Guppedantha Manasu జులై 7 ఎపిసోడ్: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి
Guppedantha Manasu July7 Episode 496: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 7 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జులై 7 గురువారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 7 Episode 496)
రిషి ఆలోచనల్లో వసుధార ఉండగా..అక్కడకు ఎంట్రీ ఇస్తాడు ఈగో మాస్టర్.
రిషి: నువ్వు పిలిచావని వచ్చాను అనుకుంటున్నావా...కాఫీ తాగాలి అనిపించింది అందుకే వచ్చాను
వసుధార: పొద్దున్నే ఇంట్లో కాఫీ తాగకుండానే వచ్చారంటే అర్థమవుతోంది అని మనసులో అనుకుంటుంది
రిషి: పొద్దున్నే ఇంట్లోనే కాఫీ తాగొచ్చు కదా అనుకుంటున్నావా
వసు: గులాబీ రెక్కలతో లవ్ సింబర్ వేసిన వసుధార.. అది చూడకూడదనే ఉద్దేశంతో రిషిని వేరే టేబుల్ పై కూర్చోమని చెబుతుంది. ఇక్కడే కూర్చుంటానని రిషి చెప్పడంతో ఆ సింబల్ చెరిపేసి పక్కకు జరుగుతుంది.
రిషి: వసు చెరిపేసిన ఆ గులాబీ రేకులన్నీ సరిచేస్తుంటాడు...ఏంటలా చెబుతున్నావ్ అని వసుధార అంటే మీరంకా ఆర్డర్ చెప్పలేదంటుంది. కిలో టమాటాలు,అరకిలో వంకాయలు అని సెటైర్ వేసిన రిషి..వెల్లి కాఫీ తీసుకురా అంటూనే వసు పేర్చినట్టే గులాబీ రేకులతో హార్ట్ సింబర్ పేరుస్తాడు.
వసు: దీన్ని నేను ఫొటో తీసుకోవచ్చా అని అడుగుతుంది
రిషి: నా హార్ట్ ని ముక్కలు చేసి గులాబీ రెక్కల హార్ట్ ని మాత్రం ఫొటో తీసుకుంటావా అనుకుంటూ వాటిని చెరిపేస్తాడు.
వసు: లోపల నుంచి కాఫీ తీసుకొచ్చిన వసుధార..రిషితో పాటూ సాక్షిని చూసి షాక్ అవుతుంది.
రిషి: చేసేవన్నీ చేసి సారీ అంటావేంటి, సారీ అన్న పదాన్ని తప్పులు చేసి కవర్ చేసేందుకే అలా వాడుతుంటారు అంటూ వసుని చూస్తూ సాక్షితో మాట్లాడుతున్నట్టు చెబుతాడు
వసు: అసలు సాక్షి ఇక్కడకు ఎందుకు వచ్చింది, అనుకోకుండా వచ్చిందా, రిషి సార్ పిలిస్తే వచ్చిందా..
సాక్షి: హలో వసుధార అని సాక్షి అంటే..హలో మేడం అంటుంది వసుధార.. మేడం అంటున్నావేంటని సాక్షి అంటే..
వసు: ఇక్కడ మీరు మా కస్టమర్ అని కౌంటర్ ఇస్తుంది వసుధార..
రిషి: మరో కాఫీ ప్లీజ్ అంటాడు రిషి... వసు వెళ్లబోతూ అక్కడే నిల్చుండిపోతుంది...
సాక్షి: మనం సినిమాకు వెళదామా, కాలేజీకి హాలిడే కదా..ప్లీజ్ రిషి అంటూ వసుధార వైపు చూస్తుంటుంది.
రిషి: గౌతమ్ కూడా ఏదో ప్లాన్ చేశాడు..తను వస్తుంటాడేమో ఈ పాటికి...
వసు: అంటే రిషి సార్ సాక్షితో సినిమాకు వెళతారా ...
సాక్షి: నా మనసేం బాలేదు సినిమాకు వెళదాం ప్లీజ్ రిషి..
రిషి: ఏంటి ఇలా ఇరుక్కుపోయాను..కాఫీ వచ్చింది తీసుకో
సాక్షి: కాఫీ కోసం వస్తావా...వసు కోసం వస్తావో ఎవరికి తెలుసు..ఇప్పుడిప్పుడే నాతో మాట్లాడుతున్నావ్ అనుకుంటూ.. నీది ఎంత మంచి మనసో అడగ్గానే సినిమాకు ఒప్పుకున్నావ్ అంటుంది..
వసు: సాక్షితో కలసి సినిమాకు వెళ్లినట్టు...కార్లో సీట్ బెల్ట్ పెట్టినట్టు ఊహించుకుని ఉలిక్కి పడుతుంది వసుధార
రిషి: గౌతమ్ వస్తానన్నాడు ఇంకా రాలేదేంటో అనుకుంటాడు
సాక్షి: మా మధ్య గౌతమ్ ఏంటో..ఎలాగైనా గౌతమ్ ని ఆపేయమని దేవయాని ఆంటీకి మెసేజ్ పెడతా అనుకుంటుంది..
అటు వసుధార బయటకు వెళ్లి రిషి కారు టైర్లో గాలి తీసేస్తుంది...
Also Read: డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!
దేవయాని: సాక్షికి రాక రాక మంచి అవకాశం వచ్చింది..ఈ గౌతమ్ పానకంలో పుడకలా వెళ్లి చెడగొడతాడు అనుకుంటూ అక్కడకు వచ్చిన గౌతమ్ తో చిన్న హెల్ప్ చేయి గౌతమ్ అంటుంది.
గౌతమ్: చెప్పు పెద్దమ్మా
దేవయాని: స్టోర్ రూమ్ ని లైబ్రరీ చేద్దాం అనుకుంటున్నాను..ఆ పని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి
గౌతమ్: ఎప్పుడు
దేవయాని: ఇప్పుడే
గౌతమ్: ఇప్పుడేనా...ఈరోజు రిషితో ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది..
దేవయాని: పెద్దమ్మా ఆజ్ఞాపించండి అన్నావ్..నువ్వు వెళితే నా విలువ ఇంతేనా, నేను చెబితే గౌతమ్ వినలేదని నా మనసు బాధపడుతుంది
గౌతమ్: ఈ పనిని రేపటికి పోస్ట్ పోన్ చేద్దామా..
దేవయాని: పనులు వాయిదా వేయడం నాకు ఇష్టం లేదు..
గౌతమ్: ఈ పని రేపటికి వాయిదా వేయండి
దేవయాని: నువ్వు వెళ్లాలి అనుకుంటే వెళ్లు నాకేం బాధలేదు..ఆ పని నేను చేసుకుంటాను
గౌతమ్: ఇక్కడే ఉంటాను అనుకుంటూ లోపలకు వెళ్లిపోతాడు... సారీ రా రిషి నువ్వు తిట్టినా నేనేం చేయలేను పెద్దమ్మ మాట కాదనలేను అనుకుంటాడు..
లోపలి నుంచి మరో వెయిటర్ వసుధారకి కాల్ చేసి వాళ్లు వచ్చేస్తున్నారని చెబుతుంది.
సాక్షి: రిషితో సినిమాకు వెళ్లబోతున్నాను..ఈ పాటికి దేవయాని ఆంటీ గౌతమ్ ని ఆపేసి ఉంటుంది అనుకుంటుంది
వసుధార: ఇంతలో బయటకు వచ్చిన వసుధార..కారు దగ్గరకు వచ్చి బై సర్ , బై సాక్షి అంటుంది. ఇప్పుడు సాక్షి అంటుందేంటి అనుకుంటున్నావా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేశాను కదా అంటుంది
రిషి: పెద్దమ్మ వాయిస్ మెసేజ్ పెట్టిందేంటని ఓపెన్ చేసిన రిషి.. గౌతమ్ రానన్నాడు నేను ఇప్పుడు బుక్కైపోయాను అనుకుంటాడు.
వసు: మీ కార్ టైర్ పంచరైంది..( పంచరైందో ఎవరో చేశారో అని సాక్షి అంటుంటే..నాక్కూడా అదే డౌట్ ఉందంటాడు రిషి)
ఇప్పుడు గాలి ఎలా సార్
రిషి: బెలూన్స్ లో గాలి ఊదినట్టే ఊదుకుని వెళతాను..
సాక్షి: రిషి ఎందుకిక్కడ టైమ్ వేస్ట్...క్యాబ్ లో వెళదాం పద
రిషి: సారీ సాక్షి..గౌతమ్ రావడం లేదంట నాక్కూడా సినిమా చూసే మూడ్ లేదు..( వసుధార నవ్వుకుంటుంటుంది)
అప్పుడే అక్కడకు జగతి, మహేంద్ర వస్తారు..ముగ్గుర్నీ చూసి ఆశ్చర్యపోతారు...
మహేంద్ర: నువ్వంటి ఇక్కడ
రిషి: కారు టైర్ పంచరైంది..మీరు సాక్షిని తీసుకెళ్లి వాళ్లింటిదగ్గర డ్రాప్ చేయండి..
మహేంద్ర: రామ్మా సాక్షి వెళదాం..
సాక్షి: బై రిషి అని కోపంగా చెప్పేసి వెళ్లిపోతుంది
మేడం మీరు లోపలకు రండి అంటుంది వసుధార...
జగతి: మీరెలా వెళతారు
రిషి: మీరు లోపలకు వెళ్లండి మేడం..టైర్ పంచరైందో, వసుధారే చేసిందో తెలియదు కానీ మొత్తానికి సాక్షితో సినిమాకు వెళ్లడాన్ని తప్పించుకున్నాను...
వసు: సాక్షి ఒక్కసారి సారీ చెబితే కరిగిపోతారా...నేను ఎన్నిసార్లు చెప్పి ఉంటాను
జగతి: నా ముందు రెండు కాఫీలు ఎందుకున్నాయ్...సాక్షితో మా అబ్బాయి సినిమాకు వెళితే నీకేంటి..
వసు: ఆ ఇంట్లోకి వెళ్లాక మీరు మారిపోయారు మేడం. రిషి సార్ తో ఇన్నేళ్లకు నేను కూడా సినిమాకు వెళ్లలేదు..ఆమె ఎలా వెళుతుంది. సర్ పక్కనే కూర్చుంటేనే కడుపు మండిపోయంది..అలాంటిది రెండు గంటల పాటూ రిషి సార్ పక్కనే కూర్చుంటే నాకెలా ఉంటుంది
జగతి: ఇది ఎవరి సమస్య...నీదా-రిషిదా- నీ మీద నీకు క్లారిటీ ఉంటే ఇలాంటి కడుపుమంటలు ఉంటాయా
వసు: క్లారిటీ ఉంది కాబట్టే కడుపుమంట మేడం... అసలు రిషి సార్ సినిమాకు ఎలా వెళతారు చెప్పండి మేడం...
రిషి వచ్చి పక్కనే నిల్చుంటాడు...షాక్ అయిన వసుధార మీరెప్పుడు వస్తారు..
రేపటి(శుక్రవారం)ఎపిసోడ్ లో
ఏం చేస్తున్నారంటే కొలుస్తున్నాను సార్ అంటుంది. క్లాసులు మానేసి ఇక్కడేం చేస్తున్నావ్ అని కోప్పడిన రిషి క్లాస్ కి పంపిస్తాడు. అటు క్లాస్ రూమ్ లో కూర్చుని జగతి మేడం చెబుతున్న లెసన్ వినకుండా కళ్లు మూసుకుని రిషి కోసం ఆలోచిస్తుంటుంది. మొత్తం గమనించిన జగతి క్లాస్ నుంచి బయటకు పంపించేస్తుంది. వసుధారపై జగతి కోప్పడడం రిషి చూస్తాడు.