Karthika Deepam జులై 5 ఎపిసోడ్: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!

Karthika Deepam july 5 Episode 1396: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం డాక్టర్ సాబ్ నిరుపమ్ పెళ్లిచుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం జులై 5 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam jly 5 Episode 1396) 

హిమ-నిరుపమ్ బయటకు వెళతారు. సోమవారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది. మంగళవారం ఎపిసోడ్ వీళ్లిద్దరి డిస్కషన్ తోనే మొదలైంది. 
నిరుపమ్:  నీ మొహంలో చిరునవ్వు కనిపించడం మానేసింది . నువ్వు ప్రతిక్షణం ఆస్వాదించాలి 
హిమ: శౌర్యతో నీ పెళ్లి జరిగితేనే నాకు ఆనందం అనుకుంటుంది
నిరుపమ్:  జ్వాల ఇచ్చిన నోటు ఖర్చు చేద్దాం అంటే అస్సలు వదలడం లేదు అనుకుంటూ కొబ్బరి బొండాం తాగిన దగ్గర  500 రూపాయల నోటు ఇస్తాడు. చిల్లర లేదని చెప్పడంతో తప్పక తన దగ్గరున్న మనీ ఇస్సాడు.
హిమ: చేంజ్ ఉన్నా కానీ 500 ఎందుకు ఇచ్చావ్
నిరుపమ్: వదిలించుకుందాం అని చూస్తున్నా కొన్ని వదలవ్...కొందరు మనుషులు కూడా అంతే కదా
హిమ: శౌర్యని వదిలించుకుందాం అని అస్సలు అనుకోకు

అటు శోభకి కాల్ చేసిన బ్యాంక్ వాళ్లు...లోన్ మొత్తం కట్టకపోతే మీ ఆస్తులు సీజ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తారు. కాల్ కట్ చేసిన శోభ.. బ్యాంక్ లోన్స్ అన్నీ పెద్ద తలనొప్పిగా మారాయి. నా స్థాయికి మించి లోన్ పెట్టి హాస్పిటల్ కట్టాను, నిరుపమ్ ని పెళ్లిచేసుకుంటే కానీ ఈ లోన్లు తీరవు. ఈ అడ్డంకులు అన్నీ ఎలా దాటాలి అనుకుంటుంది.

Also Read: జ్వాలకి మరో ఇద్దరు శత్రువులు, నిరుపమ్-శౌర్యని ఒక్కటి చేసేందుకు హిమ ఏం చేయబోతోంది!

మరోవైపు హైదరాబాద్ క్లబ్ వాళ్లు శౌర్యకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇక్కడకు నన్నెందుకు తీసుకొచ్చారు నానమ్మా అని అడుగుతుంది హిమ. ఒంటరిగా తిరిగితే నీలా అయిపోతారు, అందుకే అందర్లోకి తీసుకొచ్చాం అంటుంది సౌందర్య. ఇక్కడకు శౌర్య కూడా వస్తే బావుంటుంది కదా నానమ్మా అంటుంది హిమ. ఆ రోజు కూడా రావాలని కోరుకుందాం అని రిప్లై ఇస్తుంది సౌందర్య. అవార్డు ఇచ్చేందుకు వెదికపైకి సౌందర్య, ఆనందరావుని ఆహ్వానిస్తారు.  ధైర్యం గురించి సౌందర్య స్టేజ్ పై మాట్లాడుతుంటగా...అసలు ధైర్యం అంటేనే శౌర్య...ఈ అవార్డ్స్ అన్నీ శౌర్యకి ఇవ్వాలి అనుకుంటుంది హిమ. అంతలో జ్వాల(శౌర్య) ఎంట్రీ ఇస్తుంది. జ్వాల: నానమ్మ, తాతయ్యలను ముఖ్య అతిథిలుగా పిలిచారా..వచ్చే ఉంటారులే సౌండ్ పార్టీలు కదా... హిమ కూడా వచ్చిందా..ఇచ్చే ఉంటారులే డాక్టర్ కదా... అయిన ఇది ఇక్కడ ఉండగా నేనిక్కడ ఉండటం అవసరమా అనుకుంటూ వెనుతిరిగి వెళ్లిపోతూ మళ్లీ ఆగుతుంది. నేనేం తప్పుచేయలేదు కదా అనుకుంటూ కూర్చుటుంది. 
సౌందర్య, ఆనందరావు, హిమ వీళ్లంతా శౌర్యను చూసి ఆశ్చర్యపోతారు..తనెందుకు ఇక్కడికి వచ్చింది అనుకుంటారు....

Also Read: వసు వేసిన పూలదండ చూసి మురిసిన రిషి, పేపర్లో రిషిధార ఫొటో చూసిన దేవయాని-సాక్షికి షాకిచ్చిన జగతి-వసుధార

సేవా కార్యక్రమాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి  సౌందర్య చేతుల మీదుగా అవార్డ్స్ అందిస్తుంది. దొంగలను పోలీసులకు పట్టించిన ధైర్యశాలి జ్వాలను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అని అనౌన్స్ చేస్తారు. హిమ సంతోషంగా చప్పట్లు కొడుతుంటుంది. ఈ రోజు నేను ఇక్కడకు రావడమే మంచిది అయింది అనుకుంటుంది. నా మనవరాలు అని చెప్పుకోలేని దుస్థితి తీసుకొచ్చావ్ ఈశ్వరా అని సౌందర్య అనుకుంటుంది. ఆనందరావు, సౌందర్య ఇద్దరూ అభినందనలు చెబుతారు. 
సౌందర్య: ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు...ఓ రకంగా చెప్పాలంటే మేం ఇద్దరం ఫ్రెండ్స్. ఇలాంటి ధైర్యం ఉన్న యంగ్ ఫ్రెండ్ నాకు ఉన్నందుకు నేను గర్వ పడుతున్నాను
జ్వాల: సంతోషంగా చప్పట్లు కొడుతున్న హిమని చూసి మధ్యలో దీనికేంటో ఇంత  ఆనందం అనుకుంటుంది
సౌందర్య: నన్ను నానమ్మ అని పిలిస్తే సంతోషం..కానీ...సీనియర్ సిటిజన్ (సీసీ) అని పిలుస్తుంది. అయినా నాకు ఆనందమే. త్వరలోనే నానమ్మ అని పిలుస్తుందని ఆశిస్తున్నా అంటుంది సౌందర్య
జ్వాలకు అవార్డ్ అందించేందుకు యంగ్ డాక్టర్ వేదికపైకి రావాలని పిలుస్తారు నిర్వాహకులు. ట
హిమ: ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను..శౌర్య నన్ను ఎంత కోపంగా చూస్తోందో అనుకుంటూ ఇబ్బందిగా స్టేజ్ పైకి వెళుతుంది 
ఈమె ఎవరో కాదు..ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ సౌందర్య గారికి స్వయానా మనవరాలు డాక్టర్ హిమ అని ప్రకటిస్తారు....
తన శత్రువు హిమ...తింగరే అని తెలిసిన జ్వాల షాక్ లో ఉండిపోతుంది...
హిమ: ఇన్నాళ్లూ ఏం జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరిగింది అనుకుంటూ వేదికపైకి వెళుతుంది 
వేదికపైకి వెళ్లిన హిమను లాగిపెట్టి కొడుతుంది జ్వాల(శౌర్య).... ఆనందరావు, సౌందర్య షాక్ అవుతారు.... నువ్వు హిమవా, ఇన్నాళ్లూ నాకెందుకు చెప్పలేదని నిలదీస్తుంది. నిన్ను చంపేస్తాను , ఇంత మోసం చేస్తావా, నపక్కనే ఉన్నావ్, నా స్టోరీ తెలుసుకుంటావ్, నా శత్రువు గురించి చెబుతుంటే వింటావ్, నా ప్రేమను లాగేసుకుంటావ్, నా డాక్టర్ సాబ్ ని దూరం చేస్తావ్, పెళ్లి చేసుకుంటావ్, నువ్వు మహా మోసగత్తెవే ....
హిమ: శౌర్య నేను మొదటి రోజే చెప్పాలి అనుకున్నాను... 

Also Read:  హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్

Published at : 05 Jul 2022 08:04 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam july 5 Episode 1396

సంబంధిత కథనాలు

Hyper Aadi Sreemukhi : 'హైపర్' ఆది దెబ్బకు పరుగులు తీసిన శ్రీముఖి

Hyper Aadi Sreemukhi : 'హైపర్' ఆది దెబ్బకు పరుగులు తీసిన శ్రీముఖి

Gruhalakshmi August 6th Update: తప్పు ఒప్పుకున్న అనసూయ - తులసి విషయంలో నందుకు వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్

Gruhalakshmi August 6th Update: తప్పు ఒప్పుకున్న అనసూయ - తులసి విషయంలో నందుకు వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్

Devatha August 6th Update: రాధని ఆదిత్య ఇంటికి తీసుకెళ్తున్న మాధవ - రుక్మిణిని వెతికేందుకు సూరితో వెళ్తున్న దేవుడమ్మ

Devatha August 6th Update: రాధని ఆదిత్య ఇంటికి తీసుకెళ్తున్న మాధవ - రుక్మిణిని వెతికేందుకు సూరితో వెళ్తున్న దేవుడమ్మ

Guppedanta Manasu August 6th Update: విషం తాగబోయిన దేవయాని- సాక్షితో పెళ్ళికి రిషి ఒప్పుకుంటాడా? వామ్మో దేవయాని స్కెచ్ మామూలుగా లేదుగా

Guppedanta Manasu August 6th Update: విషం తాగబోయిన దేవయాని- సాక్షితో పెళ్ళికి రిషి ఒప్పుకుంటాడా? వామ్మో దేవయాని స్కెచ్ మామూలుగా లేదుగా

Karthika Deepam August 6th Update: నేను మోనిత సేమ్ టు సేమ్ అంటోన్న శోభ- సౌందర్య ఇంటికి పెళ్ళిపత్రికలతో వచ్చిన స్వప్న

Karthika Deepam August 6th Update: నేను మోనిత సేమ్ టు సేమ్ అంటోన్న శోభ- సౌందర్య ఇంటికి పెళ్ళిపత్రికలతో వచ్చిన స్వప్న

టాప్ స్టోరీస్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?