News
News
X

Guppedantha Manasu జులై 5 ఎపిసోడ్: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu July5 Episode 494: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 5 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు జులై 5 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 5 Episode 494)

కాలేజీలో వసుధారని ఆపి మరీ వాదన పెట్టుకుంటుంది సాక్షి. సోమవారం ఎపిసోడ్ ఈ సీన్ తో ముగిసి..మంగళవారం ఎపిసోడ్ సేమ్ సీన్ తో ప్రారంభమైంది.
వసుధార: నువ్వు వెళుతున్న దారి కరెక్ట్ కాదు..కానీ మూర్ఖులు చెప్పింద వినరు
సాక్షి: ఒకరు చెప్పింది వినడం నాకు అలవాటు లేదు...నాపై నాకు నమ్మకం ఉంది..
వసుధార: కాన్ఫిడెన్స్ ఓకే..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నీ ఆలోచనల్లో కుట్రలు కుతంత్రాలున్నాయి...
సాక్షి:నా దగ్గర ప్రేమ ఉంది
సాక్షి:లైబ్రరీలో దొరికే పుస్తకం కాదు ప్రేమంటే..దాన్ని కొట్టేయలేం, కొనుక్కో లేం. ప్రేమ సహజంగా పుట్టాలి, స్వతహాగా ఉండాల్సిన ఫీలింగ్ ని తెచ్చిపెట్టుకుంటే సాక్షి: దాన్ని ప్రేమ అనరు. ప్రేమ అనేది మంచి పదం..దాన్ని అనవసరంగా కలుషితం చేయొద్దు. లైబ్రరీలో జరిగింది అప్పుడే మరిచిపోయావా...అనవసర ప్రయత్నాలు చేయకు...
సాక్షి: గెలిచానని పొంగిపోకు వసుధార...గెలుపు పర్మినెంట్ కాదు...రాబోయే గెలుపు నాదే...
వసుధార: చెప్తే వినని వాళ్లను ఏమంటారో నువ్వే తెలుసుకో...ఇంత చెప్పాక కూడా నీకు అర్థం కాకపోతే నేనేం చెప్తాను... ఎప్పుడో అప్పుడు నీ మెడపై చేయి పెట్టి నీ దారి తప్పు అని చెప్పేవరకూ తెచ్చుకునేలా ఉన్నావ్...
సాక్షి: అంటే మెడపట్టి గెంటేస్తావా
వసుధార: నీకు అలా అర్థమైందా..మొత్తానికి అయితే విషయం అర్థమైందా..అదీ సంగతి సాక్షి... అయినా ఇంతసేపు మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదూ అని సాక్షి చేయందుకుని గుడ్ మార్నింగ్ అంటుంది. హారన్ కొడితే మనుషులు తప్పుకుంటారేమో దురదృష్టం తప్పుకోదు...ఆల్ ది బెస్ట్...బై....
చెప్తాను నీ సంగతి చెప్తాను వసుధార అనుకుంటుంది సాక్షి...

Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!

వసుధార క్లాస్ రూమ్ లో అడుగుపెట్టగానే స్టూడెంట్స్ అందరూ కంగ్రాంట్స్ చెబుతారు. నీకోసం పెద్ద పార్టీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ కుదర్లేదు అంటుంది పుష్ప. ఈ మాత్రం దానికే పార్టీలెందుకు అంటుంది వసుధార. రిషి సార్ ఇంకా రాలేదా..కాలేజీలో కనిపించలేదు అనుకుంటుంది వసుధార. ఇంతలో జగతి మేడం క్లాస్ రూమ్ కి వస్తారు. సాక్షి కాలేజీకి ఎందుకు వచ్చింది, సాక్షి వచ్చిన విషయం తెలియకపోతే నేను టెన్షన్ పడేదాన్ని కాదు కానీ తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోపోతే ఎలా అనుకుంటూ క్లాస్ రూమ్ లోంచి బయటకు వెళ్లేందుకు పర్మిషన్ అడుగుతుంది. అర్జెంట్ మేడం ప్లీజ్ అనగానే సరే వెళ్లు అని చెబుతారు జగతి మేడం. వసుని చూసి నవ్వుకుంటుంది జగతి..
మహేంద్ర: సాక్షి ఇప్పుడొచ్చిందేంటి...ఈ సాక్షి పెద్ద తలనొప్పిగా తయారైంది అనుకుంటాడు మహేంద్ర. 
రిషి రూమ్ లోకి విసురుగా వెళ్లిన సాక్షి పేపర్ తీసుకుని రిషి టేబుల్ పై విసుకుంది. సాక్షి ఏంటమ్మా ఇది అని మహేంద్ర అడుగుతాడు. చూస్తే కదా తెలుస్తుంది అంటుంది. ఇంతలో వసుధార కూడా వస్తుంది.
సాక్షి: నేను లోపలకు రాగానే అంకుల్ వచ్చారు, వెంటనే వసుధార వచ్చింది...వీళ్లంతా ప్లాన్ చేసుకున్నారా అని మనసులో అనుకుంటుంది. వసుధార చెప్పు ఎంటి పని అన్న రిషిపై సాక్షి ఫైర్ అవుతుంది...నేను ముందు వచ్చాను కదా 
రిషి: ఎవరు ముందు ఎవరు వెనుక అని కాదు...ఏ పని ముఖ్యం అన్నదే ఇంపార్టెంట్
సాక్షి: మీ ఇద్దరి ఫొటో పేపర్లో వచ్చింది..ఏంటిది
మహేంద్ర: ఫొటో పేపర్లో వస్తే తప్పేముంది
సాక్షి: ఈ విషయం రిషి చెబితే బావుంటుంది
రిషి: డాడ్ చెప్పినదాంట్లో తప్పేముంది...తను విజయం సాధించింది..అభినందించాం
మహేంద్ర: కొన్ని అర్థం చేసుకోవాలి..
సాక్షి: ఇలా పేపర్లో ఫొటోలు వస్తే ఏమనాలి
రిషి: ఎవ్వరు ఏమనుకుంటారో నాకు అనవసరం...వసు ప్లేస్ లో ఎవ్వరున్నా ఇదే చేస్తాను
మహేంద్ర, వసుధారని ఎందుకొచ్చారని ప్రశ్నించడంత మళ్లీ మాట్లాడుతాం అని రిషికి చెప్పేసి  అక్కడి నుంచి వెళ్లిపోతారు... బయటకు వెళ్లిన వసుధార మెసేజ్ చేస్తుంది. మీతో మాట్లాడాలి నాకు టైమ్ ఇవ్వండి సార్ అని మెసేజ్ చేస్తుంది...
మహేంద్ర: రిషికి చాలా పనులుంటాయ్...చిన్న చిన్న వాటికి డిస్టబ్ చేయొద్దు
సాక్షి: ఇది చిన్న విషయం ఎందుకవుతుంది..దండలు ఎప్పుడు వేస్తారు, ఎప్పడు మార్చుకుంటారో తెలుసా...
సాక్షిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోతాడు మహేంద్ర....
రిషి: కోపం వచ్చినప్పుడు ఏదో రకంగా చూపించినప్పుడు..ప్రేమను కూడా ఏదో రకంగా ఎక్స్ ప్రెస్ చేసేవాళ్లుంటారన్న గౌతమ్ మాటలు గుర్తుచేసుకున్న రిషి... ఈ  ఫొటో నాకేమైనా చెబుతోందా అనుకుంటాడు

Also Read: వసు వేసిన పూలదండ చూసి మురిసిన రిషి, పేపర్లో రిషిధార ఫొటో చూసిన దేవయాని-సాక్షికి షాకిచ్చిన జగతి-వసుధార

అటు కాలేజీ ఎంట్రన్స్ లో నిల్చున్న వసుధార..సాక్షి దగ్గర్నుంచి పేపర్ లాక్కుంటుంది. ఒక్కొక్కప్పుడు లాక్కోవడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది సాక్షి.. ముందు ముందు నీకే తెలుస్తుందిలే అంటుంది. ఈ ఫొటోలో నేను బావున్నానా, రిషి సార్ బావున్నామా...ఇద్దరం బావున్నాం కదా... జోడీ......
సాక్షి: షటప్ వసుధార
వసు: నీపై అస్సలు కోపం లేదు..పేపర్లో ఫొటోలు వేశారో, వేయించారో తెలియదు కానీ...పేపర్ కొని కాలేజీలో చూపించావ్ చూడు టచ్ చేశావ్.. నీది చాలా మంచి మనసు 
సాక్షి: ఏంటి వసుధార పిచ్చి పిచ్చిగా ఉందా
వసు: ఇంత బాగా రిషి సార్ తో ఫొటో వచ్చాక పిచ్చి ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటుంది. పార్టీ ఇవ్వనా అంటూ మరింత రెచ్చగొట్టి ఓ చాక్లెట్ తీస్తుంది.. ఒక్కటే చాక్లెట్ ఉంది...ఈ సారి నువ్వు త్యాగం చేయి అంటూ చాక్లెట్ ఓపెన్ చేసి సాక్షి ముందే తింటుంది.  ఒక్కోసారి కొన్ని చేతికొచ్చినట్టే వచ్చి మిస్సవుతుంటాయ్. ఇదిగో ఈ పది రూపాయలతో ఓ చాక్లెట్ కొనుక్కుని పండుగ చేసుకో....
సాక్షి: నాన్సెన్స్..నువ్వు నాకు డబ్బులివ్వడం ఏంటి
వసు: ప్రేమగా ఏం ఇచ్చినా, ఎంతిచ్చినా తీసుకోవాలి వద్దనకూడదు... ఒక్కసారి వద్దంటే ఎంత నష్టమో నీకు తెలుసు కదా...అంతదూరం నుంచి వచ్చావ్ , ఈ పేపర్ తెచ్చావ్...బదులుగా ఏమైనా ఇవ్వాలి కదా... చాక్లెట్ చిన్నదే అనుకుంటే...రెస్టారెంట్ కి రా బిల్లు మొత్తం కడతాను...
సాక్షి: ఆట్లాడుతున్నావా
వసు: ఆట మొదలెట్టిందే నువ్వు..ఆపితే ఏం బావుంటుంది చెప్పు...ఆటలో నేను గెలుస్తాను...నాకు క్లాస్ కి టైమ్ అయింది...లేకపోతే నీకింకా క్లాస్ ఇచ్చేదాన్ని... బై... అయ్యో మర్చిపోయాను ఓ ఫొటో తీసుకుంటాను అని పేపర్లో ఫొటోని ఫోన్లో దాచుకుంటుంది. అన్నట్టు చాక్లెట్ కొనుక్కోవడం మర్చిపోకు..బై 

Also Read:  రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!

వసుధార దండ వేసిన ఫొటో తలుచుకుంటూ రిషి అలా నడుచుకుంటూ వస్తుంటాడు. వసుధార ఎదురుపడుతుంది.
రిషి; ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావ్
వసు: మీ గురించే సార్...రిషి సార్ కి మెసేజ్ పెడితే ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటని నాలో నేనే అనుకుంటున్నాను
రిషి: నాకు ఇంకేం పనులుండవా...నీ మెసేజ్ కి ఆన్సర్ ఇవ్వడమే పనా
వసు:  ఇచ్చేటప్పుడు రిప్లై ఇస్తాను వెయిట్ చేయి...

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ఈ రోజంతా నేను రెస్టారెంట్ డ్యూటీలోనే ఉంటాను అంటుంది వసుధార. అంటే నన్ను రెస్టారెంట్ కి రమ్మంటోందా... అసలు నువ్వేమనుకుంటున్నావ్ వసుధార నీకు చాలా క్లారిటీ ఇస్తాను చూడు అనుకుని సాక్షిని తీసుకుని వెళతాడు రిషి.  వసు షాక్ అవుతుంది.

Published at : 05 Jul 2022 08:51 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu July 5 Episode 494

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు

Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు

Guppedantha Manasu ఆగస్టు 16 ఎపిసోడ్: ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి

Guppedantha Manasu ఆగస్టు 16 ఎపిసోడ్: ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి

Devatha August 16th Update: సంతోషంలో రుక్మిణి, దేవి - పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్

Devatha August 16th Update: సంతోషంలో రుక్మిణి, దేవి -  పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్

Gruhalakshmi August 16th Update: ప్రేమ్ ని నందుతో పోల్చిన శ్రుతి- బంధం తెంచేసుకుని వెళ్ళిపోయిన ప్రేమ్, గుండెలు పగిలేలా ఏడుస్తున్న శ్రుతి

Gruhalakshmi August 16th Update: ప్రేమ్ ని నందుతో పోల్చిన శ్రుతి- బంధం తెంచేసుకుని వెళ్ళిపోయిన ప్రేమ్, గుండెలు పగిలేలా ఏడుస్తున్న శ్రుతి

Karthika Deepam Serial ఆగస్టు 16 ఎపిసోడ్: మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట

Karthika Deepam Serial ఆగస్టు 16 ఎపిసోడ్:  మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట

టాప్ స్టోరీస్

Raghavendra Rao: మౌనమునికి కోపమొచ్చింది, సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు అసహనం

Raghavendra Rao: మౌనమునికి కోపమొచ్చింది, సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు అసహనం

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్

Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్