Guppedantha Manasu జూన్ 21 ఎపిసోడ్: హృదయం ఓర్చుకోలేనిది గాయం, రిజెక్టెడ్ పీస్ ని అని ఎమోషనల్ అయిన రిషిని చూసి తట్టుకోలేకపోయిన వసుధార
Guppedantha Manasu June 21 Episode 482: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 21 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జూన్ 21 ఎపిసోడ్ (Guppedantha Manasu June 21 Episode 482)
ప్లాన్ ఫెయిల్ అవడంతో వసుధారని అడ్డుకున్న సాక్షి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏయ్ అంటూ చేయెత్తిన సాక్షితో నోరు పారేసుకోవడం,చెయ్యి చేసుకోవడం లాంటివి మానేస్తే మంచిది. నువ్వు రిషి సార్ ని బ్లాక్ మెయిల్ చేస్తావా, అలా ఓ మనసుని ఎలా గెలుస్తావ్ అంటుంది. నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా..నువ్వు వద్దన్నా నిన్ను రిషి వదలడం లేదంటుంది సాక్షి. వదలడం , వద్దనడం మనసులో ఉంటుంది నీకు అర్థంకాదులే..నేను ఉన్నంతకాలం తనని కాపాడతానంటుంది. నీకసలు క్లారిటీ ఉందా అని సాక్షి అనడంతో ఈ మధ్యే క్లారిటీ వచ్చింది..లైబ్రరీ మ్యాటర్ బయటకు చెబితే నీ పరువు పోతుంది, జీవితంలో రిషిని చూడలేవు కూడా అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తుంది.నువ్వు ఎక్కువ చేస్తున్నావ్ అన్న సాక్షితో నిజంగా నేను ఎక్కువ చేస్తే నువ్వు తట్టుకోలేవ్ అంటుంది.
Also Read: ఒక్క చెంపదెబ్బతో కథ మొత్తం మార్చేసిన సౌందర్య, శౌర్య కి మళ్లీ అన్యాయం జరిగినట్టేనా!
కట్ చేస్తే అంతా ఇంట్లో నిల్చుని ఉంటారు
లైబ్రరీలో సాక్షి చేసిన హంగామా గుర్తుచేసుకున్న రిషి మాట్లాడతాడు..
రిషి: కాదని వెళ్లింది కాదనుకునే ఉంది మళ్లీ అభిప్రాయాలు మార్చుకోవడం లేదు
సాక్షి: మనసు మారుతుంది కదా
రిషి: నేను పెద్దమ్మతో మాట్లాడుతున్నాను నువ్వు మధ్యలో మాట్లాడకు..నేను పెద్దమ్మతో మాట్లాడుతున్నాను. తను వంద కారణాలు చెబుతుంది కానీ అందులో ఏ ఒక్కటీ నాకు నిజం అనిపించడం లేదు. చెప్పకుండా ఇంటికొస్తుంది, అపాయింట్ మెంట్ లేకుండా కాలేజీకి వస్తుంది. బయటకు కనిపించేది రూపం మాత్రమే తనవన్నీ విషపు ఆలోచనలే.
సాక్షి: మనకు ఎంగేజ్ మెంట్ అయింది రిషి..ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావ్..నేను కాలేజీకి వచ్చానని ఇలా అంటున్నావా
రిషి: ప్రతిదానికీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది..నేను మొదట్నుంచీ ఇదే చెబుతున్నాను..నువ్వే అభిప్రాయం మార్చుకున్నావు.. సరికొత్త ప్రయత్నం చేస్తున్నావ్..సాక్షి ఏం మాట్లాడకు. అడ్డుపడిన దేవయాని ఏదో మాట్లాడబోతుంటే...పెద్దమ్మా మీరంటే నాకు గౌరవం ఆ గౌరవాన్ని ఇలాంటి వాటికోసం వాడుకోకండి అని కౌంటర్ ఇస్తాడు. ఒకరి ఇష్టంతో జీవితాంతం ఇద్దరూ కలసి ప్రయాణించలేరు..అసలు ఇష్టం అనే పదం కూడా వాడొద్దేమో..
మహేంద్ర: రిషి అంత క్లియర్ గా చెబుతున్నాడు కదా
ఫణీంద్ర: తన మనసేంటో అభిప్రాయాలేంటో క్లియర్ గా చెప్పాడు కదా..
సాక్షి: రిషి తల్లిగా మీరేం మాట్లాడరేంటి...
రిషి: ఈ ఇంట్లోకి వచ్చావని గౌరవంగా , మర్యాదగా మాట్లాడుతున్నాను నాకు కోపం తెప్పించకు..ఇంకోసారి ఈ చర్చలు ఉండవ్.. వెళ్లిపో..
దేవయాని ఏదో చెప్పేందుకు ప్రయత్నించి ఆగిపోతుంది...
జగతి: ఓ ఆడపిల్లగా నీపై నాకు ప్రేమ,గౌరవం ఉంది. నీ మనసు మారింది అన్నావ్..రిషి కూడా మారాలి అనుకోవడం కరెక్ట్ కాదు కదా..తన మనసేంటో చెప్పాడు కదా..ఇంతకన్నా నేను ఏం చెప్పలేను..
సాక్షి: ధరణి అక్క మీరైనా నాకు సపోర్ట్ చేయండి
ధరణి: ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది
రిషి పెదనాన్న ఫణీంద్ర కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు
దేవయాని: ఇది ఓటమి కాదు సాక్షి..గెలిచేవరకూ ఆటాడుదాం. ఓటమిని తల్చుకోవద్దు..గెలుపు కలలు కనాలి
Also Read: సాక్షి క్లీన్ బౌల్డ్, వసుపై ప్రేమతో కూడిన కోపం ప్రదర్శించిన ఈగో మాస్టర్ రిషి
రూమ్ బయట చెట్టుకింద ఫోన్ చూస్తూ కూర్చున్న వసుధార..లైబ్రరీలో సాక్షి మాటలు తల్చుకుంటూ రిషి సార్ ఎంత బాధ పడ్డారో కదా అనుకుంటుంది. అటు రిషి కూడా ల్యాబ్ లో వసు రక్షించడం, లైబ్రరీలో సపోర్ట్ చేయడం గుర్తుచేసుకుంటాడు. ఇంతలో వసు నుంచి కాల్ వస్తుంది. కాల్ కట్ చేస్తాడు..
రిషి: ఏంటో తన ధీమా..ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేసి హలో అంటే మాట్లాడుతా అనుకుంటుందా అనుకుంటాడు
ఇంతలో వసుధార దగ్గరకు వచ్చిన పిల్లలు కొందరు అక్కా కథచెప్పు అని అడుగి ఫోన్ లాక్కుంటారు. అప్పుడు ఆ ఫోన్ డయల్ అయిపోతుంది..రిషి కాల్ లిఫ్ట్ చేస్తాడు..అట్నుంటి వసుధార కథ చెబుతుంటుంది..
వసుధార: అనగనగా రాజ్యంలో ఓ ప్రిన్స్ ఉన్నాడు..తనకు కోపం ఎక్కువ...తను చాలా మంచివాడు కానీ కోపంతో అందర్నీ దూరం చేసుకుంటాడు. ఆకాశంలో చందమామలా చక్కగా ఉంటాడు కానీ చందమామలో కూడా మచ్చలుంటాయి కదా. ( నా జీవితం తనకి టైం పాస్ కథలా మారిపోయింది). తన కోపంతో ఆ రాకుమారుడు ప్రేమని,రాజ్యాన్ని,సింహాసనాన్ని కోల్పోయాడు. అయితే ఓ మహర్షి చెప్పిన మాటలు విని తన కోపాన్ని తగ్గించుకుని తను పోగొట్టుకున్నవి ఎలా సంపాదించుకున్నాడో తెలుసుకుందాం...
కాలేజీలో ఓ చెట్టుకింద కూర్చున్న రిషి.. నా కథను పిల్లలకు కథలు కథలుగా చెబుతోంది రానీ చెబుతాను ఇవాళ అయిపోయింది అనుకుంటాడు. అప్పుడే కాలేజీలో అడుగుపెడుతుంది వసుధార
రిషి: వసుధార అని పిలుస్తాడు...చూసి కూడా చూడనట్టే వెళుతున్నావేమో నీకే తెలియాలి
వసు: ఏంటి రిషి సార్...
రిషి: ఏంటి కథలు చెబుతున్నావేంటి..
వసు: కథలేంటి సార్
రిషి: రాకుమారుడు, కోపం ..ఏంటివన్నీ..
వసు: మీకు ఎలా తెలుసు..
రిషి: ఆకాశవాణి చెప్పింది
వసు: అప్పుడు అర్థమవుతుంది..వాడు ఫోన్ లాక్కున్నప్పుడు డయల్ అయిందన్నమాట. వింటే ఏంటితప్పు సారీ చెబితే పోలా అనుకుంటూ కథ నచ్చలేదా అంటుంది
రిషి: నా కథ చెప్పడం ఏంటి..చెప్పడానికి నీకు నాకథే దొరికిందా..నీకు టైం పాస్ కాకపోతే ఇంకేమైనా చేయి..( ఈ మాత్రం చాలులే ఇంకా గట్టిగా అరిస్తే ఏడుస్తుందేమో అనుకుంటాడు)
వసు: మీ కథ చెబితే తప్పేముంది
రిషి: చందమామ కథ అంటావనుకున్నాను..నా కథే అని చెబుతున్నావేంటి
వసు: రాత్రి వినగానే అడగొచ్చు కదా..రాత్రంతా ఆలోచించి లిస్ట్ తయారు చేసుకుని ఇప్పుడు అడుగుతున్నారు..అదేదో రాత్రే అడగొచ్చుకదా అని ఆయాసపడుతూ వాటర్ దొరుకుతాయా సార్...
రిషి: ఆశ్చర్యంగా చూస్తుంటాడు రిషి
వసు: మీరు నా కథ చెప్పండి నేను సంతోష పడతాను..అంటూ పారిపోయి వచ్చినప్పటి నుంచీ జరిగినదంతా చెబుతుంటుంది
రిషి: ఇంక ఆపు..నువ్వెళ్లు...
వసు: సమాధానం ఎంతసేపు చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా..ఇదేం న్యాయం
రిషి: నువ్వేదో పనిమీద వెళుతున్నట్టున్నావ్ వెళ్లు
వసు: ఎవరు రాశారో కానీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని..మగవారి మాటలకు అర్థాలే వేరులే అని పాటపాడుతూ వెళ్లిపోతుంది
రిషి: కోపంగా మాట్లాడినా కూడా ఈజీగా తీసుకుంటోందిఏంటి
వసు: కోపంగా మాట్లాడినా కూడా వసు ఈజీగా తీసుకుంటోందని అనుకోవచ్చు.. ఒకరు మనల్ని తిట్టినా కూడా కోపం ఎందుకు రాదో రిషి సార్ కి అర్థం కావడం లేదు..మీ కోపం కూడా నాకు నచ్చుతుంది
Also Read: కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా - రిషి గుండె భారాన్ని దింపేస్తోన్న వసు ప్రేమ
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
తమరు చేసిన ఘన కార్యానికి భారీ సన్మానం చేసినా తప్పులేదు..నేను ప్రపోజ్ చేసింది, నువ్వు రిజెక్ట్ చేసింది తనకెలా తెలుస్తుంది.. నీ ఈగో తృప్తి పడిందా..ఆ రోజు సాక్షి అక్కడే ఉందని వసుధార చెప్పేందుకు ప్రయత్నించినా రిషి పట్టించుకోడు.. ఇక్కడి నుంచి వెళ్లిపో అని అరుస్తాడు..