అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 12th: యాక్సిడెంట్ కేసులో మ్యాడీకి దొరికిన కీలక ఆధారాలేంటి..? మ్యాడీపై దాడి చేసి కిడ్నాప్ చేసిందెవరు...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 12th: యాక్సిడెంట్ కేసులో మ్యాడీకి దొరికిన కీలక ఆధారాలేంటి..? మ్యాడీపై దాడి చేసి కిడ్నాప్ చేసిందెవరు...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: శ్రీలక్ష్మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని...ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోమని ఎస్‌ఐ చెప్పడంతో సూర్యనారాయణ చేసేదిలేక ఇంటికి బయలుదేరతాడు.నీకోసం నీభార్య ఎంతో త్యాగం చేసి స్టేషన్‌లో కూర్చందని మ్యాడీని పిలిచి సూర్యనారాయణ చెబుతాడు. నువ్వు నిజంగానే ఈ యాక్సిడెంట్ చేయకపోతే...నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని నీ భార్యతోనే ఇంటికి రావాలని...అప్పటి వరకు నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో మ్యాడీ ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి యాక్సిడెంట్ నేనే చేశానని...ఆ సమయంలో అసలు కారులో ఆ అమ్మాయి లేదని చెప్పినా వినడు. 

ఈ విషయం నిరూపిస్తూ రేపు కోర్టు సమయం ముగిసేలోపు ఆధారాలతో రమ్మని చెబుతాడు. దీంతో మ్యాడీ శ్రీలక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. మీరు ఏం బాధపడొద్దని...నేను ఆ కారులో లేనని నిరూపించే ఆధారాలు కాకుండా అసలు మీరు ఆ యాక్సిడెంట్ చేయలేదని ఆధారాలు సంపాదించడంపై దృష్టిపెట్టమని శ్రీలక్ష్మీ చెబుతుంది. అసలు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లి చూస్తే...నీకు ఏదైనా ఆధారాలు దొరకొచ్చని అనడంతో మ్యాడీ సరేనంటూ స్టేషన్‌ నుంచి బయలుదేరివెళ్తాడు.

పోలీసుస్టేషన్‌ నుంచి సూర్యనారాయణ ఇంటికి వెళ్లడంతో అందరూ మ్యాడీ కోసం ఎదురుచూస్తుంటారు. పెద్దాయన ఒక్కడేఇంటికి రావడంతో మ్యాడీ ఎక్కడని అడుగుతారు. ఈయనగారు ఉదయం మ్యాడీని తీసుకెళ్లినప్పుడే నేను అనుకున్నానని...ఖచ్చితంగా మ్యాడీని కూడా పోలీసులకు అప్పగించే వస్తారని ప్రియంవద అంటుంది. ఆ పనిచేద్దామనేవాడిని తీసుకెళ్లానని కానీ దురదృష్టవశాత్తు అప్పటికే శ్రీలక్ష్మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యిందని... దీంతో చేసేది లేక వెనుదిరిగి వచ్చానని అంటాడు. మరి మ్యాడీ  ఏమయ్యాడని అడిగితే.. భార్య స్టేషన్‌లో ఉంటే వాడు ఇంట్లో ఎలా ఉంటాడని సూర్యనారాయణ అంటాడు. తన భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించి తీసుకొచ్చేవరకు నేనే ఇంటికి రావొద్దని చెప్పానని అంటాడు.వాడిగురించి మీరు ఎలాంటి దిగులు పెట్టుకోకండని..ఖచ్చితంగా  శ్రీలక్ష్మీని తీసుకునే వాడు ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకు ఉందని అని చెప్పి లోపలకి వెళ్లిపోతాడు.

స్టేషన్‌ నుంచి మ్యాడీ హడావుడిగా బయటకు వెళ్లడం చూసిన బుల్లిరాజు, అతని అనుచరులు మ్యాడీని అనుసరించి వెళ్తారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం వెతుకుతున్న మ్యాడీకి ప్లాస్టిక్‌ ప్యాకెట్‌లోమిగిలిపోయిన ద్రాక్షరసం కనిపిస్తుంది. అది చూసి ఇది అసలు రక్తమే కాదని తెలుసుకుంటాడు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు ఉండటం చూసి ఫుటేజ్‌ కోసం వెళ్తాడు. అక్కడ సీసీ ఫుటేజ్ పరిశీలించిన మ్యాడీకి అసలు నిజం తెలుస్తుంది.తాను అసలు యాక్సిడెంట్‌ చేయలేదని...కావాలనే ఎవరో ఇదంతా చేశారని తెలుసుకుని ఆ ఫుటేజీని తన ఫోన్‌లో రికార్డు చేసుకుంటాడు. 

ఇది కోర్టులో చూపిస్తే....శ్రీలక్ష్మీపై పెట్టిన కేసు కొట్టేస్తారని అనుకుంటూ వెళ్తుండగా బుల్లిరాజు కర్రతో మ్యాడీని కొట్టి అతడి కిడ్నాప్ చేసి బంధిస్తారు. మ్యాడీ వద్ద ఉన్న ఫోన్‌ లాక్కుని స్విచ్ఛాప్ చేస్తారు.మ్యాడీ పూర్తిగా స్పృహ కోల్పోయాడని భావించి బుల్లిరాజు,అతని అనుచరులు మందు తెచ్చుకుని ఫుల్‌గా తాగుతారు. ఇంతలో మ్యాడీకి స్పృహరావడంతో వాళ్లు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. అయితే ఇదంతా ఆ శ్రీకాకుళం పెళ్లికొడుకు బుల్లిరాజు పనేనా అని అనుకుంటాడు.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget