అన్వేషించండి

Guppedantha Manasu జులై 8 ఎపిసోడ్: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్

Guppedantha Manasu July8 Episode 497:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 8 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు జులై 8 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 8 Episode 497)

సాక్షితో కలసి రిషి సార్ సినిమాకు ఎలా వెళతారంటూ జగతి మేడంతో వాదనకు దిగుతుంది వసుధార. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు. షాక్ అయిన వసుధార మీరెప్పుడు వచ్చారంటుంది.
రిషి: మేడం డాడ్ తో మాట్లాడాను, మీకు క్యాబ్ బుక్ చేశాను..అందులో మీరు ఇంటికి వెళ్లండి అని చెప్పేసి వెళ్లిపోతాడు
వసు: మేడం మీ అబ్బాయి అనగానే..
జగతి: మా అబ్బాయే..మా అబ్బాయే..నీకు నువ్వే ప్రాబ్లెమ్ తెలుసా. ప్రేమ ఎప్పుడూ బయటపడాలి, మబ్బుల చాటున దోబూచులాడకూడదు తెలుసా.. మా అబ్బాయి క్యాబ్ బుక్ చేశాడు వెళతాను, బయట మా అబ్బాయి వెయిట్ చేస్తుంటాడు, ఈ కాఫీ బిల్లు కూడా ఈసారి మా అబ్బాయి వచ్చినప్పుడు తీసుకో అని సెటైర్ వేసి వెళ్లిపోతుంది
వసు: నాకు క్లారిటీ లేదా..ఫుల్ క్లారిటీ ఉంది..అసలు రిషి సార్ సాక్షితో సినిమాకు ఎలా వెళతారు
అటు రిషి కార్లో ఇంటికి వెళుతూ వసుగురించి ఆలోచిస్తుంటే..అటు వసు ఆటోలో ఇంటికి వెళుతూ రిషి గురించి ఆలోచిస్తుంది
రిషి: వసుధారని ఎలా అర్థం చేసుకోవాలి
వసు: అసలేంటి రిషి సార్ సాక్షిది అత్యాసే అనుకుందా..రిషి సార్ సాక్షితో సినిమాకు వెళాతానని ఎలా అంటారు, నన్ను ఉడికించడానికే అంటున్నారా, ఒకప్పుడు సాక్షి పేరెత్తితే మండిపడేవారు. అలాంటిది ఇప్పుడు సాక్షితో రెస్టారెంట్ కి ఎలా వస్తారు. 

Also Read: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి

దేవయానికి కాల్ చేస్తున్న సాక్షి..నేనెంత కష్టపడినా నన్ను రిషి అస్సలు పట్టించుకోవడం లేదంటుంది. 
దేవయాని: వచ్చీ రాగానే విజయం ఎదురుకావాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది
సాక్షి: రిషిలో మార్పు వచ్చింది..గౌతమ్ రాకపోతే సినిమా ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుంటే..చివరి నిముషంలో రిషి మనసు మార్చుకున్నాడు
దేవయాని: మనసు తెగిన గాలిపటంలాంటిది. ఎవరు దక్కించుకుంటే వారిదే. ఒక్కో అడుగు రిషికి దగ్గరవుతున్నావ్ సంతోషించు. రాత్రికి రాత్రే రిషి మనసు గెలవాలని కోరుకోకు..అది అత్యాశ అవుతుంది
అటు రూమ్ లో మహేంద్ర, జగతి...సాక్షి, రిషి, వసుధార గురించి మాట్లాడుకుంటారు
మహేంద్ర: సాక్షిని తప్పించుకుంటున్న రిషి వసుధారకి ఎందుకు దగ్గరవడం లేదు
జగతి: ప్రేమగా పెంచుకున్న మొక్క గాలివానకు విరిగిపోతే అది చిగురించి పూలు పోయడానికి టైం పడుతుంది కదా.. ఇది రిషి-వసుల మనసుకి వాళ్ల జీవితానికి సంబంధించిన విషయం. మన ప్రమేయం ఎంతుంటుందో అంతే చేయగలం..కానీ పరిధి దాటి వెళ్లలేం కదా
మహేంద్ర: నిజమే కానీ మనం చూస్తూ ఊరుకోలేం కదా
జగతి: తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు..మొదటికే మోసం వస్తుంది
అటుగా వెళుతున్న గౌతమ్ ని పిలుస్తాడు మహేంద్ర...
మహేంద్ర: ఏంటి గౌతమ్ ఏంటి సంగతులు అంటూనే..మనం ఓ పని చేయాలి..రిషి వసుధార గురించి. నేను నీకో ఐడియా చెబుతాను ఫాలో అవ్వు చాలు..
గౌతమ్: మీరు చెప్పండి అంకుల్ దూసుకెళ్లిపోతాను అంటాడు

Also Read: రాత్రంతా జ్వాల(శౌర్య) ఇంటి ముందే వర్షంలో నిల్చున్న హిమ, తాతయ్య-నానమ్మ కన్నీళ్లకు కరగని శౌర్య

కాలేజీలో అటెండర్ రెండు కప్పుల కాఫీ తీసుకుని వెళుతుండగా ఆపి రిషి క్వశ్చన్ చేస్తాడు. పైన వసుధార-గౌతమ్ సార్ ఉన్నాడని చెప్పడంతో వాళ్లు పైన పనిచేయడం ఏంటనుకుంటూ వెళతాడు రిషి.
రిషి: హలో..ఏం చేస్తున్నారిక్కడ
వసు: కొలుస్తున్నాం సార్..
గౌతమ్: అదేరా మనం...
రిషి: నేను నిన్ను అడిగానా...నువ్వు చెప్పు అంటాడు వసుతో
వసు: అక్కడి నుంచి ఎంతదూరమో ఇక్కడి నుంచి అంతే దూరం అని కొలుస్తున్నాం
రిషి: క్లాసులు ఎగ్గొట్టి ఈ పనేంటి..అసలు నేను నిన్ను ఏమడుగుతున్నానో నీకు అర్థంకావడం లేదంటూ కిందకు వచ్చిన రిషికి మహేంద్ర ఎదురుపడతాడు. పైన ఏం జరుగుతోంది...
మహేంద్ర: మినిస్టర్ గారు వాలంటరీ క్లాసులు స్టార్ట్ చేయమన్నారు...మన క్లాసులు డిస్టబ్ అవకుండా పైన షెడ్ వేద్దాం అనుకుందామనుకుంటున్నా
రిషి: ఈ విషయం నాకెందుకు చెప్పలేదు..వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారు
జగతి: బయటవాళ్లకి చెప్పడం ఎందుకని....
రిషి: ఎవరి పని వాళ్లు చేస్తే బావుంటుంది..మీ స్టూడెంట్ ని కిందకు దిగమని చెప్పండి..( అంత ఎండలో వసుతో ఈ పని చేయించడం అవసరమా అనుకుంటాడు మనసులో)
మహేంద్ర: సేమ్ టు సేమ్ రిషిలా మాట్లాడి ఏడిపిస్తాడు
జగతి: ఏంటి మహేంద్ర మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు.
మహేంద్ర: అవసరం ఉన్నప్పుడు మన కొడుకు వజ్రం అంటావ్..ఇప్పుడేమో నా కొడుకు అంటావా అంటూ సరదాగా అన్నానులే నన్ను కోప్పడకు...
జగతి: ఇంకా చూస్తావేంటి రిషి వచ్చి అరవకముందే వాళ్లిద్దర్నీ కిందకు రమ్మని చెప్పు
తల్లి కొడుకులు ఇద్దరూ సేమ్ టు సేమ్ అనుకుంటూ వెళతాడు మహేంద్ర

Also Read: సాక్షితో షికార్లు చేస్తున్న రిషిని చూసి హర్ట్ అయిన వసు - దేవయాని విషపు ఆలోచన పసిగట్టేసిన జగతి, మహేంద్ర

క్లాస్ చెబుతుంటే నువ్వేంటి మాట్లాడుతున్నావ్ అంటూ ఓ స్టూడెంట్ ని నిల్చోబెట్టిన జగతి..ఇంకోసారి మాట్లాడితే బయటకు పంపిస్తానంటుంది. రిషి సార్ ఏం చేస్తున్నారో అని మనసులో అనుకుంటుంది వసుధార..ఇలా తలుచుకోగానే క్లాస్ బయట నిల్చుని ఉంటాడు రిషి. నిజంగా రిషి సార్ వచ్చారా మళ్లీ రాలేదా...ఒకవేళ నిజమైతే మళ్లీ వెనక్కు వస్తారా అనుకుంటూ కళ్లుమూసుకుని నంబర్లు లెక్కపెడుతుంది. అప్పుడే చూసిన జగతి..వసుధార ఏం చేస్తున్నావ్, స్టేండప్ అని అరుస్తారు.
జగతి: క్లాస్ లో ఎలా ఉండాలో నేను నీకు చెప్పాలా...క్లాస్ రూమ్ లో కళ్లుమూసుకుని వేళ్లు లెక్కపెడుతూ ఏం చేస్తున్నావ్, ఆటలు ఆడుతున్నావా...ర్యాంక్ స్టూడెంట్ వి అందరికీ ఆదర్శంగా ఉండాలి..క్లాస్ నుంచి వెళ్లిపో... పనిష్మెంట్ ఎవ్వరికైనా ఒక్కటే..
వసుధార: బాధగా బుక్స్ తీసుకుని బయటకు వెళ్లిపోతుంది
రిషి-వసు చెరోవైపు వెళ్లిపోతూ...ఒక్కసారి ఆగి వెనక్కు తిరిగి చూసుకుంటారు...
రిషి తన క్యాబిన్ కి వచ్చేసరికి సాక్షి ఉంటుందక్కడ...( గతంలో వసుధార ఇచ్చిన పూవుని చూస్తుంటుంది)
రిషి: సాక్షి ఇక్కడకు ఎందుకు వచ్చావ్..నిన్నెవరు రమ్మన్నారని సీరియస్ అవుతాడు. అసలు నీకు బుద్ధుందా నా క్యాబిన్లో నీకేం పని..నా పర్సనల్ వస్తువులు తీయడానికి నీకేం హక్కుంది..
సాక్షి: ఆ ఫ్లవర్ వాడిపోయింది...
రిషి: నువ్వేం మాట్లాడకు...ఇది నా క్యాబిన్, నాకు నచ్చిన వస్తువులు పెట్టుకుంటాను. నీకెన్నిసార్లు చెప్పాను కాల్ చేయకుండా నా క్యాబిన్ కి రావొద్దని
సాక్షి: నాదే పొరపాటు
రిషి: దేవయాని అన్నమాటలు గుర్తుచేసుకున్న రిషి.. సాక్షి సారీ అంటాడు..నేను అలా అరవాల్సింది కాదు..సడెన్ గా నిన్ను నా క్యాబిన్లో చూసేసరికి ఇరిటేట్ అయ్యాను..ప్లీజ్.. కూర్చో అంటాడు. చెప్పు కాఫీ, కూల్ డ్రింగ్ ఏం తీసుకుంటావ్
రిషి: నీ టైం తీసుకుంటాను
సాక్షి: నాతో ఓ రెండునిముషాల మనస్ఫూర్తిగా మాట్లాడు..( గేరు మారిస్తే తీరు మారిస్తే కానీ నువ్వు నాకు లొంగవని తెలుసు) ఇప్పుడు చూడు ఒక్కో అడుగు నేనెలా దగ్గరవుతానో....

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
వసుధార కళ్లు తిరిగి పడిపోయిందంటూ కంగారుగా వచ్చిన గౌతమ్..రిషి కార్ కీస్ అడుగుతాడు. కార్లో కూర్చున్న వసుధార రిషి సార్ కారు తెస్తే ఆయనకు ఇబ్బందికదా నేను ఆటోలో వెళతాను అంటూ డ్రైవింగ్ సీట్ వైపు చూస్తే రిషి ఉంటాడక్కడ...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Krishna Last Film: కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
Hyderabad Crime News: భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
Embed widget