అన్వేషించండి

chinni serial today march 19th: చిన్ని సీరియల్: దేవాకి చెమటలు పట్టించేసిన చిన్ని! శ్రీవారిని దారిలోకి తెచ్చుకుంటుందా!

chinni serial today episode march 19th చిన్ని దేవాతో మాట్లాడి తన తల్లి ఏ తప్పు చేయలేదు అని నిరూపించి దేవాని జైలు పాలు చేస్తా అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode: లోహిత నాగవల్లి దగ్గరకు వెళ్లి చిన్నిని ఎలా తరిమేయాలి అని ఆలోచిస్తున్నారు కదా అంటే అంత సీన్ లేదు 30 రోజుల తర్వాత అదే వెళ్లిపోతుంది అని నాగవల్లి అంటుంది. మీరు పప్పులో కాలేశారు ఆంటీ అది ఏదో రకంగా వాళ్లమ్మ తప్పు చేయలేదు అని నిరూపించి ఇక్కడే తిష్ట వేస్తుంది. దాని గురించి మీకు తెలీదు.. నాకు బాగా తెలుసు.. ఎదుటివాళ్లు ఏం ఆలోచిస్తున్నారో తను అలా ఆలోచించి.. మాట్లాడుతుంది. అది ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తుందో.. ఎలా మాట్లాడుతుందో.. ప్రతీదీ నాకు తెలుసు అని లోహిత అంటుంది. దానికి నాగవల్లి నువ్వు చిన్ని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా.. అందుకే తన గురించి నీకు అంతా తెలుసా. చెప్పు నీకు చిన్నికి సంబంధం ఏంటి అని అడుగుతుంది. 

లోహిత తడబడుతూ నాకు తనకి ఏం సంబంధం లేదు.. కేవలం ఎంటెక్‌లోనే తెలుసు అంటుంది. సంవత్సరంలోనే అంత తెలుసుకున్నావా అని నాగవల్లి అంటుంది. మర్యాదగా నిజం చెప్పు లేదంటే నీ పని అయిపోతుంది అని అంటుంది. నేను నిజమే చెప్తున్నా.. తన గురించి పరిశీలించి చెప్తున్నా అంటుంది. మీరు కూడా చిన్నిని ఇంట్లో నుంచి పంపే ఆలోచనలో ఉంటే నాకు  ఒక్క అవకాశం ఇవ్వండి ఆంటీ దాన్ని ఇంట్లో నుంచి పంపేలా చేస్తా,, ఒక్క అవకాశం ఇచ్చారు అంటే దాన్ని ఇంట్లో నుంచి తరిమి తరిమి కొడతా అని అంటుంది. 

చిన్ని ఉదయం ఉగాది సందర్భంగా ఇంట్లో అత్త, అమ్మ ఫొటోల ఎదురుగా దీపం వెలిగిస్తుంది. ఇద్దరికీ దండం పెడుతూ మీ ఇద్దరూ ఒకరి చావుకి కారణం మరొకరు ఎందుకు అవుతారు.. ఈ విషయం ఆలోచించకుండా మ్యాడీ మీ అమ్మే మా అమ్మని చంపింది అంటూ మొండిగా వాధిస్తున్నాడు.. వీలైనంత త్వరగా మా అమ్మ నిర్దోషి అని నేను నిరూపించుకునేలా నన్ను ఆశీర్వదించండి అని అంటుంది. అందరికీ టీ కాఫీలు ఇస్తుంది. మ్యాడీకి కూడా ఇస్తుంది. నాకు వద్దు అని మ్యాడీ అంటే అగ్రిమెంట్ చూడలేదా.. ఈ 30 రోజులు నా చేతి కాఫీ తాగాలి వంట తినాలి అంటుంది. దాంతో మ్యాడీ తీసుకుంటాడు. ఇక మామయ్య గారు ఇంకా రూం నుంచి రాలేదా అని  దేవా దగ్గరకు వెళ్లి గుడ్ మార్నింగ్ మామయ్య గారు అని అంటుంది. ఏ ధైర్యంతో నువ్వు ఇలా 30 రోజుల స్కీమ్ ప్లాన్ చేశావ్ అంటే.. నువ్వు తప్పు చేస్తున్నావ్ అంటే లేదు మామయ్య గారు నేను తప్పు చేసిన వాళ్ల గురించి బయట పెట్టాలి అనుకుంటున్నా అంటుంది. అన్నీ ఆలోచించుకొనే వచ్చాను మామయ్య గారు.. 30 రోజుల్లో మా అమ్మ నిర్దోషి అని నిరూపించడం.. నా భర్తకి నిజం తెలిసేలా చేయడం.. అసలు హంతకుడికి శిక్ష పడేలా చేయడం ఇదే నా టార్గెట్ అని అంటుంది. మామయ్య గారు నేను వచ్చినప్పటి నుంచి మీలో ఏదో టెన్షన్ కనపడుతుంది. ఏంటి అది. అయోమయంగా కూడా ఉంది. ఏంటి అది.. ఏం ఉన్నా పర్లేదు 30 రోజుల్లో అన్నీ బయట పడతాయి అని అంటుంది. 

దేవా కోపంగా చిన్ని వెళ్లిపోయిన తర్వాత ఆ బాలరాజు నీకు అన్నీ చెప్పి పంపాడని అర్థమైంది.. నీ దగ్గర ఏదో బలమైన ఆధారం ఉందని అర్థమైంది.. ఇన్ని తెలిసిన నాకు నీ అడ్డు తొలగించుకోవాలని తెలీదా అని అనుకుంటాడు. మ్యాడీ స్నానం చేసి వస్తే చిన్ని నేను తల తుడుస్తా.. వీపు తుడుస్తా అని అంటుంది. వీపు వీపు అని నన్ను వేపుకొని తినకు వెళ్లు నేను రెడీ అవ్వాలి అంటాడు. నేను వెళ్లాలి అంటే భార్యకి పెళ్లానికి ఉన్న తేడా ఏంటో చెప్పండి అంటుంది. దానికి మ్యాడీ భర్తకి మొగుడికి ఉన్న తేడా అని అంటాడు. కరెక్ట్గా చెప్పారు.. త్వరగా వస్తే ఇద్దరం కలిసి టిఫెన్ చేసి కలిసి ఆఫీస్‌కి వెళ్దాం అంటుంది. నేను నీతో కలిసి రాను అని మ్యాడీ అంటాడు. 

చిన్నికి తెలీకుండా మ్యాడీ ఆఫీస్‌కి వెళ్లాలి అని పరుగులు తీస్తాడు. తీరా కాస్త దూరం వెళ్లే సరికి చిన్ని శ్రీవారు అంటూ కారులో నుంచి మ్యాడీని పిలుస్తుంది, మ్యాడీ కారు ఆపి కిందకి దిగు అంటే దిగను అంటుంది. చిన్ని తన మాటలతో మ్యాడీని విసిగిస్తుంది. ఊసరవెల్లి రంగులు ఎందుకు మార్చుతుందో తెలీదు కానీ నువ్వు మాత్రం కార్యెక్టర్లు మార్చుతూనే ఉన్నావ్ అని అంటాడు. నేను నా శ్రీవారి కోసం ఆయనకు నిజం తెలియాలి అని క్యారెక్టర్లు మార్చుతూనే ఉంటా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌లో మార్పు వస్తుందా! వేదవతి సంతోషానికి కారణమేంటి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌లో మార్పు వస్తుందా! వేదవతి సంతోషానికి కారణమేంటి?
Karthika Deepam 2 Serial Today July 11th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
Nindu Manasulu Serial Today July 11th: నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!
నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 11th: తాగిన మత్తులో విక్కీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన రాధ...? దీనికి విక్కీ రియాక్షన్ ఏంటి..?
నువ్వులేక నేను లేను: తాగిన మత్తులో విక్కీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన రాధ...? దీనికి విక్కీ రియాక్షన్ ఏంటి..?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Embed widget