అన్వేషించండి

Jagadhatri Serial Today March 16th: పుట్టింట్లోనే జగధాత్రికి ఘోర అవమానం...ధాత్రిని రాగిని మెడపట్టి బయటకు గెంటడానికి కారణమేంటి..?

Jagadhatri Serial Today Episode March 16th: కౌషికిపై దాడి చేసి రూ.10కోట్లు ఎత్తుకెళ్లిన మీనన్‌...సీఈవో పదవి నుంచి దిగిపోవాలంటూ కౌషిని కోరిన నిషిక

Jagadhatri Serial Today Episode : వారం రోజుల్లో భూమి అమ్మి 10 కోట్ల రూపాయలు కట్టి ఢీల్ సెట్‌ చేయకపోతే...సీఈవో పదవి నుంచి తానే స్వచ్ఛందంగా తప్పుకుంటానని కౌషికి అంటుంది.అంతేకాకుండా వ్యాపారం మొత్తం మీకే అప్పగిస్తానని చెబుతుంది.ఆ మాటలకు వైజయంతి, నిషిక సంబరపడిపోతారు. మేం ఉండగా...ఆ భూమి ఎలా అమ్మనిస్తామని వైజయంతి మనసులో అనుకుంటుంది. 
 
కంపెనీ మొత్తం మా చేతుల్లోకి రాబోతుందని ఆనందపడుతుంది. అప్పుడే జగధాత్రి కల్పించుకుని మీ ఆ అవకాశం రాదులే నిషిక అంటుంది.ఎందుకంటే వదిన కచ్చితంగా ఈ ఢీల్‌ చేజిక్కించుకుంటారని అనడంతో నిషికకు కోపం పెరిగిపోతుంది.అక్కయ్య ఆ భూమి అమ్మి ఢీల్‌ కుదుర్చుకునే వరకు మేం ఆమెకు  తోడుగా ఉంటామని కేదార్‌  అంటాడు. అక్క ఎప్పటికీ ఓడిపోదని అంటాడు. దీంతో ఎవరికి వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
 
ఉదయం సుధాకర్‌కి రాగిణి ఫోన్‌ చేసిన తన భర్త సంవత్సరీకానికి రమ్మని కోరుతుంది. నిషికకు ఫోన్ ఇవ్వమని అడగ్గా....సుధాకర్‌ అందరినీ పిలిచి స్పీకర్‌ ఆన్ చేస్తాడు.దీంతో రాగిణి అందరూ తప్పకుండా రావాలని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రేపు ఉదయం అందరం వెళ్దామని కౌషికి అనగా...ఈ ధాత్రి వాళ్లు ఎందుకని నిషిక అంటుంది.వాళ్ల అమ్మ వల్లే మామామయ్య చనిపోయాడని అందరూ చాలా బాధలో ఉన్నారని ఇప్పుడు ఆయన సంవత్సరీకానికి మళ్లీ జగధాత్రి వచ్చిందని వాళ్లంతా బాధపడతారని అంటుంది. 
 
దీంతో సుధాకర్ కల్పించుకుని అది జగధాత్రి వాళ్ల పుట్టిల్లని...అక్కడికి వెళ్లే హక్కు నీకు ఎంత  ఉందో జగధాత్రికి కూడా అంతే ఉందని అంటుంది. కౌషికి కూడా ధాత్రికి సపోర్టు చేస్తుంది. రేపు మీమామయ్య చనిపోయిన రోజే కాదు...మీ అమ్మగారు కూడా చనిపోయిన రోజు కదా అని  గుర్తుచేస్తుంది.మీ అమ్మగారికి నువ్వు ఏమైనా చేయాలనుకుంటే చేయమని కౌషికి అనగా...అలాంటిదేమీ  లేదని నేను మాత్రమే వెళ్లి జరుపుకుంటాని ధాత్రి చెబుతుంది.అయితే రేపు నువ్వు నీ పనులన్నీ ముగించుకుని వచ్చిన తర్వాతే మీ అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్దామని చెబుతుంది. 
 
ఉదయం తన తల్లి సమాధి వద్దకు వెళ్లి ఆమె నివాళులు అర్పించిన జగధాత్రి... 25 ఏళ్లు అయినా నిన్ను అవమానిస్తూనే ఉన్నారని తల్లిని తలచుకుని బాధపడుతుంది. చేయని తప్పుకు నీతోపాటు నేను కూడా శిక్ష అనుభవిస్తున్నాని అంటుంది. నీపై పడిన నింద తొలగించి అందరూ నిన్ను గౌరవించేలా చేస్తానని చెబుతుంది. ఇంతలో కౌషికి ఫోన్ చేయడంతో కేదార్‌ మేం నేరుగా అక్కడికి వస్తామని మీరు వెళ్లండి చెబుతాడు. 
 
జగధాత్రి అక్కడే ఉండి ఆలోచిస్తుండగా...ఏం జరిగిందని కేదార్ అడుగుతాడు. ధనుంజయ్‌గారు చెప్పినట్లు నిజంగానే మామయ్య అవినీతిపరుడని తేలితే...ఈ విషయం ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని అంటుంది. ఆయన్ను దేవుడిగా భావిస్తున్న మా అత్తయ్య ఇది తట్టుకోలేదని అంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని ఆ నిజం బయటపడినప్పుడు చూసుకుందని చెప్పి భార్యను తీసుకుని రాగిణి వాళ్ల ఇంటికి వెళ్తాడు.
 
జగధాత్రి రాకను చూసిన వాళ్ల అత్తయ్య రాగిణి ఆమెపై మండిపడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా భర్త సంవత్సరీకానికి వస్తావని నిలదీస్తుంది. నేను ఏం తప్పుచేశాను అత్తయ్యా అని ధాత్రి ప్రశ్నిస్తుంది.మీఅమ్మ వల్లే నా భర్త చనిపోయాడని... నిన్ను చూసినప్పుడల్లా నాకు విషయం జ్ఞాపకానికి వచ్చి బాధ కలగుతుందని అంటుంది. 
 
మర్యాదగా నువ్వు బయటకు వెళ్లు  అంటూ మెడపట్టి గెంటివేస్తుంది. దీంతో సుధాకర్‌, కౌషికి కల్పించుకుని ఎప్పుడో 25ఏళ్ల క్రితం జరిగిన దాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు  జగధాత్రిని ఇబ్బంది పెట్టడం సరికాదని చెబుతారు. పైగా వాళ్ల అమ్మ తప్పు చేసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా  లేవని సర్దిచెబుతారు. దాన్ని మనసులో పెట్టుకుని ఇన్నేళ్లుగా మీరు ఆమెను అవమానిస్తూనే ఉన్నారని అంటారు. 
 
నన్ను మా అమ్మకన్నా నువ్వు,మామయ్య ఎక్కువ పెంచారని...అలాంటి మామయ్య సంవత్సరికం రోజు నన్ను బయట పంపించొద్దని ధాత్రి వేడుకుంటుంది. ఇప్పుడు కూడా ఇది ఇక్కడ ఏదో చేయడానికే వచ్చిందని...అది తెలిసిన రోజు నేను ఎందుకు కోప్పడ్డానో తెలుస్తుందని చెప్పి రాగిని వెళ్లిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Embed widget