News
News
X

Karthika Deepam జూన్ 29 ఎపిసోడ్: హిమ కోసం డాక్టర్ సాబ్, శౌర్య కోసం హిమ అమ్మవారికి ముడుపులు, ఎవరి కోరిక నెరవేరుతుంది !

Karthika Deepam june 29th Episode 1391: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం డాక్టర్ సాబ్ నిరుపమ్ పెళ్లిచుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

Karthika Deepam  జూన్ 29 బుధవారం ఎపిసోడ్ 

బయట ఆటో ఉంది లోపల జ్వాల కనిపించడం లేదేంటి అనుకుంటూ వెళుతుంది శోభ.  నిరుపమ్-స్వప్న ఇద్దరూ శుభలేఖలు ఎవరెవరికి ఇవ్వాలన్నది ఆలోచించుకుంటారు. ఆగలేక అడిగేస్తుంది శోభ. బయట జ్వాల ఆటో ఉందేంటని. ఇందాక అది వచ్చి వెళ్లిందని చెప్పిన స్వప్న... అప్పుడెప్పుడో నిరుపమ్ జాలిపడి ఆటో కొనిచ్చాడని తిరిగిచ్చేసి వెళ్లిపోయిందంటుంది.
శోభ: నువ్వు కొనిచ్చిన ఆటో తిరిగి ఇవ్వడం ఏంటి
నిరుపమ్: నాపై లేనిపోనివి ఊహించుకుంది...అలాంటివేమీ లేవు నేను హిమను పెళ్లిచేసుకుంటున్నా అని చెప్పగానే ఫీలై ఆటో తిరిగిచ్చేసి వెళ్లిపోయింది
శోభ: జ్వాల పోటీనుంచి తప్పుకుంది..ఇక ఆలోచించాల్సింది హిమ గురించే. హిమతో నిరుపమ్ కి పెళ్లి జరిగేలా కనిపిస్తోంది..నేను ఏమీ చేయలేనా ఈ పెళ్లి ఆపలేనా 

Also Read: ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల

అటు జ్వాల ఇంకా నిరుపమ్ రిజెక్ట్ చేసిన విషయమే తలుచుకుని బాధపడుతుంటుంది. తనే జీవితం అనుకున్నాను తననే మిస్సైపోతున్నాను, అంతటికీ కారణం తింగరే..నన్ను నమ్మించి మోసం చేసిందని బాధపడుతుండగా తలుపు కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. డోర్ తీయగానే సౌందర్య, ఆనందరావు కనిపిస్తారు. ఏంటి సీసీ అన్నట్టుగానే యంగ్ మెన్ ని తీసుకొచ్చావా అంటుంది. 
ఆనందరావు: ఎలా ఉన్నావమ్మా 
జ్వాల: బాగానే ఉన్నాను..నేను సంతోషంగా ఉంటే కొందరు చూడలేరు
ఆనందరావు: ఇంత సున్నితం ఏంటమ్మా
జ్వాల: మనం ప్రేమించిన వ్యక్తిని మన కళ్లముందే లాక్కెళ్లిపోతే చూస్తూ ఊరుకోగలమా అంటుంది. సౌందర్య ఏదో టెన్షన్లో ఉండడం చూసి ఏంటి సీసీ టెన్షన్ పడుతున్నావ్
సౌందర్య: నీ పర్మిషన్ లేకుండా ఓ పని చేశాం
జ్వాల: డొంకతిరుగుడు వద్దు సీసీ..కుండబద్దలు కొట్టినట్టు చెప్పేయాలి...మా పిన్నీ బాబాయ్ కి మొత్తం చెప్పేశావేంటి?
సౌందర్య: నువ్వు కోప్పడకూడదు
జ్వాల: నా కోపం అంతా తింగరి, నా శత్రువు పైనే...నీపై కోపం ఎందుకు మనిద్దరం ఫ్రెండ్స్ కదా. ఊరికే టెన్షన్ పెట్టకు..చెప్పు
సౌందర్య: నీకు ద్రోహం చేసిందని నువ్వు అనుకుంటున్న తింగరి....
జ్వాల: అనుకోవడం ఏంటి ..నిజంగా ద్రోహం చేసింది
సౌందర్య: ఆ తింగరి అడ్రస్ వెతికిపట్టుకుని తీసుకొచ్చాను...అది ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో నాకు చెప్పింది, నీక్కూడా చెబుతానంది ఒక్కసారి వినవే ప్లీజ్
జ్వాల: సీసీ ఆపు..
ఆనందరావు: తను చెప్పేది కూడా ఓసారి విను
జ్వాల: మీరంటే నాకు గౌరవం కానీ ప్రతీదానికీ ఓ లిమిట్ ఉంటుంది...నాపై ప్రేమతో వచ్చారు..మాట్లాడి వెళ్లాలి అంతే..నన్ను మోసం చేసినదాన్ని మీరు తీసుకురావడం ఏంటి..నేను దాంతో మాట్లాడడం ఏంటి...
అప్పుడే కనిపించిన హిమను చూసి మండిపడుతుంది జ్వాల..జన్మలో నీ మొహం చూడకూడదు అనుకున్నాను కదా మళ్లీ ఏం మొహం పెట్టుకుని వచ్చావ్ అంటుంది. ఆనందరావు, సౌందర్య ఎంత ఆపుతున్నా వినకుండా  హిమను లాక్కెళుతుంది. నన్ను మోసం చేశావ్ ,నాకు ద్రోహం చేశావ్ అంటూ  చేయిపట్టి బయటకు గెంటేస్తుంది. 
హిమ: నీకు ద్రోహం చేయలేదు..నీ మంచికోసమే చేశాను.. 
జ్వాల: నా నుంచి నా డాక్టర్ సాబ్ ని లాక్కున్నావ్, ఇక డాక్టర్ సాబ్-నీకు నాకు ఏలాంటి సంబంధం లేదు
ఇన్నాళ్లూ దూరమైన హిమ శౌర్యలు కలసి ఉంటారనుకుంటే ఇలా అయిపోయిందేంటని బాధపడతారు సౌందర్య, ఆనందరావు . చెప్పింది విను జ్వాలా జరిగినదేంటో తెలుసుకోమ్మా అని బతిమలాడినా అస్సలు పట్టించుకోకుండా ...మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి,ఇంకోసారి నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు , మీరు ఇలాంటి రాయబారాలు చేయాలి అనుకుంటే ఇంకోసారి నా దగ్గరకు రాకండి , నా బతుకేదో నన్ను బతకనీయండి అంటూ హిమను నెట్టేసి లోపలకు వెళ్లి తలుపేసుకుంటుంది.  

Also Read: అమ్మవారి సాక్షిగా మనసులో ప్రేమను బయటపెట్టిన రిషి, వసు-బంధం బలపడుతోంది
ఏడిస్తే సమస్యలు తగ్గుతాయంటే ప్రపంచంలో అందరూ ఏడుస్తారు అని హిమను ఓదార్చుతారు సౌందర్య, ఆనందరావు.  ఇల్లంటే ఆనందాల నిలయం అంటారు కానీ మనకేంటో నాలుగు దిక్కుల నుంచి కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయని బాధపడతాడు ఆనందరావు.
హిమ: శౌర్యకు నిరుపమ్ బావంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు అలాంటిది ఆటో తిరిగి ఇచ్చేయడంతో తన మనసులోంచి బావను తీసేసినట్టే
సౌందర్య: ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది
హిమ: వాళ్లిద్దర్నీ ఒక్కటిగా చేయాలి
సౌందర్య: నిరుపమ్ తనని ప్రేమించలేదు...శౌర్య మనసులోంచి బావను తీసేసింది అన్నావ్..మరి ఇద్దరకూ ఎలా పెళ్లిచేస్తావ్
హిమ: శౌర్యకి బావంటే చాలా ఇష్టం
సౌందర్య: నిరుపమ్ గురించి కూడా ఆలోచించాలి కదా... ఇష్టం లేదని తెలిసి కూడా నిరుపమ్ కు కట్టబెట్టడం సరికాదు...
ఆనందరావు: శుభలేఖలు అచ్చయ్యాక కూడా బావని శౌర్యకి ఇచ్చి పెళ్లిచేద్దాం అంటున్నావ్..నిన్ను చూసి జాలిపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు
హిమ: అమ్మా నాన్నకి మాటిచ్చాను, శౌర్యకి బావతో పెళ్లిచేయాలని ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా...ఈ పెళ్లి జరగాల్సిందే నానమ్మా...ఏదో  ఒకటి చేయండి

జ్వాల ఉదయం నిద్రలేచి బయటకు వచ్చేసరికి టీ షాప్ లో పనిచేసేవాడు ఆటకి డెకరేట్ చేస్తాడు. ఏంట్రా ఇదంతా అంటుంది. పాత ఆటోపై ఉందని ఇప్పుడు కూడా స్టిక్కర్ అతికించాను అంటాడు దుర్గ. రోజుకి 300 రూపాయలు కిరాయి అని చెబుతాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి గుడికి వెళ్లాలి వస్తావా అని అడుగుతాడు. అదే గుడిలో నిరుపమ్-హిమ ఉంటారు. 
హిమ: ఏంటి బావా గుడికి రమ్మన్నావ్ 
నిరుపమ్: మనిద్దరం పెళ్లిచేసుకోబోతున్నాం కదా
హిమ: ఇప్పుడే తాళికడతావా ఏంటి
నిరుపమ్: మన పెళ్లికి ఎన్నో అడ్డంకులు కదా..హిమతో నా పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే ముడుపు కడతానని మొక్కుకున్నా ఇప్పుడు కడతాను
హిమ: ఇంకా పెళ్లి జరగలేదు కదా..ఈ పెళ్లి నీకు-జ్వాలకి జరగాలని కోరుకుంటూ ముడుపు కడతాను
నిరుపమ్: ఇంకా నీ మనసులోంచి ఆ ఫీలింగ్ తీసెయ్యలేదా... ఎపిసోడ్ ముగిసింది

Also Read: శోభకు చెక్ పెట్టేందుకు హిమ మాస్టర్ ప్లాన్, జ్వాల సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి షాక్ అయిన డాక్టర్ సాబ్
రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
జ్వాలని నిన్ను కలపాలని మనసులో కోరుకుంటూ ముడుపుకడతాను అంటుంది హిమ...నా మనసులో ఉన్న కోరికే నిజమవుతుందని నిరుపమ్, అదే మాట చెప్పి హిమ ముడుపులు కడతారు. ఇదంతా విన్న జ్వాల...ఏంటే నీ మనసులో కోరిక..డాక్టర్ సాబ్ ని నానుంచి దూరం చేయడమా అని కోపంగా అనుకుంటుంది....

Published at : 29 Jun 2022 08:03 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam june 29th Episode 1391

సంబంధిత కథనాలు

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు