News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Karthika Deepam జులై 4 ఎపిసోడ్: జ్వాలకి మరో ఇద్దరు శత్రువులు, నిరుపమ్-శౌర్యని ఒక్కటి చేసేందుకు హిమ ఏం చేయబోతోంది!

Karthika Deepam july 4 Episode 1395: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం డాక్టర్ సాబ్ నిరుపమ్ పెళ్లిచుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం జులై 4 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam jly 4 Episode 1395) 

డాక్టర్ సాబ్ రిజెక్ట్ చేసిన బాధలో ఉన్న జ్వాల(శౌర్య)ని ఓదార్చేపనిలో ఉంటారు సౌందర్య, ఆనందరావు. 
జ్వాల: మా పిన్ని, బాబాయ్ వచ్చాక మొత్తం చెప్పేసి ఈ ఊరు వదిలేసి వెళ్లిపోతాను 
సౌందర్య-ఆనందరావు: నువ్వెళ్లిపోతే మేం ఏమైపోతాం చెప్పు...ప్రేమ విఫలమైందని వెళ్లిపోతే ఎలా
జ్వాల: నాపై మీకెందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్...నేనెవరో మీరెవరో..అనుకోకుండా కలిశాం..సీనియర్ సిటిజన్-యంగ్ మెన్ అని పిలుస్తాను. ఏదో రైల్లో ప్రయాణం చేసినట్టు స్నేహం కుదిరింది. ఎవరి స్టేషన్ రాగానే వాళ్లు దిగిపోవాలి. జీవితం కూడా అంతేకదా సీసీ...
సౌందర్య: అందరం అనుకోకుండా కలిశాం..నిన్ను చూస్తుంటే మా కుటుంబ సభ్యురాలిలా ఫీలయ్యాం...
జ్వాల: వీళ్లిద్దరికీ నేను ఎవరో తెలిసినట్టుంది..తెలిసే ఇలా ప్రవర్తిస్తున్నారా లేదా....అని ఆలోచనలో పడుతుంది జ్వాల
కట్ చేస్తే చీకటి పడేవరకూ ఆటోనడిపిన జ్వాల... లేట్ అవుతోంది ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటుండగా ఓ బేరం వస్తుంది. ఆటోలో కూర్చుని సిగరెట్ తాగుతుండగా వద్దని చెబుతుంది. తెల్లారేసరికి కోల్ కతా వెళ్లిపోతాం కదా అని...పోలీసులు ఈ ఐదు లక్షల కోసం కోల్ కతా రారు కదా... ఒక్కసారి ట్రైన్ ఎక్కాక ఎవ్వరూ మనల్ని పట్టుకోలేరు కదా అని మాట్లాడుకుంటారు. అదంతా విన్న జ్వాల నేరుగా వాళ్లని పోలీస్ స్టేషన్ కి తీసుకెళుతుంది. 
జ్వాల: ఐదు లక్షలు దొంగతనం చేసి తప్పించుకుని వెళ్లిపోతుండగా ఇక్కడకు తీసుకొచ్చాను 
పోలీసులు మెచ్చుకుంటారు...నీ పూర్తి పేరు, అడ్రస్ రాసిచ్చి వెళ్లమ్మా అని జ్వాలకి చెబుతారు. ఈ డబ్బు ఎవరిదో వాళ్లకి అప్పగిస్తాను అంటారు...
ఆ దొంగలిద్దరూ జ్వాలని కోపంగా చూస్తారు...

Also Read: వసు వేసిన పూలదండ చూసి మురిసిన రిషి, పేపర్లో రిషిధార ఫొటో చూసిన దేవయాని-సాక్షికి షాకిచ్చిన జగతి-వసుధార

మరో కస్టమర్ ని ఆటోలో తీసుకెళ్లిన జ్వాల..ఛేంజ్ కోసం అందర్నీ అడుగుతుంటుంది. డాక్టర్ సాబ్ కారెక్కుతుండగా చూసుకోకుండా అడుగుతుంది. నిరుపమ్ కూడా షాక్ అయి జ్వాలను చూస్తాడు. ( పరిచయం అయిన మొదటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటారు ఇద్దరూ). కార్లో కూర్చుని చూస్తున్న హిమ... ఎలా అయిపోయావు శౌర్య, నిరుపమ్ బావ నీపై ప్రేమ  లేదని చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థంకావడం లేదు అనుకుంటుంది. ఆ తర్వాత నిరుపమ్ చేంజ్ ఇచ్చాక థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. ఏదో ఒక అద్భుతం జరిగి వీళ్లిద్దరూ కలిస్తే బావుండును, వీళ్లిద్దరి పెళ్లైతే బావుండును అనుకుంటుంది హిమ. ఆ నోట్లను పదిలంగా చూసుకుంటుంది జ్వాల...
మరోవైపు ఇంట్లో కూర్చుని ఆలోచనలో పడిన ఆనందరావుని చూసి ఏంటండీ అలా కూర్చున్నారని అడుగుతుంది సౌందర్య
ఆనందరావు: ఇంత పెద్దింట్లో మనం ముగ్గురమే మిగిలాం... శౌర్యకి ఈ ఐశ్వర్యాన్ని అనుభవించే రాత రాయలేదు..కళ్లముందు కనిపిస్తున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. శౌర్య మనల్ని గుర్తుపట్టడం లేదా..గుర్తుపట్టికూడా ఎందుకు మనసు చంపుకుంటోంది..
సౌందర్య: తింగరే హిమ అని తిలిస్తే మొత్తం బయటపడిపోతుంది..మనకు తెలిసే ఇది చేశామని శౌర్య అనుకుంటే కథ మళ్లీ మొదటికి వస్తుంది. 
ఆనందరావు: శౌర్య మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుందా
సౌందర్య: దాని పేరు మార్చుకుంది..మనసులో మాట బయట పెట్టడం లేదు..ఈ దాగుడు మూతల ఆట ఇంకెన్నాళ్లు ఈశ్వరా....!

Also Read:  హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్

అటు జ్వాల ఇంట్లో కూర్చుని డాక్టర్ సాబ్ చేతివేళ్లు తాకిన నోట్లు అని వాటిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది....
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, ఇద్దరూ కలసి అధ్భుతంగా మోసం చేశారు కదా.. ఎన్ని ఊహించుకున్నాను, మీరు హాస్పిటల్ కి వెళితే మీ కారు నడపాలని, మీరు అమెరికా వెళితే మీతోపాటూ నేనూ రావాలని, మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాలని, డాక్టర్ సాబ్ భార్య అనిపించుకోవడం ఎంత గర్వంగా ఉంటుందో కదా అని సంబరపడ్డాను. తింగరి ఎలా మాట్లాడేది, ఎలా ఉండేది, నా బాధ్యత నా బాధ్యత అనేది నా జీవితాన్నే లాగేసుకుంది.ఈ నోట్లు డాక్టర్ సాబ్ అందించిన బహుమతా...వీటిని నేను ఖర్చుపెట్టను అనుకుంటూ ఆ నోట్లు దేవుడి దగ్గర పెడుతుంది. డాక్టర్ సాబ్ కి దూరంగా ఉండాలి అనుకున్నాను కానీ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను...ఇదంతా అబద్ధం అయితే బావుండేది కదా...అంతకు ముందు చెప్పినవన్నీ ఉత్తుత్తినే నువ్వంటే ఇష్టం అని చెబితే బావుండును. అయినా ఎంత పిచ్చిదాన్ని నేను, ఎంత అత్యాశ నాది...డాక్టర్ సాబ్ ని మర్చిపోక తప్పదు అనుకుంటుంది.....

తల్లిదండ్రుల ఫొటోల ముందు నిల్చున్న హిమ... మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ చాలా జరిగాయ్, వీళ్లిద్దర్నీ ఎలా కలపాలో నాకు తెలియడం లేదనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన నిరుపమ్...పద హిమా పెళ్లి షాపింగ్ చేద్దాం అంటాడు. ఈ షాపింగ్ ఇవన్నీ ఏంటని హిమ అడిగినా నువ్వేం మాట్లాడకు పద అని తీసుకెళతాడు. హాస్పిటల్లో మనబదులు వేరే డాక్టర్స్ హాస్పిటల్స్ చూసుకుంటారు పద అంటాడు. మనిద్దర్నీ శౌర్య చూసిన చూపు నాకింగా గుర్తుంది...మేం ఇద్దరం ఇలా తిరుగుతుంటే తను చాలా బాధపడుతుందని మనసులో అనుకుంటుంది హిమ. ఐ ప్రామిస్ యూ నాతో ఉన్న ప్రతిక్షణం నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తానంటాడు నిరుపమ్. 

Also Read:  హిమ-శౌర్య ఒక్కటయ్యారు, ఇక డాక్టర్ సాబ్ మనసు మార్చుకోక తప్పదేమో!

హైదరాబాద్ క్లబ్ నుంచి వస్తున్నాం అన్న ఇద్దరు వ్యక్తులు...మీ వివరాలు చెప్పండి అంటారు. ఎందుకు అని జ్వాల అడిగితే... ధైర్యంగా ఇద్దరు దొంగల్ని పట్టించారు కదా నీలాంటి ధైర్యవంతులకు అవార్డులు ఇస్తున్నాం.. మీడీటేల్స్ చెప్పండి అంటారు. ఇన్విటేషన్ ఇచ్చి వెళ్లిపోతారు. మరోవైపు హిమ-నిరుపమ్ బయటకు వెళతారు. నీ మొహంలో చిరునవ్వు కనిపించడం మానేసింది అని అడుగుతాడు. నువ్వు ప్రతిక్షణం ఆస్వాదించాలి అని అంటే..శౌర్యతో నీ పెళ్లి జరిగితేనే నాకు ఆనందం అనుకుంటుంది హిమ. జ్వాల ఇచ్చిన 500 రూపాయలు అక్కడ ఇచ్చేందుకు తీస్తాడు నిరుపమ్.... ఎపిసోడ్ ముగిసింది.... 

Published at : 04 Jul 2022 08:26 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam july 4 Episode 1395

సంబంధిత కథనాలు

Guppedantha Manasu ఆగస్టు 18 ఎపిసోడ్:  వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం

Guppedantha Manasu ఆగస్టు 18 ఎపిసోడ్: వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం

Janaki Kalaganaledu August 18th Update: జ్ఞానాంబ పెట్టిన షరతుల్లో జానకి మొదటి తప్పు చేసేసిందా? మల్లిక ఇరికించేసిందిగా

Janaki Kalaganaledu August 18th Update: జ్ఞానాంబ పెట్టిన షరతుల్లో జానకి మొదటి తప్పు చేసేసిందా? మల్లిక ఇరికించేసిందిగా

Karthika Deepam Serial ఆగస్టు 18 ఎపిసోడ్: శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్

Karthika Deepam Serial ఆగస్టు 18 ఎపిసోడ్: శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్

Gruhalakshmi August 18th Update: తులసి మీద అరిచిన సామ్రాట్, నీచంగా మాట్లాడిన లాస్య- ప్రేమ్ దగ్గరకి వెళ్లనని తేల్చి చెప్పిన శ్రుతి

Gruhalakshmi August 18th Update: తులసి మీద అరిచిన సామ్రాట్, నీచంగా మాట్లాడిన లాస్య- ప్రేమ్ దగ్గరకి వెళ్లనని  తేల్చి చెప్పిన శ్రుతి

Ennenno Janmalabandham August 18th Update: యష్ ఇంట ఖైలాష్ తుఫాన్ - భర్త ఇచ్చిన చీర కట్టుకుని మురిసిన వేద, యష్ కంటతడి

Ennenno Janmalabandham August 18th Update: యష్ ఇంట ఖైలాష్ తుఫాన్ - భర్త ఇచ్చిన చీర కట్టుకుని మురిసిన వేద, యష్ కంటతడి

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా