అన్వేషించండి

Karthika Deepam జూన్ 21 ఎపిసోడ్: ఒక్క చెంపదెబ్బతో కథ మొత్తం మార్చేసిన సౌందర్య, శౌర్య కి మళ్లీ అన్యాయం జరిగినట్టేనా!

Karthika Deepam june 21 Episode 1384: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 21 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 21 మంగళవారం ఎపిసోడ్ 

డాక్టర్ సాబ్ కి మనసులో మాట చెప్పేశా అన్న జ్వాల..మా పెళ్లి నువ్వే చేయాలి తింగరి అంటే సరే అంటుంది హిమ. ఇంతకీ డాక్టర్ సాబ్ నన్ను ఏ ఫంక్షన్ కి పిలిచారని అడిగితే..వాళ్ల అమ్మ బర్త్ డే అందుకే రమ్మన్నారని అబద్ధం చెబుతుంది హిమ.
జ్వాల: పోనీలే నేను రాకపోవడమే మంచిది..డాక్టర్ సాబ్ వాళ్ల అమ్మ, మా అత్తగారు నాపై కోప్పడితే ఆయన ఫీలవుతారు కదా. నేను ఎందుకు రాలేదో నీకు తెలియదు కదా..నా శత్రువు కాల్ చేసింది, ఆటో కూడా తీసుకెళ్లిపోయింది
హిమ: నానమ్మకి శోభ చెప్పేలోగా జ్వాలే శౌర్య అని చెప్పేయాలి 
జ్వాల: ఏంటి తింగరి ఏంటో ఆలోచిస్తున్నావ్..ఇంతకుముందు ఎలా ఉండేదానివో అలా అయిపోయావ్. అసలు నీకు డాక్టర్ సాబ్ నేను ఒక్కటవడం ఇష్టం లేదా?
హిమ: జ్వాలా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు..
జ్వాల: ఏదో మాట వరుసకు అన్నానులే..మేం ఇద్దరం ఒకటి కావాలని కోరుకున్నది నువ్వే కదా..ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. బయటకు వెళదాం, హోటల్ లో తిందాం, ఐస్ క్రీంతిందాం...

కట్ చేస్తే....సౌందర్య ఓ డాక్టర్ ని కలుస్తుంది..
సౌందర్య: నా మనవరాలు చెబితే వినడం లేదు..తనకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉంది, అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయిద్దాం అనుకుంటున్నాం అంటూ హిమ వాడుతున్న ట్యాబ్లెట్స్ వాడుతోంది
డాక్టర్: ఇవి అస్సలు దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానేకాదు..కేవలం బలానికి వాడేవి..
సౌందర్య: తను కూడా డాక్టరే కదా అలా ఎందుకు వాడుతుంది?
డాక్టర్: తన పేరేంటి, ఏ హాస్పిటల్లో పనిచేస్తోంది..
సౌందర్య: డాక్టర్ హిమ..ఆదిత్య హాస్పిటల్లో పనిచేస్తోంది
డాక్టర్: హిమకు క్యాన్సర్ ఏంటండీ..తను నాకు బాగా తెలుసు
సౌందర్య:మాతో అబద్ధం ఎందుకు చెప్పింది?
డాక్టర్: అవన్నీ మీ పర్సనల్ విషయాలు అయిఉంటాయి. డాక్టర్ హిమ నాకు తెలియకపోవడం ఏంటి..మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే రీసెంట్ గా మా హాస్పిటల్లో ఓ పెషెంట్ కి బ్లడ్ అవసరం పడితే హిమగారే బ్లడ్ డొనేట్ చేసి వెళ్లారు..క్యాన్సర్ పేషెంట్ అయితే బ్లడ్ తీసుకోం కదా..తనకు క్యాన్సర్ ఉండిఉంటే తను ఎలా బ్లడ్ ఇస్తుంది? మీకు ఎందుకు అబద్ధం చెప్పిందో మీకే తెలియాలి..
సౌందర్య: థ్యాంక్యూ డాక్టర్ అనేసి వెళ్లిపోతుంది..

Also Read:  డాక్టర్ సాబ్ కి 'ఐ లవ్ యూ' చెప్పేసిన జ్వాల, సౌందర్యతో బేరం పెట్టిన మరో మోనిత శోభ, మొత్తం రివీల్ చేసేసిన హిమ

శోభ డోర్ తీసి ఇంట్లోకి అడుగుపెట్టేసరికి అక్కడ సోఫాలో హిమ కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటీ నన్ను చూడగానే భయపడుతున్నావ్ అంటే నువ్వు పులివా ఏంటి హిమా ఏం మాట్లాడుతున్నావ్..
శోభ: నిన్ను చూస్తుంటే నేను నవ్వాలో ఏడవాలో జాలిపడాలో నాకే తెలియడం లేదు. నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా నీ మాటల్నే తిప్పి చెబుతాను విను. పులి దగ్గరకు జింకపిల్ల వచ్చి బెదిరిస్తే ఎలా ఉంటుందో తెలుసా..నువ్వు వచ్చి నన్ను బెదిరిస్తే అలా అనిపిస్తోంది నాకు..( నేను హిమని అని కాల్ చేస్తూ జ్వాలని ఆడుకుంటున్నాను ఈ విషయం నీకు తెలియదు అని మనసులో అనుకుంటుంది) శోభ అంటే నీకు పూర్తిగా తెలియదు
హిమ: ఏంటే తెలిసేది..నువ్వేమైనా మహా గ్రంధానివా?
శోభ: నువ్వైంటో, మీ చరిత్రేంటో..నీ కుటుంబంలో విషాదాలు అన్నీ నాకు తెలుసు
హిమ: ఏంటే గొప్ప..జ్వాలని ఫోన్లో బెదిరించడమా?
శోభ: నీకు తెలిసిపోయిందా..అందుకేనా ఇంత ధైర్యంగా వచ్చావ్. నేను నిరుపమ్ ని వదులుకునే ప్రసక్తే లేదు
హిమ: స్వప్న ఆంటీ ఉందనే ధైర్యమా..నిన్ను శోభ గారూ అని పిలిచేదాన్ని, నీ బుద్ధి తెలిసాక శోభ అని పిలుస్తున్నాను, నువ్వు డాక్టర్ వి అనే చిన్న గౌరవం ఉంది..
శోభ: నువ్వుకూడా బెదిరిస్తే నేను కూడా బెదిరిపోవాలా..నేను హిమను అని జ్వాలకు ఫోన్ చేస్తున్నానని తెలుసుకున్నావ్.. ఇంతటితోనే సినిమా అయిపోలేదు కదా ఇంకా చాలా ఉంది..నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావ్ ...నిరుపమ్ కి జ్వాల ఐ లవ్ యూ చెప్పకుండా ఆపాను, నువ్వే జ్వాల వెతికే శత్రువు అని చెప్పానే అనుకో ఏంటమ్మా నీ మానసిక పరిస్థితి? . 
నీ మీద అసలే భగభగ మండుతోంది జ్వాల... 
హిమ: మానానమ్మకి ఇంకో మనవరాలిని చూపిస్తానని బేరం పెట్టావ్ కదా..ఆ మనవరాలికి నిన్ను చూపిస్తాను అప్పుడు ఇంకా బావుంటుంది కదా..
శోభ: ఇవన్నీ ఎందుకు చెప్పు..అసలు సిసలు కొసమెరుపు నీకు క్యాన్సర్ లేదు...నిరుపమ్ కి నాకు పెళ్లి జరగొద్దని డ్రామా ఆడావని చెప్పానే అనుకో నీ పని ఔట్..ఇది నా బ్రహ్మాస్ర్తం బేబీ..
హిమ: శోభని చూసి నవ్వుకున్న హిమ.చెప్పి చెప్పి అలసిపోయావ్ కానీ నీళ్లు తాగుతావా...జ్యూస్ ఉందా తెచ్చిపెట్టమంటావా... ఏంటీ బ్రహ్మాస్త్రం ఫెయిలైందనే అనుకుంటున్నావా..నేను కూడా చాలా అలసిపోయాను...ఈ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకుంటున్నావా.. నువ్వేమో జ్వాలకి అన్నీ నిజాలు చెప్పేసెయ్. జ్వాలకి ఎలా చెప్పాలా..చెబితే ఏమవుతుందో అని టెన్షన్ గా ఉండేది..నువ్వు చెబితే నాకు హెల్ప్ చేసినట్టవుతుంది. నాకు క్యాన్సర్ లేదన్న విషయం ఎవ్వరికి తెలిసిన ఏం కాదు.. అన్నట్టు హెల్త్ జాగ్రత్త..నీ బీపీ లెవెల్స్ డిస్టబ్ అయినట్టున్నాయ్ చెక్ చేసుకో..ఇక ముందైనా వళ్లు దగ్గరపెట్టుకో.. బై

Also Read: సాక్షి క్లీన్ బౌల్డ్, వసుపై ప్రేమతో కూడిన కోపం ప్రదర్శించిన ఈగో మాస్టర్ రిషి

సౌందర్య ఇంట్లో
ఇంట్లోకి హిమ అడుగుపెట్టగానే లాగిపెట్టి కొడుతుంది సౌందర్య. ఏంటి సౌందర్య ఎందుకు కొట్టావ్ అని ఆనందరావు అడ్డుపడడంతో దీని సంగతి, దీని క్యాన్సర్ సంగతి తేల్చేస్తాను అని ఫైర్ అవుతుంది.
సౌందర్య: నీకు క్యాన్సరా థర్డ్ స్టేజ్ లో ఉందా..ఎందుకే ఇలా అందరితో ఆడుకుంటున్నావ్
హిమ: నానమ్మా నీకు అనగానే...
సౌందర్య: అంతా తెలిసిపోయింది నీకు క్యాన్సర్ లేదు..
ఆనందరావు: ఏంటి సౌందర్య తనకు క్యాన్సర్ లేదా..ఏంటమ్మా ఇది లేనిదానిని ఉన్నట్టు ఎందుకు అబద్ధాలు చెప్పావ్
సౌందర్య: అబద్ధం కాదు మోసం...మా కళ్లకు గంతలు కట్టి నువ్వు ఆడుతున్న నాటకం ఏంటి?
హాయ్ హిమ అంటూ అప్పుడే తల్లి స్వప్నతో కలసి ఎంట్రీ ఇస్తాడు నిరుపమ్... అక్కడి వాతావరణం చూసి ఏంటి అందరూ ఇలా ఉన్నారని అడుగుతాడు...ఎవరైనా అలిగారా చెప్పండి నేను అలక తీరుస్తాను..ఏంటో ఇంట్లో అంతా విషాదంగా కనిపిస్తున్నారు ఇదేమైనా పెళ్లి ఇల్లులా ఉందా అంటుంది స్వప్న
ఆనందరావు: ఏంటమ్మా నువ్వు రాగానే ఏదో ఒకటి అనాలా
స్వప్న: ఇంట్లో పెళ్లో ఇంకోటో ..అందుకే రానన్నాను
నిరుపమ్: ఎక్కడికి వెళ్లావ్ హిమా..నీ గురించి అంతా వెతుకున్నాను
హిమ: జ్వాల దగ్గరకు వెళ్లాను బావా నీ గురించి మాట్లాడేందుకు
స్వప్న: ఇప్పుడే ఇలా ఉందంటే ముందుముందు ఇంకెలా ఉంటుందో
హిమ: నువ్వు భయపడాల్సిన అవసరం లేదత్తయ్యా
స్వప్న: దీనికి రోగంతో పాటూ ధైర్యం కూడా పెరిగింది
సౌందర్య: నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తావా
స్వప్న: ఇప్పుడే ఇంత పొగరుగా సమాధానం చెబుతుంటే రేపు పెళ్లయ్యాక ఇంకెలా ఉంటుందో..ఏమైనా అందామంటే రోగం అని సానుభూతి ఒకటి 
హిమ: మీ సానుభూతి కోసం ఎవ్వరూ ఇక్కడ ఎదురుచూడడం లేదు అత్తయ్యగారు...
హిమ అలా మాట్లాడుతుంటే సౌందర్య, ఆనందరావు,నిరుపమ్ షాకింగ్ గా చూస్తుంటారు...
ఎపిసోడ్ ముగిసింది...

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
చెబుతుంటే అర్థం కావడం లేదా..నేను నిన్ను ప్రేమించడం లేదని జ్వాలకి చెప్పేస్తాడు నిరుపమ్. నేను పెళ్లి చేసుకునేది మీ తింగరినే..తననే నేను ప్రేమించానంటాడు. షాక్ అయిన జ్వాల... మీ మాటలు అబద్ధం, మీ చేతలు అబద్ధం, మీరంతా అబద్ధం అని ఏడుస్తుంది... ఇదంతా ఓ చెట్టు పక్కనుంచి విన్న సౌందర్య..నిరుపమ్ ఏంటిజ్వాలతో అలా మాట్లాడుతున్నాడు అంటే తనే మన శౌర్య అని చెబుతుంది హిమ.

Also Read:  తింగరే హిమ అని తెలిసిన జ్వాల ఏం చేయబోతోంది, కుట్రల్లో మోనితను మించిపోతున్న శోభ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
PF Balance Check: మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉంటుంది?, ఇలా చెక్‌ చేయండి
మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉంటుంది?, ఇలా చెక్‌ చేయండి
Hrithik Roshan: ఇదన్యాయం హృతిక్ - అందరూ జనవరి1న ప్రారంభించారు - నువ్వు పూర్తి చేస్తావా ?
ఇదన్యాయం హృతిక్ - అందరూ జనవరి1న ప్రారంభించారు - నువ్వు పూర్తి చేస్తావా ?
Embed widget