అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu March 6th Episode: బాలు అరెస్ట్ , షాక్ లో మీనా! మరో స్కామ్ లో మనోజ్- గుండెనిండా గుడిగంటలు మార్చి 06 ఎపిసోడ్

Gunde Ninda Gudi Gantalu March 5th Episode: శివతో పరీక్షలు రాయించకుండా ప్లాన్ చేసి ఇరికిస్తాడు గుణ. ఎలాగైనా పరీక్షలు రాయిస్తామని మాటిస్తారు బాలు - మీనా ...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu 2025 March 6th Episode Telugu Serial

శ్రుతికి వచ్చిన పార్సిల్ ప్రభావతి ఓపెన్ చేస్తుంది..మీనా వద్దని చెప్పినా వినదు. శ్రుతి బాధపడుతందేమో అంటుంది మీనా. అయినా మీనాకు గడ్డిపెడుతుంది కానీ వినదు. అవి హెడ్ ఫోన్స్.. ఇదేంటి అంటుంది ప్రభావతి.. దానిని హెడ్ ఫోన్స్ అంటారు అంటుంది. నాకు తెలియదా ఏంటి అంటూనే..ఇందులో పాటలు రావడం లేదేంటని అడుగుతుంది. దాన్ని ఫోన్ కి కనెక్ట్ చేయాలని మీనా అనడంతో ఫైర్ అవుతుంది.నేను ఈ హెడ్ సెట్ పెట్టుకుంటే నాకెంత బావుందో అని మురిసిపోతుంది. ఇంతలో శ్రుతి వచ్చి నాకు వచ్చిన పార్సిల్ ఎలా ఓపెన్ చేస్తారు? మేనర్స్ ఉండాలి కదా? నాకు వచ్చిన వస్తువులు మా అమ్మ ఓపెన్ చేసినా నచ్చదు అంటుంది. ఈ ఇంట్లో పిల్లవే కదా అని ఓపెన్ చేశానని చెప్పింది కదా అంటాడు రవి. నా వస్తువులు ఎవరైనా తీసుకుంటే నచ్చదని నీకు తెలుసుకదా అని రవికి ఇచ్చిపడేస్తుంది. సారీ ఆంటీ అనేసి వెళ్లిపోతుంది. 

మీనా ఇప్పుడు నీకు కళ్లు చల్లబడ్డాయా అని కోప్పడుతుంది. ఇలా జరుగుతుందనే మీకు ముందే చెప్పానంటుంది. అక్కడి నుంచి కోపంగా వెళ్లిన ప్రభావతి... రవిని పిలిచి అదేంటి అలా మాట్లాడుతుంది...నన్ను అన్నేసి మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి అంటుంది. నీకే సపోర్ట్ చేశాను కదా అని రవి చెప్పినా..ప్రభావతి ఫైర్ అవుతుంది. బాలు గాడు మీనా చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు, నువ్వు కూడా శ్రుతిని కంట్రోల్ చేయకపోతే నువ్వు కూడా అలానే తయారవుతాయ్ అంటుంది. ఇదంతా విని మీనా బాధపడుతుంది. ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోగానే...మీనా వస్తుంది. బాధపడకు వదినా అమ్మ మాటలు విని అంటాడు. నాకు అలవాటు అయిపోయిందిలే రవి..శ్రుతి సంగతి తెలుసుకదా నువ్వెళ్లు అంటుంది.

బాలు కాల్ చేసి గుణతప్పించుకున్నాడని చెబుతుంది. ఇప్పుడు నువ్వు కాలేజీకి రా.. శివకు ఎల్లుండి నుంచి పరీక్షలు కదా ఓసారి ప్రిన్సిపాల్ తో మాట్లాడుదాం అంటాడు బాలు. నేను చదువుకుని ఉంటే అత్తయ్య నాకు విలువ ఇచ్చేది కదా అంటుంది మీనా. మా అమ్మ విలువ ఇవ్వదు..వెలకడుతుంది అంటాడు. నేను చదువుకుని ఉంటే కార్ ఇంజినీరింగ్ చేసేవాడిని, నువ్వు చదువుకుంటే ఏసీ రూమ్ లో కూర్చుని పూలమ్ముకునేదానివి కదా అంటాడు. అంటే అప్పుడు కూడా మీకు కారు, నాకు పూలు తప్పవా అని నవ్వుతుంది.వెళ్లి ప్రిన్సిపాల్ ను కలిసేందుకు ఫ్యూన్ ని అడిగితే..అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. శనివారం రండి అంటాడు ఫ్యూన్. అలా కాదు తాతా..తనకు ఎల్లుండి నుంచి పరీక్షలున్నాయి..అందుకే ఈ రోజు మాట్లాడితేనే పరీక్షలు రాయడం కుదురుతుంది అంటారు. వెళ్లి ప్రిన్సిపాల్ ని అడిగి వచ్చినా అపాయిట్మెంట్ దొరకదు. అక్కడి నుంచి మీనా బాలు వెనుతిరుగుతారు. ప్రిన్సిపాల్ వెళ్లిపోతుంటే కలిసేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. 

సార్ కి ఓ కూతురు ఉండేది..ఆ అమ్మాయి బాగా చదువుకుంది.. ఓ అబ్బాయికి ఇచ్చి పెళ్లిచేశారు. ఎంతో ప్రేమగా చూసుకున్న ఆయన కూతుర్ని...భర్త నిత్యం తాగి వచ్చి కొట్టేవాడు. ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చేసింది. అప్పటి నుంచి మందు బాటిల్ చూసినా, చదువుపై శ్రద్ధ లేని పిల్లల్ని చూసినా ఆయనకు కోపం అని చెబుతాడు. ప్రిన్సిపాల్ ని బయట కలవొచ్చా అని అడిగితే.. ఆయన ఎవ్వర్నీ కలవరు, ఎక్కడికీ వెళ్లరు అంటాడు. ఆయన ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు బాలు. అడ్రస్ చెబుతాడు ఫ్యూన్. 


మనోజ్ దగ్గర పనిచేసే సేల్స్ మేనేజర్ వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది డబ్బులు కావాలని అడుగుతాడు. లేవు పో అని చెప్పి పంపించేస్తాడు మనోజ్. ఆ తర్వాత బ్రో అంటూ ఒకడు ఎంట్రీ ఇస్తాడు. గతంలో లాటరీ గెలుస్తానని చెబితే నువ్వు నమ్మలేదు.. కోటి రూపాయలు లాటరీ తగిలింది..నాపై నాకున్న నమ్మకం..నేను నమ్మి గెలిచాను కోటీశ్వరుడిని అయ్యాను. నువ్వు నన్ను నమ్మలేదు..కొన్ని జీవితాలంతే అంటాడు. కొత్త స్టాక్ వచ్చిందంటూ హడావుడి చేస్తాడు మనోజ్. నేను ఇక్కడెందుకు కొంటాను.. పక్కషాపులో కొంటాని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పార్క్ ఫ్రెండ్ వస్తాడు..అందరూ బాగుపడుతున్నారు నాకే ఎందుకు ఇలా అవుతుందో అర్థంకావడం లేదంటాడు. పక్కవాళ్లగురించి పాజిటివ్ గా మాట్లాడడం నేర్చుకో అని క్లాస్ వేస్తాడు. ప్రతి నెలా ఏదో సమస్య వచ్చి పడుతోంది అంటాడు బాలు. నీకు తెలిసిన చిల్లర వ్యాపారం చేస్తావా అని అడిగితే..మంచి ఐడియా ఇవ్వు అంటాడు మనోజ్. బాంబేలో నా ఫ్రెండ్ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు..ఆ కంపెనీలో డీలర్ షిప్ కి ఆప్షన్ ఉందంట ట్రై చేస్తావా అనగానే సరే అంటాడు  మనోజ్.

ఇంట్లో అందరూ పడుకున్నారా అని అడిగిన తర్వాత మందు బాటిల్ బయటకు తీస్తాడు బాలు. మీనాను ప్రిన్సిపాల్ ఇంటికి తీసుకెళ్లి అక్కడ మందు తాగి రచ్చ రచ్చ చేస్తాడు. నేను మందు బాటిల్ మీ తమ్ముడి కాలేజ్ బ్యాగ్ లో దాచిపెడితే నాకేం తెలియదు అంటాడా అని మీనాపై ఫైర్ అవుతాడు. ఇదంతా విన్న ప్రిన్సిపాల్..అయ్యో శివకి నేను అన్యాయం చేశానా అనుకుంటాడు. ఇప్పటికే నా తమ్ముడి చేయి విరగ్గొట్టి వాడిని చదువుకోకుండా ఆపేశావ్..ఇప్పుడు మందుబాటిల్ వాడి బ్యాగ్ లో పెట్టి ఇలా చేశావ్ అంటుంది మీనా. అయ్యయ్యో పాపం అని ప్రిన్సిపాల్ బాధపడతాడు. ఇంతలో శివ రాగానే..ప్రిన్పిపాల్ దగ్గరకు తీసుకెళ్లి బతిమలాడుతుంది మీనా. అప్పుడు శివకు ఎగ్జామ్ రాసే అవకాశం కల్పిస్తాడు ప్రిన్సిపాల్.  పోలీసులను పిలిచి బాలుని పట్టిస్తాడు. నువ్వు రేపటి నుంచి కాలేజీకి వచ్చి ఎగ్జామ్స్ బాగా రాసి..ఈ దరిద్రుడి నుంచి విడాకులు ఇప్పించి మీ అక్కను పోషించు అంటాడు. మీ మేలు మర్చిపోలేను సర్ అని అంటుంది మీనా. 

పోలీసులు వచ్చి బాలుని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు..ప్రిన్సిపాల్ వెళ్లిపోతాడు. అసలేం జరుగుతోందని శివ అడుగుతాడు. పోలీసులకు బాలు నిజం చెబుదాం అని ప్రయత్నించినా పట్టించుకోరు. మంచి పని అయిందని శివ అంటే..అంతా నీవల్లే , ఇదంతా నాటకం, మీ ప్రిన్సిపాల్ నీ తప్పేం లేదనుకోవాలని తప్పు తనపై వేసుకున్నాడని చెబుతుంది మీనా. ఇద్దరం కలసి ఇలా ప్లాన్ చేశాం నీ చదువు కోసం అని బాధపడుతుంది మీనా. ఇప్పుడు ఆయన్ని కొడతారో ఏంటో అని బాధపడుతుంది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today April 13th: నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
Meghasandesam Serial Today April 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
Podharillu Serial Today April 13th: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
పొదరిల్లు: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
Brahmamudi Serial Today April 13th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణను అనుమానించిన రేఖ – సుభాష్‌ను చంపేయబోయిన భూషణ్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణను అనుమానించిన రేఖ – సుభాష్‌ను చంపేయబోయిన భూషణ్‌
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Embed widget