అన్వేషించండి

Podharillu Serial Today March 10th: మాధవ్‌పై చేయిచేసుకున్న గాయత్రి తల్లిదండ్రులు...పెద్దిని కొడుతుంటే మహాలక్ష్మీ ఏం చేసింది..?

Podharillu Serial Today Episode March 10th: మాధవ్‌పై చేయిచేసుకున్న గాయత్రి తల్లిదండ్రులు...పెద్దిని కొడుతుంటే మహాలక్ష్మీ ఏం చేసింది..?

Podharillu Serial Today Episode: ఫోన్ లేకుండా ఇంట్లో అందరినీ మ్యానేజ్ చేయలేక ఇబ్బందిపడుతున్న శైలూ...కేశవ్‌ డబ్బులు అతనికి ఇచ్చి ఫోన్ తెచ్చుకోవాలని అనుకుంటుంది.తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఎక్కడైనా డబ్బులు అప్పుగా ఇప్పించమని ప్రాధేయపడుతుంది. దీంతో ఆమె డబ్బులు ఇప్పిస్తానని చెప్పడంతో శైలూ కేశవ్‌కు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెబుతుంది. ఆ డబ్బులు ఎక్కడ కొట్టేశావని అడగ్గా...అవన్నీ నీకు అనవసరమని నీ డబ్బులు నీకు ఇస్తానని నా ఫోన్ నాకు ఇవ్వాలని అంటుంది.సరే లోకేషన్ పంపించమని చెప్పడంతో సరేనని అంటుంది.

దుబాయి పెళ్లికొడుక్కి ఇచ్చితనకు పెళ్లి చేయనున్నారని తెలిసి గాయత్రి పరుగెత్తుకుండా మాధవ్‌ దగ్గరకు వస్తుంది. తనను కౌగిలించుకుని ఏడుస్తుంది. చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్తగా ఊహించుకున్నానని ఇప్పుడు వేరేవాళ్లతో నాకు పెళ్లి చేయాలని మా అమ్మానాన్న చూస్తున్నారని ఏడుస్తుంది. నేను చావనైనా చస్తాగానీ ఆ పెళ్లి చేసుకోనని చెబుతుంది. అక్కడే ఉన్న మహాలక్ష్మీ ఇదంతా గమనిస్తుంది. నువ్వు ఏడ్వకు ఏం కాదులే అని మాధవ్ సర్దిచెబుతుండగానే తాయరు, పురుషోత్తం అక్కడికి వస్తారు. తన కూతురు మాధవ్‌ను పట్టుకుని ఏడుస్తుండటం చూసి కోపంతో రగిలిపోతారు. తాయరు వెళ్లి తన కూతురుని కొట్టి పక్కకు లాక్కొస్తుంది. పురుషోత్తం మాధవ్‌పై చేయిచేసుకుంటాడు. నా కూతురుకు మాయమాటలు చెప్పి లోబర్చుకోవాలని చూస్తున్నావని తిడతాడు. 

అదే పనిగా మాధవ్‌ను కొడుతుండటంతో మహాలక్ష్మీ అడ్డుపడుతుంది. నీ కూతురే ఇక్కడికి వచ్చింది గానీ ఏనాడైనా మాధవ్‌ మీఇంటికి వచ్చాడా అని నిలదీస్తుంది.నీ కూతురు తప్పు చేస్తే....అతన్ని ఎందుకు కొడుతున్నావని మండిపడుతుంది. తాయర్ మహాను పక్కకు లాగేసి ఇంకా కొట్టమని ప్రోత్సహిస్తుంది. అంతలో మహా కలుగజేసుకుని ముందు నీ కూతురు మనసులో ఎవరున్నారో చూసి వాళ్లకు ఇచ్చి పెళ్లిచేయమని సలహా ఇస్తుంది.అది తెలుసుకోకుండా పెద్ద సంబంధం అంటూ ఏదేదో చేస్తున్నారని మండిపడుతుంది. 

అందరూ నీలాగా ఇంట్లో నుంచి లేచిపోయివచ్చి పెళ్లిచేసుకోవాలా అని తాయర్ మహాను ప్రశ్నిస్తుంది. మా కూతురు గురించి నీ సలహాలు మాకు ఏం అక్కర్లేదని చెబుతుంది.ఇంకోసారి ఇలా మా కూతురిని కలిసేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు తీస్తాం అని చెప్పి గాయత్రిని తీసుకుని వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

శైలూ డబ్బులు ఇస్తానని చెప్పడంతో కేశవ్‌ అక్కడికి వెళ్తాడు. కీర్తి డబ్బులు తెస్తుందని ఆ డబ్బులు కేశవ్‌కు ఇచ్చి తన ఫోన్‌ తీసుకోవచ్చన్న గర్వంతో కేశవ్‌ను నోటికొచ్చినట్లు తిడుతుంది శైలు. డబ్బులు విసిరిపడేస్తాను ఏరుకోమంటూ హేళనగా మాట్లాడుతుంది. కీర్తి రావడం చూసి మరింత రెచ్చిపోతుంది. అప్పటికీ కీర్తి వద్దని చెబుతున్నా వినకుండా చాలా అవమానిస్తుంది. కీర్తి తన ఫ్రెండ్‌ను పక్కకు లాక్కెళ్లి  అసలు విషయం చెబుతుంది. డబ్బులు దొరకలేదని తీసుకురాలేదని చెప్పడంతో శైలుకు ఏం చేయాలో అర్థంకాదు. అందుకే వచ్చినప్పటి నుంచి నేను సైగ చేస్తున్నా నువ్వే వినకుండా వాడిని చెడామడా తిట్టావని కీర్తి శైలుపై మండిపడుతుంది. 

ఇప్పుడేం చేద్దామని అంటే నీ చావు నువ్వు చావంటూ అక్కడి నుంచి కీర్తి వెళ్లిపోతుంది. డబ్బులు లేకపోవడంతో శైలూ కేశవ్ దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుకుంటుంది. తన ఫ్రెండ్ డబ్బులు తీసుకురాలేదని నేను అన్న మాటలు ఏం మనుసులో పెట్టుకోవద్దని అంటుంది.దీంతో రెచ్చిపోయిన కేశవ్‌...అసలు నువ్వు  20వేలు ఇచ్చినా ఈ ఫోన్ నీకు ఇచ్చేది లేదని చెబుతాడు. నువ్వు తిట్టిన తిట్లకు వడ్డీతో  సహా కలిపి కట్టి ఫోన్ తీసుకెళ్లమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

గాయత్రి తల్లిదండ్రులు వచ్చి మాధవ్‌పై చేయిచేసుకున్న విషయం మహాలక్ష్మీ చక్రికి చెబుతుంది. వెంటనే ఇంటికి రమ్మని అంటుంది. చక్రి కేశవ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. ఇద్దరూ వచ్చిన తర్వాత మాధవ్‌ను అడుగుతారు.ఏం లేదులే అని మాధవ్ చెబుతున్నా వినకుండా వాళ్ల అంతు చూస్తామంటూ ఇద్దరూ బయలుదేరి వెళ్తారు. అక్కడ కూతురు ఇళ్లు దాటి వెళ్తుంటే ఏంచేస్తున్నావంటూ పురుషోత్తం తాయర్‌పై చేయిచేసుకంటాడు. నా పరువుపోతుందనే ఇన్నాళ్లు నువ్వు ఏం చేసినా సహిస్తూ ఉన్నానని ఇప్పుడు అదే పరువు పోతుందని తెలిస్తే మీ ఇద్దరినీ చంపేస్తానని తాయర్‌ను బెదిరిస్తాడు. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
Podarillu Serial Today July 29th: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
పొదరిల్లు: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
Illu Illalu Pillalu Serial Today July 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:
ఇల్లు ఇల్లాలు పిల్లలు: "ఐ హేట్ యూ ధీరజ్..!" ఇంటిని వదిలి వెళ్లిపోయిన ప్రేమ..! వేదవతిపై చేయి ఎత్తిన రామరాజు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget