అన్వేషించండి

Karthika Deepam జులై 7 ఎపిసోడ్ 1398: డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!

Karthika Deepam july 7 Episode 1398: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీకదీపం జులై 7 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam jly 7 Episode 1398) 

హిమ -తింగరి ఒకటే అని జ్వాలకు నిజం తెలిసిపోవడంతో ఇంటికొచ్చి కోపంతో ఊగిపోతుంది. చివరికి నానమ్మ-తాతయ్య కూడా మోసం చేశారని బాధపడుతుంది. శౌర్య ఎలా ఉందో ఏంటో అనుకుంటూ సౌందర్య కారు వెనక్కు తిప్పుతుంది. జ్వాల ఇంటి ముందు సౌందర్య వాళ్ల కారు ఆగుతుంది. కంగారుగా దిగిన హిమ, సౌందర్య, ఆనందరావులు.. ఇంటి ముందు ఆటో తిరగబడి ఉండడం చూసి కంగారుగా లోపలకు వెళతారు. ఇక్కడే ఇలా ఉందంటే లోపల సౌర్య పరిస్థితేంటో నాన్నమ్మా భయంగా ఉంది అంటుంది హిమ. వెంటనే లోపలికి పరుగుతీస్తారు ముగ్గురు. శౌర్యా అంటూ  దగ్గరకు వెళ్లబోతున్న హిమను...హేయ్ ఆగు అని అంటుంది కోపంగా శౌర్య. అప్పటికే శౌర్య బ్యాగులో బట్టలు సర్దుకుంటుంది. 

జ్వాల(శౌర్య): ఎవరు మీరు? నా ఆటో బాలేదు.. నాకు బాలేదు.. సవారీకి రాలేను’ అంటుంది 
సౌందర్య: మేము ఆటో కోసం వచ్చామనుకుంటున్నావా?
జ్వాల: మరి దేని కోసం వచ్చారు? నా పేరు జ్వాల. ఆటో జ్వాల. ఇక్కడ అంతా నన్ను ఇలానే అంటారు. మీరు వెళ్లొచ్చు 
సౌందర్య: శౌర్యా  ఎందుకే ఎందుకే మమ్మల్ని ఇలా గుండె కోత కోస్తావ్?
జ్వాల: అరెరే.. ఎంత గొప్ప మాట అన్నారండి.. గుండె కోత? అది గుండె ఉన్నవారికి కదా? మీకు ఎలా వర్తిస్తుంది.? నాకు తెలుసు.. గుండె కోత అంటే ఏంటో..’‘చూడమ్మా మేమంతా’ అంటూ ఆనందరావు ఏదో చెప్పబోతుంటే.. ‘హా.. మీరంతా ప్లాన్ చేసుకుని, కూడబలుక్కుని నా దగ్గరకు వచ్చారా? ఇంకేం మిగిలిందని? అంతా కొలాప్స్ కదా? జీవితమే మటాష్ కదా? అందుకే బట్టలు సద్దుకుంటున్నా’
ఆనందరావు:  ఎక్కడికి వెళ్తున్నావ్
జ్వాల: మోసాలు కుట్రలు లేకుండా మనుషులు ఎక్కడైనా ఉన్నారేమో వెతికి.. అక్కడికి వెళ్తాను... నవ్వుతూ గొంతు కోసే నంగనాచి మనుషులు లేని చోటికి వెళ్తాను.. నేను వెళ్లే చోట మోసం చేసే వాళ్లు ఉన్నా కచ్చితంగా ఇంత ద్రోహం చేసేవాళ్లు ఉండరనే అనుకుంటున్నాను’ అంటుంది సౌర్య. ‘మేమంతా ఇక్కడ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావే’ అంటుంది సౌందర్య బాధగా. ‘మీరు ఎక్కడ ఉన్నారనే వెళ్తున్నానండి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గారు’
ఆనందరావు: శౌర్యా ఈ తాతయ్య అంటే నీకు ఇష్టం కదా? మరి వదిలేసి మళ్లీ వెళ్తావా?
జ్వాల: తాతయ్యా.. నాన్నమ్మా.. వినడానికి, అనడానికి ఎంతో బాగున్నాయి కదా ఈ బంధాలు..? మరి నేను లంచ్ బాక్స్‌లు ఆటోలో తెస్తుంటే.. చూస్తూ పట్టనట్టే ఉంటారు. ఆటోలో కూర్చుంటారు డబ్బులు ఇస్తారు. కష్టపడుతున్నా పట్టనట్లే ఉన్నారు కదా? పరాయి దానిలానే చూశారు కదా? ముగ్గురుకి ముగ్గురు గొప్పగా పోటీ పడి నటించారు. ఈవిడ (సౌందర్య) గోరు ముద్దలు తినిపించారు.. ఆవిడేమో(హిమ) ది గ్రేట్ డాక్టర్ కాస్తా ది గ్రేట్ యాక్టర్ అయ్యారు.. నా జీవితంలో ఊహించని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 
హిమ: శౌర్యా.. అసలు జరిగిందేంటో నీకు తెలియదు.. నీకు అంతా రివర్స్‌లో అర్థమైంది
జ్వాల:  మాట్లాడొద్దు.. ఆ మాత్రం తెలివి నాకు లేదా? అయినా నీతో నాకు మాటలేంటే?  నేను వెళ్తాను.. తప్పుకోండి అంటూ బ్యాగ్ అందుకుంటుంది. 
సౌందర్య: శౌర్యా ప్లీజ్ వెళ్లకే.. నువ్వు వెళ్తే ఎలానే అంటుంది ఏడుస్తూ. 
జ్వాల: ఎందుకు? హో నీ మనవరాలు పెళ్లి ఉంది కదా.. అప్పుడు నాకు పని ఇస్తావా? వచ్చేపోయే చుట్టాలని అటు ఇటు తిప్పాలా అంటుంది సౌర్య మరింత ఎమోషనల్‌గా.. అందరూ కలిసి నన్ను పని దానిలానే చూశారు
సౌందర్య:  ఏంటే ఆ మాటలు.. మేము అలా ఎందుకు చూస్తామే
జ్వాల: ఏం చూడలేదా? అలాంటప్పుడు ఆటో నడుపుకుంటుంది.. బాక్స్ అందిస్తుంది అని తెలిసి కూడా.. నన్ను సౌర్య అని గుర్తు పట్టి కూడా సౌర్యా అని అప్పుడే పిలిచి ఉంటే ఎంత సంతోషించేదాన్ని?
సౌందర్య: మమ్మల్ని అంటున్నావ్ కదా.. అదే పని నువ్వు ఎందుకు చెయ్యలేదు..? నాన్నమ్మా తాతయ్యా అని తెలిసి కూడా ఎందుకు పిలవలేదు?
జ్వాల:  సమాధానం చెప్పలేక ఇలా ప్రశ్నలు వేస్తున్నావా? నేను పిలవకపోవడానికి కారణం ఇదే అంటూ చేతి మీదున్న హెచ్(పచ్చబొట్టు) చూపిస్తుంది. మిమ్మల్ని నాన్నమ్మా తాతయ్యా అని పిలిస్తే మీరు తట్టుకోలేరు.. నేను తట్టుకోలేను.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇంటికి రావాలి.. ఇంటికి వస్తే దీన్ని చూడాలి.. దీన్ని చూస్తే నాకు కోపం ఆగదు.. ఏం చేస్తానో నాకే తెలియదు.. అంత కోపం...’ 
సౌందర్య: సరే దాని మీద కోపం మా మీద ఎందుకు చూపిస్తున్నావ్
జ్వాల: ఆహా.. మీకేం తెలియదా? మీకు ఏ సంబంధం లేదా? మరి ఇన్నేళ్లలో నాకోసం ఎన్ని రోజులు వెతికారు? ఏ ప్రయత్నాలు చేశారు? చెయ్యలేదు కదా? ఇన్నేళ్లు లేని ప్రేమ ఒక్కసారిగా పొంగిపొర్లినట్టు మొన్నటికి మొన్న బొమ్మలు గీయించడాలు చేశావ్.. నేను వేరే నంబర్ నుంచి కాల్ చేస్తే.. మీరు అక్కడికి వచ్చారు.. టవర్ సిగ్నల్ వచ్చిన ప్లేసులో వచ్చారు. వెతికారు’ . మీకు ప్రేమ ఉంటే వెతికేవారు. నేను కోరుకున్న డాక్టర్ సాబ్ ని అది పెళ్లిచేసుకుంటోంది.  కొత్త కొత్త కథలు చెప్పు....
హిమ: అయ్యో శౌర్యా అసలు విషయం నీకు తెలియదు
జ్వాల: ఇక నోరుముయ్యవే... ఈరోజు నుంచి మీకు నేను కనిపించను..హాయిగా ఉండండి

Also Read: తనను ప్రేమించిన రౌడీబేబీనే శౌర్య అని నిరుపమ్ కి తెలుస్తుందా, సౌందర్యకి జ్వాల ఏం సమాధానం చెబుతుంది!

సౌందర్య: ఇంటికి వెళదాం పద...అన్నీ వివరంగా చెబుతాను
జ్వాల: అది నీ ఇల్లు...నా ఇల్లు కాదు... నా వాళ్లు అక్కడ ఎవరూ లేరు...ఈ రమ్మనేది ఏదో ముందుగా రమ్మంటే ఆలోచించేదాన్నేమో..అందరి ముందూ అవార్డ్ ఇచ్చేటప్పుడు ఈ డాక్టర్ గారి పేరు చెప్పి మీ మనవరాలు అని చెబితే అప్పుడు నాకు తెలిసింది. లేకపోతే ఈ దాగుడుమూతల ఆటని మీరు ఇంకెన్నాళ్లు ఆడేవారో..
సౌందర్య: అందర్నీ కాదని ఎక్కడికి వెళతావ్, ఎలా ఉంటావ్
జ్వాల: అందర్నీ కాదనుకుని ఇన్నాళ్లూ బతకలేదా...ఏ సంబంధం లేకపోయినా పిన్నీ, బాబాయ్ ప్రేమగా చూసుకున్నారు..వాళ్లు గొప్పవాళ్లంటే...వాళ్లది ప్రేమంటే...ఏసీ రూముల్లో కూర్చుని శౌర్య రాలేదని ఏడాదికి ఓసారి బాధపడడం కాదు ప్రేమంటే... 
బ్యాగు తీసుకుని వెళ్లిపోతున్న శౌర్యని...సౌందర్య, ఆనందరావు, హిమ బతిమలాడుతారు... 
జ్వాల: నేను ఉండను...మీరు వద్దు..మీ బంధుత్వం వద్దు..ఈ ఊర్లో నేను ఉండను గాక ఉండను.
సౌందర్య: మీ అమ్మా నాన్నలపై నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడే ఉండిపో..ఇక్కడే ఉంటే అప్పుడప్పుడు కనీసం కళ్లతో అయినా చూసుకుంటాం..ఉండిపోవే...నువ్వెళితే మీ అమ్మా నాన్నల ఆత్మలు కూడా శాంతించవు..వాళ్లని కష్టపెట్టిన దానివి అవుతావ్... ప్లీస్...ఉండిపో...
జ్వాల: సరే నేను ఇక్కడే ఉంటాను..మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి...చచ్చిపోయిన అమ్మా నాన్నల ఆత్మలు అడ్డుపెట్టుకుని ఆపుతున్నారు..వెళ్లండి...మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టి తలుపేసుకుంటుంది.
సౌందర్య, ఆనందరావు, హిమ అక్కడి నుంచి వెళ్లిపోతారు....

Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!

అప్పుడే ఇంటికి వచ్చిన ఇంద్రుడు, చందమ్మ ఇంటిముందు ఆటో పడి ఉండడం చూసి కంగారుగా లోపలకు వెళతారు. జ్వాల ఏడుస్తూ కూర్చోవడం చూసి ఏమైందో అని టెన్షన్ పడతారు. ఏమైంది, ఎవరైనా వచ్చారా, గొడవ జరిగిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఊరు నుంచి రాగానే మాకు ఏదైనా శుభవార్త చెబుతావని సంబరపడుతూ వచ్చాం అన్న పిన్ని చంద్రమ్మతో... వార్తలే ఉన్నాయి శుభవార్తలు లేవు అంటుంది. ఏమైందో చెప్పమ్మా మాకు భయం వేస్తోందంటారు. అప్పటివరకూ ధైర్యాన్ని తెచ్చిపెట్టుకున్న శౌర్య..చంద్రమ్మను చూడగానే ఏడుస్తుంది...

రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
శౌర్య కోసం హిమ వచ్చి వంటచేస్తుంటుంది. పిన్నీ అంటూ లోపల అడుగుపెట్టి హిమని చూసిన శౌర్య..కోపంగా బయటకు నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదన్న హిమ... డాక్టర్ సాబ్ తో నీకు పెళ్లిచేసేబాధ్యత నాది...అని మళ్లీ మాటిస్తుంది.

Also Read: సాక్షితో షికార్లు చేస్తున్న రిషిని చూసి హర్ట్ అయిన వసు - దేవయాని విషపు ఆలోచన పసిగట్టేసిన జగతి, మహేంద్ర

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Citadel Honey Bunny First Review: 'సిటాడెల్: హనీ బన్నీ' ఫస్ట్ రివ్యూ... సమంత లేటెస్ట్‌ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'సిటాడెల్: హనీ బన్నీ' ఫస్ట్ రివ్యూ... సమంత లేటెస్ట్‌ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Imane Khelif: ఆమె కాదు అతడే, ఇమాన్‌ ఖలీఫ్‌ మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఆమె కాదు అతడే, ఇమాన్‌ ఖలీఫ్‌ మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Embed widget