అన్వేషించండి

Guppedantha Manasu జూన్ 30 ఎపిసోడ్: అభినందన సభలో గందరగోళం - రిషిని అవమానించిన దేవయాని,సాక్షికి వసు ఇచ్చే సమాధానం ఏంటి!

Guppedantha Manasu June 30 Episode 490: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 30 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు జూన్ 30 ఎపిసోడ్ (Guppedantha Manasu June 30 Episode 490)

వసుధారని అభినందించేందుకు వెళతారు రిషి, గౌతమ్, ధరణి.... ఇద్దరూ అభినందనలు చెప్పినా రిషి మాత్రం చెప్పడు. నువ్వు చెప్పవేంట్రా అని గౌతమ్ అంటే...డీబీఎస్టీ కాలేజీ తరపున కంగ్రాంట్స్ వసుధార అంటాడు. వసుధారకి స్వీట్స్ ఇస్తారు. గౌతమ్ సరదాగా ఇంటర్యూ చేస్తాడు. రిషి సార్ మీకు నాపై కోపం ఉందని తెలుసు  కానీ ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కావడం లేదు అనుకుంటుంది. ఇంతలో గౌతమ్ ఏంటి మీ రూమ్ కి వస్తే మర్యాదలు చేయవా అంటాడు గౌతమ్. స్నాక్స్ ఏమీ పెట్టవా అనగానే వాళ్లిచ్చిన స్వీట్సే వాళ్లకు పెడుతుంది వసుధార. పక్కనే బుక్స్ పై తను గతంలో ఇచ్చిన పూలు ఉండడం చూసిన రిషి...మాట స్వచ్ఛం, మనసు గందరగోళం అనుకుంటాడు. బిందె జాగ్రత్త అని చెప్పండి అన్న రిషితో..బిందె జాగ్రత్త ఏంట్రా అని గౌతమ్ అంటే.పరీక్ష రాయాల్సిన చేతులు అలా నీళ్లు మోయడం ఏంటి అనుకుంటూ వెళ్లిపోతాడు.  మీ మనసు నాకు తెలిసింది..నా మనసు నాకు తెలిసింది..మరి నామనసు మీకెప్పుడు తెలుస్తుంది అనుకుంటుంది. 

Also Read: హిమ-శౌర్య ఒక్కటయ్యారు, ఇక డాక్టర్ సాబ్ మనసు మార్చుకోక తప్పదేమో!

ఫోన్లో హ్యాపీగా మాట్లాడుతున్న ఫణీంద్రతో..ఏంటో అంత ఆనందం నాక్కూడా చెబితే సంతోషిస్తాను కదా అంటుంది దేవయాని
ఫణీంద్ర: కొన్ని గుడ్ న్యూస్ లు నీకు చెబితే సంతోషించలేవు అందుకే చెప్పడం లేదు ట
దేవయాని: మీరెందుకు ఇంట్లో అందర్నీ ఒకలా చూస్తారు, నన్ను మరోలా చూస్తారు
అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిషి, గౌతమ్, ధరణిని చూసిన దేవయాని ఏంటి ధరణి చెప్పా చేయకుండా బయటకు వెళ్లావ్ అని అంటే... నేనే వదినను తీసుకు వెళ్లాను అంటాడు రిషి. తనతో ఏం పని రిషి అన్న దేవయాని వెళితే నాకో మాట చెప్పాలి కదా అనుకుంటుంది దేవయాని
ఫణీంద్ర: వసుధార దగ్గరకు ఎందుకు వెళ్లావ్
రిషి: ఇంటర్యూ ఉందని చెప్పడానికి వెళ్లాం...
దేవయాని:  వసుకి సన్మానం అయితే నీకేం పని గౌతమ్
రిషి: బస్తీలో సన్మానం, ఇంటర్యూలకు ప్లేస్ చూసేందుకు ముగ్గురం వెళ్లాం
గౌతమ్: వసు విజయం వెనుక రిషి ఉన్నాడు..
దేవయాని: అందరి విజయం వెనుకూ ఉంటాడు కానీ తనే ఓడిపోయాడు అనుకుంటూ ఊర్లో వాళ్ల విజయాలను నెత్తికెక్కించుకోవడం అవసరమా
ఫణీంద్ర: డీబీఎస్టీ కాలేజీకి మంచి పేరు వస్తుందని తెలిసికూడా అలా అంటావేంటి. కాలేజీలో సన్మానం నాలుగు గోడమ మధ్య ఉండిపోతుంది.. బస్తీలో సన్మానం చేస్తే అందరికీ తెలుస్తుంది
దేవయాని: నాకు మాత్రం సమాధానం బాగా చెబుతారు లెండి... ఈమాత్రం దానికి ధరణి అవసరమా
రిషి: నేను ఒక్కడినే వెళ్లి మాట్లాడితే కొత్తరకం చర్చకు అవకాశం ఇచ్చినట్టుంటుంది...అందుకే వదినను తీసుకెళ్లాను
ధరణి: నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తావ్ రిషి
రిషి: ఈ ప్రోగ్రాం గురించి కాలేజీలో మీటింగ్ పెట్టుకుందాం పెదనాన్న....
గౌతమ్: వసుధార యూత్ ఐకాన్ టైటిల్ గెలిచించి...స్కాలర్ షిప్ ఎంట్రన్స్ లో టాపర్ గా నిలిచింది.. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేస్తుంది
దేవయాని: చెట్టుకాయని కాదు చెట్టుని మెచ్చుకోవాలి కదా
ఫణీంద్ర: నేను చెప్పేది అదే...ఆమె విజయం వెనుక డీబీఎస్టీ కాలేజీ ఉందనే చెబుతున్నాను

Also Read: రిషికి వసుధార గోరు ముద్దలు, అభినందన సభలో ఈగో మాస్టర్ ఏం చేయబోతున్నాడు!

అటు కాలేజీలో వసుకి అభినందన సభ పెడుతూ నోటీస్ పెడతారు. వసు ఏం చేసినా సన్మానం సత్కారం కామన్ కదా అనుకుంటారు  కొందరు. ఇంతలో వసు దగ్గరకు వచ్చిన పుష్ప కంగ్రాట్స్ చెబుతుంది. నేనేం సాధించాను చెప్పు ..అదేం పెద్ద గొప్ప కాదు అంటుంది. సభ ఏర్పాట్లన్నీ రిషి సార్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారంట అంటుంది పుష్ప. అభినందన సభ చేయాలన్న ఆలోచన కూడా రిషి సార్ దే అంట అంటుంది పుష్ప. అంటే సీరియస్ సింహానికి నాపై కోపం పోయిందా..కోపం ఉండి ఉంటే ఎందుకు ఇదంతా చేస్తారు అనుకుంటుంది వసుధార..

రిషి: అదే సమయంలో రిషి...దీన్ని భారీగా చేయాల్సిన అవసరం లేదు సింపిల్ గా చేద్దాం అని మహేంద్ర-జగతితో చెబుతాడు. వసు సాధించిన విజయాన్ని గొప్పగా ప్రచారం చేయకూడదు, చిన్నగా చూడకూడదు... అందరికీ స్ఫూర్తినిచ్చేలా చేస్తే చాలు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు గౌతమ్ చూసుకుంటున్నాడు మీరు తనకి హెల్ప్ చేయండి మేడం...
జగతి: సరే సార్ అంటుంది
రిషి: బయట రిసెప్షన్ దగ్గర నిల్చున్న వసుని చూస్తూ ఉండిపోయిన రిషి.... మహేంద్ర-జగతి ఏం చెప్పినా  మీ ఇష్టం అనే సమాధానాలు ఇస్తుంటాడు. వాళ్లిద్దరూ లేచి వెళ్లిపోతుండగా..మాట్లాడుతుండగా వెళ్లిపోతున్నారేంటి అంటాడు. 
మినిస్టర్ గారిని పిలుద్దామా అంటే...వద్దులెండి డాడ్ సడెన్ గా రమ్మనడం సరికాదు, సింపిల్ గా కానిచ్చేద్దాం అంటాడు రిషి...
జగతి: వసు-రిషి మధ్య దూరం ఈ రకంగా అయినా తగ్గితే చాలు... ఈ అభినందన సభ వీళ్లమధ్య స్నేహాన్ని పెంచుతుందా అనుకుంటుంది జగతి...
రిషి: వసుని చూస్తూ ఉండిపోయిన రిషి...తన మనసులో ఏముంది..నన్నెందుకు రిజెక్ట్ చేసింది...
లైబ్రరీలో పని ఉంది వెళతాను అని పుష్ప వెళుతుంది..అప్పుడే జగతి వస్తుంది. నాకు టెన్షన్ గా ఉంది మేడం ఇదంతా అవసరమా అంటుంది. ఇది నీకు గౌరవం, చాలా మందికి స్ఫూర్తి అని చెబుతుంటుంది. అప్పుడే రిషి కారు స్టార్ట్ చేసుకుని వెళ్లడం చూస్తుంది. అటు రిషి కారు ఆపిన మహేంద్ర..ఇప్పుడెక్కడికి వెళుతున్నావ్ అని అడుగుతాడు. 
బయటకు ఏం సమాధానం చెప్పని రిషి( స్కాలర్ షిప్ టెస్ట్ గుర్తొస్తే వసు నన్ను రిజెక్ట్ చేసిన విషయం కళ్లముందు కనిపిస్తుంది అందుకే వెళుతున్నాను అనుకుంటాడు). పని ఉండి వెళుతున్నాను, మీరు-పెదనాన్న-గౌతమ్ చూసుకోండి అనేసి వెళ్లిపోతాడు...
వసుధార: రిషి సార్ కావాలనే వెళుతున్నారు..ఇప్పుడెందుకు వెళుతున్నారు..ప్రోగ్రాం మొదలవుతోంది కదా..నాపై కోపంతో వెళుతున్నారా 
జగతి: ఈ టైంలో రిషి ఎక్కడికి వెళుతున్నాడు
మహేంద్ర: ఏదో పని ఉందట..వసుని టెన్షన్ పడొద్దని, మీడియా ముందు సరిగ్గా మాట్లాడమని చెబుతున్నాడు...
జగతి: నువ్వెళ్లు మహేంద్ర...కావాల్సిన ఏర్పాట్లు చేయి...పనులు చూసుకో నేను వచ్చి జాయిన్ అవుతాను. 
వసుధార: రిషి సార్ వస్తారా..రారని నా మనసు చెబుతోంది
జగతి: రాకుండా ఎలా ఉంటారు...నీ మనసు అన్నిసార్లూ నిజమే చెబుతోందా

Also Read:అమ్మవారి సాక్షిగా మనసులో ప్రేమను బయటపెట్టిన రిషి, వసు-బంధం బలపడుతోంది

రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
రిషి సార్ మీరెక్కడున్నారో రావొచ్చు కదా అనుకుంటుంది...ఇంతలో రిషి రావడంతో సంతోషంగా ఫీలవుతుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన సాక్షి-దేవయాని...వసు గొప్పతనాన్ని తెలిపే వీడియో ఉంది ప్లే చేయమంటారా అంటూ.. రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేస్తారు. అది చూసి రిషి...వసుపై ఫైర్ అవుతాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget