అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?

Illu Illalu Pillalu Serial Today Episode March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?

Illu Illalu Pillalu Serial Today Episode: శ్రీవల్లి ఇచ్చిన ఐడియాతో విశ్వ వేరే అమ్మాయిని తీసుకుని వెళ్లి కామాక్షి వాళ్ల ఇంటి ముందు హోలీ ఆడుతుంటాడు. అప్పుడే అక్కడికి ఇడ్లీ, భాగ్యం వస్తారు. వాళ్లిద్దరినీ అక్కడ చూసి శ్రీవల్లికి ఫోన్ చేసి చెబుతారు.ఆ విషయం తెలిసిన శ్రీవల్లి ఎంతో ఆనందపడుతుంది. ఇదంతా మనం వేసిన స్కెచ్‌ అని తల్లిదండ్రులకు చెబుతుంది. 

ఎందుకే ఇలా చేశావని వాళ్లు అడగ్గా....ఆ కామాక్షి నోరు అసలే పెద్దదని అక్కడ వాళ్లిద్దరినీ చూసిందంటే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుందని దీంతో అమూల్య మెడలో తాళి తానే వేసుకోమన్నానని ప్రేరణ తన నోటితో తానే చెబుతుందని అంటుంది.అప్పుడు వాళ్లువాళ్లు గొడవపడితే మనం చాలా హ్యాపీ అని అంటుంది. 

కూతురు తెలివితేటలు మెచ్చుకున్న భాగ్యం...అక్కడే ప్రేమ, ధీరజ్‌  కూడా హోలీ ఆడుతున్న సంగతి చూసి శ్రీవల్లికి చెబుతుంది.అయితే ఇంకా మంచిదని మనకు అన్నీ కలిసొస్తున్నాయని శ్రీవల్లి సంబరపడిపోతుంది. ధీరజ్‌, ప్రేమ, కామాక్షి అందరూ కలిసి హోలీ ఆడుతుంటారు. ఎంతసేపటికీ విశ్వను చూడకపోవడంతో....భాగ్యం అక్కడికి వెళ్లి వాళ్లు చూసేలా హోలీ ఆడుకోండని విశ్వకు చెప్పి వస్తుంది.

ధీరజ్ కంట్లో పడాలని కావాలనే విశ్వ ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ల ముందుకు వెళ్తాడు. ఆ అమ్మాయితో రాసుకుని, పూసుకుని తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్‌ కోపంతో రగిలిపోతాడు.వెంటనే వాడిని పట్టుకుని రెండు తగిలిస్తాడు. దీంతో వాళ్లిద్దరూ కొట్టుకోవడంతో కామాక్షి వచ్చి విడదీస్తుంది. 

ఇంట్లో భార్యను పెట్టుకుని ఇదేం పనులురా అని నిలదీస్తుంది. నా ఇష్టం వచ్చినట్లు చేస్తానని అడగడానికి మీరు ఎవరని అంటాడు. నాకు ఇంట్లో భార్య ఉన్నా వీధుల్లో చాలామంది ప్రియురాళ్లు ఉన్నారని అంటాడు. దీంతో ధీరజ్ మళ్లీ విశ్వపై చేయిచేసుకుంటాడు. నా చెల్లికి అన్యాయం చేయాలని చూశావంటే నీ ప్రాణాలు తీస్తానని అంటాడు. నీ సంగతి ఇక్కడ కాదురా మీ ఇంటి దగ్గర తేలుస్తానంటూ వాడిని పట్టుకుని లాక్కొస్తాడు. నేను కూడా అక్కడే తేల్చుకుంటానని విశ్వ అంటాడు.

ఇంట్లో రేవతి ఏడుస్తుండటంతో అమూల్య ఆమెను ఓదార్చుతుంది. ఏం జరిగిందని నట్టింట్లో ఏడుస్తున్నారని భద్రావతి వాళ్లను అడుగుతుంది.దీంతో ఉదయం పాయసం తెచ్చి ఇస్తే విశ్వ చేసిన గొడవ గురించి చెబుతుంది అమూల్య. నేను ఉన్నా అదే పని చేసేదాన్నని అంటుంది భద్రావతి. దీంతో రేవతికి కోపం వస్తుంది. మీ పంతాలు,పగలుకోసం మమ్మల్ని ఏడిపిస్తున్నారని అంటుంది. 

అసలు ఈరోజు మీ మేకోడలు పుట్టినరోజు అన్న సంగతి మీకు తెలుసా అని నిలదీస్తుంది. బిడ్డ పుట్టినరోజు నాడు దానికి నా చేతులతో  ఏదైనా చేసిపెట్టే భాగ్యం కూడా లేదని రేవతి ఏడుస్తుంది.అది నీకు కూతురు మాత్రమేనని నేను దాన్ని నా గుండెలపై పెంచానని భద్రావతి చెబుతుంది. దాని పుట్టినరోజు అంగరంగ వైభవంగా ఎలా చేసేదాన్నో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదని అంటుంది.

కానీ అదే మనల్ని వదిలేసి ఆ కొంపకు పోయిందని బాధపడుతుంది.మళ్లీ ప్రేమ ఈ ఇంటికి తీసుకొచ్చే వరకు  నేను నిద్రపోనని అంటుంది. ఇంతలో ధీరజ్ విశ్వను గల్లాపట్టుకుని లాక్కొచ్చి వాళ్ల ఇంటి ముందే కొడతాడు. ఇది చూసిన శ్రీవల్లి ఆనందంతో వెళ్లి ఇంట్లో వాళ్లందరినీ తీసుకొస్తుంది. భద్రావతి కూడా ఇంటి ముందుకు వచ్చి ఎందుకు కొడుతున్నావని నిలదీస్తుంది. 

వీడు వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని చెప్పగా....నా మేనల్లుడు అలాంటి వాడు కాదని చెబుతుంది. అయితే వాడినే అడగండని ధీరజ్‌ అంటాడు. ఏం జరిగిందని విశ్వను అడగుతారు. ఇది నేను చూసుకుంటానని చెప్పి....అవున్రా నేను వేరే అమ్మాయిలతో తిరుగుతాను ఇప్పుడు ఏం చేస్తావని ‌అనడంతో ధీరజ్‌కు కోపం వచ్చి మళ్లీ విశ్వ గల్లా పట్టుకుంటాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today April 22th:మినిస్టర్‌పై జేడీ,కేడీ ఎందుకు చేయిచేసుకున్నారు...? ఏ కేసులో మినిస్టర్‌ కొడుకును అరెస్ట్‌చేశారు..?
జగద్ధాత్రి సీరియల్: మినిస్టర్‌పై జేడీ,కేడీ ఎందుకు చేయిచేసుకున్నారు...? ఏ కేసులో మినిస్టర్‌ కొడుకును అరెస్ట్‌చేశారు..?
kalavari kodalu kanaka mahalakshmi serial today April 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నడిరోడ్డు మీద తాగి పడిపోయిన విహారి! భర్తని చూసిన లక్ష్మీ ఏం చేసిందంటే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నడిరోడ్డు మీద తాగి పడిపోయిన విహారి! భర్తని చూసిన లక్ష్మీ ఏం చేసిందంటే!
The Raja Saab TV Premiere Date: థియేటర్లలో డిజాస్టర్... ఓటీటీలో ట్రోలింగ్... టీవీలో ఎలా? 'ది రాజా సాబ్' టెలికాస్ట్ ఎప్పుడంటే?
థియేటర్లలో డిజాస్టర్... ఓటీటీలో ట్రోలింగ్... టీవీలో ఎలా? 'ది రాజా సాబ్' టెలికాస్ట్ ఎప్పుడంటే?
Nindu Manasulu Serial Today April 22nd: నిండు మనసులు: ప్రేరణ మీద సీరియస్ అయిన మంజు! మామ మామూలోడు కాదు! మత్తులో సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణ మీద సీరియస్ అయిన మంజు! మామ మామూలోడు కాదు! మత్తులో సిద్ధూ!
Advertisement

వీడియోలు

Abhishek Sharma IPL 2026 SRH vs DC | అభిషేక్ సెంచరీ సెలబ్రేషన్ వెనక ఉన్న కారణం ఇదే
Bumrah Funny Conversation with Siraj IPL 2026 | సిరాజ్ ను ఆటపట్టించిన సిరాజ్
Abhishek Century SRH vs GT IPL 2026 | విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ
Ishan Kishan Run Out vs DC IPL 2026 | అభిషేక్ కొట్టిన షాట్‌కు కెప్టెన్ ఇషాన్ రనౌట్
SRH vs DC IPL 2026 Highlights | ఉప్పల్ వేదికగా హ్యాట్రిక్ విజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengal Assembly Elections: చేపల కూరే ఎజెండా - బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే హైలెట్ - ఎందుకో తెలుసా?
చేపల కూరే ఎజెండా - బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే హైలెట్ - ఎందుకో తెలుసా?
Pithapuram Politics: ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తేవాలి కానీ వివాదం చేస్తారా? - వర్మ ఫ్లెక్సీ రచ్చపై సీఎం చంద్రబాబు అసహనం
ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తేవాలి కానీ వివాదం చేస్తారా? - వర్మ ఫ్లెక్సీ రచ్చపై సీఎం చంద్రబాబు అసహనం
Justice Ghosh Report: జస్టిస్ ఘోష్ రిపోర్టుపై ప్రభుత్వం తర్జన భర్జన - సుప్రీంకోర్టుకు వెళ్లడమా? మళ్లీ కమిషన్ పని ప్రారంభించడమా?
జస్టిస్ ఘోష్ రిపోర్టుపై ప్రభుత్వం తర్జన భర్జన - సుప్రీంకోర్టుకు వెళ్లడమా? మళ్లీ కమిషన్ పని ప్రారంభించడమా?
Relief for KCR and Harish Rao: కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట.. ఘోష్ కమిషన్ రిపోర్టుపై కీలక తీర్పు
కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట.. ఘోష్ కమిషన్ రిపోర్టుపై కీలక తీర్పు
Army Canteen Liquor Price: ఆర్మీ క్యాంటీన్‌లో మద్యంపై సైనికులకు ఎంత రాయితీ ఇస్తారు? ఎవరికి ఎంత కోటా ఉంటుంది?
ఆర్మీ క్యాంటీన్‌లో మద్యంపై సైనికులకు ఎంత రాయితీ ఇస్తారు? ఎవరికి ఎంత కోటా ఉంటుంది?
Rana Daggubati: రానా... అక్షయ్... కరణ్... దర్శకుడు చందూ మొండేటి భారీ మల్టీస్టారర్
రానా... అక్షయ్... కరణ్... దర్శకుడు చందూ మొండేటి భారీ మల్టీస్టారర్
Who Is Dilshan Madushanka: ఢిల్లీతో మ్యాచ్‌లో IPL అరంగేట్రం చేసిన దిల్షాన్ మధుశంక.. ఈ SRH బౌలర్ ప్రత్యేకత ఏంటీ ?
ఢిల్లీతో మ్యాచ్‌లో IPL అరంగేట్రం చేసిన దిల్షాన్ మధుశంక.. ఈ SRH బౌలర్ ప్రత్యేకత ఏంటీ ?
RTC bandh: కేసీఆర్ హయాంలోనూ ఆర్టీసీ సమ్మె - అందరి ఉద్యోగాలూ తీసేసిన ప్రభుత్వం - ఇప్పుడేం జరుగుతుంది?
కేసీఆర్ హయాంలోనూ ఆర్టీసీ సమ్మె - అందరి ఉద్యోగాలూ తీసేసిన ప్రభుత్వం - ఇప్పుడేం జరుగుతుంది?
Embed widget