అన్వేషించండి

chinni serial today march 16th: చిన్ని సీరియల్: దేవా నిజస్వరూపం కూతురికి చెప్పేసిన బాలరాజు! మ్యాడీ విడాకులు ఇవ్వకుండా చిన్ని ఆపుతుందా!

chinni serial today episode march 16th మ్యాడీ తనకు విడాకులు ఇవ్వనున్నాడు అని చిన్ని బాలరాజుకి చెప్పడం.. దేవా పార్వతి, కావేరిలను చంపిన విషయం చిన్నికి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode ప్రమీల చిన్నితో మ్యాడీ నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడు అని చెప్తుంది. చిన్నితో పాటు తన ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. ఎంత చెప్పినా మ్యాడీ వినడం లేదు అని ప్రమీల అంటుంది. నాగవల్లి, దేవా బామ్మర్ది వాడినే సమర్దిస్తున్నారు. విడాకులు తీసుకొని విడిపోయే వాళ్లు మళ్లీ కలవలేరు.. నువ్వే ఏదో ఒకటి చేసి వాడి మనసు మార్చాలి.. నువ్వు తప్ప ఇంకెవరూ వాడి మనసు మార్చలేరు.. నువ్వే ఏదో ఒకటి చేసి నీ కాపురం నిలబెట్టుకో తల్లీ అని ప్రమీల చిన్నికి చెప్తుంది. 

చిన్ని కోపంగా రాత్రి మ్యాడీ కారుకి ఎదురుగా వెళ్తుంది. మ్యాడీ బయటకు వచ్చి కళ్లు కనిపించడంలేదా అంటే కనిపిస్తున్నాయ్.. నాకు విడాకులు ఇవ్వాలి అనుకున్నది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అని మ్యాడీ అంటాడు. అంత తప్పు నేనేం చేశాను అని అంటే నువ్వే చేసే ప్రతీది తప్పే ప్రతీదీ మోసమే అని అంటాడు. నేను చిన్ని అని చెప్పలేదు అంతకంటే తప్పు మోసం ఏం చేయలేదు..  మా అమ్మ నిర్దోషి అని చెప్పిన తర్వాత నేనే చిన్ని అని చెప్పాలి అనుకున్నా అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు నా దృష్టిలో చీటర్‌వే అందుకే నువ్వు నా జీవితంలో నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని నీకు విడాకులు ఇస్తా అని అంటాడు.

మ్యాడీ తప్పు ఎవరి మాటలో నమ్మి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటుంది. నేను ఎవరి మాటలు వినడం లేదు.. నువ్వే చిన్ని అని తెలిసిన తర్వాత మానసికంగా మన మధ్య బంధం తెగిపోయింది.. ఇప్పుడు విడాకులు ఇచ్చి శాశ్వతంగా బంధం తెంచుకుంటా అని అంటాడు. చిన్ని వద్దని ఎంత చెప్పినా మ్యాడీ వినడు. నేను నీకు విడాకులు ఇవ్వడం ఖాయం మనం  విడిపోవడం ఖాయం అని అంటాడు

చిన్ని చాలా ఏడుస్తుంది. శ్రేయ దగ్గరకు పార్టీ ఇవ్వు మరదలు మ్యాడీ చిన్నికి విడాకులు ఇస్తున్నాడు అని అంటుంది. నాకు నమ్మకం లేదు.. ఆ చిన్ని ఏమైనా చేస్తుంది అని శ్రేయ అంటుంది. ఈ విషయంలో చిన్నికి అంత సీన్ లేదు.. మీ మామయ్య పెద్ద పెద్ద లాయర్లను పెడతారు. లైఫ్‌లో అది మ్యాడీకి దగ్గర అవ్వలేదు..ఈ లోపు నువ్వు మ్యాడీకి దగ్గర అవ్వాలి.. చిన్నిని ఎంత ప్రేమించాడో అంతకు డబుల్ నిన్ను మీ బావ ప్రేమించేలా చేయాలి అని లోహిత అంటుంది. నువ్వు చెప్పినట్లే చేస్తా బావకి దగ్గర అవుతా అని శ్రేయ అంటుంది. 

ఆఫ్ టికెట్ బాలరాజు నడవడానికి సాయం చేస్తుంటాడు. ఇంతలో చిన్ని అక్కడికి వస్తుంది. చిన్ని డల్‌గా ఉండటం చూసి బాలరాజు వెళ్లి పడిపోబోతే చిన్ని పట్టుకుంటుంది. చిన్ని మెడలో తాళి చూసి బాలరాజు షాక్ అయిపోతారు. మెడలో మంగళసూత్రం ఏంటమ్మా అంటే నీకు పెళ్లి అయిందా అని అంటే అయింది అని ఆఫ్ టికెట్ చెప్తాడు. అవునా అని బాలరాజు చాలా సంతోషపడతాడు. ఇంత కాలం ఈ శుభవార్త ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అల్లుడు గారు ఏం  చేస్తుంటారు అని అడుగుతాడు. చిన్ని చాలా కంగారు పడుతుంది. చిన్ని ఎవర్ని పెళ్లి చేసుకుందిరా అని అడిగితే దేవా కొడుకు మహిని పెళ్లి చేసుకుంది అన్న అని ఆఫ్ టికెట్ చెప్తాడు. బాలరాజు షాక్ అయిపోతాడు.

చిన్ని వాడిని చేసుకుంటే నువ్వు ఎలా ఊరుకున్నావ్‌రా అని బాలరాజు ఆఫ్ టికెట్ని తిడుతాడు. చిన్ని వెళ్లింది అత్తారింటికి కాదురా మృత్యువు ఒడిలోకి.. ఆ దేవా నిన్ను బతకనివ్వడు అమ్మా ఏదో ఒక రోజు నీ ప్రాణం తీస్తాడు అంటాడు. ఎందుకు నాన్న అని చిన్ని అడిగితే మా అమ్మని చంపింది వాడే కాబట్టి అని మొత్తం చెప్తాడు. మీ అమ్మనే కాదమ్మా మహి వాళ్ల అమ్మ పార్వతిని చంపింది కూడా వాడే అని చెప్తాడు. ఆ నేరం మీ అమ్మ మీద మోపి మీ అమ్మని జైలుకి పంపాడు.. అప్పట్లో నాకు వాడితో ఉన్న స్నేహం వల్ల మీ అమ్మ జైలుకి వెళ్లడానికి నేను కారణం అయ్యాను.. పార్వతి, కావేరిని చంపింది వాడే అని నీకు తెలుసు అనుకుంటున్నాడు.. నిర్దాక్షిణ్యంగా భార్యని చంపిన వాడు వాడి కొడుకుతో నీ నిన్ను చంపిస్తాడు అని బాలరాజు అంటాడు.

మహి చాలా మంచోడు అని ఆఫ్ టికెట్ అని చెప్తాడు. చిన్ని మహిని ప్రేమించిందని చెప్తాడు. మహిని నేను ఇప్పుడు ప్రేమిస్తే మహి చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు అని గుడిలో జరిగిన పెళ్లి గురించి చెప్తుంది. మహిని నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అని తెలియగానే గుండెలో దడ పుట్టింది కానీ మహి మంచోడు అని తెలియగానే సంతోషంగా ఉందని అంటాడు. మహి తనకు విడాకులు ఇవ్వనున్నాడు అన్న విషయం చిన్ని చెప్తుంది. దాంతో బాలరాజు దేవా, నేను చేసినా పాపాలకు మీ జీవితాలు నాశనం అవ్వడానికి వీల్లేదు.. మహికి విషయం చెప్తాను అని బాలరాజు అంటే చిన్ని ఆపేస్తుంది. మహి ఇప్పుడు వినే పరిస్థితిలో లేడు అని చెప్తుంది. నేను ఇష్టపడే వాళ్లు అంతా నాకు దూరం అవ్వాలి అన్నది నా జాతకంలోనే ఉంది అని ఏడుస్తుంది. నీ తలరాతని నువ్వే మార్చుకోవాలి.. ఎలా అయినా సరే నీ భర్తని నువ్వే మార్చుకోవాలి.. చిన్నప్పుడు మిస్ అయిన తండ్రిని దేవా చెర నుంచి రక్షించుకున్నావ్,. కళ్ల ముందు ఉన్న నీ భర్తని దక్కించుకోలేవా అని కూతురికి బాలరాజు ధైర్యం చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gunde Ninda Gudi Gantalu Mai 12th Episode:బాలుకి ఘోర అవమానం! రోహిణికి షాక్ ఇచ్చిన మీనా - గుండెనిండా గుడిగంటలు మే 12 ఎపిసోడ్
బాలుకి ఘోర అవమానం! రోహిణికి షాక్ ఇచ్చిన మీనా - గుండెనిండా గుడిగంటలు మే 12 ఎపిసోడ్
Podharillu Serial Today May 12th: మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?
పొదరిల్లు: మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?
Meghasandesam Serial Today May 12th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రికి వార్నింగ్‌ ఇచ్చిన నక్షత్ర – సునందను కలిసిన గగన్‌, భూమి
‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రికి వార్నింగ్‌ ఇచ్చిన నక్షత్ర – సునందను కలిసిన గగన్‌, భూమి
Nindu Manasulu Serial Today May 12th: నిండు మనసులు: సిద్ధూ ప్రపోజల్‌ వీడియోని చూసేసిన ప్రేరణ! ఎమోషనల్ అవుతూ సిద్ధూకి ఏం చెప్పిందో తెలుసా!
నిండు మనసులు: సిద్ధూ ప్రపోజల్‌ వీడియోని చూసేసిన ప్రేరణ! ఎమోషనల్ అవుతూ సిద్ధూకి ఏం చెప్పిందో తెలుసా!
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Paper Leak: NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
Vijay Astrologer: విజయ్ కూడా అంతే - ఆస్థాన జ్యోతిష్యుడికి సీఎంవో బాధ్యతలు !
విజయ్ కూడా అంతే - ఆస్థాన జ్యోతిష్యుడికి సీఎంవో బాధ్యతలు !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Ranveer Singh: శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?
శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Trisha Krishnan: మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget