగతి పిలుస్తున్నా ఆగకుండా వెళ్లిపోతుంది
మహేంద్ర: ఎదురుగా వచ్చిన మహేంద్ర..వసు ఎక్కడికి వెళుతున్నావ్..జగతి ఏమంటోంది..మీరిద్దరూ ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకున్నట్టు కనిపించడం లేదు అని అడిగితే మేడంతో మాట్లాడి వస్తున్నాను సార్ అని వెళ్లిపోతుంది. ఏమైంది జగతి అని అడుగుతాడు మహేంద్ర. ఇదే నేను అడిగితే మీ అబ్బాయి జెంటిల్మెన్ మేడం అని సమాధానం చెప్పింది. 
మహేంద్ర: నేను ఆలోచించి చెప్పాలా వీళ్లేంటి నాకు షాకులిస్తున్నారు

Also Read: హృదయం ఓర్చుకోలేనిది గాయం, రిజెక్టెడ్ పీస్ ని అని ఎమోషనల్ అయిన రిషిని చూసి తట్టుకోలేకపోయిన వసుధార

కట్ చేస్తే దేవయాని-సాక్షిపై సీన్ ఓపెన్ అవుతుంది
సాక్షి: నాకు నమ్మకం రావడం లేదు ఆంటీ 
దేవయాని: ఓ జీవితం సెట్ చేసుకోవాలంటే టైమ్ పడుతుంది, రిషిని మార్చుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది. రిషికి ఆప్షన్ లేదు
సాక్షి: మీరు చెబితే ధైర్యం వస్తోంది కానీ అక్కడ రిషి మారేట్టు లేడు
దేవయాని: నీకు నేనున్నాను అధైర్య పడొద్దు

రూమ్ లో గోళీల డబ్బా పట్టుకుని కూర్చున్న వసుధార..గతంలో రిషితో కలసి వెళ్లి పిల్లలతో గోళీలు ఆడిన సంఘటనలు గుర్తుచేసుకుని, రిషి కోపంగా మాట్లాడిన మాటలు తలుచుకుని బాధపడుతుంది. జ్ఞాపకాలు అందంగా ఉంటాయనుకున్నాను కానీ అవే జ్ఞాపకాలు బాధిస్తాయని అనుకోలేదనుకుంటుంది. రిషి సార్ ప్రతిమాటా ప్రతి జ్ఞాపకం...ఏందుకు వసుధారా రిజెక్ట్ చేశావ్ అని ప్రశ్నిస్తున్నాయి...
కట్ చేస్తే రిషి కూడా సేమ్ అవే గోళీల డబ్బా పట్టుకుని వసుని తలుచుకుంటాడు
రిషి: జ్ఞాపకాలు ఇంత బాధిస్తాయా,బంధిస్తాయా..వసుకి ఎప్పుడూ నేను తప్పుచేశాననే ఫీలింగ్ రాలేదా..
వసు: ఈ జ్ఞాపకాలు రోజురోజుకీ నేను మోయలేనంత బరువెక్కిపోతున్నాయ్
రిషి: గోళీల డబ్బాను కోపంగా విసిరేస్తాడు రిషి..అప్పుడే అక్కడకు వచ్చిన జగతి అవి తీస్తుంది
జగతి: విసిరేస్తూ వెళితే మనదగ్గర ఏమీ మిగలవ్ కదా..
రిషి: విసిరేసినవి అన్నీ మనకు దూరం అవుతాయని అనుకోకూడదు..విత్తనాలను విసిరేస్తే అవి మొక్కలవుతాయి ఆ విషయం మీకు తెలుసు
జగతి: ఆశావాదంతో ఉండడం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది రిషి సార్.. జ్ఞాపకాలతో ఎన్నిరోజులు స్నేహం చేస్తారు సార్..
రిషి: ఆ జ్ఞాపకాలు నన్ను వీడిపోయేవరకూ..మీరు నా మనసుని చదివినట్టు చెబుతున్నా అనుకుంటున్నారు కానీ మీరు చెప్పే వాటిలో సగం నిజాలు కాదు
జగతి: సగం నిజమే కదా అనే అభిప్రాయంతో నేను ఉన్నా.. వసు ధార...
రిషి: తన టాపిక్ నేను మాట్లాడొద్దు.. మీరు మీ శిష్యురాలు వదిలేసుకోవడంలో గ్రేట్
జగతి: నేను ఆ టాపిక్ మాట్లాడేందుకు రాలేదు. మిషన్ ఎడ్యుకేషన వర్క్ మొదలెట్టాలి, మినిస్టర్ గారు కాల్ చేశారు, వర్క్ మొదలు పెట్టాలి, మెయిల్ చూడండి..
ఇక్కడ రిషి...అక్కడ వసు ఇద్దరూ మళ్లీ గోళీల బాటిల్ చూస్తూ కూర్చుంటారు...
ఎపిసోడ్ ముగిసింది..

Also Read: కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా - రిషి గుండె భారాన్ని దింపేస్తోన్న వసు ప్రేమ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget