Guppedantha Manasu జులై 1ఎపిసోడ్: రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!
Guppedantha Manasu July 1 Episode 491: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జులై 1 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జులై 1 ఎపిసోడ్ (Guppedantha Manasu July 1 Episode 491)
రిషి కాలేజీ నుంచి వెళ్లిపోవడం చూసి వసు టెన్షన్ పడుతుంటుంది..రిషి సార్ రారని నా మనసు చెబుతోంది అంటుంది వసుధార. అవునా...నీ మనసు చెప్పించే వింటున్నావా అని సెటైర్ వేసిన జగతి..ఈ అభినందన సభ ఆలోచనే రిషిది...అలాంటప్పుడు రాకుండా ఎలా ఉంటాడంటుంది. నీ మనసేంటో నీ ఆలోచనేంటో నీకు స్పష్టత ఉంటే చాలన్న జగతితో ఈ మధ్యే ఓ స్పష్టత వచ్చింది మేడం అని చెబుతుంది. అటు రిషి రోడ్డు పక్కన కారు ఆపి ఆలోచనలో పడతాడు.
రిషి: వసుధారకి అభినందన సభ అంటే నేను ఉండాలి కదా..ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాను... నన్ను కాదన్న వసుధార నా కళ్లముందు తిరుగుతోంది నాకు గిల్టీగా ఉంది... మరి తనకేమీ అనిపించేలేదా
( నువ్వు వసుని ప్రేమిస్తున్నావ్ అన్న జగతి మాటల నుంచి వసు రిజెక్ట్ చేసినంతవరకూ అన్నీ గుర్తుచేసుకుంటాడు)
అటు అభినందన సభ స్టార్ట్ అవుతుంది. వసుధార మాత్రం టెన్షన్ గా రిషి కోసం చూస్తుంటుంది.
జగతి: ఇంకా ఇలా ఉంటే ఎలా వెళ్లి రెడీ అవు
వసు: ఇలా ఉండడం ఏంటి ఇలాగే ఉంటాను
బస్తీ నుంచి కొందరు వచ్చి వసుధారని అభినందిస్తారు. థ్యాంక్స్ చెప్పి వాళ్లని కూర్చోబెట్టిన వసుధార...రిషి కోసం ఆలోచిస్తుంటుంది. అటు రిషి కాలేజీ గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుకుంటాడు. ఇంతలో వసుధార నుంచి మెసేజ్ వస్తుంది. 'సర్ నేను సాధించిన విజయాన్ని అందరూ పొగుడుతూ ఉంటారు ఆ విజయానికి కారణం అయిన మీరు మాత్రం దూరంగా ఉంటారు ఎందుకు సార్ ఇలా రావొచ్చు కదా' ..నేను నిన్ను దూరం చేసుకున్నానా-నువ్వు దూరంగా వెళ్లావా? సమాధానం నీకే తెలియాలి
గౌతమ్: రిషి కి కాల్ చేసిన గౌతమ్...ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది ఇంకా రాలేదేంటి అంటాడు. పెద్దమ్మ, సాక్షి, ధరణి వదిన వచ్చారు నువ్వు రమ్మన్నావా
రిషి: నేను రమ్మనలేదే..అయినా పెద్దమ్మని బాగా చూసుకో
దేవయానిని చూసి మహేంద్ర షాక్ అవుతాడు...రండి రండి స్వాగతం అంటాడు.
దేవయాని: లోపలకు వచ్చాక స్వాగతం పలుకుతున్నావా. రాకపోతే బావుండును అనుకుంటున్నావా
మహేంద్ర: అలా ఎందుకు అనుకుంటాం
దేవయాని: ఏం జగతి దగ్గరుండి మరీ సన్మానం చేస్తున్నావా..నీ శిష్యురాలికి
జగతి: ఇందులో నాదేముంది... మీరు వచ్చారు, పెద్దమనసుతో దీవించండి
దేవయాని: నేను వచ్చింది అందుకే కదా...
ఫణీంద్ర: దేవయాని మీరు కూర్చోండి, మినిస్టర్ గారు వచ్చారు మహేంద్ర వెళదాం రా
దేవయాని: మినిస్టర్ గారిని కూడా పిలిచారా, వెరీ గుడ్ చాలా మంచిపని చేశారు.
జగతి: ( రిపోర్టర్స్ తో సాక్షి మాట్లాడుతుంటే ఏదో డౌట్ వస్తుంది జగతి).
దేవయాని: నేను వచ్చానని భయపడుతున్నావా...ఏదో జరుగుతుంది అనుకుంటున్నావా...నీ భయాన్ని నిజం చేస్తానులే..నిన్ను అస్సలు డిస్సప్పాయింట్ చేయనులే
జగతి: వీళ్లు ఏదో కుట్ర చేయడానికే వచ్చారు...ఏం ప్లాన్ చేశారు?
మినిస్టర్ గారు కూడా వస్తున్నారా...అయితే వసుధార పరువు పెద్ద ఎత్తునే పోతుందన్నమాట అని దేవయానితో అంటుంది సాక్షి
Also Read: అభినందన సభలో గందరగోళం - రిషిని అవమానించిన దేవయాని,సాక్షికి వసు ఇచ్చే సమాధానం ఏంటి!
ఇంతలో లోపలకు వచ్చిన మినిస్టర్ గారు వసుధారని అభినందిస్తారు. రిషి కనిపించడం లేదేంటి అని అడిగితే వస్తున్నారు సార్ అని చెబుతాడు గౌతమ్.
సాక్షి: అభినందన సభ అని నువ్వు అనుకుంటున్నావ్...అవమానం జరగబోతోందని నువ్వు ఊహించలేకపోతున్నావ్ అనుకుంటూ కంగ్రాట్స్ వసుధార అంటుంది
వసుధార-సాక్షి మధ్య చిన్న వాదన జరుగుతుంది. ఆ తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. వసుధార కళ్లు మాత్రం రిషి కోసం వెతుకుతుంటాయి. కాలేజీ యాజమాన్యం, మంత్రిగారు అంతా వసుధారని అభినందనలతో ముంచెత్తుతారు.
వసుధార: మేడం రిషి ఇంకా రాలేదు
జగతి: రిషి రాకపోతనే నువ్వు స్టేజ్ పైకి వెళ్లవా ఏంటి
ఇంతలో మహేంద్ర ...వసుధారని స్టేజ్ పైకి పిలుస్తాడు ( దేవయాని-సాక్షి విషపు నవ్వు నవ్వుతారు)
దేవయాని: మేం ఏం చేస్తామో అని టెన్షన్ పడుతున్నావా...సాక్షి అదేంటో చూపించెయ్
సాక్షి: వసుధార గురించి ఈ ప్రోగ్రాంలో ఓ ఏవీ చూపించబోతున్నాం...వసుధారకి అవమానం జరగబోతోంది, వసుతో ఎందుకు తిరిగానా అని రిషి ఫీలవుతాడు...
జగతి: ఈమె పేరు వసుధార,డబ్బు కోసం సిటీకి వచ్చింది, రిషికి వలవేసింది... రిషిని ఏం చేసిందో ఏం మందు పెట్టిందో తెలియదు కానీ తను ఏం చెబితే అది వింటాడు. పడిపోయిన రిషి..వసుకి ప్రపోజ్ చేశాడు. అప్పుడే వసుధార తన అసలు సిసలు అస్త్రాన్ని ప్రయోగించింది. ఆస్తి మొత్తం తనపేరుమీద ట్రాన్ఫర్ చేస్తేనే ఎస్ అందామని నో చెప్పింది. ఇదీ ఆ వీడియో సారాంశం. సాక్షి ఏంటిదంతా ఆపు...
సాక్షి: వసుధార పరువు పోవడం ఖాయం...ఈ వసుధార వెనుకున్న అదృశ్య హస్తం మీరే అని ముగిస్తాను....ఇదంతా పెన్ డ్రైవ్ లో వేసిచ్చాను...స్క్రీన్ పై ప్లే అవుతుంది చూడండి...
జగతి: షాక్ అవుతుంది....
Also Read: హిమ-శౌర్య ఒక్కటయ్యారు, ఇక డాక్టర్ సాబ్ మనసు మార్చుకోక తప్పదేమో!
అటు సభలో వసుధార రిషి కోసం చూస్తుంటుంది....కార్యక్రమం మొదలెడదామా అనగానే..వసుధార గొప్పతనం తెలిపే వీడియో నా దగ్గర ఉంది ముందుగా దాన్ని ప్లే చేద్దామా అంటుంది సాక్షి. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు రిషి. రిషిని చూసి వసుధార ముఖం వెలిగిపోతుంది. అందరూ రిషిని పలకరిస్తారు...
ఎపిసోడ్ ముగిసింది.....
రేపటి( శనివారం)ఎపిసోడ్ లో
వీడియో ప్లే అవుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు... ఇదంతా వసుధారే చేసింది అనుకుంటాడు రిషి....
Also Read: రిషికి వసుధార గోరు ముద్దలు, అభినందన సభలో ఈగో మాస్టర్ ఏం చేయబోతున్నాడు!