Karthika Deepam జూన్ 23 ఎపిసోడ్: రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో, ఇకపై ఇద్దరు శత్రువులు అని రగిలిపోతున్న జ్వాల
Karthika Deepam june 23th Episode 1386: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 23 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.
Karthika Deepam జూన్ 23 గురువారం ఎపిసోడ్
నిరుపమ్ రిజెక్ట్ చేయడంలో జ్వాల ఆశ్రమం బయటే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన సౌందర్య ... హిమ పద వెళదాం అంటుంది. నానమ్మ దయచేసి వెళ్లిపో నన్ను ఒంటరిగా వదిలెయ్ అని అడుగుతుంది. ఏమీ మాట్లాడలేక సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చెట్టుకి ఓ వైపు జ్వాల మరో వైపు హిమ ఏడుస్తూ కూర్చుంటారు. అక్కడి నుంచి లేచి అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనలో తాను మాట్లాడుకుంటుంది హిమ.
హిమ: అమ్మా నాన్న..నన్ను క్షమించండి. శౌర్య ప్రేమించిన నిరుపమ్ బావని తనకి ఇచ్చేందుకు చివరివరకూ ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది. మీ చివరికి కోరికను కూడా నేను తీర్చలేకపోతున్నాను. నా వల్లే శౌర్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. నేను ఓడిపోయానమ్మా...క్యాన్సర్ అని చెప్పి చచ్చిపోతానని చెప్పినా నమ్మలేదు కానీ ఇప్పుడు మానసికంగా చచ్చిపోయాను అనుకుంటూ రోడ్డుమధ్యలో నడుస్తూ వెళుతుంది.
వెనుక లారీ హారన్ కొడుతున్నా వినిపించుకోదు..ఇంతలో అక్కడకు వచ్చిన ప్రేమ్ చేయిపట్టి రోడ్డుపక్కకు లాగుతాడు.
నా మనసులో మాట చెప్పలేకపోయాను అని తనలో తానే బాధపడతాడు.
ప్రేమ్: నీ పెళ్లి, నీ జీవితం నీ ఇష్టం..ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయలేను కదా
హిమ: నా జీవితమే ప్రశ్నగా మారింది
ప్రేమ్: ఉన్నంతవరకూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలగాలి
హిమ: ప్రశాంతత నాకు బద్ధశత్రువు అయింది..
ప్రేమ్: ఇంటికి డ్రాప్ చేస్తా పద హిమ..
Also Read: నిరుపమ్ మాటలకు కుప్పకూలిపోయిన జ్వాల, అండగా నిలబడిన సౌందర్య, కథలో మరో కీలక మలుపు
అటు జ్వాల(శౌర్య) ఇంట్లో కూర్చుని హిమ, నిరుపమ్ మాటలు గుర్తుచేసుకుంటుంది.
జ్వాల: తింగరీ నువ్వు నా పక్కనే ఉన్నావ్..నా మంచి కోసమే చేస్తున్నట్టు నటించావ్..అయినా డాక్టర్ సాబ్ ఏంటి గుండెలు కోసేటట్టు మాట్లాడాడు..నా విషయంలో దేవుడు మారిపోయాడు అనుకున్నాను...చిన్నపిల్లలకు చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు నాకు డాక్టర్ సాబ్ ని ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నాడు. అమ్మా నాన్నలు లేరు, నా కుటుంబం దూరమైపోయింది..నా జీవితంలో గొప్పసంతోషం నా డాక్టర్ సాబ్..ఆయన్ను కూడా కాకుండా చేశావా..నా పిచ్చి కానీ ఇంకా నా డాక్టర్ సాబ్ ఏంటి... ఏడిస్తే తగ్గిపోయే చిన్న బాధా ఇది..ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మాటలు..ఈ ప్రేమ పాడుగానూ..ఇంత బాధ పెడుతుందా..( నిరుపమ్ తో స్పెండ్ చేసిన ప్రతిక్షణం గుర్తుచేసుకుంటుంది). డాక్టర్ సాబ్ అంతబాగా మాట్లాడేవారు..అంత ప్రేమగా ఉండేవారు.. సడెన్ గా ప్రేమలేదు అంటారేంటి..డాక్టర్ సాబ్ సంగతి నాకు తెలియదా..చాలామంచి వారు,ఆ తింగరే ఏదో మాయచేసి ఉంటుంది. ఎంత అమాయకంగా కనిపించింది, జ్వాలా జ్వాలా అని ఓ చిన్న పిల్లలా ఉండేది. ఇది డాక్టర్ ఎలా అయిందో అనిపించేది. నేను తయారుచేసిన కత్తి నాకే గుచ్చుకుంది. దానికి తెలివితేటలు నేర్పించి, మాట్లాడే ధైర్యం ఇచ్చి వెంట తిప్పుకుంటే.. నేర్చుకున్న తెలివిని నాపైనే వాడింది. డాక్టర్ సాబ్ కాదన్నారని ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావా..దీనికి కారణం అయిన నిన్ను మాత్రం వదిలేదే లే అనుకుంటుంది.
ఇంతలో హిమ నుంచి కాల్ వస్తుంది. ఎన్నిసార్లు కట్ చేసినా మళ్లీ మళ్లీ చేస్తూనే ఉండటంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది జ్వాల.
హిమ-జ్వాల: ఫోన్ లిఫ్ట్ చేసిన జ్వాల అటు హిమ మాటలు వినకుండా కోపాన్ని చూపిస్తుంది. ఇందుకోసమేనా డాక్టర్ సాబ్ కి నన్ను ఐ లవ్ యూ చెప్పనివ్వలేదు అని విరుచుకుపడుతుంది. ఓ జీవితంతో ఆడుకున్నావ్, నన్ను అబద్ధాలతో న మాయ నటనతో నమ్మించి మోసం చేశావ్ అని అటు హిమను మాట్లాడనివ్వదు. నా తల్లిదండ్రులను దూరం చేసిన హిమతో పాటూ నువ్వు కూడా శత్రువువే, ఇంకోసారి నాకు కాల్ చేయకు అని విసరుగా కాల్ కట్ చేస్తుంది.
Also Read: నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా, వసు ప్రేమని గుర్తించలేకపోతున్న రిషి
కాల్ కట్ చేశాక..జ్వాలతో కలసి ఉన్న ఫొటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది హిమ. అప్పుడే రూమ్ కి వెళ్లి సౌందర్యతో.. నానమ్మ జ్వాలే మన శౌర్య అని తెలిసినప్పటి నుంచీ ఈ ఫొటో పెట్టుకుని దీనితోనే మాట్లాడుతున్నాను. నాకు శౌర్య అంటే చాలా ఇష్టం నానమ్మ. తను నాకంటే ఫాస్ట్, అన్ని విషయాలు చాలా బాగా ఆలోచించేది. నేను తనంత దూకుడుగా ఉండకపోతే తను నాకు అన్నీ చెప్పేది. అలాంటి శౌర్య..నామూలంగా ఇంట్లోంచి వెళ్లిపోతే ఎలా భరించానో..అమ్మా నాన్న వెళ్లిపోయిన బాధ ఓ వైపు, శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోయిన బాధ మరోవైపు.
సౌందర్య: కళ్లముందు ఇద్దరూ తిరిగేవారు, ఇద్దరూ గొడవపడిన సందర్భాలు చాలా తక్కువ. అటు ఇద్దరు, ఇటు ఇద్దరు కలసి నలుగురు అయ్యేసరికి ఎవరికి కన్నుకుట్టిందో ఏమో మీ ఇద్దర్నీ దూరం చేసారు. అసలు ఆ రౌడీది నీకెలా కనిపించింది
హిమ: జ్వాలను చూసిన ప్రతీసారీ నాకు మన శౌర్యలానే అనిపించేది. ఓసారి మెడికల్ క్యాంప్ లో తెలిసింది. తను నన్ను ఎంతద్వేషిస్తోందో తెలుసుకున్నాక బాధఅనిపించింది.శౌర్యకి నాపై కోపం అని తెలిసాక ఆ కోపం తగ్గిపోతుందిలే అనుకున్నాను. ఆ కోపం తగ్గించేవరకూ మీకు చెప్పొద్దు అనుకున్నాను. తను నన్ను చూస్తే గుర్తుపడితే నాపై కోపంతో తను ఎక్కడ దూరమైపోతుందో అని నేను హిమని అని చెప్పలేదు. ఇంటికి కూడా తీసుకురాలేకపోయాను. మీకు చెబితే మీరు తనని చూడకుండా, మాట్లాడకుండా ఉండలేరని మీతో కూడా దాచాల్సి వచ్చింది నానమ్మా.ఒకరోజు ఐస్ క్రీం పార్లర్ లో ఉన్నప్పుడు... శౌర్య నిరుపమ్ బావని ప్రేమిస్తున్నట్టు తెలిసింది. అప్పటి నుంచీ నా మనసు మార్చుకున్నాను, అమ్మా నాన్నలు చనిపోయే ముందు చివరిగా అన్నమాటేంటో తెలుసా.. హిమా ..శౌర్య జాగ్రత్త తనని నువ్వే చూసుకోవాలి అని చెప్పారు.
రేపటి( శుక్రవారం) ఎపిసోడ్
ఇంట్లో కూర్చుని నిరుపమ్ మాటలే తల్చుకుంటుంది జ్వాల. మీ ఇద్దరి మధ్యా గొడవేంటి అని సౌందర్య అడిగితే నేను తనని ఎంత ప్రేమించానో తెలుసా అని రక్తంతో బొమ్మ గీశాను అని చూపిస్తుంది. ఎంత కష్టం వచ్చిందే నీకు అని సౌందర్యతో నా కష్టం విని నువ్వు ఫీలవుతున్నావా అంటుంది జ్వాల.
Also Read: ఒక్క చెంపదెబ్బతో కథ మొత్తం మార్చేసిన సౌందర్య, శౌర్య కి మళ్లీ అన్యాయం జరిగినట్టేనా!