అన్వేషించండి

Karthika Deepam జూన్ 24 ఎపిసోడ్: తింగరే హిమ అని జ్వాల(శౌర్య)కు తెలిసేలా చేసిన శోభ, సౌందర్య ఏం చేయబోతోంది

Karthika Deepam june 24th Episode 1387: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 24 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 24 శుక్రవారం ఎపిసోడ్ 

శౌర్య తనకు ఎలా తెలుసో సౌందర్యకు చెప్పిన హిమ...తను నిరుపమ్ బావని ప్రేమిస్తోందని అందుకే నా మనసు మార్చుకున్నా అని చెబుతుంది.
హిమ: అమ్మా నాన్న చివరి కోరికగా శౌర్యను బాగా చూసుకో అని చెప్పారు. మనం అందరం సంతోషంగా ఉంటే అది కష్టాలుపడింది. వీటన్నింటికీ నేనే కదా కారణం అనిపించింది. అందుకే నా ప్రేమను త్యాగం చేసి ఎలాగైనా నిరుపమ్ బావతో శౌర్యకు పెళ్లిచేస్తానని అనుకున్నాను. వాళ్లిద్దరికీ పెళ్లయ్యాక నీకు చెప్పాలి అనుకున్నాను. నేను ఎవరో తెలిస్తే శౌర్య గొడవ చేస్తుంది, మళ్లీ దూరంగా వెళ్లిపోతుంది. తనకు జరిగిన నష్టానికి కష్టానికి ఈ విధంగా అయినా రుణం తీర్చుకుందాం అనుకున్నాను. 
సౌందర్య: నిన్నంటే గుర్తుపట్టలేదు సరే..నన్ను గుర్తుపట్టి కూడా నానమ్మా అని నోరారా పిలవకుండా ఉందంటే లోపల ఎంత కష్టపడుతోందో కదా పాపం..మనకెందుకు దూరంగా ఉంటోందే..దాని మనసులో ఏముంది..
హిమ: శౌర్యకి నాపై ఎంత కోపం ఉందో నీకు తెలియదు నానమ్మ...ఈ పచ్చబొట్టు చిన్నప్పుడు ఏ ముహూర్తాన వేయించుకున్నామో తెలియదు కానీ తనముందు పచ్చబొట్టు దాచుకుంటూ ఇబ్బందిపడుతున్నాను. తనుమాత్రం పచ్చబొట్టు చూస్తూ కోపం పెంచుకుంటోంది.
సౌందర్య: త్వరలో శౌర్య మనసు మారాలని కోరుకుందాం..
హిమ: కాదు నానమ్మా శౌర్య నిరుపమ్ బావ ఒకటి కావాలని కోరుకుందాం...

Also Read: రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో, ఇకపై ఇద్దరు శత్రువులు అని రగిలిపోతున్న జ్వాల

జ్వాల(శౌర్య) తో మాట్లాడినదంతా గుర్తుచేసుకుంటాడు నిరుపమ్.
నిరుపమ్: పాపం జ్వాల చాలా ఫీలైంది కానీ ఇందులో నాతప్పేముంది. అనవసరంగా నువ్వే ఏదో ఊహించుకున్నావ్, అప్పటికీ నీకు నిజం చెప్పాలని చాలా ట్రై చేశాను, అయినా హిమ తప్పుకూడా ఉందిలే నీలో లేని ఆశలు కల్పించింది.జ్వాలకు క్లియర్ గా చప్పేసాక నా మనసు తేలికపడింది. ఇక నాకు హిమకు పెళ్లే మిగిలింది. ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాను. తనకు క్యాన్సర్ ఉందని జ్వాలను పెళ్లిచేసుకోమంది, అయినా ఎవరైనా,ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా...వెనకా ముందూ అంతే. కానీ ఉన్నన్ని రోజులూ హిమని సంతోషంగా చూసుకుంటాను. హిమ నా జీవితం. ఇకపై తనే నా ప్రపంచం..తను నాతో ఉన్న ప్రతిక్షణాన్ని ఆనందంగా మార్చాలి. ఐ లవ్ యూ హిమ 

మరోవైపు జ్వాల కూడా అవే మాటలు గుర్తుచేసుకుంటూ కూర్చుంటుంది. ఇంతలో సౌందర్య అక్కడకు వెళుతుంది. రా సీసీ అని లోపలకు పిలుస్తుంది జ్వాల. 
జ్వాల: ఏంటి సీసీ సడెన్ గా వచ్చావ్
సౌందర్య: ఏం లేదే నిన్ను ఆశ్రమంలో చూశాను
జ్వాల: అక్కడకు నువ్వెందుకు వచ్చావ్
సౌందర్య: ఆ ఆశ్రమం నాదే, దానికి సంబంధించిన ఖర్చులన్నీ నేను చూసుకుంటాను
జ్వాల: ఏంటి సీసీ ఆ అనాధాశ్రమం నువ్వు నడుపుతావా( నువ్వు కట్టిన అనాథాశ్రమంలో నేను అనాథగా చేరానా)
సౌందర్య: ఇంట్లో ఎవ్వరూ లేరా
జ్వాల: అందరూ ఊరెళ్లారు..నువ్వు రాంగ్ టైంలో వచ్చావ్.నీకు మర్యాదలు చేయలేను
సౌందర్య: నీకు మర్యాదలు చేయడానికి రాలేదు..దూరం నుంచి చూశాను, మొత్తం వినలేదు, ఎవరా అబ్బాయి . నీ నానమ్మని అనుకుని చెప్పు
జ్వాల: చుట్టరికాలు, బంధుత్వాలు నాకు అచ్చిరాలేదు. ఈ ప్రేమలు, ఈ గొడవలు నీకు తెలియంది కాను.. అయినా నా గొడవ నీకెందుకులే..
సౌందర్య: ఆ అబ్బాయి గొప్పింటి బిడ్డలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు
జ్వాల: తనో డాక్టర్ ...ఎప్పుడూ ఎవ్వర్ని చూసినా పట్టించుకోని నేను ఆ డాక్టర్ సాబ్ తో ప్రేమ అనుకున్నాను.. తప్పు నాదే ఏదో అనుకున్నాను ఏదో అయింది..మధ్యలో ఓ విలన్ దొరికింది. ఆటో ఆటో అని ఆటో నిడిపే నేను నా రేంజ్ మరిచిపోయి డాక్టర్ ని ప్రేమించడం ఏంటి, నా ఖర్మ కాకపోతే..అంతా బావుంటే డాక్టర్ పెళ్లాన్ని అయ్యేదాన్ని, అంతా అయిపోయిందిలే సీసీ ... ఏంటి సంగతులు. నా కథ చెప్పి బోర్ కొట్టిస్తున్నానా, సినిమాకు వెళదామా...
సౌందర్య: లవ్ ఫెయిల్యూర్ అంటావ్, లైఫ్ లో ప్రాబ్లెమ్ అంటావ్, సినిమాకు వెళ్లడం ఏంటి..ఇంత బాధ పెట్టుకుని ఎలా నవ్వుతున్నావ్
జ్వాల: నా గురించి నా జీవితం గురించి నీకు తెలియదు
సౌందర్య:నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు కానీ నువ్వే బయటపడడం లేదు. దీని మనసులో ఎంత బాధఉన్నా బయటకు నవ్వుతోంది..
జ్వాల: సీసీ మీది లవ్ మ్యారేజా...?
సౌందర్య: ఎందుకలా అడిగావ్
జ్వాల: ఈ ప్రేమలు పెళ్లిళ్లు మీద నాకు విరక్తి పుట్టేసింది..నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
సౌందర్య: నేనున్నాను కదా నీ బాధ నాకు చెప్పుకోవే..
జ్వాల: బాధలు చెప్పుకుని భుజంపై తలపెట్టి కన్నీళ్లు కార్చుకోవడం మనకు పడవు, మనం ఆ టైప్ కాదు. దెబ్బతిగిలిందని ఆగి ఓర్చుకోను మరింత స్పీడ్ గా పరిగెడతాను..
సౌందర్య: కష్టాలు, బాధల గురించి నువ్వు చెప్పినవి విని నేను ఎంత రిలీఫ్ పొందానో తెలుసా
జ్వాల: మగాళ్లు లవ్ ఫెయిల్యూర్ అయితే మందు తాగుతారు, కానీ లేడీస్ మాత్రం చెప్పలేరు..
సౌందర్య: ఏడుపొస్తే ఏడ్చేయవే..బాధ తగ్గిపోతుంది
జ్వాల: అదే తప్పు సీసీ, బాధ తగ్గిపోతే మనల్ని బాధపెట్టిన వాళ్లమీద కోపం తగ్గిపోతుంది,ఇలా నా ప్రేమని నా డాక్టర్ సాబ్ ని దూరం చేసింది ఒకతుంది..దాని సంగతి నేను చూస్తాను, నాతోనే ఉంటూ నా క్షేమాన్ని కోరుకున్నట్టు నటిస్తూ నా తోక పట్టుకుని తిరిగి నా డాక్టర్ సాబ్ ని నాకు కాకుండా దూరం చేసింది. దాన్ని వదిలిపెట్టను..
సౌందర్య: అది నీకు ద్రోహం చేయలేదు..నీ మంచి కోసమే చేసింది..కానీ నీకు అర్థంకావడం లేదు..ఈ విషయం నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావ్ అనుకుంటుంది 
జ్వాల: రక్తంతో బొమ్మగీశాను డాక్టర్ సాబ్ ని అంత ప్రేమించాను సీస..ఇంతకన్నా ఇంకేం చేస్తాను.. బొమ్మలు గీయడమే అలవాటు లేని నేను ఇంత బాగా బొమ్మగీశానంటే మనసులో ఎంత ప్రేముందో అర్థం చేసుకోవాలి..
సౌందర్య: ఎంత కష్టం వచ్చిందే నీకు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సౌందర్య
జ్వాల: ఏంటి సీసీ నా లవ్ స్టోరీ విని నువ్వు ఫీలవుతున్నావా అన్న జ్వాలని సౌందర్య హగ్ చేసుకుంటుంది..

Also Read: కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా - వసు దగ్గర బెట్టు చేస్తోన్న రిషి

అటు స్వప్న ఇంట్లో శోభ కూర్చుని ఉంటుంది
శోభ: ఎప్పుడొచ్చినా పరాయిదానిలాగే వస్తుంటాను..ఈ ఇంటికి కోడలిగా ఎప్పుడొస్తానా అని ఎదురుచూస్తున్నాను
స్వప్న: ఏం చెప్పాలనుకుంటున్నావ్
శోభ: హిమతో బలవంతంగా పెళ్లి ఎందుకు, నిరుపమ్ ని ఒప్పించొచ్చు కదా..డైరెక్ట్ గా నన్నే పెళ్లిచేసుకోమని చెప్పొచ్చు కదా
స్వప్న: చెబితే వినే పరిస్థితిలో వాళ్లు లేరు..శోభలో ఆశలు రేకెత్తించొద్దని హిమ నాకు సలహా ఇచ్చింది. నీకు అర్థం అవుతోందా. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు, నాకు సలహా ఇస్తే నచ్చదు.
శోభ: ఆంటీ మూడు  బాగున్నట్టు లేదు ఇలాంటప్పుడు ఏమీ మాట్లాడకపోవడమే మంచిది. హిమకు క్యాన్సర్ లేదని ఆంటీకి చెబితే వెంటనే నిరుపమ్ కి తెలుస్తుంది. ఇంకేమైనా ఉందా..ఏం చేసైనా నిరుపమ్ ని పెళ్లిచేసుకోవాలి

అటు సౌందర్య వంట చేస్తుంటే ఏంటి సీసీ మీరంతా పెద్దోళ్లు  మా ఇంట్లో వంటచేస్తున్నావ్ అని అడుగుతుంది జ్వాల. మనిద్దరం ఫ్రెండ్స్ అన్నావ్ కదా అందుకే చేస్తున్నా అంటుంది. దోసకాయ పచ్చడి చేయాలా అని సౌందర్య అడిగిన వెంటనే శౌర్య ఫైర్ అవుతుంది..

రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
హిమ ఓ రోడ్డుపక్కన నిల్చోవడం చూసి జ్వాలకి పట్టించేందుకు సిద్ధమైంది శోభ. హిమ పేరుతో కాల్ చేసి జ్వాలని రమ్మంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన జ్వాల..హిమను చూసి ఫైర్ అవుతుంది. అసలు నీ పేరేంటో చెప్పవే అని నిలదీస్తుంది...

Also Read: నిరుపమ్ మాటలకు కుప్పకూలిపోయిన జ్వాల, అండగా నిలబడిన సౌందర్య, కథలో మరో కీలక మలుపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget