Nindu Manasulu Serial Today March 18th: నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ మంజుల! సిద్ధూ ఎదురుగానే మాటల యుద్ధం!
Nindu Manasulu Serial Today March 18th: నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ మంజుల! సిద్ధూ ఎదురుగానే మాటల యుద్ధం!

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ప్రేరణలు వీడియో కాల్ చేసుకొని మాట్లాడుతారు. సిద్ధూ ప్రేరణని నవ్వించి నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలని అంటాడు. ఇంతలో మంజుల వచ్చి ఫోన్ లాక్కొని.. డాక్టర్ తనకి రెస్ట్ అవసరం అని చెప్పారు.. నీకు ఆ విషయం తెలుసు కదా.. అన్నీ తెలిసి ఇలా విసిగించడం అవసరమా అని ఫోన్ కట్ చేసేస్తుంది. సిద్ధూ తల్లితో ఎందుకు కట్ చేశావ్ అంటే ఇలాంటి వాళ్లని కట్ చేయడమే కరెక్ట్ లేదంటే మనకు తెలీకుండా కనెక్ట్ అవుతారు.. ఇలాంటి పరిచయాలు మనకి అవసరం లేదు అని అంటుంది.
కుమార్‌కి ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు అని చెప్పి అకౌంట్‌కి డబ్బులు వేసి ఏం కావాలో చూసుకో అని చెప్పి వెళ్లిపోతుంది. ప్రేరణ బాధ పడుతూ ఉంటే ఐశ్వర్య వెళ్లి నువ్వు సిద్ధూ నిజంగానే ఫ్రెండ్సా అక్కా.. నీకు ఏమైనా అయితే సిద్ధూ గారు తట్టుకోలేకపోవడం.. నువ్వు పక్కన లేకపోతే భరించలేకపోవడం.. ఇలా ఒక్కటి కాదు అక్కా చాలా విషయాల్లో చూస్తుంటే నాకు ఎందుకో సిద్ధూ గారు నీకు ఫ్రెండ్ కాదు సోల్‌మేట్‌లా కనిపిస్తున్నారు అని అంటుంది. ఇంకోసారి అలా అనొద్దు మా మధ్య ఏం లేదు అని ప్రేరణ అంటే కానీ మిమల్ని చూస్తే అలా లేదు అక్కా ఇద్దరి మనసుల్లో ఏదో ఉంది అని అంటుంది.
అక్కా.. ఏ మాటకి ఆ మాట ఏ ఆడపిల్లకి అయినా మొదటి హీరో నాన్నే కదా.. నాన్న లాగే మనల్ని సపోర్ట్ చేసి మన వెంటే ఉండే వ్యక్తి ఒకరు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అక్కా.,. నాకు ఇప్పుడు సిద్ధూ గారిని చూస్తే అలాగే ఉంది.. నాన్నతో ఉంటే నువ్వు ఎలా ఉంటావో సిద్ధూ గారు నీకు అలాగే తోడుగా ఉన్నారు అని అనిపిస్తుంది. కష్టం వస్తే కొందరు సాయం చేస్తారు కానీ కష్టం రాకుండా కొందరే చూస్తారు.. అలా సిద్ధూ గారు నీకు ఉన్నారు అక్కా.. అలాంటి వాళ్లు జీవితంలో మనకు తోడుగా ఉంటే ఇంకే కావాలి అక్కా అని అంటుంది. నిజమా ఐషూ అని ప్రేరణ అంటుంది. అంతే అక్కా అని అంతే నాది సిద్ధూది స్నేహం మాత్రమే అని అంటుంది.
సిద్ధూని తీసుకొని మంజుల వాళ్లు ఇంటికి తీసుకొస్తారు. విజయానంద్ సిద్ధూతో నేను నీకు తోడుగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. అయినా సరే నీకు ఈ పరిస్థితి తెచ్చిన వాళ్లని వదలను అంటాడు. ఆపుతావా నీ నటన అని సిద్ధూ అంటాడు. సిద్ధూకి దిష్టి తీయమని విజయానంద్ అంటాడు. ఇంతలో ప్రేరణ దిష్టి నీళ్లు పట్టుకొని ఎదురుగా వస్తుంది. మంజుల, విజయానంద్ షాక్ అయిపోతారు. సిద్ధూ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కొత్త మనిషిని చూసినట్లు అక్కడే ఆగిపోయారు రండి అని ప్రేరణ పిలుస్తుంది. సిద్ధూ నీ సంతోషం చూసి ఓర్వలేని కళ్లు దిష్టి పెట్టాయి.. అందుకే నీకు ప్రమాదం తప్పింది.. అందుకే నేనే నీకు దిష్టి తీయాలి అనుకుంటున్నా అని అంటుంది. ప్రేరణ దిష్టి తీస్తుంటే అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు అని మంజుల అంటే ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందు దిష్టి తీస్తానని ప్రేరణ అని దిష్టి తీస్తుంది. తర్వాత ప్రేరణ ఇంట్లోకి వస్తుంటే మంజుల ఆపుతుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని అడిగితే తనని నేనే రమ్మన్నాను అని సిద్ధూ చెప్తాడు. మంజుల షాక్ అయిపోతుంది.
ప్రేరణ నువ్వు రా అని సిద్ధూ పిలుస్తాడు. తనని ఎందుకు రమ్మన్నావ్ సిద్ధూ నీకు ఈ పరిస్థితి రావడానికి తనే కారణం కదా అంటే తను నన్ను వదిలేసి వెళ్లిపోలేదు కదా.. అని అంటాడు. నువ్వు తన ప్రాణాలు కాపాడావు.. తను నీకు రక్తం ఇచ్చింది ఇక్కడితో రుణాలు అయిపోయావి.. ఇక ఎవరి దారిలో వాళ్లు ఉంటే మంచిది అని మంజుల అంటుంది. వెళ్తా ఆంటీ కానీ సిద్ధూతో నా రుణం తీరిపోలేదు.. సిద్ధూతో పరిచయం అయినప్పటి నుంచి తీర్చుకోలేని రుణం ఉంది.. అని అంటుంది. అలా అని ఇక్కడే తిష్ట వేస్తావా అని విజయానంద్ అంటే సిద్ధూ కోపంగా చూస్తాడు. ఎవరో నా గురించి లేనిపోనివి చెప్పి మీ మనసు మార్చారు ఆంటీ.. అని అంటుంది. నాకు ఎవరు ఎలాంటి వాళ్లో తెలీదు అంటావా అని మంజుల అంటే కచ్చితంగా తెలీదు ఆంటీ.. అందరూ మంచివాళ్లు అనుకోవడం మీ మంచి తనం కానీ పరిస్థితుల బట్టీ అందరూ మారిపోతారు అనుకోవడం మీ మూర్ఖత్వం.. నేను మీకు పరిచయం అయినప్పటి నుంచి ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను.
సిద్ధూతో కూడా అలాగే ఉన్నాను.. నా పద్ధతిలో ప్రవర్తనలో ఏ మార్పు లేదు కానీ మార్పు వచ్చింది మీలో.. పరిస్థితి బట్టీ మారింది మీరే ఆంటీ.. సమస్య మీలో పెట్టుకొని ఎదుటి వాళ్లని సమస్యలు సృష్టిస్తున్నారు అనడం ఎంత వరకు కరెక్ట్.. మనసుతో మాత్రమే ఆలోచిస్తే మీకు తెలుస్తుంది అని అంటుంది. ప్రేరణ వెళ్లిపోతుంటే సిద్ధూ ఆపి ప్రేరణ దగ్గరకు వెళ్లి నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. మరోవైపు ప్రేరణ తండ్రికి అంతా గుర్తొచ్చి పెద్దోడా అని అరిచి లేచేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















