అన్వేషించండి

Karthika Deepam జూన్ 17 ఎపిసోడ్: తింగరే హిమ అని తెలిసిన జ్వాల ఏం చేయబోతోంది, కుట్రల్లో మోనితను మించిపోతున్న శోభ!

Karthika Deepam june 17th Episode 1381: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 17 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 17 శుక్రవారం ఎపిసోడ్ 

హిమని పెళ్లిచేసుకుంటాని క్లారిటీ ఇచ్చిన నిరుపమ్.. పెళ్లి పనులు మొదలు కావాలి..వెళ్లి షాపింగ్ చేయండి అంటాడు. హిమ లేని సమయంలో వాళ్లకి విషయం చెప్పండి’ అంటాడు.మరోవైపు సౌందర్య ఉదయాన్నే లేచి దీప, కార్తీక్‌ల ఫొటో దగ్గర నిల్చుని సంతోషంగా మాట్లాడుతుంది.
సౌందర్య ఇంట్లో
పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దోడా, దీపా.. ఈ రోజు ఏంటో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టింది. ఏదో మంచి జరగబోతోందని మనసు చెబుతోంది అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన స్వప్న, సత్యం... నిరుపమ్ చెప్పిన విషయం చెబుతుంది. ‘ఇంట్లో పెళ్లి పనులు కావాలని పసుపు కొట్టడం మొదలుపెట్టమని నిరుపమ్ చెప్పాడు..మీరు ఏదో ఒకటి చెప్పి హిమను మా ఇంటికి తీసుకురండి పెళ్లిపనులు మొదలుపెడతాం అని చెబుతుంది. సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బైన సౌందర్య స్వీట్ ఇస్తానన్నా, కాఫీ తాగమన్నా అవసరం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న. వాళ్లు వెళ్లిన తర్వాత సౌందర్య, ఆనందరావు సంబరపడతారు. 

జ్వాల-రవ్వఇడ్లీ: 
రవ్వ ఇడ్లీ టిఫిన్ సెంటర్‌కి వెళ్లి విసుగ్గా కూర్చుంటుంది జ్వాల. ఈ తింగరి అడ్డంగా లేకపోతే డాక్టర్ సాబ్ తో నా మనుసులో మాట చెప్పేదాన్ని అని చిరాగ్గా ఉంటుంది. ఇంతలో రవ్వ ఇడ్లీ వచ్చి టీ ఇవ్వడంతో మరింత విసుక్కుంటుంది. ఇంతలో నిరుపమ్ ఫోన్ రావడంతో చిరునవ్వు నవ్వుకుంటుంది. ఓహో నీకు ఫోన్ వస్తే కోపం తగ్గిపోతుందన్నమాట అని నవ్వుకుంటూ అంటాడు రవ్వ ఇడ్లీ. కాల్ లిఫ్ట్ చేసిన జ్వాలతో..అరగంట ఆగి మా ఇంటికిరావాలి అని చెబుతాడు. డాక్టర్ సాబ్ శాసిస్తారు-ఈ జ్వాల పాటిస్తుందన్నమాట అంటుంది. ఇంకేముంది డాక్టర్ సాబ్ తో మళ్లీ ఊహల్లో తేలిపోతుంది.

Also Read: డాక్టర్ సాబ్ పెళ్లిపనులు మొదలయ్యాయి, రగిలిపోతున్న శోభ-నిజం తెలుసుకున్న జ్వాల

మమ్మీ ఇంకా హిమావాళ్లు రాలేదేంటని కంగారు పెడతాడు నిరుపమ్. వస్తారులే నువ్వు కంగారుపడి నన్ను కంగారుపెట్టకు అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన శోభ..ఏంటీ ఆంటీ ఇల్లంతా హడావుడిగా ఉంది. అందంగా డెకరేట్ చేశారని అడుగుతుంది. మరోవైపు  శోభ నిరుపమ్ ఇంటికి వస్తుంది. హిమ ఆయుష్షు రెండే నెలలు..ఆ తర్వాత నిరుపమ్ తో జీవితం నీదేకదా కాస్త ఓపిక పట్టు..శోభా నా మాటవిను అని కన్వెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏం మాట్లాడలేకపోయిన శోభ సరే అంటుంది. 

నిరుపమ్: హిమా ఈ రోజు నుంచి నువ్వు ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటాను..నీ మనసులో ఏదో సమస్య అడ్డంగా ఉంది దాన్ని కూడా ఈ రోజు పరిష్కరిస్తాను... ‘జ్వాలని పిలిచాను..తను రాగానే.. హిమకు క్యాన్సర్ అని.. హిమని తప్ప నేను ఎవరినీ ప్రేమించలేనని.. ఈ జన్మకు తనే నా భార్య అని చెప్పేస్తాను.నాకు తెలియకుండానే తనకు ఆశలు కల్పించి ఉంటే క్షమించమని అడుగుతాను’ అని ఫిక్స్ అవుతాడు. 

శోభ:  ఆంటీ మీకెలా చెప్పాలో అర్థంకావడం లేద. ఈ విషయం చెబితే పెళ్లి మొత్తానికే ఫిక్స్ చేసేస్తారు... అప్పుడు మొత్తానికే మోసం వస్తుంది. జ్వాలకు హిమని పట్టించినా, హిమ కుటుంబానికి జ్వాల ఎవరో చెప్పినా నిరుపమ్ పెళ్లి మాత్రం ఆగదు. ఏం చేసి అయినా నిరుపమ్ ను నా సొంతం చేసుకోవాలని తనలో తను అనుకుంటుంది.

మరోవైపు హిమ ఎంత అడుగుతున్నా పట్టించుకోకుండా, అసలు విషయం చెప్పకుండా సౌందర్య, ఆనందరావులు... నిరుపమ్ ఇంటికి తీసుకెళతారు. కారు ఆగిన వెంటనే ఎదురొచ్చిన స్వప్న..ప్రేమగా ఆహ్వానించి నీకు-నిరుపమ్ కి పెళ్లి అని చెప్పడంతో హిమ షాక్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు హిమ సిద్ధమవుతుండగా..నిరుపమ్ వచ్చి ‘ఆగు హిమా..’ అంటాడు. మీరింకా అలాగే నిల్చున్నారేంటి హిమను లోపలకు తీసుకెళ్లండి అని చెబుతాడు. అయిష్టంగానే లోపలకు వెళుతుంది హిమ. అదే సమయంలో శోభకు ఓ విషయం గుర్తొస్తుంది. శోభకు ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తూ.. వీటి ద్వారా ఆమెకు క్యాన్సర్ లేదని నిరూపించగలం డాక్టర్’అంటాడు. వాటిని తను తీసుకున్నదాచి పెట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. 

Also Read: పెదవి దాటని వసు ప్రేమ - థ్యాంక్స్ చెప్పి డైలమాలో పడేసిన రిషి, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తరంగాలు

అక్కడ రవ్వఇడ్లీ షాప్ దగ్గర కూర్చున్న జ్వాల అరగంట అయింది కదా అనుకుంటూ బయలుదేరుతుంది. కాసేపు ఉండు జ్వాలా అని రవ్వఇడ్లీ అంటున్నా మళ్లీ వస్తానులే అనేసి వెళ్లిపోతుంది. డాక్టర్ సాబ్ ఎందుకు రమ్మన్నారు-మామూలుగా ఏదైనా మాట్లాడాలి అంటే ఆశ్రమానికి రమ్మంటారు-తనేమైనా బిజీగా ఉంటే హాస్పిటల్ కి రమ్మంటారు-ఇప్పుడు ఇంటికి రమ్మంటున్నారంటే ముఖ్యమైన పని అయిఉంటుంది..వాళ్ల అమ్మా నాన్నలకు పరిచయం చేస్తారేమో అనుకుంటుంది. 

ఎపిసోడ్ ముగిసింది

రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
ఇదిగో నీ కోడలు అని అని సౌందర్య..హిమని  స్వప్న చేతిలో పెడుతుంది. శోభ చిరాగ్గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది.. జ్వాల లోపలకు వెళుతుంటుంది...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget