News
News
X

Karthika Deepam జూన్ 30 ఎపిసోడ్: హిమ-శౌర్య ఒక్కటయ్యారు, ఇక డాక్టర్ సాబ్ మనసు మార్చుకోక తప్పదేమో!

Karthika Deepam june 30th Episode 1392: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం డాక్టర్ సాబ్ నిరుపమ్ పెళ్లిచుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం జూన్ 30 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam june 30 Episode 1392)

హిమ, నిరుపమ్‌ల మధ్య.. అమ్మవారికి ముడుపు కట్టడం గురించి వాదన జరుగుతుంది. ‘నేను మన పెళ్లికి ఏ ఆటంకంలేకుండా ముడుపు కడతాను..’ అని నిరుపమ్ అంటే.. ‘నీకూ జ్వాలకి పెళ్లి కావాలని నేనూ మొక్కుకుంటూ ముడుపు కడతాను’ అని హిమ అంటుంది.  నిన్నటి ఎపిసోడ్ ఇక్కడే పూర్తై ...ఈ రోజు ( గురువారం) ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది. ‘నేను అనుకున్నదే జరుగుతుంది..’ అని నిరుపమ్.. ‘నా కోరికే బలమైనది’ అని హిమ మాట్లాడుకుంటూ ఉండగా పూజారి అటువైపు వెళతారు( దీప-కార్తీక్ పెళ్లిచేసిన వ్యక్తి) . హిమ-నిరుపమ్ ఇద్దరూ ఆయన్ని పిలిచి ఇద్దరం వేరు వేరు అభిప్రాయాలతో ముడుపు కడుతున్నాం ఎవరి కోరిక నెరవేరుతుందని అడిగితే...‘శుభం.. కట్టండి.. ఏది ప్రాప్తం ఉంటే అదే జరుగుతుంది’అంటారాయన. దాంతో ఇద్దరూ ముడుపు కట్టడానికి వెళ్తారు. మరోవైపు ఆటోలో వ్యక్తిని గుడి దగ్గర దింపిన జ్వాల... ఆయన కవర్ మరిచిపోవడంతో ఇచ్చేందుకు లోపలకు వెళుతుంది. 

ఇద్దరూ ముడుపుకట్టేందుకు వెళతారు..నేను కడుతున్నా కదా హిమా నువ్వు కట్టొద్దు అంటాడు నిరుపమ్....లేద బావా జ్వాలని నిన్ను కలపాలని నేను కడతా అంటుంది హిమ. వాళ్లిద్దర్నీ చూసిన జ్వాల అక్కడే నిల్చుటుంది.... ‘మనం కలవాలన్నదే నా కోరిక.. ఇదే కోరికతో నేను ముడుపు కడుతున్నాను’ అంటాడు నిరుపమ్. ‘లేదు.. నా మనసులో కోరికే నిజమవుతుంది చూస్తూ ఉండు’ అంటుంది హిమ. ఆ మాట విన్న జ్వాల.. ‘ఏం కోరుకున్నావే మనసులో.? నా జీవితాన్ని నాశనం చేసి.. రాత్రి కూడా ఎంత నాటకం ఆడావే?’ అనుకుంటూ రగిలిపోతుంది. ఇక్కడ కూడా హిమని అపార్థం చేసుకుని జ్వాల వెళ్లిపోతుంది. అటు హిమ-నిరుపమ్ మాత్రం జ్వాలని చూడరు.

Also Read: హిమ కోసం డాక్టర్ సాబ్, శౌర్య కోసం హిమ అమ్మవారికి ముడుపులు, ఎవరి కోరిక నెరవేరుతుంది !

కట్ చేస్తే.. 
ఆనందరావు, సౌందర్యలు హిమ, శౌర్యలను కలపడం గురించి మాట్లాడుకుంటారు. వాళ్లని కలిపే క్రమంలో మనం శౌర్య దృష్టిలో మోసగాళ్లుగా మిగిలిపోతామేమో.. జాగ్రత్తగా ఉండాలి’ అనుకుంటారు. అటు హిమ ఏవో ఆలోచనల్లో ఉంటూ డాక్టర్స్ కూర్చునే ప్లేస్ లో కాకుండా పేషెంట్స్ కూర్చునే ప్లేస్ లో కూర్చుంటుంది. అది చూసిన నిరుపమ్.. తన క్యాబిన్‌కి వెళ్లిపోయి రిసెప్షన్‌కి కాల్ చేసి ఏదో చెబుతాడు. రిసెప్షనిస్ట్ నర్స్ ని పంపిస్తుంది. ‘హిమా.. హిమా.. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు’ అంటుంది. వెంటనే సారీ చెప్పి ‘నిరుపమ్ గారు అలానే పిలవమ్మారు మేడమ్’ అంటుంది. వెంటనే హిమ నిరుపమ్ క్యాబిన్‌కి వెళ్తుంది.
నిరుపమ్: ‘కూర్చోండి హిమా.. ఏంటి మీ ప్రాబ్లమ్’
హిమ: ‘ఏంటి బావా ఇది.. బయట తనేమో పేషెంట్‌ని పిలిచినట్లు పిలుస్తుంది. నువ్వేమో ఇలా?’
నిరుపమ్:  ‘ఊరికే హిమా.. నువ్వు పేషెంట్స్ కూర్చునే చోట కూర్చున్నావ్ కదా.. అందుకే ఆటపట్టిద్దామని’
హిమ: ‘నేను నిజంగానే పెషెంట్‌నే కదా బావా?’
నిరుపమ్: సారీ  హిమా... ‘హిమా నీ టెన్షన్‌కి ఆ జ్వాలే కారణం అనిపిస్తోంది.. అసలు జ్వాల ఎవరు?’
హిమ:  ‘బావా నన్ను ఏం అడగొద్దు’
నిరుపమ్: ‘అడుగుతాను హిమా.. అడుగుతాను.. అడగాల్సిన బాధ్యత నాకుంది.. అసలు జ్వాల ఎవరు? తనని పెళ్లి చేసుకోమని నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్? తనకెందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నావ్?’
హిమ:  ఒక స్వచ్ఛమైన మంచి మనసున్న అమ్మాయి బావా తను నిన్ను ప్రేమిస్తోంది
నిరుపమ్: ‘ప్రేమించేది ప్రేమిస్తుంది కదా? నేను తనకి ఓపెన్‌గా చెప్పేశాను.. నేను ఇప్పుడు చేసిన పనిని నువ్వు ఎప్పుడో చెయ్యాల్సింది..’ 
హిమ: ‘నేను ఇంక ఎన్నాళ్లు ఉంటానో తెలియదు బావా.. తనే నీకు సరైన జోడీ.. జ్వాలకి నువ్వంటే ప్రాణం బావా’
నిరుపమ్: నాకు నువ్వంటే ప్రాణం హిమా  తనకి కూడా ఆ మాట చెప్పేశాను.. అలా కొన్ని రోజులు బాధపడుతుంది. తర్వాత మరిచిపోతుంది
హిమ:  తను అలాంటిది కాదు బావా 
నిరుపమ్:  హిమా నీకు తన మీద ఇంత సానుభూతి ఎందుకో నాకు అర్థం కావట్లేదు.. నీకు గుర్తుందా నా ఫైనల్ ఇయర్‌లో నాన్సీ నాకు ఇలానే ప్రపోజ్ చేసింది.. నేను నో అన్నాను అని.. జీవితాంతం పెళ్లి చేసుకోను అంది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? సౌత్ ఆఫ్రికాలో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది.. ఇప్పుడు కూడా...
హిమ: జ్వాల కూడా అంతే అనకు బావా  అంటుంది కోపంగా
నిరుపమ్: అంతే హిమా.. తన స్థాయికి తగ్గవాళ్లని పెళ్లి చేసుకుని అదే ఆటో నడుపుకుంటూ అలానే బతికేస్తుంది’ అంటాడు నిరుపమ్. 
‘బావా’ అని గట్టిగా అరుస్తుంది హిమ. ‘ఏం అయ్యింది హిమా’ అంటాడు నిరుపమ్. ‘జ్వాలకు అంత కర్మేం పట్టలేదు బావా’ అంటుంది.  ‘ఏంటి హిమా నువ్వు? అసలు ఏం అర్థం కావు.. నీ లైఫ్‌లో ఇంత విషాదం ఉంది.. నువ్వు తన గురించి జాలిపడతావేంటీ? అసలు తను ఎవరు హిమా?’ అంటాడు నిరుపమ్. ‘తను నా ఫ్రెండ్.. నన్ను పిరితనం నుంచి కాపాడి, ధైర్యాన్ని అందించిన నా గురువు.. కష్టం అనిపిస్తే చెప్పుకునే ఆత్మీయురాలు.. ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా బావా’ అంటుంది హిమ కోపంగా. మనసులో మాత్రం.. ‘జ్వాల గురించి జ్వాలే శౌర్య  అనే నిజం చెబితే అయినా బావ సింపతీతో పెళ్లి చేసుకుంటాడా? ఏమో చేసుకోడేమో? చెప్పి ఉపయోగం ఉండదేమో.. నా వల్ల కాదు.. శౌర్యని నిరుపమ్ బావని కలపడం నా వల్ల కాదు.. నాన్నమ్మ హెల్ఫ్ తీసుకోవాలి’ అనుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

Also Read: రిషికి వసుధార గోరు ముద్దలు, అభినందన సభలో ఈగో మాస్టర్ ఏం చేయబోతున్నాడు!

జ్వాల
 జ్వాల మాత్రం హిమ గురించి రగిలిపోతూ ఉంటుంది. తింగరీ తింగరీ అంటూ తిరిగాను.. దాన్ని నేను ఎంతో నమ్మాను  అంటూ ఊగిపోతూ ఉంటుంది. ఇంతలో ఆనందరావు, సౌందర్య వచ్చి నేల మీద పగిలిన అద్దం చూసి ఏంటమ్మా ఇదంతా అంటాడు ఆనందరావు. ‘నా మనసు యంగ్ మెన్.. నా మనసు కూడా ఈ అద్దంలానే ముక్కలైపోయింది’ అంటుంది. ఇలాంటప్పుడు ఏం మాట్లాడినా చిరాకుగానే ఉంటుంది. కానీ నీ దోస్త్‌గా ఒక్క మాట చెబుతాను విను అంటుంది సౌందర్య. 
జ్వాల: ఏంటి నీతిబోధలా
సౌందర్య: నీతి బోధలు నీకెందుకు చెబుతామే నువ్వు మాకు ఏం అవుతావని అంటుంది. 
జ్వాల: సీసీ నీకు తెలుసా? ఇద్దరూ గుడిలో ముడుపులు కడుతున్నారు.. ఏం మొక్కుకుని ఉంటుందో అది.. రాక్షసి..’
ఆనందరావు: అది కాదమ్మా.. నీకు నా మనవరాలి వయసే ఉంటుంది కాబట్టి ఆ చనువుతోనే ఓ మాట చెబుతాను.. నీకు ఓ గొప్ప సంబంధం చూస్తాం అని ఆనందరావు చెప్పడం పూర్తి చేయకుండానే..
జ్వాల: యంగ్ మెన్ అంటూ ఆవేశంగా అరుస్తుంది...వెంటనే తమాయించుకుని.. సారీ యంగ్ మెన్.. నువ్వు పెద్దవాడివి.. నీపై అలా అరవడం కరెక్ట్ కాదు సారీ అంటుంది
పర్వాలేదమ్మా అంటాడు ఆనందరావు..ఎపిసోడ్ ముగిసింది....

రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
జ్వాలను కలిసిన హిమ ఏదో మాట్లాడేందుకు వెళుతుంది. జ్వాల అస్సలు వినకుండా విసుక్కుంటుంది. ఇంకా ఏం మోసం చేయడానికి వచ్చావ్ అని జ్వాల అరుస్తుంటే.. నువ్వు డాక్టర్ సాబ్ ని ప్రేమించడం మానొద్దు అని చెప్పడానికి వచ్చానంటుంది హిమ. జ్వాల షాక్ అయి చూస్తుండిపోతుంది.

Also Read: ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల

Published at : 30 Jun 2022 08:31 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam june 30 Episode 1392

సంబంధిత కథనాలు

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!