అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తాళి తీసి విశ్వ మొహం మీద కొట్టిన అమూల్య! నిజం తెలుసుకున్న ఫ్యామిలీ!

Illu Illalu Pillalu Serial Today Episode March 16th విశ్వక్ తన మెడలో తాళి కట్టలేదు అని అమూల్య చెప్పడం అమూల్యని రామరాజు ఇంటికి తీసుకెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode విశ్వక్ వల్లీ చెప్పిన ప్లాన్ ప్రకారం వేరే అమ్మాయితో చనువుగా ఉంటూ ధీరజ్, ప్రేమ, కామాక్షిల కంట పడతాడు. తన చెల్లిని మోసం చేస్తున్నాడని ధీరజ్ విశ్వక్‌ని చితక్కొట్టి ఇంటికి తీసుకొస్తాడు. అందరి ముందు పంచాయితీ పెడతాడు. అందరితో తన చెల్లిని మోసం చేస్తూ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్తాడు. దానికి విశ్వక్‌ తిరుగున్నానురా.. ఒకమ్మాయితో కాదు వంద మందితో తిరుగుతా అని అంటాడు. 

ధీరజ్ కోపంగా నా చెల్లి జీవితం నాశనం చేస్తే ఊరుకుంటా అనుకున్నావా అని అడుగుతాడు. దానికి విశ్వక్ ఓరేయ్ పిచ్చోడా నేను నీ చెల్లిని పెళ్లి చేసుకుందే దాని జీవితం నాశనం చేయడానికి.. మీ మీద పగ తీర్చుకోవడం కోసంరా.. అని అంటాడు. విశ్వక్ అలా అనడంతో అమూల్య అన్నలు విశ్వక్ మీదకు వెళ్తారు. దాంతో విశ్వక్ ఏంట్రా మీదకు వస్తున్నారు.. మీరు ఇలా చేస్తే మీ చెల్లికి విడాకులు ఇచ్చేస్తా.. ఇప్పటి వరకు నాతో ఉన్నదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.. అప్పుడు మీ చెల్లి జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిపోతుంది. పర్లేదు అంటే నా మీద చేయి వేయండ్రా అని విశ్వక్ అంటాడు. నా చెల్లి జీవితం నాశనం చేస్తా అంటే నిన్ను ఎలా బతకనిస్తా అనుకున్నావ్‌రా అని ధరజ్ ఆవేశంగా పెద్ద బండరాయి పట్టుకొని వచ్చి విశ్వక్ మీదకు వెళ్లబోతే అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు. రారా నీకు నిజంగా దమ్ముంటే రామరాజు కొడుకు అయితే వచ్చి చంపరా అని విశ్వక్ అంటాడు. 

ధీరజ్ ఎంతకీ ఆగకపవడంతో అమూల్య ధరీజ్‌ని ఆపి అన్నయ్యా ఆగు అన్నయ్యా వీడు అసలు నా మెడలో తాళి కట్టలేదు అన్నయ్యా అని చెప్పేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఏంటి అని రామరాజు అడుగుతాడు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు శ్రీవల్లి నవ్వుకుంటుంది. అవును వీడు నా మెడలో తాళే కట్టలేదు.. వీడికి నాకు సంబంధం లేదు.. వీడు నా భర్తే కాదు.. మరి వీడు నా జీవితాన్ని అన్యాయం చేసేది ఏంటి.. వీడు ఏమైపోతే మనకేంటి.. ఎవరితో తిరిగితే మనకేంటి.. వీడిని చంపి నువ్వు జైలు పాలు అవ్వడం ఏంటి అన్నయ్యా..వదిలేయ్ అని అమూల్య అంటుంది. వీడు నీ మెడలో తాళి కట్టకపోతే నీ మెడలో తాళి ఎందుకు ఉందే అని వేదవతి అడుగుతుంది. విశ్వక్ మనసులో దీని కోసమే కథ ఇక్కడి వరకు తీసుకొచ్చా అని అనుకుంటాడు.

రామరాజు, వేదవతి అమూల్యని ఏమైందని అడుగుతారు. బామ్మ, ప్రేమ తల్లి అందరూ గొడవలకు భయపడి ఇలా పెళ్లి కాలేదు అని చెప్పొద్దు అమ్మా అని అంటారు. ఇంతలో ప్రేమ అమూల్య చెప్పింది నిజమే.. అని అంటుంది. నర్మద కూడా అమూల్యకి అసలు పెళ్లే కాలేదు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. అమూల్య తాళి వెనక ఏదో మతలబు ఉందని అర్థమవుతుంది.. ఆ విషయం మీకు తెలుసు అని అర్థమవుతుంది. ఎందుకు తన మెడలోకి తాళి వచ్చిందో చెప్పండే అని వేదవతి అడుగుతుంది. అమూల్య చెప్పు అమూల్య మీ అన్నయ్య టెన్షన్ పడుతున్నాడు.. మీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చిందో చెప్పు అని విశ్వక్ అడుగుతాడు. అమూల్య నోరు విప్పకపోవడంతో వేదవతి అమూల్యని కొడుతుంది. ఇంతలో ప్రేమ ధీరజ్ చేయి పట్టుకొని కంగారు నేనే చెప్పాను అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ధీరజ్ ప్రేమ చేయి విడిపించుకొని ప్రేమని కోపంగా చూస్తాడు. 

రెండు కుటుంబాల మధ్య మళ్లీ గొడవ జరుగుతుంది. ఒకర్ని ఒకరు తిట్టుకుంటారు. ప్రేమ జరిగింది చెప్పబోతే ధీరజ్ మాట్లాడొద్దని అనేస్తాడు. రామరాజు అందర్నీ ఆపేసి కూతురి దగ్గరకు వెళ్లి నీకు నిజంగా పెళ్లి అవ్వలేదు కదా అని అడుగుతాడు. అవును అని అమూల్య అంటే ఆ తాళి తీసి వాడి మొహం మీద కొట్టు అని అంటాడు. వేదవతి కూడా అలానే చేయమని అంటుంది. దాంతో అమూల్య తాళి తీసి విశ్వక్ మీదకి విసిరేస్తుంది. రామరాజు కూతుర్ని తీసుకొని ఇంట్లోకి వెళ్లిపోతాడు. ధీరజ్ షాక్‌లో ఉంటే ప్రేమ ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పబోతే ధీరజ్ ఏం చెప్పొద్దు అని ఛీ కొట్టి వెళ్లిపోతాడు. ప్రేమ చాలా ఏడుస్తుంది. 

రామరాజు ఇంట్లో అందరూ బాధగా ఉంటారు. ప్రేమ ఏడుస్తూ ఉంటే నర్మద వెళ్లి ధైర్యం చెప్పి లోపలికి తీసుకొస్తుంది. వేదవతి అమూల్యతో ప్రేమ నీకు ఎందుకు అలా చెప్పిందే అని అడుగుతుంది. పెళ్లి ముందు రోజు నువ్వు వాడితో ఎందుకు వెళ్లిపోయావే అని కామాక్షి అడుగుతుంది. నేను వాడితో వెళ్లిలేదు.. వాడే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు అని అమూల్య చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. తన గురించి తెలిసిపోతుందని శ్రీవల్లి కంగారు పడుతుంది. నిన్ను వాడు కిడ్నాప్ చేశాడా అని ధీరజ్ అడుగుతాడు. అవును అన్నయ్యా నన్ను కిడ్నాప్ చేసి బంధించి.. నా క్యారెక్టర్ మీద నింద వేస్తాను అని బెదిరించాడు అని మొత్తం చెప్తుంది.

అంత రాత్రి నువ్వు బయటకు ఎందుకు వెళ్లావ్ అని సాగర్ అడిగితే నర్మద శ్రీవల్లి వైపు చూస్తుంది. నువ్వే వెళ్లావా నిన్ను ఎవరైనా తీసుకెళ్లారా అని చందు అడుగుతాడు. ప్రేమే కదా అని ధీరజ్ అడుగుతాడు. నువ్వు ప్రేమ వదినని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అన్నయ్యా ఈ విషయం గురించి వదినకు అసలు తెలీదు.. విశ్వక్‌తో మాట్లాడటానికి నన్ను తీసుకెళ్లింది ప్రేమ వదిన కాదు.. అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget