అన్వేషించండి
Illu Illalu Pillalu Serial Today March 10th: ప్రేమకు సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చిన ధీరజ్...తండ్రి మాటలతో మరోసారి నొచ్చుకున్న సాగర్
Illu Illalu Pillalu Serial Today Episode March 10th: ప్రేమకు సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చిన ధీరజ్...తండ్రి మాటలతో మరోసారి నొచ్చుకున్న సాగర్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్
Source : Social Media
Illu Illalu Pillalu Serial Today Episode : రామరాజును ఘోరంగా అవమానించినందుకు వనజాక్షి, అతని తమ్ముడు చాలా ఆనందపడుతుంటారు. వాడు ఇదే విధంగా అవమానభారంతో కుళ్లికుళ్లి చచ్చిపోవాలని అనుకుంటారు. మనం పెట్టే టార్చర్‌కు వాడు ముఖం చూపించలేక బయటకురాలేకపోతున్నాడని సంతోషపడుతుంటారు. వాళ్ల మాటలు విన్న అమూల్య వాళ్ల పెద్దమ్మను నిలదీస్తుంది.ఎందుకు మీకు మా అమ్మానాన్న అంటే అంత కోపం అని ప్రశ్నిస్తుంది.
వాళ్లు ఎప్పుడూ మీరు బాగుండాలనే కోరుకుంటారని..మీరు మాత్రం వాళ్ల పతనం చూడాలని అనుకోవడం బాగుండదు పెద్దమ్మ అని అంటుంది. మా అమ్మ ఈ ఇంటి నుంచి వచ్చేసినా ఎప్పుడూ మీ చెడు కోరుకోలేదని బాధపడుతుంది. దీంతో వనజాక్షి ఆమెకు తిడుతుంది. నా మేనల్లుడు ఓ జమిందార్‌కు వారసుడని..అలాంటివాడిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే మీ నాన్న తట్టుకోలేకపోయాడని...కానీ మీనాన్న మా ఇంట్లో పనోడు అయ్యి ఉండి మా చెల్లికి మాయమాటలు చెప్పి లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆ బాధ,అవమానం తట్టుకోలేక మానాన్న చనిపోయాడని అంటుంది.
అలాంటిప్పుడు మాకు ఎంత కోపం ఉండాలని మండిపడుతుంది.మా ఇంట్లో పనిచేసే ఆ రామరాజుగాడు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ క్షమించలేమని...వాడి కుటుంబం సర్వనాశనం అయ్యేంత వరకు వదిలిపెట్టబోమని చెప్పికోపంగా వెళ్లిపోతుంది.
కారు కొనడానికి మీ నాన్నను డబ్బులు అడగకపోయినా పర్వాలేదు గానీ...కనీసం కారు కొంటున్న విషయమైనా మీనాన్నకు చెప్పమని ప్రేమ ధీరజ్‌కు చెబుతుంది.లేకపోతే సాగర్‌బావ చెప్పకుండా ఉద్యోగం కొనుక్కున్నట్లు మీరు కూడా చెప్పకుండా కారు కొనుక్కురాని ఆయన అపార్థం చేసుకుంటారని అంటుంది. ఇప్పుడే వెళ్లి అసలు విషయం చెప్పేద్దామని...మళ్లీ వేరేవాళ్ల ద్వారా ఆయనకు తెలిస్తే బాధపడతారని అంటుంది. అటు నర్మద కూడా తన భర్తకు హితబోధ చేస్తుంది. మీరు వెళ్లి మీ నాన్నగారి కాళ్లుపట్టుకుని క్షమాపణలు కోరితే ఆయన తప్పకుండా క్షమిస్తారని చెబుతుంది.
మా నాన్న గురించి చిన్నప్పటి నుంచి నాకు తెలుసని...ఆయన మొండిపట్టుదల వీడరని సాగర్ చెబుతాడు. అయినాగానీ మీనాన్నను క్షమాపణలు అడగడంలో తప్పులేదని నర్మద ఒప్పించి ఆయన వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ధీరజ్ తండ్రివద్దకు వచ్చి కారు విషయం మాట్లాడతాడు. ఎన్నాళ్లని డ్రైవర్‌గా పనిచేస్తానని...సొంతంగా కారుకొనుక్కుని ట్రావెల్స్ పెట్టుకుందామని అనుకుంటున్నట్లు చెబుతాడు. ఆ మాటలు విన్న బుజ్జమ్మ....మనకు ఎందుకురా ఆ కార్లు...వెళ్లి హాయిగా రైస్‌మిల్లు చూసుకోక అని అంటుంది.
ఇంతలో ప్రేమ కలుగజేసుకుని ధీరజ్ రైస్‌మిల్లు చూసుకుందామని అనుకున్నాడు గానీ....పెద్దబావ చందు రైస్‌మిల్లు చూసుకుంటానని చెప్పడంతో వెనక్కి తగ్గాడని చెబుతుంది. అయినా ఆ కారుతో నువ్వు కష్టాలు పడటం నేను చూడలేనని వెళ్లి రైస్‌మిల్లు చూసుకోమని బుజ్జమ్మ చెబుతుంది. దీంతో రామరాజు కలుగజేసుకుని చిన్నప్పటి నుంచి వాడు మనమాట ఎప్పుడు విన్నాడని...వాడికి నచ్చిందే చేస్తాడు కదా అని అంటాడు. ఇంతకు ముందు కనీసం చెప్పేవాడు కాదని...ఇప్పుడు కారుకొంటున్నట్లు చెప్పాడు సంతోషమని అనడంతో ధీరజ్ ఆనందపడతాడు.
అప్పుడే నర్మద సాగర్‌ను తీసుకుని అక్కడికి వస్తుంది. ఆ విషయం చూసుకోకుండా రామరాజు సాగర్‌ను తిడతాడు. ఆ సాగర్‌లా చెప్పాపెట్టకుండా వేరే వాళ్లలా ఉద్యోగం కొనుక్కుని అక్రమంగా సంపాదించాలని అనుకోవడం లేదు కదా...సొంతంగా కారు కొనుక్కుంటే తప్పేమిలేదని అంటాడు.ఆమాటలు విన్న సాగర్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తన రూమ్‌లోకి వెళ్లిపోయిన సాగర్...నర్మదపై మండిపడతాడు.నాకు ముందే తెలుసు మానాన్న ఇలాగే మాట్లాడతాడని అనగా..తప్పులు నువ్వు చేసి మీనాన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నావేంటని నర్మద భర్తను మందలిస్తుంది.నువ్వు చేసిన పనికి ఆయనకు కోపం రావడంతో తప్పేముందని ప్రశ్నిస్తుంది. దీంతో సాగర్ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. ప్రేమ పుట్టినరోజు కావడంతో ఆమెకు తెలియకుండా ధీరజ్ సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేసి ఆమెను ఆశ్చర్యపరుస్తాడు.
ఇంకా చదవండి
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















