Guppedantha Manasu జూన్ 20 ఎపిసోడ్: సాక్షి క్లీన్ బౌల్డ్, వసుపై ప్రేమతో కూడిన కోపం ప్రదర్శించిన ఈగో మాస్టర్ రిషి
Guppedantha Manasu June 20 Episode 481: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 20 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జూన్ 20 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu June 20 Episode 481)
లైబ్రరీలో రిషి ఉన్నాడని తెలిసి సైలెంట్ గా లోపలకు వెళ్లి లోపలి నుంచి లాక్ చేసిన సాక్షి..రిషిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. పరువుపోయాక కూడా నువ్వు నన్నే పెళ్లిచేసుకోవాలి తప్పదు..అందుకే ఇప్పుడే ఒప్పుకో అంటుంది. శనివారం ఎపిసోడ్ లో ఇదే హైలెట్..సోమవారం ఎపిసోడ్ కూడా ఇక్కడే మొదలైంది..
సాక్షి: బట్టలు చింపుకుంటాను, జుట్టు చెరుపుకుంటాను..లవ్ లో ఫెయిలయ్యావ్..ఇక లైఫ్ లో కూడా ఫెయిలవ్వకు
రిషి: నా లవ్ పెయిలైందని ఎవరు చెప్పారు నీకు
సాక్షి: నాకు ఎలాగో తెలిసిందేలే..నీ పరువు పోతుంది ఆలోచించుకో నన్ను పెళ్లిచేసుకుంటానని చెప్పు లేదంటే ఈ అలారం నొక్కేస్తాను..అందరూ వచ్చేస్తారు అప్పుడు నిన్ను అల్లరిచేస్తాను, నీ పరువు తీస్తాను.. లోపల మనం ఎందుకున్నామో, మనిద్దరమే ఉండగా లాక్ ఎందుకు చేశావో నువ్వే చెప్పాలి అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి అలారం నొక్కేస్తుంది సాక్షి
రిషి: షాక్ లో అలానే చూస్తుండిపోతాడు...
అలారం సౌండ్ విని కాలేజీలో ఉన్న వాళ్లంతా లైబ్రరీవైపు పరుగులు తీస్తారు.
సాక్షి: అలారం ఎక్కడి నుంచో తెలుసుకుని అందరూ ఇటువైపు వచ్చేలోగా ఇప్పటికైనా ఒప్పుకో .. చెప్పవా సరే నీ ఇష్టం.. ఇక నిన్ను దేవుడు కూడా కాపాడలేడు అంటుంది..
ఇంతలో సైలెంట్ గా వెనుక నుంచి వసుధార ఎంట్రీ ఇస్తుంది..
రిషి: వసుధార ఇక్కడుందేంటి...
వసుధార: ఛఛ..కథ మొత్తం అడ్డం తరిగింది..ప్లాన్ మొత్తం ఢమాల్ అయింది..ప్చ్..హాయ్ సార్ ..హాయ్ సాక్షి అని వెటకారంగా అంటుంది. నువ్వేంటి ఇలా లైబ్రరీలో..ఓ..పుస్తకాలు చదివి విజ్ఞానం పెంచుకుందామని వచ్చావా..ఈ కథలో విలన్ ప్లాన్ ఏ, ప్లాన్ బి అని రెండు పథకాలు వేస్తాడు..కానీ తనకు తెలియనిది ఏంటంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉన్నప్పుడు ప్లాన్ సి కూడా ఉంటుంది కదా..ఈ చిన్న లాజిక్ కథలో విలన్స్ మర్చిపోతారు నీలాగా..ఏంటీ సాక్షి నీ ప్లాన్ లో నీ నాటకంలో నా పాత్రేమీ లేదు కదా..నీకు ఎప్పుడో చెప్పాను..రిషి సార్ ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవని, రిషి సార్ ని ఇబ్బంది పెట్టి పరువు తీస్తావా..ఏదీ తియ్ చూస్తాను..డామిట్ కథ అడ్డం తిరిగింది..
రిషి: వసుధార ఏం చెబుతుంది ఇప్పుడు
వసు: ఇప్పటి వరకూ చాలా మాట్లాడావ్..ఇప్పుడేమైంది..మౌన వ్రతమా..ఇది చేస్తాను,అది చేస్తాను, ఇలా నటిస్తాను అలా నటిస్తాను అనిచెప్పావు కదా..ఏదీ ఓ సారి రిహార్సల్స్ చేద్దామా..నేను యాక్షన్ చెప్పనా..నువ్వు అలారం మోగించావ్ కదా ఇప్పటికే అందరూ వస్తూ ఉంటారేమో తలుపులు కొడతారేమో..
బయటి నుంచి అందరూ తలుపులు కొడుతుంటే..నువ్వు లాక్ తీస్తే తప్పొప్పుకున్నట్టు భావిస్తా...నేను తీస్తే ఏం జరిగిందో నిజం మొత్తం చెప్పేస్తానని వసుధార బెదిరిస్తుంది. తప్పనిపరిస్థితుల్లో సాక్షి డోర్ ఓపెన్ చేస్తుంది. అందరూ లోపల సాక్షిని చూసి షాక్ అవుతారు. సాక్షి నువ్వేంటి ఇక్కడ...రిషి నువ్వూ ఇక్కడే ఉన్నావా..వసుధారా మీరూ ఇక్కడే ఉన్నారా.. ఏవైంది రిషి , ఎందుకిక్కడ ఉన్నారు, ఆ అలారం ఎందుకు మోగించారని అడుగుతాడు మహేంద్ర. వసు ఏంటిది, ఏం జరిగింది అంటుంది జగతి.
వసుధార: ఓ కథ అడ్డం తిరిగింది మేడం అని మొదలుపెట్టిన వసుధార.. పాపం సాక్షి మేడం తనకు కావాల్సిన బుక్ ఇక్కడ దొరుకుతుందని ఆశపడి వచ్చింది, దొరకలేదు అంతేనా సాక్షి మేడం అంటుంది వసుధార. అవును అంతే అంటుంది సాక్షి. మరి అలారం అని జగతి అడిగితే ఈ మేడంగారే నొక్కారు...మేడం ఇంటర్యూకి వచ్చారు కదా ఇక్కడ లైబ్రరీలో అలారం చూసి ఇది మోగుతుందా లేదా అని టెస్ట్ చేసినట్టున్నారంటుంది.
మహేంద్ర: మరి తలుపులు ఎందుకు వేశారు
వసు: అది సాక్షి మేడంని అడగండి
సాక్షి:ఏం చెప్పలేక నీళ్లు నములుతుంటుంది..
వసుధార: అసలేం జరిగిందంటే..సాక్షి కావాలనుకున్న పుస్తకం తనకి దొరక్కపోయే సరికి నేను తీసుకున్నానని తిరిగిస్తేనే కానీ తలుపులు తీయనని మారాం చేశారు. రిషి సార్ సర్దిచెప్పేందుకు కూడా ప్రయత్నించారు..కానీసాక్షి మేడం వినలేదు.
మహేంద్ర: ఇదంతా కాలేజీలో అవసరమా సాక్షి
వసు: సాక్షిమేడం తప్పేం లేదు సార్..ఆ పుస్తకం తనకు దొరకదు అని తను రియలైజ్ అయ్యారు..అప్పుడు తలుపులు తీశారు. అంతేగా...
సాక్షి: అవును అంతే..
వసు: ఇక్కడ జరిగిందంతా అందరికీ చెప్పి నీ పరువు తీయగలను..నువ్విలా మా రిషి సార్ తో అన్నావని చెప్పడానికి వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. సార్ గురించి ఒక్కమచ్చ పడడం కూడా నాకు ఇష్టం లేదు.. బై సాక్షి ...వెళ్లు...
రిషి..వసును చూస్తూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు..
ఆటోలో ఇంటికి వెళుతున్న వసుధార..లైబ్రరీలో సాక్షి మాట్లాడిన మాటలన్నీ తల్చుకుంటుంది. అటు రిషి కూడా అదే సంఘటన తలుచుకుంటాడు. ఇంతలో వసు నుంచి sorry సార్ లైబ్రరీలో మీ పర్మిషన్ లేకుండా జోక్యం చేసుకున్ననని మెసేజ్ వస్తుంది. మరోవైపు వసు ఆటోకి సాక్షి కారు అడ్డుగా పెడుతుంది.
వసు: నా రూమ్ కి వస్తారని ఊహించాను..దార్లో కాపు కాశారేమో..
సాక్షి: నా గురించి ఏమనుకుంటున్నావ్
వసు: నీ గురించి అనుకునేందుకు ఏముంది..టైం వేస్ట్..
సాక్షి: నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది
వసు: నిప్పు కాలుతుంది, ఉప్పు కరుగుతుంది...ఇలాంటి డైలాగ్స్ మానేసెయ్
సాక్షి: నా ప్లాన్ చెడగొట్టానని సంబరపడుతున్నావా..
వసు: ఓ చచ్చుపుచ్చు ప్లాన్ వేశావ్..ఫెయిలైంది.నువ్వేం చేసినా రిషి సార్ ని చేరుకోలేవ్
సాక్షి కొట్టేందుకు చేయి ఎత్తుతుంది..వసుధార అడ్డుకుంటుంది..ఎపిసోడ్ ముగిసింది
Also Read: కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా - రిషి గుండె భారాన్ని దింపేస్తోన్న వసు ప్రేమ
అనగనగా ఓ రాజ్యంలో ప్రిన్స్ ఉండేవాడు ..ఆ ప్రిన్స్ కి కోపం ఎక్కువట అంటూ కథ చెబుతుంది. ఇదంతా రిషి ఫోన్ లైన్లో ఉండగానే చెబుతుంది. కట్ చేస్తే కాలేజీలో ఎదురుపడిన వసుతో..నా కథ ఎందుకు చెప్పావ్ అంటాడు రిషి. చెబితే తప్పేముంది రాత్రి కథంతా విన్నారు కదా అప్పుడే అగడొచ్చు కదా అంటుంది. మగవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. తిట్టినా నవ్వుతోందేంటి అని రిషి అనుకోగా..ఒకరు తిట్టినా కోపం ఎందుకు రాదో రిషిసార్ కి ఇంకా అర్థంకాలేదనుకుంటుంది వసు...
Also Read: పెదవి దాటని వసు ప్రేమ - థ్యాంక్స్ చెప్పి డైలమాలో పడేసిన రిషి, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తరంగాలు