అన్వేషించండి

Karthika Deepam జులై 9 ఎపిసోడ్ 1400: హిమ క్యాన్సర్ నాటకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శోభ, మరింత పగ పెంచుకున్న శౌర్య

Karthika Deepam july 9 Episode 1400: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీకదీపం జులై 9 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam july 9 Episode 1400)

హిమను బయటకు గెంటేసిన తర్వాత  పిన్ని చంద్రమ్మ-బాబాయ్ ఇంద్రుడికి జరిగినదంతా చెబుతుంది. వాళ్లు అంతలా బతిమలాడుతున్నారు వెళ్లొచ్చుకదా అని చంద్రమ్మ అనడంతో ఆ మాట అనొద్దు అంటుంది జ్వాల...
జ్వాల:  మీరు కూడా వేరుచేస్తున్నారా, బంధాలు లేవు, అంతా స్వార్థపరులే..నాకు నా అనేవాళ్లు ఉన్నారో లేరో తెలియనప్పుడే , నా పేరోంటో కూడా చెప్పకపోయినా నన్ను దగ్గరకు తీసుకున్నారు, మీ బిడ్డలా చూసుకున్నారు. ఎప్పటికీ మిమ్మల్ని వదిలివెళ్లను అని చెబుతుంది.
చంద్రమ్మ: నువ్వు పెద్దింటి బిడ్డవి, పేదింట్లో పెంచాను ఇప్పటికైనా అక్కడకు వెళ్లమ్మా
జ్వాల: ఇల్లు పెద్దవే కానీ మనసులు ఇరుకు...మన ఇల్లులు ఇరుకైనా మనసులు పెద్దవి. ఇంకోసారి నన్ను మీరు వెళ్లమని అనొద్దు నేను మీతోనే ఉంటాను. నీళ్లు లేకుండా చేప బతకలేనట్టు..ప్రేమలేని దగ్గర నేను బతకలేను పిన్నీ

Also Read: రాత్రంతా జ్వాల(శౌర్య) ఇంటి ముందే వర్షంలో నిల్చున్న హిమ, తాతయ్య-నానమ్మ కన్నీళ్లకు కరగని శౌర్య

స్వప్న వంటచేస్తుండగా నిరుపమ్ అక్కడకు వెళతాడు. 
నిరుపమ్: మనం ఇంకా పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు లేం. అలా చూస్తావేంటి..వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాం కానీ వంట సంగతేంటి. పెళ్లి గ్రాండ్ గా చేయాలి
స్వప్న: సరేలేరా 
నిరుపమ్: సరే అంటావేంటి మమ్మీ...స్వప్న-సత్యం ఇంట్లో పెళ్లి ఇంత బాగా చేశారు అనుకోవాలి అంతా
స్వప్న: ఈ పెళ్లికి ఇంత హడావుడి అవసరమా
నిరుపమ్: హిమకు ఏమైనా అవుతుందని బాధపడుతున్నావా...హిమకు ఏమీ కాకుండా చూసుకుంటాను..ఇదంతా హిమపై జాలితో కాదు..ప్రేమతో చేస్తున్నాను
స్వప్న: రెండు నెలల్లో పోతుందనుకుంటే..దాన్ని బతికించుకుంటానంటున్నాను అంటాడేంటి..అదే జరిగితే హిమ పర్మినెంట్ గా నా కోడలు అయిపోతుంది.. అలా జరగడానికి వీల్లేదు...
అటు సౌందర్య ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఆనందరావుకి ఇస్తుంది..
ఆనందరావు: మనసు ప్రశాంతంగా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా..
సౌందర్య: హిమ ఇంకా ఇంటికి రాలేదు...శౌర్య మనసు మార్చి తీసుకొస్తానంది
ఆనందరావు: నేను పెద్దవాడిగా వెళ్లి అడిగాను..రాలేదు...ఇప్పుడు కూడా అంతే...హిమ నమ్మక ద్రోహం చేసిందని శౌర్య నమ్ముతోంది
సౌందర్య: అంత ప్రేమించే హిమను..అంతకుమించి ద్వేషిస్తోంది శౌర్య..
ఆనందరావు: హిమ ప్రయత్నం చేస్తోందే కానీ అది అయ్యే పనిలా కనిపించలేదు..టైం చాలా అయింది...ఓసారి హిమకు కాల్ చేయలేకపోయావా
సౌందర్య: చేస్తూనే ఉన్నాను స్విచ్చాఫ్ వస్తోంది..వర్షం ఎక్కువైందని ఎక్కడైనా ఆగిందేమో... మీరు ఎక్కువ ఆలోచించకండి..

Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్

అప్పుడే ఆటో చొక్కా వేసుకుని బయలుదేరుతున్నావ్...రెండు ముద్దలైనా తినేసి వెళ్లు అని ఇంద్రుడు-చంద్రమ్మ బతిమలాడుతారు. చాలా బావుంది దోసకాయ పచ్చడి తినివెళ్లు అని ఠక్కున ఇంద్రుడు అనడంతో పచ్చడే చేయాలా అని మండిపడుతుంది( దోసకాయ పచ్చడి అంటే హిమకు ఇష్టం). నేను తోడుగా రానా అని ఇంద్రుడు అంటే..డబ్బులేమైనా అవసరమా అంటుంది. వద్దులే అని చెప్పేసి డోర్ తీస్తుంది.... వర్షంలో బయట తడుస్తూ హిమ నిలబడి ఉంటుంది...
శౌర్య: ఏయ్ నువ్వేంటి ఇంటికి వెళ్లకుండా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా. నీకు పిచ్చెక్కిందా, వేషాలేస్తున్నావా
హిమ: వేషాలు, మోసాలు నాకు అలవాటు లేదు
శౌర్య: ఇలా చేస్తే జాలిపడతాను అనుకుంటున్నావా..ఇంటి ముందు నిల్చుని ఎవర్ని సాదిద్దామని..
హిమ: లోపలకు వెళదాం చాలా చలి వేస్తోంది...
శౌర్య: ఇంట్లోకి ఎందుకు..మీ ఇంటికే వెళదాం...
హిమ: నాపై కోపం పోవాలంటే ఒక్కసారి నేను చెప్పేది విను...
శౌర్య: నీ మాట వినేది లేదు..నా జీవితాన్ని నాశనం చేశావ్... ఇల్లెక్కడో చెప్పు దించేసి వస్తాను... 
హిమ: మన ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నావా..ఇది ఎంత విచిత్రమో కదా
శౌర్య: ఇంతకన్నా విచిత్రాలు జీవితంలో చాలా జరిగాయి...మీ ఇంటికి దారి చెప్పు...ఇంకేం మాట్లాడకు...

స్వప్న-శోభ ఇద్దరూ డిస్కషన్ పెట్టుకుంటారు
స్వప్న: ఏం ఆలోచిస్తున్నావ్ మాట్లాడవేంటి
శోభ: మీరు చెప్పింది వింటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అసలు నిరుపమ్ అలా ఎలా ఆలోచిస్తున్నాడు
స్వప్న: ఏం చేసైనా హిమను బతికించుకుంటానంటున్నాడు
శోభ: బతికించుకోవడం ఏంటి..అది బతుకుతుంది..దానికి క్యాన్సర్ లేదు ..ఈ విషయం మీకు చెప్పలేను. హాస్పిటల్ అప్పులు తీర్చుదామని నిరుపమ్ ని పెళ్లిచేసుకుందాం అనుకున్నాను... ఇప్పుడు ఆ ఆశలేదు అనుకుంటూ... వెళతాను ఆంటీ నాకేం అర్థం కావడం లేదంటుంది... ( నిరుపమ్ ని దక్కించుకోవాలంటే నేను గట్టి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుంది)
స్వప్న: ఈ శోభ ఏంటి ఇలా ఉంటుంది..ఈ మధ్య దీని ప్రవర్తన అస్సలు అర్థంకావడం లేదు...

Also Read:డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!

హిమను ఇంటి దగ్గర దించేసి లోపలకు  వెళ్లకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోతుంది శౌర్య... పరాయిదానిలా అలా వెళ్లిపోతావేంటని హిమ చెబుతున్నా.. నాకు  ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదంటుంది. నేను నిన్ను మోసం చేయలేదు నమ్ము అని హిమ చెప్పేందుకు ప్రయత్నించినా శౌర్య అస్సలు వినదు. హిమ: నువ్వు లోపలకు వస్తే నానమ్మ, తాతయ్యలు సంతోష పడతారు
శౌర్య: మీ సంతోషమే కానీ నా సంతోషం కోసం ఆలోచించడం లేదు.  ఇక్కడి వరకూ వచ్చింది నీపై ప్రేమ, జాలి కాదు...మా ఇంటి ముందు దిష్టిబొమ్మలా నిల్చుంటే చూడలేక తీసుకొచ్చాను...
హిమ: నువ్వు రాకపోతే నేను ఈ ఇంటికి కూడా వెళ్లను ఇక్కడే ఇలా నిల్చుంటాను
శౌర్య: ఎవర్ని బెదిరిస్తావ్.... అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది... ఎపిసోడ్‌ ముగిసింది

సోమవారం ఎపిసోడ్ లో
శౌర్యను కలిసిన శోభ..హిమ గురించి మరింత నెగిటివ్ గా చెబుతుంది. నువ్వు డాక్టర్ సాబ్ ని ప్రేమిస్తున్నావ్ అని తెలిసిన తర్వాత తనకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకుందంటుంది. శోభను లాగిపెట్టి కొడుతుంది శౌర్య.  మరోవైపు జ్వరంతో ఉన్న శౌర్య దగ్గరకు కంగారుగా వస్తుంది హిమ....నేను మోసపోయాను పిన్నీ అని కలవరిస్తున్న శౌర్యని చూసి హమ బాధపడుతుంది...

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 25th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  కోర్టుకు వచ్చిన శరత్‌ చంద్ర – డమ్మీ కోర్టు అని నమ్మిన సూర్య, అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌:  కోర్టుకు వచ్చిన శరత్‌ చంద్ర – డమ్మీ కోర్టు అని నమ్మిన సూర్య, అపూర్వ
Nindu Noorella Saavasam Serial Today October 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మను గురించి నిజం చెప్పిన ఎస్సై – అమర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మను గురించి నిజం చెప్పిన ఎస్సై – అమర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర సిరి కూతురేనా.. అనుమానాలకు పద్మాక్షి చెక్ పెడుతుందా! మహా మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర సిరి కూతురేనా.. అనుమానాలకు పద్మాక్షి చెక్ పెడుతుందా! మహా మాస్టర్ ప్లాన్!
Nindu Manasulu Serial Today October 24th: నిండు మనసులు: ప్రేరణ, గణల ఎమోషనల్ సీన్! అన్నగా అండగా ఉంటానంటూ ప్రామిస్! విజయానంద్‌కి వణుకు!
నిండు మనసులు: ప్రేరణ, గణల ఎమోషనల్ సీన్! అన్నగా అండగా ఉంటానంటూ ప్రామిస్! విజయానంద్‌కి వణుకు!

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Embed widget