అన్వేషించండి

Karthika Deepam జూన్ 27 ఎపిసోడ్: శోభకు చెక్ పెట్టేందుకు హిమ మాస్టర్ ప్లాన్, జ్వాల సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి షాక్ అయిన డాక్టర్ సాబ్

Karthika Deepam june 27th Episode 1389: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 25 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 27 సోమవారం ఎపిసోడ్ 

హిమ పేరుతో కాల్ చేసిన శోభ...రమ్మని సవాల్ చేస్తుంది. శత్రువుపై కోపంతో రగిలిపోతూ జ్వాల ఆ ప్లేస్ కి వెళుతుంది. అక్కడ హిమను చూసి నీ మొహం నాకు చూపించకు, నువ్వేంటి ఇక్కడ అవతలకు వెళ్లు అని అరుస్తుంది. జ్వాలా నువ్వేంటి ఇక్కడ అని హిమ అడుగుతున్నా పట్టించుకోకుండా..జరిగినదంతా నాకు తెలుసు, నువ్వు ఎన్ని నాటకాలు ఆడావ్, నన్ను డాక్టర్ సాబ్ ని కలవనీయకుండా ప్రతిసారీ ఆపావ్, తీరా చూస్తే నువ్వు డాక్టర్ సాబ్ ని పెళ్లిచేసుకుంటున్నావ్, నువ్వు తింగరికి కాదు పెద్ద మోసకారివి. నాకు-డాక్టర్ సాబ్ కి మధ్య నువ్వు విలన్ వి... ఇన్నాళ్లూ నాకు శత్రువు ఒక్కరే అనుకున్నాను, నువ్వు అంతకుమించి తయారయ్యావ్, నువ్వంటి ఇక్కడున్నావ్...నాకు నా శత్రువు కాల్ చేస్తే ఇక్కడకు వచ్చాను.
హిమ: నిన్ను ఆ శోభ తప్పుదోవ పట్టిస్తోంది, నేనే హిమ అని నిజం చెప్పలేకపోతున్నాను, నా నీడ కూడా చూడనంత శత్రువును అయిపోయానా అనుకుంటుంది
జ్వాల: నీ పేరేంటో చెప్పవే..నాకు ఇద్దరు శత్రువులు..అది కూడా నంగనాచిలా కనిపిస్తూ మా అమ్మా నాన్నని పొట్టనపెట్టుకుంది, నువ్వు కూడా అంతే నా డాక్టర్ సాబ్ ని లాగేశావ్...
శోభ: అది హిమ అని తెలియకముందే ఇంతలా గొడవ పెట్టుకుంటున్నావ్..అదే హిమ అని తెలిస్తే ఏం చేస్తావ్..మీ ఇద్దరి గొడవా చూస్తుంటే కన్నుల పండువగా ఉందనుకుంటుంది శోభ
జ్వాల: నా శత్రువు రమ్మని చెప్పింది కానీ ఇంకా కాల్ చేయలేదేంటి అనుకుంటూ కాల్ చేసి..ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది..

Also Read: శోభ చెంప చెళ్లుమనిపించిన సౌందర్య, అటు డాక్టర్ సాబ్ తో లెక్కలు తేల్చుకుంటున్న రౌడీ బేబీ

ఇంట్లో ఉన్న హిమ... శోభ మరీ శాడిస్టులా తయారైంది.. ఇప్పటికే బావ కాదన్నాడన్న బాధలో ఉన్న శౌర్యని శోభ మరింత ఇబ్బంది పెడుతోంది అనుకుంటుంది. నాకు క్యాన్సర్ లేదని,  నేనే హిమని అని బావకి, శౌర్య కి చెప్పేస్తే అని ఆలోచిస్తుంటే అక్కడకు వచ్చిన ఆనందరావు హాస్పిటల్ కి వెళితే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అంటాడు. మనశ్సాంతి లేనప్పుడు ఎక్కడకు వెళితే ఏంటంటుంది హిమ. అప్పుడే అక్కడకు వచ్చిన నిరుపమ్, స్వప్న...శుభలేఖలు తీసుకొస్తారు. బావుందా వెడ్డింగ్ కార్డ్ అని నిరుపమ్ మురిసిపోతుంటే అప్పుడే శుభలేఖలు కొట్టించారా అని హిమ మరింత డల్ అయిపోతుంది. స్వప్న కార్డు ఇస్తుంటే ఫస్ట్ కార్డ్ దేవుడికి ఇవ్వమ్మా అన్న ఆనందరావుతో  ఇదో మొక్కుబడి పెళ్లి అని సెటైర్ వేసి వెళ్లిపోతుంది. ఆ శుభలేఖ చూస్తూ హిమ ... దేవుడా ఈ పెళ్లి ఆపలేవా అనుకుంటుంది.

సౌందర్య: క్యారియర్ కట్టి తీసుకెళ్లిన సౌందర్య...ఆటోపై వదిలేదే లే అని రాసి ఉండడం చూసి...నువ్వంటే అది పడిచస్తోంది, నువ్వేమో కక్ష కట్టావ్. ఏదో జరిగిందని ఇంట్లోంచి వెళ్లిపోయావ్... నువ్వెప్పుడు ఇంట్లోకి వస్తావా అని ఎదురుచూస్తున్నాం, నువ్వు హిమకు అక్కవే అయినా అదే నీకు అక్కలా ఆరాటపడుతోంది అనుకుంటుంది. హిమ మంచితనం ఎప్పుడు అర్థం చేసుకుంటావ్, మీరిద్దరూ ఎప్పుడు కలుస్తారు అనుకుంటూ లోపలకు వెళుతుంది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడిఉంటాయ్. రక్తంతో గీసిన నిరుపమ్ ఫొటో చింపేసి పడి ఉంటుంది. ఎంత నిద్రలేపినా జ్వాల లేవదు. ఇల్లంతా క్లీన్ చేస్తుంది సౌందర్య. చించి పడేసి ఉన్న నిరుపమ్ ఫొటో చూసి జ్వాల మాటలు గుర్తుచేసుకుంటుంది.  ఇల్లంతా క్లీన్ చేయడం చూసి బయట నుంచి వెళుతున్న ఓ ముసలమ్మ చూసి..ఈవిడెవరు కొత్తగా కనిపిస్తోంది ఈ విషయం శోభ మేడంకి చెప్పాలా వద్దా అనుకుంటుంది. 

Also Read: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం

హిమ-ఆనందరావు
ఆనందరావు: ఏంట్రా ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్, మనింటిని సంతోషాలు వదిలిపోయి చాలా సంవత్సరాలైంది, ఏంటో అన్నీ ఇలా అవుతున్నాయ్, నీకు నిరుపమ్ ని పెళ్లిచేసుకునే అవకాశం వచ్చింది కదా, ఈ రకంగా అయినా ఇంటికి సంతోషాలొస్తాయని ఆలోచిస్తున్నాను
హిమ: శౌర్య కోసం ఇదంతా చేస్తున్నాను కదా 
ఆనందరావు: జరగని దానికోసం మనసు పాడుచేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావ్..నా మాట విని నిరుపమ్ ని...
హిమ: నానమ్మ తలుచుకుంటే శౌర్య నిరుపమ్ ని కలపగలదు
ఆనందరావు: నీకు మీ నానమ్మ మీద నమ్మకం ఉంది  కానీ స్వప్న తీరు చూస్తుంటే భయం వేస్తోంది. అది నిన్ను కోడలిగా చూడాలి అనుకోవడం లేదు..నీ చావు కోరుకుంటోంది.
హిమ: నాకు తెలుసు తాతయ్య... స్వప్నత్త మనసులో ఏమీ పెట్టుకోవద్దు. కానీ శోభ మాత్రం జ్వాలతో ఆటలాడుతోంది..ఏమాత్రం అవకాశం ఇచ్చినా శోభ నిరుపమ్ బావ మనసు కలుషితం చేస్తోంది. జ్వాలే శౌర్య అని తెలియనప్పుడు బావని పెళ్లికి ఒప్పించాను...తాతయ్యా మీరు సపోర్ట్ చేస్తే శౌర్య-బావని ఒక్కటి చేద్దాం..
ఆనందరావు: ఈ ఇంట్లో ఏం జరుగుతోందో అర్థంకావడం లేదు.. శౌర్య ఎక్కడో కష్టపడుతోంది, నిరుపమ్ ని పెళ్లిచేసుకోవాల్సిన నువ్వు వాళ్లిద్దరికీ పెళ్లిచేస్తానంటున్నావ్, అటు స్వప్న శోభని కోడలిగా తెచ్చుకుంటానంటోంది... మన జీవితాలు ఏమైపోతున్నాయ్...
 
అప్పుడే నిద్రలేచిన జ్వాల ఇల్లంతా క్లీన్ గా ఉండడం చూసి షాక్ అవుతుంది. హాల్లో క్యారియర్ చూసి షాక్ అవుతుంది. 
జ్వాల: ఇవన్నీ నువ్వే చేశావా...నువ్వు ఇవన్నీ చేయడం ఏంటి
సౌందర్య: నీ ఇల్లు నా ఇల్లు కాదా..నా ఇల్లు నీ ఇల్లు కాదా...
జ్వాల: నేను ఎవరో తెలిసిపోయిందా అనుకుంటూ నన్ను చూసి జాలిపడుతున్నావా
సౌందర్య: రాత్రంతా నీ గురించే ఆలోచించాను..అందుకే పొద్దున్నే వచ్చేశాను... ఈ ఇంటి వాతావరణం చూసి ఇదంతా చేశాను
జ్వాల: ఏంటో సీసీ నీకు రోజురోజుకీ రుణపణిపోతున్నాను
సౌందర్య: నీకు నాకు రుణం ఏంటే..ఫ్రెండ్స్ కదా మనం
జ్వాల: నానమ్మకి నేనెవరో తెలిసిపోయిందా..తెలిసి ఉంటే తాతయ్యని తీసుకొచ్చేది కదా అనుకుంటూ....నాకు థ్యాంక్స్ చెప్పే అలవాటు లేదు అంటుంది
ఇప్పుడు నిన్ను థ్యాంక్స్ చెప్పమని ఎవరన్నారు అంటూ..ఓ పేపర్ తీసి చూడు అని చేతిలో పెడుతుంది సౌందర్య అది చూసి షాక్ అవుతుంది జ్వాల....

Also Read: తింగరే హిమ అని జ్వాల(శౌర్య)కు తెలిసేలా చేసిన శోభ, సౌందర్య ఏం చేయబోతోంది
మంగళవారం ఎపిసోడ్ లో
ఏంటే ఆటోని తీసుకొచ్చి ఏకంగా ఇంటి ముందు పెట్టావ్ అని స్వప్న అడుగుతుంది. లెక్కలు తేల్చుకుందామని వచ్చానన్న జ్వాల...ఇది మీరు కొనిచ్చిన ఆటోనే డాక్టర్ సాబ్..ఇంకా నేను ఆటోలో తిరిగితే జ్వాల అనే నా పేరుకి అర్థం లేకుండా పోతుంది. మీ సహాయానికి సానుభూతికి నమస్కారం అని ఆటో కీ నిరుపమ్ చేతిలో పెడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Paatal Lok 2: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Embed widget