Guppedantha Manasu జులై 11 ఎపిసోడ్: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం, రిషి-వసు మధ్య మళ్లీ చిగురిస్తోన్న ప్రేమ - మధ్యలో వచ్చి చేరిన సాక్షి
Guppedantha Manasu July 11Episode 499:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 11సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జులై 11 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 11 Episode 499)
రిషి-వసుధారని రూమ్ దగ్గర దించేందుకు వెళతాడు. మొత్తానికి వాళ్లిద్దర్నీ ఒకే కారులో వెళ్లేలా ప్లాన్ చేశాం అంకుల్ అంటాడు గౌతమ్. ఇద్దర్నీ పంపించగలిగాం కానీ మాట్లాడుకుంటారా అంటాడు గౌతమ్. క్లాస్ రూమ్ లో వసుధారని కోప్పడ్డాను అందుకు ఫీలైందేమో అంటుంది జగతి. తన కాన్సన్ ట్రేషన్ పోలేదు..అయోమయంగా ఉంది అంతే..ఆ అయోమయం పోతే మళ్లీ సెట్టవుతుందని మహేంద్ర అంటే.. వసుధార తెలివైంది అంకుల్ అన్ని పరిస్థితులు చక్కబెట్టుకోగలదు అంటాడు గౌతమ్. వసుధార గెలవాలి రిషిని గెలిపించాలి..ఇంతకన్నా కోరుకునేది ఏముంది అనుకుంటారు.
Also Read: వసు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్న రిషి, వేగంగా పావులు కదుపుతున్న దేవయాని-సాక్షి
వసు: సార్ కళ్లు తిరిగితే కూడా హాస్పిటల్ కి తీసుకురావాలా
రిషి: ఇంకేం మాట్లాడకు, ఈ ట్యాబ్లెట్స్ వాడితే ఓపిక వస్తుంది
రిషి సార్ కి నాపై ఎంత శ్రద్ధో అనుకుంటుంది...ఇంతలో రిషి సీట్ బెల్ట్ పెట్టుకో అంటాడు
రిషి: అసలు నీకు నీరసం ఎందుకొచ్చింది
వసు: శక్తి లేక
రిషి:శక్తి ఎందుకు లేదో..
వసు: తినకపోవడం వల్ల
రిషి: కదా..అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు...కాలేజీ బిల్టింగ్ పై ఎండలో పనిచేయడం ఎందుకు.. అసలు నీ లక్ష్యాన్ని మర్చిపోయావా..
వసు: ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్... కారు ఆగడంతో ఏమైంది సార్..ఇక్కడి నుంచి ఇంటికి ఆటోలో వెళ్లమంటున్నారా...
ఇలాంటి తెలివి తేటలకి తక్కువలేదు..కొబ్బరి బొండాం తాగుదుగానివి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి కొబ్బరి బొండాం తీసుకొచ్చి ఇస్తాడు రిషి
రిషి: కారు టైర్లో గాలేమైనా తగ్గిందా...
వసు: కరెక్ట్ గా ఉంది
రిషి: నీకు కారు టైర్లో గాలి గురించి బాగానే అలవాటున్నట్టుంది... టైర్లోంచి గాలి తీయడం కూడా ఈజీనేమో కదా నీకు.....
వసు: సమధానం తప్పించుకున్న వసుధార..వర్షం వచ్చేలా ఉంది వెళదామా...
రిషి: టాపిక్ మారుస్తున్నావా...నువ్వే కారు టైర్లోంచి గాలి తీశావని నాకు తెలుసు...నాకెంత ఇబ్బంది అయిందో తెలుసా
వసు: అయినా ఆ సాక్షితో మీరు సినిమాకు వెళ్లడం ఏంటి..నాకు నచ్చలేదు..
రిషి: ఎందుకు నచ్చలేదు....కారణం ఏంటి
వసు: ఇన్నాళ్ల పరిచయంలో నన్నెప్పుడైనా సినిమాకు తీసుకెళ్లారా...లేదు కదా..ఇన్నాళ్లూ వసుధార నువ్వు అది. నువ్వు అది అని అన్ని చెప్పి...నిన్నగాక మొన్న వచ్చిన సాక్షితో సినిమాకు ఎలా వెళతారు...
రిషి: వర్షం వచ్చేలా ఉంది వెళదామా
వసు: ఏంటి సార్ ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా
రా వెళదాం అని వసుని కారెక్కమంటాడు రిషి...ఇంతలో సాక్షి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావ్ అని అడిగితే డ్యూటీలో ఉన్నానంటాడు...ఇప్పుడేం డ్యూటీ అని సాక్షి అంటే ఒక్కోసారి డ్యూటీలు అనుకోకుండా పడతాయ్ కదా అంటాడు. వసు తనని గమనిస్తోందని చూసిన రిషి...వసుని ఉడికించేలా మాట్లాడతుంటాడు. వాతావరణ బావుంది కదా సాక్షి ఇలాంటి సమయంలో మిర్చి బజ్జీలు తింటే బావుంటుందని ఏదో మాట్లాడుతుంటే...ఇంతలో వసు వచ్చి ఉల్లి పకోడీలు కూడా తింటే బావుంటుందంటూ ఎంట్రీ ఇస్తుంది. సాక్షికి డౌట్ మొదలవుతుంది..రిషి కాల్ కట్ చేస్తాడు..
రిషి: సాక్షితో మాట్లాడుతుంటే వసుకి కోపం వచ్చినట్టుంది...ఒకప్పుడు నువ్వు శిరీష్ తో మాట్లాడుతుంటే నాక్కూడా ఇలాగే ఉండేది అనుకుంటాడు
వసుధారని రూమ్ దగ్గర దింపేసి వెళ్లిపోతాడు రిషి...( మీరు జెంటిల్మెన్ సార్ అనుకుంటుంది)
Also Read: సౌందర్య ఆనందరావు దగ్గరకు చేరిన శౌర్య (జ్వాల), ఇంట్లో కనిపించని హిమ - మరింత పెరిగిన శోభ పైశాచికత్వం
దేవయానికి కాల్ చేసిన సాక్షి..జరిగినదంతా చెబుతుంది.
దేవయాని: అంటే వాళ్లిద్దరూ విడిపోలేదన్నమాట
సాక్షి: కొత్త డవలప్ మెంట్ ఏంటంటే..రిషి విసుక్కోకుండా, కాల్ కట్ చేయకుండా మాట్లాడాడు
దేవయాని: ఓపిక పట్టు, వెయిట్ చేస్తే రిషి నీవాడవుతాడు
సాక్షి: సరే ఆంటీ థ్యాంక్యూ సోమచ్ అని కాల్ కట్ చేస్తుంది
అటు రిషి ఇంకా రాలేదని అడుగుతాడు మహేంద్ర. తనకేవో పనులుంటాయి కదా అంటుంది జగతి.
మహేంద్ర: వసు-రిషి మధ్య కోపతాపాలు తగ్గిపోయాయా..ఇద్దరి మధ్యా స్నేహబంధం మళ్లీ చిగురించిందా...
జగతి: వాళ్లిద్దరి ఆలోచనలు, వారిమధ్య అనుబంధం ఎలా ఉంటుందో మనం ఊహించలేం....వాళ్లిద్దరూ తోడు దొంగలు. మనసులో ఉన్న మాట బయటపెట్టుకోరు. మనసు చెప్పిన మాట వింటారో లేదో తెలియదు...
మహేంద్ర: త్వరలో మనం గుడ్ న్యూస్ వింటాం జగతి...
జగతి: శుభవార్త వినాలని నాక్కూడా ఉంది...ఎవరి జీవితాలు వాళ్లే మలుచుకోవాలి..తప్పులైనా , ఒప్పులైనా నిర్ణయం తీసుకునేది వాళ్లేకాబట్టి వాళ్లకే వదిలేద్దాం. మన ప్రమేయం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది
మహేంద్ర: మన ప్రమేయం ఉన్నా లేకున్నా వాళ్లిద్దరూ ఒక్కటైతే చాలు...
జగతి-మహేంద్ర మాటలు విన్న దేవయాని...రిషి-వసుని ఒక్కటి చేయాలని చూస్తున్నారా...నేను బతికి ఉండగా మీ ఆటలు సాగనివ్వను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని... జగతి బయటకు వచ్చి చూస్తుంది కానీ ఎవ్వరూ కనిపించరు...
Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్
అటు రిషి ఇంట్లో ...వసుధార గురించి ఆలోచించుకుంటాడు. ఇంతలో గౌతమ్ రావడంతో ఇలా రా అని పిలుస్తాడు
గౌతమ్: ఏంట్రా కొడతావా ఏంటి..పాత పగలు ఏమైనా గుర్తొచ్చాయా
రిషి: ఇలా రారా... గౌతమ్ ఫోన్ లాక్కుని ఓ కాల్ చేసుకోవాలి అంటాడు. వసుధారకి కాల్ చేసి గౌతమ్ చేతిలో పెడతాడు...హెల్త్ ఎలా ఉంది, తిన్నావా లేదా అని అడుగు అంటాడు.
వసు: గౌతమ్ సార్ కాల్ చేస్తున్నారేంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది వసుధార... ఎలా ఉన్నావ్, తిన్నావా లేదా అని రిషి అడుగుతున్నాడని చెప్పేస్తాడు గౌతమ్...ఓసారి రిషి సార్ కి ఇవ్వండి సార్ చెబుతాను అంటుంది... గౌతమ్ స్పీకర్ ఆన్ చేయడంతో... నేను తిన్నాను సార్, నేను బావున్నాను, నా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపిస్తున్న ఎండీగారికి ధన్యవాదాలు అంటుంది...
రిషి ఫోన్ లాక్కుని విసిరేస్తాడు రిషి.... ఏంట్రా ఇది అని గౌతమ్ అనడంతో..నాక్కావాల్సిన వివరాలు తెలిశాయి చాలు అంటాడు రిషి...
వసు: కాల్ మధ్యలోనే కట్ చేశారేంటో..మళ్లీ కాల్ చేయాలా...నేను ఎలా ఉన్నానో అని రిషి సార్ టెన్షన్ పడుతున్నారా...
గౌతమ్: నీ ప్రాబ్లెమ్ ఏంట్రా... ( గౌతమ్ రిషిని అడుగుతున్న ప్రశ్నలకు అక్కడ వసుధార సమధానం చెప్పుకుంటూ ఉంటుంది)
వసు: ఎన్నో ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేసే రిషి సార్ నన్ను అర్థం చేసుకోవడం లేదు....
గౌతమ్: మీ మధ్య దూరం ఏంట్రా
వసు: ఈ దూరం తాత్కాలికం...త్వరలోనే ఈ దూరం తగ్గిస్తాను...
గౌతమ్: అన్నీ మనసులోనే దాచుకుంటే ఎలా..అసలేంటి ఇప్పుడు..భవిష్యత్ కార్యాచరణ ఏంటి...ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా...
రిషి: ప్రతీసారీ ప్రతీదానికి క్లారిటీ ఆశించవద్దు..మనం క్లారిటీగా ఉన్నా ఒక్కోసారి అంచనాలు పరిస్థితులు బోల్తా కొట్టిస్తాయి
వసు: నేను చాలా క్లారిటీగా ఉన్నాను రిషి సార్...మీ వరకూ రావడమే ఆలస్యం
రిషి: నా భవిష్యత్ నాకు కనిపిస్తోంది...అంతా బ్లాంక్ గా...చీకటిగా కనిపిస్తోంది...
వసు: నా భవిష్యత్ మీరే..సాక్షికి భయపడో ఇంకోటో మరోకారణంతో నేను మీకు నో చెప్పలేదు...నా మనసు చెప్పింది చెప్పాను..మీరు దూరమయ్యాకే విలువ తెలిసింది...
రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
వసుధార నువ్విక్కడే ఉన్నావా అంటుంది సాక్షి. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటుంది వసుధార. క్యాబ్ బుక్ చేశానని సాక్షి చెప్పడంతో హమ్మయ్య అనుకుంటాడు రిషి. అయితే ఆ క్యాబ్ వసుధార కోసం అని సాక్షి అనడంతో రిషి షాక్ అవుతాడు. మొత్తానికి ఇద్దరూ రిషి కార్లోనే కూర్చుంటారు....