News
News
X

Guppedantha Manasu జూన్ 27 ఎపిసోడ్: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం

Guppedantha Manasu June 27 Episode 487: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 27 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు జూన్ 27 ఎపిసోడ్ (Guppedantha Manasu June 27 Episode 487)

రిషి క్యాబిన్ కి వెళ్లిన వసుని బయటకు వెళ్లిపొమ్మంటాడు రిషి. ఏంటో మేడం నన్ను వెళ్లి చెప్పమంటారు ఆయనేమో మాటవినరు అనుకుంటూ బయటకు వస్తుంటుంది. ఈ లోగా జగతి ఎదురవుతుంది..ఏంటి వసుధార అప్పుడే చెప్పేశావా అని అడుగుతుంది. మీరిలా అంటారు అక్కడ రిషి సార్ ఏమో అని వసుధార అనేలోగా అక్కడకు వస్తాడు రిషి.  ఏంటి చెబుతున్నావ్ అని అడిగితే మాట దాటవేస్తుంది వసుధార. మినిస్టర్ గారు కాల్ చేశారని చెప్పిన రిషి... మేడం మీరూ, మీ స్టూడెంట్ వెళ్లండి అంటాడు. నేనెలా వెళతాను మీరెళ్లండి..రమ్మంటే నేను కూడా వస్తానంటుంది. వద్దులెండి మీ స్టూడెంట్ ని రెడీ గా ఉండమనండి అని చెప్పేసి వెళ్లిపోతాడు. థ్యాంక్స్ మేడం అంటుంది వసుధార...

తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న జగతికి దేవయాని కాల్ చేస్తుంది. జగతి లిఫ్ట్ చేసి ఇప్పుడే కదా ఇంట్లోంచి వచ్చాను ఏంటో చెప్పండి అంటుంది.
దేవయాని: ఈ మధ్య రిషి డల్ గా ఉంటున్నాడు, కారణం ఏంటో తెలుసుకోవాలి కదా
జగతి: చిన్నపిల్లలైతే చెబుతాం, కాలేజీ ఎండీకి ఏం చెబుతాం
దేవయాని: ఈ విషయంలో మీ శిష్యురాలి మేథస్సుని వాడుకోవచ్చు కదా
జగతి: మేథస్సు అందరికీ సమానంగా ఉంటుంది...వాడడం లోనే తేడా...( అక్కయ్య గురించి రివర్స్ లో వెళ్లడమే బెటర్ అనుకుంటూ).. రిషి ప్రపంచంలో మిమ్మల్నే నమ్ముతాడు, మీ దగ్గరే మనసు విప్పి మాట్లాడుతాడు, నా కంటే పెద్దవారిగా, ఇంటిపెత్తనం చూసేవారిగా మీకు గౌరవం ఇస్తాను. సరే వసుకి కాల్ చేసి రిషి మనసులో బాధకి కారణం ఏంటో తెలుసుకంటాను సరేనా...
దేవయాని: జగతి వాళకం చూస్తంటే ఇద్దర్నీ మళ్లీ కలిపేలా ఉందే అనుకుంటుంది
జగతి: వసు-రిషి కాలేజీ పనిపై బయటకు వెళుతున్నారు అక్కయ్యా అంటుంది
ఆవేశంగా కాల్ కట్ చేసిన దేవయానికి మళ్లీ కాల్ చేసిన జగతి..బై దేవయాని అక్కయ్యా అని కాల్ కట్ చేస్తుంది...
Also Read: శోభకు చెక్ పెట్టేందుకు హిమ మాస్టర్ ప్లాన్, జ్వాల సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి షాక్ అయిన డాక్టర్ సాబ్

రిషి-వసు ఇద్దరూ కార్లో వెళుతుంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా ఏమీ చెప్పడం లేదు ఎందుకో అనుకుంటుంది. ఇంతలో రోడ్డు పక్కన కారు ఆపిన రిషి సీట్ బెల్ట్ పెడతాడు.( ఇదంతా వసు ఊహ మాత్రమే). సీట్ బెల్ట్ పెట్టుకో అని చెబుతాడు. ఇదంతా నా ఊహా అనుకుంటూ సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది వసుధార. 
వసుధార: పాటలు విందామా సార్ 
రిషి: నాక్ మూడ్ లేదు
వసు: నాకు ఉంది సార్...
రిషి: థ్యాంక్స్ నన్ను పాడమని అడగలేదు
వసు: ఏంటి సీరియస్ గా ఉన్నారనుకుంటూ ఈ మధ్య సినిమాలు చూశారా అని అడుగుతుంది..
కట్ చేస్తే ఇద్దరూ మినిస్టర్ దగ్గర ఉంటారు. మళ్లీ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం సంతోషంగా ఉందంటూ మిషన్ ఎడ్యుకేషన్ గురించి పొగుడుతాడు. ప్రాజెక్ట్ గురించి డీటేల్స్ అన్నీ చెబుతుంది వసుధార. ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించింది మాత్రమే కాకుండా జీవనవిధానంలో మార్పుండేలా చేద్దాం అంటుంది. పెద్ద పెద్ద అవసరాలు పెద్దఎత్తున తీర్చుకోవడం కన్నా చిన్న అవసరం తీర్చడం బావుంటుంది కదా అంటుంది. వసు చెప్పింది విని మినిస్టర్ గారు చప్పట్లు కొడతారు. వెరీ గుడ్ రిషి అని ప్రశంసలు అందిస్తాడు. వెళ్లొస్తాం సార్ అని బయలుదేరుతారు.
వసుధార స్కాలర్ షిప్ టెస్ట్ రిజల్ట్ ఇంకా రాలేదు కదా నీకు మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నా అంటారు మినిస్టర్( ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించడం, వచ్చాక ఐ లవ్ య చెప్పి రిజెక్ట్ అవడం గుర్తుచేసుకుంటాడు రిషి)

జగతికి కాల్ చేసిన మినిస్టర్ గారు...ఇప్పుడే మీ రిషి, వసుధారలు వచ్చారనడంతో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని అడుగుతుందిజగతి. ప్రాజెక్ట్ అంతా ఓకే అన్న మినిస్టర్ గారు రిషి లాంటి కొడుకును కన్నందుకు మిమ్మల్ని అభినందించాలి అనిపించింది . రిషి ఆవేశపరుడే కానీ ఈ రోజుల్లో కొంత ఆవేశం కూడా మేథస్సుకు తోడైతే తను గొప్ప నాయకుడు అవుతాడు. మీకు మహేంద్ర సార్ కి నా అభినందనలు అని చెబుతాడు. కాల్ కట్ అయిన తర్వాత....నిన్ను కన్న అదృష్టవంతురాలిని, అమ్మా అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాలిని అనుకుంటుంది.

Also Read:  నీ దూరం భరించలేను-దగ్గరకొస్తే సహించలేనన్న రిషి, జీవితకాలం మీతో ప్రయాణిస్తానన్న వసు- ప్రేమ వెన్నెల కురుస్తోంది!

రిషి సార్ ఏంటో సీరియస్ గా ఉన్నారని వసుధార... ఏంటో ఏమీ జరగనట్టే ఉంటోందని రిషి అనుకుంటారు..
వసు: మీరు ఎప్పుడైనా మూకీ సినిమాలు చూశారా
రిషి: చూడలేదు విన్నాను
వసు: మన ప్రయాణం కూడా అలాగే ఉంది
రిషి: రెండూ ఊరమాస్ సాంగ్స్ తీసిపెట్టు కారు పక్కకు ఆపుతాను కారుపై డాన్స్ చేద్దాం అని సెటైర్ వేస్తాడు
రోడ్డు వర్క్స్ నడుస్తుండడంతో కారు దారి మళ్లిస్తారు...మరో ఐదు కిలోమీటర్లు వెళ్లాలా...ఆకలేస్తోంది అనుకుంటాడు.. నాక్కూడా ఆకలేస్తోంది సార్ అంటుంది వసుధార. 
రిషి: ఒక్క మనసు భాష తప్ప అన్నీ బాగా అర్థమవుతాయ్ నీకు అనుకుంటాడు
వసు: వాటర్ మిలన్ తిందాం సార్ అంటుంది
రిషి: తన మనసులో ఎలాంటి భారం లేదా..గలగలా మాట్లాడుతోంది అనుకుంటాడు
వసు: నాకైతే ఆకలేస్తోంది...మీరు వద్దంటే వద్దు అంటుంది
రిషి: అతని జీవిత చరిత్ర , వాటర్ మిలన్ పుట్టుపూర్వోత్తరాలు లేకుండా తిందాం అంటే వెళదాం అంటాడు
వసు: ఇది కోసివ్వు అంటుంది
రిషి: ఏంటీ ఈసారి బేరాల్లేవా
వసు:  డబ్బులు మీరిచ్చే టప్పుడు నేనెందుకు అనవసరంగా బేరం ఆడడం అంటుంది
రిషి: చాలా క్లారిటీగా ఉన్నావ్
ఆ తర్వాత వాటర్ మిలన్ ఎలా తినాలో నేర్పిస్తుంది వసుధార...తినండి సార్ అంటే మనమేం తినే పోటీలు పెట్టుకోవడం లేదంటాడు. ఆనందంగా తినాలి అంటే..నేనేం ఏడ్చుకుంటూ తినడం లేదని సెటైర్ వేస్తాడు. రిషి ముఖానికి వాటర్ మిలన్ అంటుకోవడంతో ఫొటో తీసి చూపిస్తుంది వసుధార. తుడుచుకున్న రిషి చెప్పొచ్చు కదా అంటాడు...
ఎపిసోడ్ ముగిసింది....

Also Read: ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు-వసు అల్లరికి రిషి ఫిదా, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తుళ్లింత

Published at : 27 Jun 2022 09:33 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu June 27 Episode 487

సంబంధిత కథనాలు

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్

టాప్ స్టోరీస్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!