అన్వేషించండి

Jagadhatri Serial Today March 9th: : శ్రీవల్లి కేదార్‌ సొంత చెల్లెలు అని అందరికీ తెలిసిపోయిందా..? వైజయంతిని సుధాకర్‌ మెడపట్టి ఎందుకు బయటకు గెంటేశాడు...?

Jagadhatri Serial Today Episode March 9th: : శ్రీవల్లి కేదార్‌ సొంత చెల్లెలు అని అందరికీ తెలిసిపోయిందా..? వైజయంతిని సుధాకర్‌ మెడపట్టి ఎందుకు బయటకు గెంటేశాడు...?

Jagadhatri Serial Today Episode : శ్రీవల్లి ఉండి వచ్చిన అనాథ ఆశ్రమం మేనేజర్‌ హరిబాబు శ్రీవల్లిని చూడటానికి కౌషికి వాళ్ల ఇంటికి వస్తాడు.అతన్నిచూడగానే భయపడిపోయి వైజయంతి పైకి వెళ్లి దాక్కుంటుంది. శ్రీవల్లి యోగక్షేమాలు అడిగిన హరి తిరిగి వెళ్లబోతుండగా...జగధాత్రి ఆయన్ను ఆపి శ్రీవల్లి తల్లిదండ్రుల గురించి వివరాలు అడుగుతుంది. మీరేమో మా అత్తయ్యగారే ఈ శ్రీవల్లిని  తీసుకొచ్చి మీకు అప్పగించారని చెప్పారు. కానీ శ్రీవల్లి వద్ద ఇంకో ఆమె ఫొటో ఉంది. ఈ ఇద్దరిలో శ్రీవల్లి ఎవరికి కూతురో తెలియక తికమకపడుతున్నామని అంటుంది. దీంతో మేనేజర్‌ కూడా నాకు తెలియదమ్మా అని అంటాడు. అయినా శ్రీవల్లి వద్ద ఒకఆవిడ ఫొటో ఉండాలి కదా అని అడగ్గా...దురదృష్టవశాత్తు ఆ ఫొటో పోయిందని శ్రీవల్లి చెబుతుంది.

మీ దగ్గర ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ధాత్రి అడుగుతుంది.  దానితో శ్రీవల్లి తల్లిదండ్రుల కోసం మేం ఆరా తీస్తామని చెబుతుంది. దీంతో మేనేజర్‌...నా దగ్గర ఇంకో ఫొటో ఉందని చెప్పడంతో శ్రీవల్లితో పాటు అందరూ సంతోషపడతారు.ఇప్పుడే మావాడికి చెప్పి ఆ ఫొటో తీసుకురమ్మని చెబుతానంటాడు. ఆ మాటలు విన్న వైజయంతి వెన్నులో వణుకుపుడుతుంది. ఇప్పుడు ఆ మేనేజర్‌ ఫొటో తీసుకొస్తే....శ్రీవల్లి సుభాషిణి కూతురు అని అందరికీ తెలిసిపోతుందని...మా ఆయన నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టడం ఖాయమని అంటుంది.

అనాథ ఆశ్రమం మేనేజర్ వచ్చినప్పటి నుంచి అత్తయ్యగారు ఎందుకో భయపడుతున్నారని నిషిక అనుకుంటుంది. ఆమె ఏం చేస్తుందో చూద్దామని పైకి వెళ్తుంది. భార్య వెనకే  యువరాజు కూడా తన తల్లివద్దకు వెళ్తాడు. చాలా భయపడుతున్న వైజయంతిని చూసి ఏం జరిగిందని వారు నిలదీస్తారు. ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదని...నువ్వు అర్జెంట్‌గా వెళ్లి ఆ మేనేజర్‌ ఫోన్ చేసి ఫొటో తీసుకురమ్మన్నవాడిని అడ్డుకుని వాడి దగ్గర ఉన్న ఫొటో లాక్కుని సుజాత ఆంటీ ఫొటో అక్కడ పెట్టాలని వైజయంతి అంటుంది. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని చెప్పడంతో యువరాజు వెళ్లిపోతాడు. అప్పుడు నిషిక నిలదీయడంతో వైజయంతి నిజం చెప్పేస్తుంది. 

ఇప్పుడు ఆ శ్రీవల్లి మా ఆయన కూతురని తెలిస్తే....నా కొడుకు బతుకు రోడ్డుపాలేనని అనడంతో నిషిక కూడా భయపడుతుంది. ఇంతలో యువరాజు రోడ్డుపై కారు అడ్డుగా పెట్టి అనాథ ఆశ్రమం నుంచి వచ్చే వాడిని అడ్డుకోవాలని చూస్తాడు. తుపాకీ గురిపెట్టి బెదిరించినప్పటికీ అతను యువరాజు నుంచి తప్పించుకుని కౌషికి వాళ్ల ఇంటికి చేరతాడు. ఇప్పుడు వాడు తెచ్చిన ఫొటో వీళ్లు చూస్తే మన పని అయిపోతుందని వైజయంతి చెప్పడంతో...ఆ ఫొటో చూడకుండా ఉండేందుకు నిషిక ప్రయత్నించినప్పటికీ....జగధాత్రి అడ్డుపడుతుంది.

మేనేజర్ హరి చేతుల్లో నుంచి ఫొటో తీసుకుని చూసి ఒక్కసారిగా ధాత్రి షాక్‌కు గురవుతుంది.ఏమైందని అందరూ అడగ్గా....శ్రీవల్లి సుభాషిణి అత్తయ్య కూతురని చెప్పి అందరికీ ఫొటో చూపిస్తుంది. దీంతో కేదార్‌ శ్రీవల్లిని దగ్గరకు తీసుకుని...ఇన్నాళ్లు నేను వెతుకుతున్న నా చెల్లి నువ్వేనని చెబుతాడు. సుధాకర్‌ కూడా తన కూతురుని దగ్గరకు తీసుకుంటాడు. దీంతో నిషికకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇదంతా నాటకమని...ముందు కేదార్‌ ఈ ఇంటి  కొడుకునని చెప్పి వచ్చాడని...ఇప్పుడు ఈ శ్రీవల్లిని కూతురని మరో నాటకం మొదలుపెట్టారని అంటుంది.ఇదంతా కేదార్‌, జగధాత్రి ఆడిస్తున్న డ్రామా అని అంటుంది. 

దీంతో వైజయంతి ఈ మందను బయటకు గెట్టేయండని అనగా...సుధాకర్‌ ఆమె మెడపట్టి బయటకు గెంటేస్తాడు. తప్పు చేసినవాళ్లను వదిలేసి అత్తయ్యను ఎందుకు బయటకు గెంటేశారని నిషిక అడగ్గా....ఎందుకంటే తప్పు చేసింది వైజయంతి అత్తయ్యే కాబట్టని ధాత్రి అంటుంది. శ్రీవల్లి సుభాషిణి అత్తయ్య కూతురని వైజయంతికి 20 ఏళ్ల క్రితమే తెలుసని...అందుకే తీసుకెళ్లి అనాథ ఆశ్రమంలో పడేసిందని అంటుంది. మళ్లీ శ్రీవల్లి తిరిగిరావడంతో ఆమెను వదిలించుకునేందుకు పడరానిపాట్లుపడిందని చెబుతుంది. ఎవరో అనామకుడికి కట్టబెట్టి వదిలించుకోవాలని చూసిందని చెబుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget