Guppedantha Manasu జూన్ 23 ఎపిసోడ్: కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా - వసు దగ్గర బెట్టు చేస్తోన్న రిషి
Guppedantha Manasu June 23 Episode 484: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 24 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జూన్ 23 ఎపిసోడ్ (Guppedantha Manasu June 23 Episode 484)
రిషి ఆలోచనలు ఓవైపు, మినిస్టర్ గారు అప్పగించిన వర్క్ ఓ వైపు..బిజీబిజీగా ఉంటుంది వసుధార. మొత్తానికి వర్క్ అయిపోయింది జగతిమేడంకి కాల్ చేసి చెప్పాలి అనుకుంటుంది.
వసు: మేడం రిపోర్ట్స్ రెడీ అయ్యాయి ఫైనల్ చేయండి
జగతి: నీ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను..కానీ ఫైనల్ చేయాల్సింది రిషి నేను కాదు.. కాస్త టైమ్ ఇవ్వు కాల్ చేస్తాను.
వసు పంపించిన వర్క్ మొత్తం చెక్ చేసిన జగతి దీన్ని ప్రింట్ తీసి రిషికి ఇస్తే సరిపోతుంది అనుకుంటుంది. ఇంతలో అక్కడకు మహేంద్ర,గౌతమ్ వస్తారు. ఇంకా వర్క్ చేస్తున్నావా అని మహేంద్ర అంటే..ల్యాప్ టాప్ తీసుకెళ్లింది కదా తొందరగా చేసి పెట్టేసింది అంటుంది జగతి. వసుధార వర్క్ విషయంలో చాలా సిన్సియర్ అంటాడు గౌతమ్
మహేంద్ర: రిషి మైండ్ ను దార్లో పెట్టేపని నీదే
గౌతమ్: నా పని నేను చేస్తున్నాను..ఆ బాధ్యత మీది కూడా..
జగతి: వాడి ఆశావాదం చూసి సంతోషపడాలో, లోపల నిరాశావాదంలో కూరుకుపోతున్నాడో అర్థంకాలేదు. బయటకు గంభీరంగా ఉన్నా లోపల నలిగిపోతున్నాడు మనమే ఏదోఒకటి చేయాలి
మహేంద్ర: ఇందులో నీ హెల్ప్ కూడా కావాలి..ఏం చేసైనా సరే రిషి మనసు తేలికపరచాలి
Also Read: రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో, ఇకపై ఇద్దరు శత్రువులు అని రగిలిపోతున్న జ్వాల
బాల్కనీలో నిల్చుని టీ తాగుతుండగా.. గేట్ బయట వసుధార కనిపిస్తుంది. ఇలా నువ్వు కంటిముందుకు రాకువసుధార నీ ఆలోచనలు మింగుడుపడడం లేదని రిషి అనుకుంటే.. నావల్ల మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థం అవుతోంది నేను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేను అనుకుంటుంది. ఇంతలో ధరణి జ్యూస్ తీసుకెళుతుంటే..
దేవయాని: వచ్చినవారికి అతిథి మర్యాదలు బాగానే చేస్తున్నావ్ అని సెటైర్ వేస్తుంది
ఫణీంద్ర: టైమ్ కాని టైమ్ లో మనపని చేస్తున్నందుకు సంతోషించకుండా ధరణిపై ఫైర్ అవుతావేంటి
దేవయాని: ఆ వసుధారతో పని ఉంటే కాలేజీలో చేయించుకోవాలి వదిలేయాని ఇంటికి తీసుకురావాలా..ఎన్నిసార్లు చెప్పినా నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు
ఫణీంద్ర: కొంచెం ఉన్నతంగా ఆలోచించు అనేసి నువ్వెళ్లు ధరణి అంటాడు
అటు రిషి బాల్కనీలో నిల్చుని వసుని చూస్తూ.. అసలు నన్నెందుకు రిజెక్ట్ చేసింది, ఎంత ఆలోచించినా కారణం తెలియడం లేదు అనుకుంటాడు. మీరు ఏం ఆలోచిస్తున్నారో నా మనసుకి తెలుస్తోంది సార్ అనుకుంటుంది వసుధార.
కాలేజీలో:
మినిస్టర్ గారు అప్పగించిన వర్క్ పై రిషి క్యాబిన్లో డిస్కషన్ పెడతారు మహేంద్ర, జగతి. రెండు గ్రూపులు, ఆ గ్రూపులను ఎవరెవరు లీడ్ చేయాలన్నది క్లారిటీ ఇస్తుంది జగతి. అంతా బావుంది ఇలాగే ఫాలో అయిపోండి అంటాడు రిషి. నువ్వు వస్తావా రావా అని మహేంద్ర అడిగితే..నా వీలును బట్టి వస్తానంటాడు రిషి. వసుధారలో వెళ్లమని చెప్పాలని ఉంది కానీ చెబితే ఎక్కడ అరుస్తాడో అని భయం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు మహేంద్ర,జగతి.
Also Read: నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా, వసు ప్రేమని గుర్తించలేకపోతున్న రిషి
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా అని గౌతమ్ అంటే..ఈ క్రెడిట్ అంతా రిషి సార్, జగతి మేడందే అంటారు కాలేజీకి చెందిన మేడం. ఇంతలో వసుధార సైకిల్ పై అక్కడకు వస్తుంది. గౌతమ్, వసుధార,మేడం కలసి వెళుతుంటారు. స్లమ్ ఏరియాకి వసుకన్నా ముందే వచ్చిన రిషి..ఈ వసుధార ఎక్కడ తిరుగుతోందో అనుకుంటాడు. ఏమీ జరగనట్టే ఉంటోందా లేదా తన మనసులో పశ్చాత్తాపం మొదలైందా అని ఆలోచిస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ ప్లైన్ చేస్తున్న వసుని చూస్తూ ఉండిపోయిన రిషి..అంతలోనే తనను రిజెక్ట్ చేసిన విషయం గుర్తుచేసుకుంటాడు. నన్నెందుకు రిజెక్ట్ చేశావ్, నాలాగే గౌతమ్ కి కూడా వసు నో చెప్పింది కానీ వాడు ఎప్పటిలా నవ్వుతూ సరదాగా ఉంటున్నాడు, వాడు తీసుకున్నంత ఈజీగా నేనెందుకు తీసుకోలేకపోతున్నాను, ప్రాబ్లెం నాలోనే ఉందా? అసలు వసుధార కోసం నేనెందుకు ఎదురుచూస్తున్నాను వెళతాను అనుకుంటూ వసుని కలవకుండానే వెళ్లిపోతాడు. రిషి వెళ్లడం చూసిన వసుధార..సార్ వచ్చారా అనుకుంటుంది.
దేవయాని, ఫణీంద్ర భోజనం చేస్తుంటారు ధరణి వడ్డిస్తుంటుంది.
ఏదైనా కోర్సు నేర్చుకోమ్మా అని ఫణీంద్ర అంటే.. జగతి దగ్గర చాలానే నేర్చుకుంటోంది కదా చాలు అంటుంది దేవయాని. అప్పుడే లోపలకు వచ్చిన మహేంద్ర, జగతిని భోజనానికి పిలుస్తాడు పణీంద్ర. మేం బయట తినేసి వచ్చాం అని మహేంద్ర చెబుతాడు.
దేవయాని: పొద్దున్నే ఇంటినుంచి వెళ్లడం ఏ రాత్రికో రావడం , ఇల్లూ పట్టదు, ఇంట్లో మనుషులు పట్టరు అని సెటైర్ వేస్తుంది.ఏ స్టార్ హోటల్లోనే తినేసి వచ్చింటారు.
జగతి: స్లమ్ ఏరియాలో వాళ్లతో పాటూ జొన్నరెట్టెలు తినేసి వచ్చాం
దేవయాని: కంచంలో చేయి కడుక్కుని వెళ్లిపోయిన దేవయాని.. తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేస్తే పిల్లలు ఎలా తయారవుతారు. అందుకే అంటారు కొందరి నీడ రాక్షస నీడ అంటారు అనేసి చేయి కడుక్కుని వెళ్లిపోతుంది.
జగతి-ఫణీంద్ర: బావగారూ మీరుకూడా ఏంటి అనగానే..మనతో పాటూ తినేవాళ్లు చేయికడుక్కుని వెళ్లిపోతే మనం ఎళా తినగలం. కొందరు అంతే చెబితే వినరు , మనం మార్చలేం అనేసి వెళ్లిపోతాడు.
Also Read: హృదయం ఓర్చుకోలేనిది గాయం, రిజెక్టెడ్ పీస్ ని అని ఎమోషనల్ అయిన రిషిని చూసి తట్టుకోలేకపోయిన వసుధార
అటు గౌతమ్ కి కాల్ చేసిన రిషి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అయిపోయింది కదా రిటర్న్ వెళుతున్నాం అంటాడు. వసు కార్లో ఉందో తెలుసుకునేందుకు రిషి పడుతున్న తాపత్రయం చూసి వీడితో ఆడుకుంటా చూడు అనుకుంటాడు గౌతమ్.
రిషి: నేను కూడా మీరు వెళ్లిన ఏరియాకు వచ్చాను, అన్ని గ్రూప్స్ నిటచ్ చేస్తూ వచ్చాను ఇంకా ఎవరైనా వెళ్లిపోయారా, ఉన్నారా
గౌతమ్: మేం అయితే బయలుదేరిపోయాం
రిషి: అదేరా...ఎవరెళ్లారో లేదో తెలుసుకోవాలి కదా..
గౌతమ్: ఇక ఇబ్బంది పెట్టడం ఎందుకని తను సైకిల్ పై వెళ్లిపోయింది అంటాడు
రిషి: తను అంటే వసుధారే కదా
గౌతమ్: నీకు కావాల్సిన సమాచారం ఇదేకదా
ఈ రూట్లో సైకిల్ పై రావడం ఏంటి, కాలేజీ వర్కే కదా వెహికల్ ఉంది కదా అడగొచ్చు కదా, ఏంటో వసుధార ధైర్యం అనకోవాలా, పొగరు అనుకోవాలా, మొండితనం అనుకోవాలా.. అనుకుంటాడు
దేవయాని అన్న మాటలు తల్చుకుని బాధపడుతుంది జగతి. అక్కయ్యలో కడుపుమంట రోజురోజుకీ పెరుగుతోంది. బావగారి ముందే ఇలా మాట్లాడుతోందంటే పరిస్థితి మరింత దారుణంగా తాయరయ్యేట్టుంది అంటుంది. ఎపిసోడ్ ముగిసింది....
రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
సైకిల్ పాడవడంతో కూర్చుని బాగుచేసుకుంటుంది వసుధార. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి నేను ట్రై చేయనా అని అడుగుతాడు. కొద్దిసేపు క్యారెక్టర్స్ మార్చుకుందాం అన్న వసు.. కారులో వెళదాం అని అడుగుతుంది. నేను మనసు, క్యారెక్టర్స్ మార్చుకునే రకం కాదు ఎప్పటికీ ఒకేలా ఉంటానంటూ షాక్ ఇస్తాడు రిషి.