అన్వేషించండి

Nindu Manasulu Serial Today March10th:తండ్రి ఇంటికి వచ్చిన ఆనందంతో హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రేరణ కుటుంబం...తండ్రి దూరమై కోపంతో రగిలిపోయిన గణ

Nindu ManasuluSerial Today Episode March 10th: తండ్రి ఇంటికి వచ్చిన ఆనందంతో హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రేరణ కుటుంబం...తండ్రి దూరమై కోపంతో రగిలిపోయిన గణ

Nindu Manasulu Serial Today Episode: ప్రేరణ బెదిరింపుతో  భయపడిపోయి తల్లిని తీసుకుని గణ ఇంటికి వెళ్లిపోగా....కన్నతండ్రి తమ ఇంటికి వచ్చిన ఆనందంతో రాజశేఖర్‌కు  హారతి ఇచ్చి ప్రేరణ ఇంట్లోకి తీసుకెళ్తుంది. తనకు చెప్పకుండా ఇలాంటి పని ఎందుకు చేశావని గణ వాళ్ల అమ్మపై మండిపడతాడు. నాన్నను వాళ్లకు శాశ్వతంగా దూరం చేయాలని నేను కలలు కంటుంటే...నువ్వు మొత్తం పాడుచేశావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. 

ఇప్పుడు ఏకంగా నాన్న వాళ్ల ఇంటికి వెళ్లిపోయాడని బాధపడతాడు. నువ్వు ఏదైనా చేసేప్పుడు నాకు చెప్పి చేయాలి కదా అని ఈశ్వరీని నిలదీస్తాడు. మరి ఏం చేయమంటావురా ...ఆ అమ్మా కూతుళ్లు మన ఇంటికి వచ్చి నా కళ్లముందే ఆయనతో ఆనందంగా ఉంటుంటే చూస్తూ  ఏలా ఊరుకోమ్మంటావని  అంటుంది. మీనాన్నను దాచేసి ఆ కేసులో వాళ్లను ఇరికిద్దామని ఈ పని చేశానని అంటుంది. నువ్వు చేసింది మంచి పనే అయినా...నాకు చెప్పి ఉంటే ఇంతకన్నా మంచిగా ప్లాన్ చేసేవాళ్లం కదా అని అంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు....మీనాన్న శాశ్వతంగా మన ఇంటికి వచ్చేయాలని చెబుతుంది. ఇప్పుడు  కూడా అదే పనిలో ఉన్నానని గణ అంటాడు. ఈసారి నేను కొట్టే దెబ్బకు ఆ ప్రేరణ జీవితంలో కోలుకోదని చెబుతాడు.

తండ్రి ఇంటికి రావడంతో ప్రేరణ కుటుంబం ఎంతో ఆనందంతో  ఉండిపోతుంది. మళ్లీ ఇన్నాళ్లకు మా నాన్న మా ఇంటికి వచ్చారని ఐష్‌ ఆనందంతో పొంగిపోతుంది. దీనంతటికీ కారణం సిద్ధూనేనని అంటుంది. నేను కష్టాల్లో ఉన్నప్రతిసారీ నువ్వు నా పక్కనే ఉన్నావని...ప్రేరణ సిద్ధూకు కృతజ్ఞతలు చెబుతుంది. ఒకప్పుడు మానాన్నను ప్రమాదం నుంచి కాపాడి ఆయన ప్రాణాలు దక్కేలా చేశావని...ఇప్పుడు దూరమైపోయిన మానాన్నను మాకు తెచ్చి ఇచ్చావని ఏడుస్తుంది. నువ్వు నా చెల్లి జీవితం నాశనం కాకుండా ఆ గణ గురించి నిజం చెప్పి మా కుటుంబాన్ని కాపాడావు...ఇప్పుడు నేను నీకు  అండగా ఉన్నానని సిద్ధూ అంటాడు. మనం ఒకరికొకరం కృతజ్ఞతలు చెప్పుకోకూడదని అంటాడు. 

మా నాన్న ఇంటికి వచ్చిన ఆనందంలో రేపు బ్రహ్మాండంగా హోలీ జరుపుకుందామని ఐష్  చెబుతుంది. సరేనంటూ  సిద్ధూ ఇంటికి బయలుదేరతాడు. గేటువరకు వచ్చిన ప్రేమ వాళ్ల అమ్మ.... సిద్ధూకు కృతజ్ఞతలు చెబుతుంది. మేం ఎన్ని అవమానాలు చేసినా నువ్వు మాత్రం మా ప్రేరణ వెనకే ఉన్నావని అంటుంది. మీ ఇద్దరి మధ్య ఏం ఉందో తెలియదు గానీ...నీ మనసులో మా ప్రేరణకు చోటు ఉంటే మాత్రం మాకు అంతకన్నా ఆనందం వేరే ఉండదని అంటుంది. నాకు ఇష్టమేనని చెబుతుంది. దీంతో సిద్ధూ కూడా చాలా ఆనందపడతాడు. రేపే ప్రేరణకు అసలు విషయం చెప్పేయాలని అనుకుంటాడు.

ఇంటికి వెళ్లిన సిద్ధూ వాళ్ల అమ్మానాన్నలకు  నిజం చెబుతాడు. ప్రేరణ తండ్రి రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి దాచేసింది ఈశ్వరీగారేనని చెబుతాడు. నేను ఎంత చెబుతున్నా వినకుండా మీరు అనవసరంగా  ప్రేరణను అపార్థం చేసుకున్నారని అంటాడు. ఆ గణగాడు మీలో విషభీజం నాటాడని...నేను ప్రేరణకు దూరమైతే అప్పుడు ఒంటరిదాన్ని చేసి వాడు ఆడుకుందామని అనుకున్నాడని వివరిస్తాడు. 

ప్రేరణ తండ్రి, గణ తండ్రి ఒకరేనన్న నిజం అందరికీ తెలిసిపోతుందనే ఇదంతా చేశాడని చెబుతాడు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా  ఆమె గురించి నిజం తెలుసుకోకుండా అవమానించారని అంటాడు. మేం ఏం చేసినా నీ మంచి కోసమే కదా అని తండ్రి అనగా....మనల్ని నమ్ముకున్నవాళ్లను  నట్టేట వదిలేయడమేనా  మంచి అని నిలదీస్తాడు. ఇంతలో వాళ్ల చెల్లి అక్కడికి వచ్చి రేపు హోలీ పెట్టుకుని ఇంట్లో ఈ గొడవలు ఏంటని అంటుంది. ఆనందంగా హోలీ ఆడుకుందామని అనగా...నేను మంచి మనుషుల మధ్య హోలీ జరుపుకుందామని అనుకుంటున్నానని మీ అందరినీ కూడా అక్కడికే తీసుకెళ్లాలని అనుకుంటున్నానని అంటాడు. 

దీంతో సిద్ధూ వాళ్ల అమ్మ రానని అంటే...నేను మాత్రం అక్కడికే వెళ్తున్నానని చెప్పి సిద్ధూ వెళ్లిపోతాడు. హోలీకి మంచి  ఏర్పాట్లు చేసి అందరూ ఆనందంగా ఉన్న సమయంలో  ప్రేరణకు ఓ ఫోన్‌కాల్  వస్తుంది. అది చూసి ఆమె కొంత ఆందోళనకు  గురవ్వడంతో  ఈరోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget