Karthika Deepam జులై 12 ఎపిసోడ్ 1402: తనవారితో కలసిపోయిన శౌర్య- పూర్తిగా మోనితలా మారిపోయిన శోభ - కార్తీకదీపం కథ ఇక సుఖాంతమేనా !
Karthika Deepam july 12 Episode 1402: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం జులై 12 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam july 12 Episode 1402)
హిమ మోసం చేసిందని చెప్పిన శోభని చెంపదెబ్బ కొడుతుంది జ్వాల (శౌర్య). ఆతర్వాత ఇంటికి వెళ్లిన జ్వాల జ్వరంతో పడిఉండగా హిమ ఇంటికి తీసుకొచ్చేస్తుంది. తెల్లారే లేచి చూసేసరికి కొత్త ఇంట్లో ఉన్నానేంటని చుట్టూ చూస్తుంటుంది. ఇంతలో సౌందర్య, ఆనందరావు అక్కడకు వస్తారు. సోమవారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది. మంగళవారం ఎపిసోడ్ ఇదే సీన్ తో ప్రారంభమైంది...
టేబుల్ మీద.. హిమ, జ్వాలల ఫొటో ఉంటుంది. ఇక అదే రూమ్‌లోకి సౌందర్య, ఆనందరావులు వస్తారు. ‘మీరేంటి ఇక్కడా? నేనేంటి ఇక్కడా?’ అంటుంది శౌర్య(జ్వాల). ఇంతలో హిమ వస్తుంది. ‘నీకు బాలేకపోతే మీ ఇంటికి వచ్చిన హిమే.. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది’ అంటాడు ఆనందరావు. శౌర్య: ట్రీట్మెంట్ చేసినందుకు రెండింతల ఫీజ్ ముఖాన్ని కొడతాను.. ఇప్పుడు నేను వెళ్తాను అంటుంది
సౌందర్య: ఏం మాట్లాడుతున్నావే? ఫీజ్ ముఖాన్న కొడతావా? దాన్ని చూశావా? దాని మొహం చూడవే.. పాపమే.. నీకు జ్వరమని రాత్రంతా నిద్రలేకుండా నీ పక్కనే కూర్చుని.. టెంపరేచర్ చెక్ చేస్తూ.. టాబ్లెట్స్ వేస్తూ.. ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఫీజ్ మొహాన్న కొడతావా? అదేం డాక్టర్‌గా సేవలు చేయలేదే.. తోడపుట్టినదానిలాగ.. ఓ తల్లిలా నిన్ను చూసుకుంది..’ అంటుంది సౌందర్య.
శౌర్య: హా.. అయ్యిందా ఇంకేమైనా ఉందా? నువ్వు తెలివైనదానివని.. మాటకారివని నాకు బాగా తెలుసు.. నన్ను ఇలా మాటలతోనే ఉంచెయ్యాలని చూస్తున్నారా?
ఆనందరావు: ఏంటమ్మా అయ్యిందేదో అయ్యిందని ఉండొచ్చు కదమ్మా
శౌర్య: తాతయ్యా.. అయ్యిందేదో అయ్యింది అనుకోవడానికి పోయింది రూపాయో పది రూపాయలో కాదు నా జీవితం.. నా ప్రేమ పోయింది.. ఇది.. ఇది మోసం చేసింది.. మీరు మోసం చేశారు.. అబద్దాలు.. కపట ప్రేమలు.. అన్నీ మరిచిపోయి… అన్నీ మరిచిపోయి.. హాయ్ తాతయ్యా.. హాయ్ నాన్నమ్మా అంటూ ఎప్పటిలా తిరగాలా? నా వల్ల కాదు
Also Read: సౌందర్య ఆనందరావు దగ్గరకు చేరిన శౌర్య (జ్వాల), ఇంట్లో కనిపించని హిమ - మరింత పెరిగిన శోభ పైశాచికత్వం
హిమ: శౌర్యా అసలు జరిగింది ఏంటంటే
శౌర్య: నువ్వు నోరుముయ్ నాకు కంపరంగా ఉంది
సౌందర్య: అసలు ఎందుకే అంత కోపం? జరిగింది ఏంటో నీకు తెలియదు.
శౌర్య: దాన్ని గొప్ప త్యాగమూర్తిని చేయకండి.. మీరేం చెప్పినా నేను నమ్మను.. జరిగింది నాకేంటో చాలా క్లియర్‌గా తెలుసు. చిన్నప్పుడు నువ్వు చెప్పిన పులి బంగారు కడియం కథ నా జీవితంలో నిజం అయింది. ఇదే ఆ మాయమాటల పులి, బలైంది నేను, నా ప్రేమ, నా జీవితం, ఇంకా ఈ మానవరూపంలో ఉన్న పులి గురించి మంచి మాటలు చెబుతావా......
సౌందర్య: ఏంటే నువ్వు చెప్పేదే వినాలా? మేము చెప్పేది నువ్వు వినవా?
ఆనందరావు: ఇన్నాళ్లూ ఎక్కడో ఉన్నావ్...ఎలాగోలా బతికావ్...ఇప్పుడైనా అందరం కలిసుందాం...
శౌర్య: అవును.. నాకు ఎవరు లేరు.. నేను ఎవరితో కలిసి ఉండను
సౌందర్య: నీకు తెలియకుండానే నన్ను నానమ్మా, తనని తాతయ్య అని పిలిచావ్. కోపాలు పగలు.. అనుమానాలు అన్నీ సహజమే.. కానీ బంధం ఎప్పటికీ నిజం. మీ అమ్మా నాన్నలని పోగొట్టుకుని నువ్వే అంత బాధపడితే వాడు నా కొడుకే, అది నా కోడలే… వాళ్లని పోగొట్టుకుని మేమెంత బాధపడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా? ఆలోచించవు. నువ్వు ఆలోచించవు.. ఎప్పుడూ నీవైపే కాదు.. మా వైపున కూడా ఆలోచించు
శౌర్య: చాలు.. ఒక్కసారి మోసపోతే.. ఆ తప్పు ఎదుటివారిదే అవుతుంది. కానీ రెండో సారి మోసపోతే ఆ తప్పు కచ్చితంగా మనదే అవుతుంది.. జీవితంలో మళ్లీ మళ్లీ మోసపోవాలని లేదు.. నేను వెళ్తున్నాను
Also Read: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం, రిషి-వసు మధ్య మళ్లీ చిగురిస్తోన్న ప్రేమ - మధ్యలో వచ్చి చేరిన సాక్షి
సౌందర్య: సౌర్యా సౌర్యా ఆగు అంటూ ముగ్గురూ వస్తారు. ఆనందరావు సౌర్య చేయి పట్టుకుని.. ఆపుతాడు. ఒక్క రెండు నిమిషాలు నన్ను మాట్లాడనీయమ్మా ప్లీజ్ అంటూ దీప, కార్తీక్‌ల ఫొటోలు చూపిస్తూ మాట్లాడతాడు.
ఆనందరావు: చూడమ్మా రోజులో ఎక్కువ సేపు నేను ఇక్కడే గడుపుతాను.. ఎప్పుడో తెలుసా? అందరూ నిద్రపోయాక.. ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు.. ఈ ఫొటోల ముందు నిలుచుకుని.. వాళ్లని నిన్ను తలుచుకుంటూ అయ్యో భగవంతుడా? ఏం చేశావయ్యా.? ఏం తిందో? ఎలా ఉందో? అని ఏడ్చీ ఏడ్చీ ఏడవడానికి శక్తి లేనప్పుడు అప్పుడు వెళ్లి పడుకుంటానమ్మా.. ఏ తెల్లవారు జామునో.. నువ్వే శౌర్యవని హిమ చెప్పినప్పుడు ఎంత సంతోషపడ్డానో తెలుసా? నా మనవరాలు వస్తుంది.. తాతయ్యా అని గట్టిగా హత్తుకుంటుంది. రోజులు తరబడి కబుర్లు చెబుతుంది అనుకున్నాను.. కానీ ఇలా మాట్లాడుతుంది అనుకోలేదమ్మా అంటూ ఆనందరావు ఏడ్చేస్తాడు. దాంతో సౌర్య మనసు అల్లాడిపోతుంది.
సౌందర్య: దీనికీ నీకు వంద గొడవలు ఉండొచ్చే కానీ మధ్యలో మేమేం తప్పు చేశామే అని ఏడుస్తుంది సౌందర్య.
ఆనందరావు: వెళ్లిపోమ్మా.. వెళ్లిపో.. దూరంగా ఉండటం నీకు అలవాటు అయ్యిందేమో కానీ.. దూరం చేసుకోవడం, మరిచిపోవడం మాకు ఇంకా తెలియదమ్మా.. నువ్వు కనిపించనప్పుడు రోజు ఆ దేవుడ్ని నా మనవరాలు నా ఇంటికి వచ్చేలా చెయ్.. అని కోరుకునేవాడ్ని. ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే.. దేవుడా నేను పోయాక నా మనవరాలు నా ఇంటికి వచ్చేలా చెయ్ అని కోరుకుంటానమ్మా. అంటాడు ఆనందరావు ఏడుస్తూ.
సౌందర్య: ఏమండీ.. ఏంటా మాటలు
ఆందరావు: ఇంకేం మాట్లాడాలి సౌందర్యా
శౌర్య: నేను వెళ్తాను
సౌందర్య: ఇంత చెప్పినా నీ మనసు కరగలేదా
శౌర్య: ఉండు అనగానే ఉండిపోవాలా? నా ఆటో తెచ్చుకోవాలి కదా? నా లగేజ్ తెచ్చుకోవాలిగా అంటుంది బుంగమూతి పెట్టి
శౌర్య ఉంటుందన్న మాట తెలియగానే ముగ్గురూ సంబరపడతారు... శౌర్యకి నిరుపమ్ బావతో పెళ్లిచేస్తే చాలు అంటుంది హిమ....
శౌర్య: ఇక్కడ ఉంటున్నాను కదా అని.. అన్ని మరిచిపోతాను అనుకోకండి.. నా బతుకు నాది.. నా ఆటో నాది.
హిమ: ఇన్ని ఉండగా మళ్లీ ఆటో నడపడం ఏంటీ
శౌర్య: నడుపుతాను.. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను.. నేను మారను.. నా కోపం తగ్గదు అంటూ తన ఫోన్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్తుంది.
Also Read: హిమ క్యాన్సర్ నాటకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శోభ, మరింత పగ పెంచుకున్న శౌర్య
చంద్రమ్మ, ఇంద్రుడు
జ్వాల లేని ఇల్లు ఇల్లే కాదు అన్నట్లుగా ఫీల్ అవుతారు. చాలా అల్లాడిపోతూ ఉంటారు. డాక్టరమ్మని అపార్థం చేసుకున్నాం..ఎంత మంచిదో కదా అనుకుంటారు. జ్వాలమ్మ లేకుండా ఇంట్లో ఉండలేకపోతున్నా...జ్వాలమ్మ ఎలా ఉందో ఏంటో చూడకుండా ఉండలేకపోతున్నా అని బాధపడతారు. అప్పుడే చంద్రమ్మకు కడుపు నొప్పి వస్తుంది. ఈ నొప్పి నన్ను ఎప్పుడో ఎత్తుకుని పోయేలా ఉంది అంటుంది. ట్యాబ్లెట్స్ తేవడానికి ఇంద్రుడు వెళతాడు...
స్వప్న-శోభ
స్వప్న దగ్గరకు వెళ్లిన శోభ.. తను తెచ్చిన రిపోర్ట్ స్వప్న చేతిలో పెట్టి.. ‘ఆంటీ హిమ గురించి మీకు ఓ నిజం తెలియాలి.. ఇది చూస్తే ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలుస్తుంది..’ అని రిపోర్ట్స్ ఇచ్చి వెళ్లిపోతుంది. అవి చూసిన స్వప్న షాక్ అవుతుంది. ( ఆ రిపోర్ట్ చూశాక హిమకు క్యాన్స్ర్ లేదని తెలిస్తే స్వప్నాంటీ ఏం చేస్తుందో అనుకుంటూ శోభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది)
అటు హిమ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటుంది. శౌర్య ఇంటికి వచ్చినందుకు సంతోషించాలో, నాపై కోపం తగ్గలేదని బాధపడాలో అర్థంకావడం లేదు. ఏదైతే ఏం...శౌర్యని ఇంటికి తీసుకురాగలిగాను. నా ముందున్న లక్ష్యం ఒక్కటే శౌర్యకి నిజం చెప్పి నాపై కోపం తగ్గించాలి అనుకుంటుంది. తల్లిదండ్రుల ఫొటోల దగ్గరకు వెళ్లి శౌర్య మనింట్లో అడుగుపెట్టింది, ఎన్నో ఏళ్ల తర్వాత మనింట్లోకి వచ్చింది..ఎలాగైనా శౌర్య మనసు మార్చాలి మారుస్తాను....రూమ్ డోర్ తీసి చూస్తుంది...శౌర్య గదిలో లేదేంటి అని అడిగితే..లగేజ్ తెచ్చుకుంటానంది కదా అందుకోసమే వెళ్లి ఉంటుంది అంటుంది సౌందర్య. ఏం జరిగిందో చెప్పేస్తాను నానమ్మా అంటే...సందర్భం చూసుకుని చెప్పకపోతే నిజం అబద్ధం అవుతుందంటుంది. శౌర్య మనసులో కోపాన్ని తగ్గించి తనకు దగ్గరవుతాను..నా చిన్నప్పటి శౌర్య నాక్కావాలి....ఎపిసోడ్ ముగిసింది....