By: ABP Desam | Updated at : 08 Jul 2022 08:21 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam july 8 Episode 1399 (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం జులై 8 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam jly 8 Episode 1399)
పిన్ని, బాబాయ్ ని చూసి బోరున ఎడ్చిన జ్వాలని చూసి ఇంద్రుడు, చంద్రమ్మ కంగారుపడిపోతారు. మరోవైపు తిరిగి ఇంటికి వెళుతూ సౌందర్య, ఆనందరావు, హిమ...జ్వాల మాటలే గుర్తుచేసుకుంటారు. మర్నాడు తెల్లారి జ్వాల తలుపు తీసి బయటకు బయటకు వచ్చేసరికి బయట ఆనందరావు కూర్చునిఉంటాడు. మీరేంటి తాతయ్య ఇక్కడున్నారు అంటుంది జ్వాల.
ఆనందరావు: నిత్యం దేవుడిని వేడుకుంటూనే ఉన్నాను నా రెండో మనవరాలు కనిపించాలని, దేవుడు వరమిచ్చాడు కానీ నువ్వే కరుణించడం లేదు.వెళదాం పదరా బంగారం, అక్కడ నీకోసం మీ నానమ్మ, బోలెడన్ని జ్ఞాపకాలు ఎదురుచూస్తున్నాయ్.
జ్వాల: అక్కడ నాకోసం నా శత్రువు కూడా ఎదురుచూస్తోంది తాతయ్య, నేను ఇంటికి రాను
ఆనందరావు: ఈ వయసులో దేవుడు ఎంత ఏడిపించాలో ఏడిపించాడు...నువ్వు కూడా ఏడిపిస్తే ఎలాగమ్మా
జ్వాల: ఏడిస్తే కష్టాలు పోతాయనుకుంటే ఇన్నేళ్లు ఎంతో ఏచ్చేదాన్ని..లోపలకు రండి కాఫీ తాగి వెళుదురుగాని
ఆనందరావు: కాఫీ కోసం రాలేదు..నా మనవరాలిని తీసుకెళ్లడానికి వచ్చాను
జ్వాల: అది ఎప్పటికీ జరగదు
ఆనందరావు: ఇంత బాధని మనసులో పెట్టుకుని మీ నానమ్మని సీసీ అన్నావ్, నన్ను యంగ్ మెన్ అన్నావ్ దోస్త్ అన్నావ్.. మేం ఎన్నాళ్లు బతుకుతామో తెలియదు కానీ బతికిన కొన్నాళ్లైనా సంతోషంగా ఉంచు. దూరమై నువ్వు బాధపడ్డావ్, దూరం చేసుకుని మేం బాధపడ్డాం, దగ్గరయ్యాక కూడా ఈ బాధ ఏంటమ్మా
జ్వాల: తాతయ్య దయచేసి ఎక్కువ బతిమలాడొద్దు నేను రాలేను
ఆనందరావు: రాకుండా ఎవర్ని సాధిస్తావు, దీనివల్ల ఎవరికి లాభం, ఎందుకీ పంతం. దూరంగా ఉండి నువ్వేమైనా సాధించావా. అందర్నీ క్షమించి నా కోసం మన ఇంటికి రామ్మా
జ్వాల: మీరు ఎన్ని చెప్పినా వచ్చే ఆలోచన నాకు లేదు తాతయ్య
Also Read: డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!
తల్లిదండ్రుల ఫొటో ముందు నిల్చుని...
హిమ: నేను నీకిచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను డాడీ, శౌర్య-నిరుపమ్ బావకి ఎలాగైనా పెళ్లిచేయాలనే ఆలోచనతో ఉన్నాను కానీ అన్ని పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి
సౌందర్య: హిమా ఇక్కడేం చేస్తున్నావ్
హిమ:మనసువిప్పి మాట్లాడుకునేది ఇక్కడే కదా నానమ్మా. ఇన్నాళ్లూ నేను ఎవరో తెలియకుండా జాగ్రత్త పడ్డాను, శౌర్యక నాపై ఉన్న కోపాన్ని తగ్గించాలని చూశాను, కోపం తగ్గాక నేనే హిమని అని చెప్పాలి అనుకున్నాను, ఇంతలోనే ఇలా అయ్యింది
సౌందర్య:ఇప్పుడేం చేద్దామని
హిమ: ఏం చేసినా, ఏం జరిగినా శౌర్య ఆనందంగా ఉండడమే ఇష్టం. ఇప్పటికీ శౌర్య కష్టాలు పడుతోంది. తను పడే ప్రతి కష్టానికీ కారణం నేనే కదా నానమ్మా...అందుకే శౌర్య కోరుకున్నట్టుగానే నిరుపమ్ బావతో ఎలాగైనా పెళ్లి జరిపించాలి
సౌందర్య: అసాధ్యం అయినవి ఎలా జరుగుతాయి
హిమ: బావను ఒప్పించడమే నేను చేయాల్సిన పని..దీనికోసమే కదా ఇంత ఆరాటపడింది. శౌర్య దగ్గర నేనెవరో దాచింది కూడా ఇందుకే కదా..వాళ్లిద్దర్నీ ఒకటి చేయాలి అనుకున్నాను చేస్తాను
సౌందర్య: దానిపై నీకున్న ప్రేమని చూస్తే ముచ్చటేస్తోంది..కానీ..శౌర్యకి నీపై కోపం చూస్తుంటే భయం వేస్తోంది. స్వప్న, నిరుపమ్ కి ఇప్పుడే నిజం చెప్పకు. ఆటోది అని చాలా చులకనగా చూస్తోంది. సమయం సందర్భం వచ్చినప్పుడు చూద్దాం.
హిమ: శౌర్యకి నాపై ఉన్నప్పుడు కోపం పోతుంది కదా..మేం ఎప్పటిలా కలసి ఉంటాం కదా...
సౌందర్య: మీ తాతయ్య తనదగ్గరకే కదా వెళ్లారు..ఏదో మాట్లాడతాను ఒప్పించి తీసుకొస్తాను అన్నారు...
ఇంతలో ఆనందరావు వచ్చి సోఫాలో కూర్చుంటాడు..ఏమైందని సౌందర్య అడిగితే..కాఫీ ఇస్తాను తాగి వెళ్లు ఉంది
ఆనందరావు: మనం తనకు అవసరం లేదు, మనసు బండరాయిలా మార్చుకుని బతికేస్తోంది. నిన్ను సీసీ అని, నన్ను యంగ్ మెన్ అని ప్రేమగా పిలవడమే బావుండేదేమో..ఎవరో ఏంట తెలియనప్పుడు నా మనవరాలు ఎప్పుడో ఓసారి వస్తుందనే నమ్మకం ఉండేది. ఇఫ్పుడది రానని మొహంమీద చెప్పాక ఇంకేం చేయగలం సౌందర్య. నువ్వు ఎప్పటిలా సీసీవే, నేను ఎప్పటికీ యంగ్ మెన్ లానే ఉండిపోతాను సౌందర్య అంటాడు ఆవేదనగా...
Also Read: తనను ప్రేమించిన రౌడీబేబీనే శౌర్య అని నిరుపమ్ కి తెలుస్తుందా, సౌందర్యకి జ్వాల ఏం సమాధానం చెబుతుంది!
హిమ: శౌర్యా నువ్వెంత తిట్టినా పడతాను, నా వల్ల నువ్వు ఎన్న కష్టాలు పడ్డావ్...ఎన్ని తిట్టినా పడతాను
శౌర్య: నువ్వేం మనిషివే..ఓ వైపు తిడుతుంటే వంటలు, కూరలు అంటావ్ ఏంటి
హిమ: నాకు వంటలు రావనా నీ డౌట్..ఎంతైనా మనం వంటలక్క కూతుర్లం కదా..
శౌర్య: హిమ చేతిలో ప్లేట్ తీసి విసిరి కొడుతుంది. నువ్వు వంటలక్క కూతురివా..మరి ఏదీ ఆ వంటలక్క..కళ్లముందే మా అమ్మా నాన్నని కనిపించకుండా చేసింది నువ్వేకదా..వాళ్లని దూరం చేసినదానివి నువ్వే కదా...నా ప్రేమను, నా డాక్టర్ సాబ్ ని దూరం చేసింది కాక నా ఇంటికి వచ్చి వంటచేస్తావా..నడవ్వే బయటకు
హిమ: నేను నీతో మాట్లాడాలి..నువ్వు నన్ను కరెక్టుగా అర్థం చేసుకోవడం లేదు..
శౌర్య: నా జీవితానికే అర్థం లేకుండా చేశావ్..
హిమ: కోపంగా చేయి విదిలించుకున్న హిమ..నీకు డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాది
శౌర్య: నాకు డాక్టర్ సాబ్ తో పెళ్లిచేస్తావా..ఇంకేం మోసం చేస్తావ్ చెప్పు. ఏదో చేస్తానన్నావ్, పెళ్లి అన్నావ్, తీరా నువ్వు డాక్టర్ సాబ్ ని లాగేసుకున్నావ్, పెళ్లిచేసుకోబోతున్నారు, శుభలేఖలు అచ్చువేయించారు, అందర్నీ పిలుస్తున్నారు. ఇప్పుడు మళ్లీ డాక్టర్ సాబ్ తో పెళ్లి అంటున్నావా..అసలు నీది నోరేనా...
హిమ: శౌర్య మాటలు విని హిమ నవ్వుతుంది..
శౌర్య: నా బతుకు నీకు నవ్వులాటగా మారుతోందా..
హిమ: నీ తోడబుట్టింది నీకు ద్రోహం చేస్తుందని ఎలా అనుకుంటున్నావ్. ఒక్కసారైనా ఆలోచించలేదా, చిన్నప్పటి నుంచీ కలసి తిరిగాం, కలసి పెరిగాం, నువ్వెవరో నాకు తెలిసాక ఎలా మోసం చేస్తాను.
శౌర్య: మోసం చేసేవాళ్లు ఎవరూ పది దేశాలు దాటిరారు..మనం అనుకున్న వాళ్లే తెలివిగా మోసం చేస్తారు. అందుకు నువ్వే గొప్ప ఉదాహరణ. నువ్వు నన్ను ఎప్పుడో చంపేశావ్, ఇంకా నా శవాన్ని ఎలా పాతిపెట్టాలని చూస్తున్నావా
హిమ: కొంచెం టైం ఇస్తే అసలేం జరిగిందో చెబుతాను
శౌర్య: గొప్ప ప్లాన్ తో వచ్చినట్టున్నావ్
కలసి ఇంటికి వెళ్దాం అన్న హిమ చేయిపట్టుకుని బయటకు గెంటేస్తుంది శౌర్య
మనిద్దరి మధ్యా అపార్థాలు ఎప్పుడు తొలగిపోతాయి శౌర్యా అని బాధగా అనుకుంటుంది...
Also Read: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి
రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
హిమను గెంటేసినా బయటే నిల్చుని ఉంటుంది. తెల్లారి చూసేసరికి వర్షంలో తడిచిపోయి ఉన్న హిమను చూసి శౌర్య ఫైర్ అవుతుంది. నీగోల నాకెందుకు మీ ఇల్లెక్కడో చెప్పు దించేసి వస్తానంటుంది. అక్కడి వరకూ వెళ్లి హిమను దించేసి లోపలకు వెళ్లకుండా వెళ్లిపోతుంది శౌర్య(జ్వాల)
Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ
Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్
Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!
Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!
Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ